29, మే 2017, సోమవారం

విశ్వములో జీవితం -9***

ఓం శ్రీ రామ్ - శ్రీ మాత్రేనమ:
విశ్వములో జీవితం -9

దేవుడున్నాడా లేడా?

 ఇద్దరు మనుషులు దేవుడున్నాడా లేడా అని వాదించు కుంటున్నారు అప్పుడే మూడో వ్యక్తి వచ్చి మీ సమస్య ను క్షణం లో తిరుస్తాను అన్నాడు. మరి చెప్పేవే అన్నాడు. నాకు తైలం పడందే, లాభం లేనిదే ఏవిషయము బయటకు చెప్పొద్దన్నారు మాగురువుగారు అన్నాడు.

నీకు లాభం వచ్చే సలహా ఇవ్వలేము కానీ ఇంద తైలం అంటూ చేతిలో పెట్టారు. వెంటనే తైలం లో ఉన్నాడు దేవుడు అంటూ వెళ్లి,పోయాడు. అంటే అతని మాటలకు  అవాక్కయ్యారు.

చేసేది లేక వాళ్లిద్దరూ దగ్గర ఉన్న గుడికి వెళ్లి పూజారిని ప్రశ్నిద్దాం అనుకున్నారు, వెళ్లారు పూజారిని అడిగారు. నేను కొబ్బరికాయ కొట్టి హారతి ఇస్తాను ముందు అవి తీసుకురండి అన్నాడు. సరె అని అవి తీసుకు వచ్చి ఇచ్చారు వెంటనే దేవునికి నైవేద్యం పెట్టి తీర్ధం ఇచ్చి కొబ్బరిచిప్ప చేతిలో పెట్టి ఇక వేళ్ళ మన్నాడు. మేము అడిగిన దానికి సమాధానము చెప్పలేదు ఎందుకు అన్నాడు. 

ముందు ప్రాసాదం తినండి అన్నాడు, తిన్నారు.

ఇప్పుడు చెపుతున్న వినండి దేవుడు మీ డబ్బులతో ప్రసాదం కొనిపిచ్చి సగమే మీకు పెట్టాడు కదా అవును, అవును
మిగతా సగం లో దేవుడున్నాడు ఎందుకంటే అది అందరి కీ సమానంగా ప్రసాదాన్ని పంచుతాను అందరు దేవుని ప్రసాదం పెట్టాడు అను కుంటారు. మీలో దేవుడు ఉన్నాడు కదా ఇంత దూరం రాగలిగారు, దేవుడ్ని చూడగలిగారు  అన్నాడు పూజారి. 

పూజారి చెప్పిన మాటలు అర్ధం గాక బుర్రగోక్కున్నారు.

నడుస్తూ మరలా వాదించు కున్నారు అప్పుడే వారికీ ఓతాగుబోతు ఎదురయ్యాడు. త్రాగుబోతులు నిజం చెపుతారు అతన్ని అడుగుదామా అని అతని దగ్గరకు వెళ్లారు వారు.

బాబులు మీరు అడిగిన దానికి నిజం చెప్పాలంటే నాకు కిక్ తగ్గింది, కిక్ ఎక్కించండి అన్నాడు  అప్పుడు నిజం చెపుతాను .
వెంటనే దగ్గర ఉన్న షొప్ వద్దకు పోయి అతనికి కిక్ ఎక్కించారు.
    
కోట్లు ఖర్చు పెట్టి గొప్పగా పెళ్ళీళ్ళు చేస్తారు ఎందుకో చెప్పండి అన్నాడు.
అది వారి తాహతు తగ్గ వారని తలంచి పెళ్లి ఘనంగా చేస్తే నలుగురు మెచ్చు కుంటారని భావిస్తారు.
ఎలా సంపా ఇంచారో అనవసరం ఒక్క రోజులో కోట్లు ఖర్చు పెట్టాడు అంటే ఎంతో మంది బాగు పడ్డట్టేగదా .
అంటే (నగల షాప్ వారు, వస్త్రాలు షాపువారు, వంట వారు, కళ్యాణ మండపం వారు ఇంకా ఎన్నో ఎన్నో ) అప్పుడు వీళ్ళందరికీ దేవుడు కనిపిస్తాడు అన్నాడు

నేను అడిగిన దానికి సమాధానము చెప్పలేదు అన్నాడు.

అనవసరముగా నా సమయాన్ని వ్యర్థం చేసారు, నాకు కిక్కు ఎక్కించి నా ఆరోగ్యం పాడు చేశారు కనుక మీమీద కేసు పెడతా పదా పోలీస్ స్టేషన్కు అంటూ ఇద్దర్ని పట్టుకున్నాడు
మీకు దేవుడున్నాడా లేదో ఆ పోలీసులే చెపుతారు.

వదులురా బాబు వదులు మమ్ము బుద్ధి తక్కువై పని చేసుకోకుండా వీధిని పడి సమయాన్ని వ్యర్ధం చేసుకున్నాం

మాకు బుద్దొచ్చింది మమ్మల్ని వదులు మాకు నీలో దేవుడు కనబడు తున్నాడు అంటూ గుంజుకొని చేతులను వదిలించుకొని ఓదేవుడా మమ్ము రక్షించు అంటూ పరుగెత్తారు ఇద్దరు.  

అందమైన కలలు కంటాము అవి ఆచరణకు నోచుకోవు -  మనం చేసిన పుణ్యమే మనల్ని సక్రమ మార్గంలో నడిపిస్తుంది. ఒకరు వేలెత్తి చూపని జీవితాన్ని దేవుడే కల్పిస్తాడు  ఇదే నా నమ్మకం - నమ్మకం మీద జీవిస్తే మన:శాంతి తో ఆరోగ్యంతో దైవధ్యానంలో ఉండగలుగుతారు.                  
                             

కామెంట్‌లు లేవు:

కామెంట్‌ను పోస్ట్ చేయండి