ఓం శ్రీ రాం - శ్రీ మాత్రే నమ:
రాధ యేప్పుడు పని పని అంటూ అలా చేస్తూనే ఉన్నావు, కాస్త తీరిక చేసుకొని నాతొ మాట్లాడవచ్చు కదా, నేను ఏదన్న పుస్తకము చదువుతున్నాననుకో అప్పుడే వచ్చి ఎప్పుడూ పుస్తకాల చదవటం తప్ప పెళ్ళాం ఒకటున్నది దాన్ని మంచి చెడ్డ చూడాలని ఒక ఆలోచన మీకు రాదు, మీరు మొగవారండి మీసం తిప్పుతూ ఎదో పెద్ద ఘనకార్యము చేసినట్లు ఒక ఫోజు ఇస్తూ ఉంటారు అంటావు నీవు, అన్నాడు మాధవ్, మీరు ఏమైనా అనుకోండి నాకు ఇప్పుడు మూడు లేదు అన్నాది. మొగవాడికి మూడొచ్చి నప్పుడు ఆడదానికి సుఖము ఎక్కువ పంచవచ్చునట అన్నాడు ఒక కవి, అబ్బో మీకోరికల కోసం ఎన్నో కధలు చెపుతారు, ఇదుగో చూడు నామాటలు కొంచం అర్ధం చేసుకో అంటూ పాత పాడటం మొదలు పెట్టాడు మాధవ్
ఆనందం సొంతము అయితే , అనురాగం ఆకలి చూస్తే , అనురాగపు తంచులు చూస్తాం ఆనందపు లోతులు తీస్తాం.
నీ
కంకణ నిక్వాణంలో, నా జీవన నిర్వాణంలో , నీ మదిలో డోలలు తూగీ, నా హృదిలో
జ్వాలలు రేగీ, నీ తలపున రేకులు పూస్తే, నా వలపున బాకులు దూస్తే, నూతన తేజానికి ప్రాణం పోస్తాం, స్వర్గానికి నిచ్చెన వేస్తాం.
సహనానికి రాణివి నీవై, వ్యసనానికి బానిస నేనై, వాసంత సమీరం నీవై, హేమంత తుషారం నేనై
నీ ఎగిరిన జీవవిహంగం, నా జత హృదయ తరంగం,
చిగురించిన తోటలలోనో, వికసించిన
పువ్వులలోనే, అమృత వలయములు జనించినప్పుడు, విలయములై జ్వలించి నప్పుడు,
కాలానికి నమస్కారం చేద్దాం, ప్రేమకు గొళ్ళెం తీద్దాం, ఆనందపు అంచులు
చూద్దాం, భవిషత్తుకు పునాది వేద్దాం, నవ వసంత మార్గంలో యవ్వన సమరంలో పోరాడి
గెలుద్దాం, స్వర్గ సుఖాలు అనుభవిద్దాం అని పాట పాడాడు మాధవ్
ఆనందం సొంతము అయితే , అనురాగం ఆకలి , అనురాగపు తంచులు చూస్తాం ఆనందపు లోతులు చూ స్తాం. నవ వసంతపు నిర్మాణానికి పునాది వేద్దాం
చూడండి మీరు రచయితలని నాకు తెలుసు, నీ పాటకు లొంగే మనస్తత్వ నాది కాదు
అయినా వేళాపాళా ఉండదా, అయినా మీ మొగవారు ఎలా ఉంటారో నేను చెపుతా వినండి
అంటూ ఒక పాట గా చెపుతాను. ఆ ... ఆ .. చెప్పు
ఆమ్మో నీకు కవిత్వం వస్తున్నదా
ఎంతైనా మీ భార్యను కదండీ, మీలో సగ భాగం నేను, మీ నాలుకపై నేనే ఉన్నాను, మీ హృదయంలో ఉన్నాను, నన్ను వదలి మీరెక్కడకు పోలేరు, అయినా మీకు నేను ఎప్పుడో సొంతం అయినాను, మీకు సుఖం అందించటమే నా జీవన మాధుర్యం అయినా వినండి
నన్ను మృదువుగా నిమురుతూవు నీవు, దగ్గరగా తీసుకున్నపుడు నీలో నాప్రేమను చూసా నంటావు
పుట్టిన నాటినుండి నీ ప్రేమకోసం నీ చుట్టు తిరిగానని అంటావు, నీవే ప్రాణమని నీవు లేకపోతే బ్రతకలేనని అంటావు, కొద్ది ఆలస్యమైతే చాలు ఎక్కడ లేని కోపం ప్రవర్తిస్తావు, దగ్గర వచ్చేదాకా చిన్న పిల్లడు గొడవ చేసినట్లు గొడవ చేస్తావు.
అధికంగా తినటం అజీర్తి యంటూ, శ్రద్ధగా దగ్గరగా వచ్చి తినిపిస్తావు, నీవు భారం కాదని నీవు నమ్మ పలుకుతావు, ఈమాట అంటే ఆమాట, ఆమాట అంటే ఈమాట వాదిస్తావు, ఏపని అంటే ఆపని క్షణంలో చేస్తానంటావు, పూలు, సువాసన ద్రవ్యాలు పూటపూటా దెచ్చి, ఉత్తేజ పరుస్తావు
కన్న బిడ్డ కన్నా ఎక్కవ ప్రేమను నా మీద చూపిస్తావు, మానవతను చూపి అనురాగము ఆత్మీయం ఆనందము పంచుతావు, నామీద ప్రేమా నమ్మకము చూపుతావు.
నీలో ఉన్న దానవుడ్ని కట్టేసి మానవున్నే నాకు చూపుతావు, అధర్మమంపై రెచ్చి పోతావు,
నా విశ్వాసం నీవు కొల్ల గొడతావు, నానోటి ఈమాట రాకుండా ముద్దులతో ముంచేస్తావు, నా మీద ఉంచుకున్న ప్రేమను కెరటం లా కప్పేసి చల్ల పడతావు, కొన్ని సార్లు నటనలుకు నేను తప్పక లొంగి పోతాను, తర్వాత తెలిసిన ఇది పెద్ద తప్పు కాదులే అని సర్దుకొని పోమంటావు, మౌనం వీడి బ్రతుకు వేదంలో మనం పావులవుదా మంటావు.
అంటూ కిల కిలా నవ్వు కుంటూ ముందు స్నానము చేద్దాం పందండి, ఆతర్వాత భోజనం ఆతర్వాత మీ సొంతం అనగానే
మాధవ్ రాధ దగ్గరకు చేరి గట్టిగా కౌగలించుకొని ఇది అడ్వాంస్ తర్వాత ఫుల్ అన్నాడు
అప్పుడే రాధ నవ్వుకుంటూ నోటితో ద్రాక్ష పళ్ళు అందిస్తూ ..................

కామెంట్‌లు లేవు:
కామెంట్‌ను పోస్ట్ చేయండి