ఓం శ్రీ రామ్ - శ్రీ మాత్రేనమ:
ప్రేమతో - ప్రేమ లేఖ (2)
నీ
మెసేజ్ అందింది, నాలో కలవరం మొదలైనది, నీకు మెసేజ్ పంపాలని తాపత్రయం
పెరిగింది, ల్యాబ్ టాప్ తీసాను, నాకు తెలిసిన విధముగా ప్రేమ లేఖను
వ్రాస్తున్న, నీకు నచ్చుతుందని నేను ఆశిస్తా, నీ రూపు రేఖలు నా కాంతిలో
చిక్కి ఉన్నాయి. నాప్రేమ నంతా రంగరించి, నిన్ను మరువ లేక, నేను ఉండలేక
వ్రాస్తున్నాను, ఇదే నాకు కొంత మన:శాంతి.
పరిమళించే
పరువపు రెమ్మవు, ఎమన్నా పట్టించుకోక తనువును అర్పించిన బొమ్మవు, రతిని
మించిన రసరూపమ్ము చూపించి తన్మయ పరిచే అతిలోక దివ్య సుందరివి, పలుక
నేర్చిన చిలుకవు, నడక నేర్చి, నాట్య మాడే, పలకరించి నాట్య మయూరివి, కనులతో
కవ్వించి, పెదాలతో పలకరించి, నడకను వయ్యారంగా చూపించి, జడ తిప్పుతూ కదిలే
వయ్యారివి.
నిన్ను
అర్ధం చేసు కోవటానికి చాలదు నాజీవితం, త్రిగుణాల సమ్మేళనమే నీ గుణం,
మొగవాడ్ని గుప్పెట్లో పెట్టుకొనే బ్రహ్మాస్త్రం ఉన్నదానివి, అలసి వచ్చిన
వానికి సేద తీర్చే నీలో ఉంది కరుణాస్త్రం, గాలిద్వారా మనసును ఆకర్షించి
చిరు నవ్వును చూపి మనసును దోచే పవనాస్త్రం ఉన్నదానివి, ఎన్ని కష్టాల్లో
ఉన్న మనసును రంగ రించి, మొహాన్ని పంచే సమ్మోహనాస్త్రం ఉన్నదానివి, అన్ని
సమయములలో ఓర్పు వహించి ఓదార్పు చూపించే సహనాస్త్రం గలదానివి, ఇట్లా ఎన్నో
అస్త్రాలు నీలో నిండి ఉన్నాయి. అందుకే నేను నిన్నుఅంటాను సర్వాస్త్ర
సుందరివి.
చీకట్లో
కూడా కనిపించే తెల్లని మంచు తెరగల దేహంగా, తళ తళా మెరుస్తూ నిలకడగా ఉన్న
నదిగా, వెచ్చని వేడి నందించి చల్లని మనసుకు హాయిగా , ఆహ్లదంగా, ఊరట
కల్పించే దిశగా, నిశ్చలముగా, నిర్మలంగా, నిలకడగా స్వశ్చంగా సుఖాన్ని
అందించే నా కలల సుందరివి.
అంటూ ప్రేమ లేఖను (మెసేజ్) రాధకు వ్రాసాడు మాధవ్
ఆ మెసేజ్ చూసి రాధ మాధవ్ కు మెసేజ్ పెట్టింది.
నవమన్మధాకారా
రూపంతో, ధ్రుడకాయముతో, ఆరడుగుల ఎత్తుతో తెల్లని పంచ లాల్చీ ధరించి,
చేతులకు ఉంగరాలతో, మేడలో బంగారు గొలుసుతో నా మనసునుని దోచిన నటనాగ్రేసుడవు
నీవు, నా ఊహలన్నీ నీమీదే
నీమాటలకు
చిక్కి నీవు ఆడమన్నట్లుగా ఆడి, నీకు ఉల్లాసము కల్పించి ఉత్సాహము పెంచి,
సమయాన్ని సద్వినియోగము గా శకలం అర్పించాను ఆనాడు, ఆతీపి గుర్తులే నాకు
బంధువులు.
నన్ను
అస్త్రాలతో పోల్చి మూలగచెట్టు ఎక్కించావు ఎందుకు, నేను ఎప్పుడు నీమాట
జవదాట లేదు, నేనెప్పుడూ నీ నీడగా వెనకాలే ఉండేదాన్ని, ఒక చెట్టులాగా ఎదిగి
చెట్టు చేసిన ఉపయోగాలన్నీ నేను నీకు చేసాను. కాలంతో మారకుండా నాకోసం
వేచిఉన్నావని సంతోషముగా ఉన్నది. నిన్ను తలవని రోజు లేదు, నీకోసం ఎదురు
చూడని రోజులేదు, నీవు చేసే సమాజ సేవకు నీ చేదోడుగా ఉండి సహాయము చేసిన
రోజులు ఇంకా గుర్తు ఉన్నాయ్.
రాగాలన్నింటిలో
అనురాగము గొప్పది, బంధాలన్నింటిలో అనుబంధం గొప్పది, స్వేశ్చవాయువుల్లో
వెలుగుబాట గొప్పది, పున్నమి వెన్నెలలో పూల పరిమళాలు గొప్పవి, నువ్వు
నువ్వుగా గుర్తింపు తెచ్చుకోవటం అన్నింటికన్నా గొప్పది. మగవానికి
సహజంగా ఉండే అహంకారము లేకుండా ప్రేమను పంచే తత్వం నీలో ఉన్నందుకు నాకు చాలా
సంతోషము మరియు నిత్యం ధరిత్రియందు నాకోసం ఎదురు చూపులతో ఉన్నందుకు నేనే
నీకు సర్వం అర్పించేందుకు సర్వసన్నద్ధంగా ఉన్నాను.
కార్యేషు
దాసిగా, కరణేషు మంత్రిగా, భోజ్యేషు మాతగా, క్షమయా ధరిత్రిగా, కులధృమ
పత్నిగా, మన కుటుంబానికి నేనొక ఆశాకిరణంగా నీకోసం వేయికళ్లతో ఎదురు చూస్తూ
ఉంటాను
నిమెసేజ్ కోసం ఎదురు చూస్తుంటాను మాధవా
కామెంట్‌లు లేవు:
కామెంట్‌ను పోస్ట్ చేయండి