15, మే 2017, సోమవారం

Mallapragada Ramakrishna telugu stories -13

ఓం శ్రీ రామ్   - శ్రీ మాత్రే నమ:
ఖీ - ప్రియా (ప్రేమ కధ )

సూర్యుడు అస్తమించే దిశగా బయలు దేరాడు, చీకటి ఆవరించింది, గుంటూరు లో ఉన్న సొంత ఇంటి   పెరటిలో పెంచిన ఉసిరిక చెట్టుకు దగ్గరగా అప్పుడే శ్రీతారామయ్య గారి భార్య దీపారాధన చేసి పూజ చేసి ప్రసాదం తన ఇద్దారి కొడుకులకు భర్తకు  పెట్టింది.
పెద్దకొడుకు  రామా రావు   గుంటూరు లో స్కూలు   టీచర్ గా  పనిచేస్తున్నాడు, పెద్దలు కుదిరించిన వివాహము చేసుకున్నాడు, తండ్రి రిటైర్ గుమాస్తా, ప్రస్తుతం పెన్షన్ పొందుతూ ఉన్నాడు,
 ఇక రెండవ కుమారుడు తను కాలేజీలో చదువు తున్నప్పుడు రాధ ని ప్రేమించాడు, పెళ్లి చేసుకుందామనుకున్నాడు, విధి ఎప్పుడు అనుకున్నవి జరగనీయదు అని కొందరు అంటారు అది మాత్రం ఇతనికి అక్షరాలా నిజం జరిగింది.

ఎం . బి . ఏ . చదివిన ఉద్యోగము లేదు,  కాని   పెళ్లిచేసు కుంటానని తండ్రిని అడిగాడు.
తండ్రి ఒక్కటే చెప్పాడు నేను నిన్ను నీ భార్యను పోషించే శక్తి నాకులేదు, నీవు వేరేగా వెళ్లి బ్రతకమని చెప్పను, నేను చెప్పేది ఒక్కటే నీప్రేమ నిజమైతే నీకే శక్తి  నిస్తుంది, నీ  బ్రతుకుకు మార్గం చూపుతుంది, నీ  స్వేశ్చకు మేము ఎవ్వరమూ అడ్డురాము, నీవు ఉద్యోగము సంపాయించి ప్రేమించిన రాధ ని పెళ్లి   చేసుకో, రిజిస్టర్ మ్యారేజ్ ఐతే మేము సంతకము పెడతాము, రాధ పెద్దలని సంప్రదించి పెళ్లి చేయమంటే చేస్తాను.
ఒక్కసారి నీవు పేమించిన అమ్మాయిని ఇంటికి తీసుకునిరా ఆమె అభిప్రాయము కూడా తెలుసు కుంటాను, ఇంతకన్నా ఎక్కువ చెప్పలేను, నీ అంత నేను చదువుకోలేదు

అట్లాగే నాన్న రేపు తీసుకొస్తాను ఇంట్లో అందరికి చూపి స్తాను, అని చెప్పి బయటకు నడిచాడు మాధవ్ .

తను ప్రేమించిన రాధ ఇంటికి బయలు దేరాడు మాధవ్ , ఇంటికి తాళం ఉంది, ప్రక్క వారిని అడుగగా తన బావను పెళ్లి చేసుకుంటున్నది అని మాత్రం తెలుసు కున్నాడు, వెంటనే స్నేహితురాలు సురేఖ ఇంటికి బయలు దేరాడు ఇది నిజమో కాదో తెలుసుకొనేందుకు, సురేఖ చెప్పింది నీతో ప్రేమ జరిపి, తల్లి తండ్రులను ఎదిరించలేక పెళ్ళికి ఒప్పుకున్నది అని తెలుసుకున్నాడు.

ఇక్కడేదో పొరపాటు జరిగింది, పెళ్లి  చేసున్నారో తెలుసుకోలేక ఇంట్లో తల్లి తండ్రులకు మొఖం చూపలేక స్నేహితుని రూంలో ఉండిపోయాడు. అప్పుడే  ఒక డైరీలో  ఈ విధముగా వ్రాసుకున్నాడు
      
"నిన్ను వీక్షించనిదే ఉండలేను, నిన్ను ఆశ్రయించి నీతోనూ ఉండలేను, నిన్ను విడిచి  అంతకన్నా ఉండలేను,  పున్నమి వెన్నెల ఎలా ఉంటుందో తెలియదు, నీ కళ్ళ మెరుపు నాకు గుర్తు ఉన్నాది, ఎంత దూరము పోయినా, ఎక్కడ ఉన్నా నీ హృదయ స్పన్దన నాకోసమే అని, నీ ఆలోచనలు నన్ను దాటి పోలేవని, నా  ఆశల దీపానివి, నా ఆలోచనా రూపానివి, నన్ను ఆకర్షించిన దేవతవి, నాహృదయాంతరములో  ఎక్కడో కదిలించి, ఏమి తెలియని అమాయకురాలిగా, నన్ను మోసగించి,  నీలోఉన్న నా ప్రేమను అణగతొక్కి,  పెళ్లి  అనే నెపముతో నన్ను విడిచి దూరముగా వెళ్లిన, నీకోసం, నీ ప్రేమ కోసాం నీవు వచ్చి నాప్రేమ పొందే దాకా ఇక్కడే ఉంటా ...
విరిదండ -
రమ్ము నను జూడ సకీ - రాగములఁ బాడ సకీ
చిమ్ము మిఁక ప్రేమ సకీ - చిత్త మిటఁ జింద సకీ
యిమ్ము సుధ పాత్ర సకీ - యీప్సితము దీరు సకీ
కొమ్ము విరిదండ సకీ - కోమలము గుండె సకీ 

నాలో ప్రేమను పెంచావు, మమతను  పంచావు, కరుణతో కనికరించావు, చివరకు నన్నే మరిచావు, అయినా నీమీద ప్రేమ మరువ లేను, నిన్ను విడిచి ఉండలేను. 

తలపులు తల్లకిందు లవలేదు, కోరికలు మరచి ఉండలేదు, జ్ఞాపకాలను వదలి ఉండలేదు, 
తాను నన్ను వదలి వెళ్లినా నేను ఆమెను మరువలేను. 

మనసుని తొలచిన ప్రేమ కొరకు ఆశలతో ఉండుట తప్పు కాదు, ఈ ప్రేమకోసం నాలో బి.పి, షుగర్ పెరిగినా, నాలో  అను కోని రోగం వెంబడించిన, ప్రేమ    సఫలమయ్యేదాకా కొన ఊపిరితో బ్రతుక గలను    

తన  స్నేహితుని ద్వారా అదే డైరీలో తండ్రికి లేఖ ఈ క్రింది విధముగా  వ్రాసి ఇచ్చాడు. 
 నాన్న గారు మీరు చెప్పినట్లుగా నేను ఉద్యోగము సంపాదించేవరకు వివాహము చేసుకోను, మీకు భారముకాను అందుకే ఉద్యోగము వేటకు బయలు దేరుతున్నాను, మీ ఆశీర్వాదము నాకు పంపగలరు, త్వరలో ప్రయోజకునిగా మారి మీవద్దకు రాగాలను, అమ్మ భాదపడవద్దను, అన్నయ్యను వదినను అడిగినట్లు చెప్పగలవు
అందరికి  నమస్కారములు 

అలా డైరీని పంపి  తల్లి తండ్రులకు మొఖం చూపించలేక, ఎవరితోనూ చెప్పుకోలేక ఊరుకాని  ఊరు పయన మయ్యాడు మాధవ్
కాల చక్రం 2 సంవత్సరాలు అనుకోకుండా జరిగి పోయిన్ది
                               
సముద్రపు కెరటం గట్టు దాటాలను ఉవ్విళ్లూరుతు వస్తుంది, తర్వాత దాటలేక వెనక్కు తగ్గు తుంది. అట్లాగే మన మాధవ్ మంచి సాఫ్ట్వెర్ కంపెనీలో ఉద్యోగం సాంపాదించాడు, తల్లి తండ్రులు ఎంత కోరినా వివాహము చేసుకోమన్న చేసుకోను, నేను రాముని భక్తుణ్ణి, నాప్రేమ ఫలిం చేదాకా ఇట్లాగే ఉంటా, నాకు చేతనయినంత సాహాయము చేస్తా అని ఇంట్లో వాళ్ళందరి తెలియపరిచాడు, ఎవరు ఏమి మాట్లాడలేక ఊరుకున్నారు. 

అప్పుడే టి.వి. లో ఒక పాట వస్తున్నది 

పున్నమి వెన్నెలలో నీవునేను ఒకటవుదాం 
మురిసిపోయి మైమరిచి పోయి ఆనందంగా విహరిద్దాం 
గగనాన తరాలన్నీ మనల్ని చూసి సిగ్గుపడతాయి 
సంద్రంలో ఉన్న అలలన్నీ మనల్ని చూసి నవ్వు కుంటాయి 

అడవి జింకలు మన చుట్టు చేరి కేరింతలు కొడతాయి 
మనల్ని చూసి నెమలి నాట్యమాడుతుంది 
చిరు కొమ్మలు మనల్ని చూసి కొమ్మ కొమ్మ రాచుకొని పూలు కురిపిస్తాయి 
కొమ్మ ముద్ద కోయల మనల్ని చూసి ఓర్వలేక కూత కూస్తూనే ఉంటుంది 

తుమ్మెద ఝుంకారం   మనకు శ్రవణానందము కలిగిస్తాయి 
సలయేరుల గలగలలు మనస్సును ఉల్లాస పరుస్తాయి 
సెలయేరులో  హంసలు శబ్దము చేస్తూ మనల్ని చూస్తాయి 
మధువును వెదజల్లే పారిజాతాలు, సంపెంగలు మనచుట్టు ఉన్నాయి 

నాకు నీవు నీకు నేను ఒకరి కొకరమై పెనవేసుకొని లతల్లా అల్లుకొని 
వేణు గానంతో రవళి నాదంతో పరవశించి ఏకమవుదాం 

అన్న పాట చక్కగా పాడుతున్నారు ఇరువురు 

వెంటనే చలపతి కి గుర్తుకు వచ్చింది ఇది నేను శ్రావణికి వ్రాసి ఇచ్చిన పాట, కొద్ది మార్పులలో ఉన్నది తప్పా ఇది నేను వ్రాసిన పాట తెలుసుకున్నాడు. 

వెంటనే టి.వి. స్టేషన్ కు వెళ్ళాడు, పాట ఎవరు రచించారు, ఆ చిరునామా తీసుకోని ఇంటికి వెళ్ళాడు. 
ఆ ఇంటిలో రాధ కనబడటం తో తన సంతోషాన్ని ఆపుకోలేక పోయాడు మాధవ్

చాలా రోజుల కు నేను గుర్తుకు వచ్చానా, రా కూర్చో ముందు కాఫీ తెస్తా ఉండు అని  చెప్పి లోపలకు వెళ్ళింది 
ఇల్లు అంతా చూసాడు నిశ్శబ్దముగా ఉన్నది 
కాఫీ త్రాగుతూ మీవారు లేరా, ఇంట్లో ఎక్కడా మీ పెళ్లి ఫోటో కనిపించ లేదు అని అడిగాడు. 

నాకు ఇంకా పెళ్లి కాలేదను కున్నావా మాధవ్ , నా విషయము అట్లా ఉంచు, నీకు పెళ్లైందా, ఏదన్న ఉద్యోగము చేస్తున్నావా, ఒక్కసారిగా ప్రేమకు ఉన్న గుర్తులన్నీ చక చక అడిగింది. 
అయ్యో నిన్ను ప్రశ్నలమీద ప్రశ్నలు వేస్తున్నాను నన్ను క్షమించు, నిన్ను చూసేటప్పటికల్లా నా మనసు మనసులో లేదు అయ్యో ఉండు టిఫిన్ చేస్తా ఎప్పుడు తిన్నావో అంటూ లేవబో యింది, వద్దు వద్దు నీవు మాట్లాడుతుంటే నా మనసు  హాయిగా   ఉన్నది. 
నాగురించి విను నేను పెళ్లి చేసుకోలేదు నీకోసమే వేచిఉన్నాను, మంచి ఉద్యోగము సంపాదించాను. 
మరి నీ విషయము చెప్పు 
నీకు ఉద్యోగము లేదని మా బావకు మంచి ఉద్యోగం ఉందని నేను ఎంత బతిమి లాడిన వప్పుకొనలేదు, ఈ పెళ్ళికి వప్పుకోకపోతే మేము చనిపోతామని బెదిరించారు   , నేను నమ్మిన దేవుడు  రామ చంద్రుడు కాపాడుతాడని  చదువుకున్నా ఏమీ చాతకాని దానిగా మారాను, అప్పటికప్పుడే రిజిస్టర్ ఆఫీసులో పెళ్లి జరిగింది. 
తిరుగు ప్రయాణంలో తిరిగి వస్తున్నాము కారులో ఉండి  నాన్న అక్కడ ముసలమ్మ సంపెంగ పూలు అమ్ముతుంది ఒక నిముషము కారు ఆపితే కొనుక్కొ స్తాను అని నేను దిగాను కొనుక్కొని తిరిగి వస్తున్నాను లేదో పెద్ద శబ్దం చేస్తూ ఒక లారీ మాకారును డాష్ ఇచ్చింది 
ఆ విషాద సంఘటన నేను నీకు చెప్పలేను, అప్పుడే అందరూ చనిపోయారు. 
నాకు  నచ్చిన కధలు వ్రాస్తూ ఎడిటర్ గా భుక్తి కోసం పనిచేస్తున్నాను ఇదే నా కధ 

మీ ఇంట్లో వారందరూ బాగున్నారా అందరూ బాగున్నారు 

నిన్ను నేను పెళ్లి చేసుకుందా మనుకున్నాను, అదియు నీకు ఇష్టమైతేనే 
ఇష్టం కాక పొతే నీప్రేమనే తలుచుకుంటూ జీవితాంతమూ బ్రహ్మ చారిగా ఉంది పోతాను అంతే తప్ప వేరెవరిని పెళ్లి చేసుకోను 

నీవు  ఒక  సారి వ్రాసిన పాట గుర్తుందా, ఆపాటేగా నన్ను నిన్ను కలిపింది అని లేచి దగ్గరకు వచ్చి కౌగిల్లో బంధించాడు, ఆగు ఆగు వేదమంత్రాల మధ్య పెళ్లి జరగనీ ఈ తనువంతా నీ సొంతమే అని ఒకటే నవ్వులు వేళ్ళు విరిసెను  

Photo   
   









కామెంట్‌లు లేవు:

కామెంట్‌ను పోస్ట్ చేయండి