27, మే 2017, శనివారం

విశ్వములో జీవితం- 4***

 ఓం శ్రీ రామ్ - శ్రీ మాత్రే నమ: Exploring the Science of "Sleeping Hot" 
విశ్వములో జీవితం- 4
నిద్ర 
మనకు ఆరోగ్యాన్ని పెంచేది, ఉల్లాసంగా ఉత్సాహంగా ఉంచేది ఏమిటో తెలుసా ?
ఆలోచనలు ప్రక్కకు నెట్టి, కోరికలను కూడా మరచు నట్లు చేసేది సుఖ నిద్ర. 
   
నిద్రకు అనుకూలమైన పరిస్థితులు మనమే కలగచేసుకోవాలి, వెన్నెలలో, చల్లటి గాలిలో అరుగు దొరికితే హాయిగా నిద్రపోవచ్చు. నిద్రపోతున్నప్పుడు చెమట పడుతున్నది, కలవరింతలు వస్తాయి, గురక వస్తున్నది ఇవి ఎందుకొస్తాయి ఒక్కసారి ఆలోచిద్దాం.

ముందుగా మనం నిద్రపోయే ప్రదేశము శుభ్రముగా ఉంచుకోవాలి, దుప్పటి దులుపుకొని సరిగా మంచముపై పరచుకొని,  తలక్రింద సరిఅయిన దిండు పెట్టుకోవాలి       
1/20 వ మందంతో ఉన్న మిలియన్ల కొద్దీ ఫైబర్స్తో, కాస్పర్ దిండు మీరు నిద్రించే విధంగా అనుగుణంగా రూపొందించబడింది. మీ జిజ్ఞాసను ఆలోచనను మరచు నట్లు చేస్తుంది. 

జంట ఉన్నప్పుడు ఒకరకంగా నిద్ర ఉంటుంది, జంట ఉన్నప్పుడు మెలి కలయికతో సుఖ నిద్ర ఉంటుంది.  జంట లేనప్పుడు మరోరకంగా నిద్ర ఉంటుంది. ఆలోచనతో ఎదో కొరత ఉన్నట్లు భావిస్తారు, ఎదో మనసులో వెళితే ఉంటుంది, ఎదో చూద్దాము అని వేచి ఉండి కళ్లకు శ్రమ వచ్చేదాకా వేచి ఉంది నిద్రపోతారు. 
పడుకునేముందు కడుపు నిండా నీరు త్రా గండి, లేదా పాలు త్రాగి పడుకున్నట్లైతే ఇంకా మంచిది. దూది పరుపు దిండు శ్రేయస్కరమైనది. ఆధునిక పరికరములు ప్రక్కన పెట్టుకొని నిద్రకు అంత మంచిది కాదు (సెల్ల్, ఎలక్ట్రిక్ పరికరములు దగ్గర్లో ఉంచకూడదు)           

ఎలక్ట్రిక్ లైటింగ్, టెలివిజన్, ఇంటర్నెట్ మరియు కెఫిన్ వంటివి అన్నింటిని విలాసవంతులకు ముందు రోజులు పోలిస్తే నిద్రపోయే సమయాన్ని తగ్గిస్తాయి. ఊబకాయం, మూడ్ డిజార్డర్స్ మరియు ఇతర ఆధునిక రోగాల పెరుగుదలకు ఈ విధమైన నిద్ర లేమి కొన్నిసార్లు బాధ్యత వహిస్తుంది.

మనం నిద్ర పోతున్నప్పుడు మనకు ఏమి తెలియదు, కొందరు ఒంటి కన్నుతో నిద్రపోతారు (భల్లూకం లాగా) మరికొందరు కళ్ళు తెరుచుకొని నిద్రపోతారు, (చేపలాగా) కొందరు లేచిన తర్వాత ప్రక్క వారిని నిద్రపోకుండా చేస్తారు. కొందరికి నిద్రలో స్వర్గ సుఖాలు అనుభవించినట్లు, మరికొందరికి నరకములో ప్రవేశించినట్లు కలు వస్తాయి. అది మానసిక వత్తిడి అని నా భావము. 

జీవుని మనస్సు శారీరక, ఇంద్రియ, ప్రాణ సంబంధమైన బంధనాలలో బంధించి సంచరిస్తూ 'నేను', 'నాది' అన్న అహంభావముతో వివిధములైన లౌకిక, ఆనందాల మధ్య సంచరించుచూ వాటి మంచి, చెడు ఫలితములను అనుభవింపజేస్తుంది. ఇది అంతా సుఖ నిద్రలో జరుగు తుంది. 

కేవలము మనస్సు మాత్రమే మనిషి యొక్క బంధనాలకు, చెడు వంచనలకు, మార్పులు చెందుటకు కారణ మగుచున్నది. దాని వలననే దుఃఖాలకు, పుట్టుక, చావులకు కారణ మగుచున్నది. ఇవన్నీ రాజస, తామస గుణాల ప్రభావమేనని అందువలన మంచి, చెడుల వివేకము నశిస్తుందని గమనించాలి. సాత్విక గుణం తో మానవులు ఉన్నట్లయితే ఆరోగ్యానికి హాని ఉండదు, ఆలోచనకు తావు ఉండదు. సుఖమును పంచే తనువుకు విశ్రాంతి కలుగుతుంది.      
   --((*))--

 

కామెంట్‌లు లేవు:

కామెంట్‌ను పోస్ట్ చేయండి