29, మే 2017, సోమవారం

విశ్వములో జీవితం -8

ॐ श्री राम - श्री मात्रे नम :
విశ్వములో జీవితం -8
ప్రాంజలి ప్రభ. కల్పన
ఎవరనుకోవాలి, ఏమనుకోవాలి నా మనసును దోచిన వారెవరో, ఆకర్షించిన వారెవరో, ద్వేషించిన వారెవరో తెలుసుకోలేని వయసు నాది, అయినా ఎక్కడో నా మనసు లాగుతున్నది, అది ఎందుకో తెలియుట  లేదు. ఎందరినో ఆకర్షించు తున్నది, ఎన్నో ఎన్నెన్నో మాటలు నేర్చుకోవాలని ఉన్నది, మృదు మధురంగా పలకాలని ఉన్నది. అందానికి  దాసోహం అవ్వాలా, ప్రేమ చూపులకు లొంగి పోవాలా, వయసు ఎదుగు దలకు అవసరమా, అనే ఆలోచనలు యవ్వన వంతులను వెంబడి స్థాయి. 

కధలో కావ్య సుందరి వర్ణనలకు లొంగి పోతామా, ఆవే ఆలోచనలతో నిద్రలో కూడా కలలుగా మారుతాయా ?

ఊహల్లో చిక్కి వాస్తవాన్ని గమనించ లేక పోవుటకు నాకు వయసే కారణమా?

స్వశ్చముగా పరిమళించే మల్లికను చూసినా
  ఆకు పై చలిస్తున్న ఆని ముత్యము చూసినా,
చెంత చేరి సేద తీర్చే స్వాతి ముత్యమును చూసినా, 
తీయని ఓదార్పు తో కనుల చూపులు చూసినా 
మది గదిలో కల్లోలం ఏర్పడుటకు కారణము ఏది, ప్రకృతి పరవసాన్ని ఆస్వాదించి అనుభవించుటకే కదా ఈ వయసు ఇన్ని ఆంక్షలు, కట్టుబాట్లు ఎందుకు ?     

తీయని ఓదార్పు వెచ్చని కన్నీటి బొట్టు, మనసును తొలచి వేస్తుంది.  నా ఆలోచనలు ప్రేమగా మారుతున్నాయి, ప్రేమ అంటే ఏమిటో ఇప్పుడే తెలుస్తున్నది.  

ప్రేమ ఊహ అయితే, ఆ  ఊహకు సాక్షం నీవు 
ప్రేమ తలపు నీవే అయితే,  నా ఊపిరి తలపులు నీవు
ప్రేమ మధుర భావము అయితే, నా భావానికి భాష నీవు 
ప్రేమ కమ్మని కల  అయితే, నా కలకు కల్పన నీవు  
ప్రేమ రాగం అయితే, ఆ రాగాన్ని మీటే స్పందన నీవు  

నీ ఆలోచనలో అంతరంగంలో పెనవేసి, మదికి చల్లని చందన లేపనం అద్దుతున్న ఎవరు నీవు,
పారిజాతల పరిమళంలా నను చుట్టేసి చిత్రంగా నవ్వుతున్న ఎవరు నువ్వు, చూపులకు చిక్కక, నవ్వులు కురిపిస్తూ గాజులు శబ్దం వినిపిస్తూ ముఖం కనబడక ముసుగులో నన్ను ఊరడించి, ఉడికించి, హెచ్చరించి, నన్ను వదిలి పోలేవులే, వయసు ఉడుకు చూపు దామనుకున్నా ఆ సమయము రాలేదని తెలుసుకొని చూసి చూడనట్లుగా పోతున్నావు నీవు,  నన్ను కూడ కదులు అనే భావపు చూపులు చూపావు.          

అప్పుడనుకున్నా దివి నుండి భువికి నాకోసం జాలువారిన చంద్రోదయానివా,నా చేయి వీడని అమృత బంధానివా..నాకల సుందరివా అనుకోవటం టప్ప ఏమి చేయలేను నేను.

ఆకాశములో పక్షి ఎగురుటకు రెక్కలు ఎంత అవసరమో, పురుషునకు విషయ జ్ఞానము, ఓర్పు అంత న్నా ఎక్కువ అవసరము     


కామెంట్‌లు లేవు:

కామెంట్‌ను పోస్ట్ చేయండి