ఓం శ్రీ రామ్ - శ్రీ మాత్రే నమ:
వివాహమనేది మానవులకు తప్పనిసరి ఎందుకనగా వయస్సు పెరిగిన కొద్దీ మనలో ఉన్న జవ సత్వాలు తగ్గుతూ ఉంటాయి, వయసులో ఉన్నప్పుడే మన కోరికలకు పదును పెట్టి, సక్రమ మార్గాన ప్రయాణమే మానవుల సత్ సంకల్పము, సుఖ దు:ఖాలు మనల్ని వెంబడిస్తాయి అయినప్పటికీ మనలో ఉన్న నిక్షిప్తముగా ఉన్న జ్ఞానాన్ని ప్రపంచ ప్రజలతో పంచుకుంటే, సభ్యులతో పంచుకుంటే మనస్సు ప్రశాంతముగా ఉంటుంది.
కాల గమనాన్ని బట్టి మనప్రవర్తనను మార్చుకుంటూ, జీవితము గడపాలి,
అసలు నా దృష్టిలో నరుడు ఏడ్చేవాడు నారాయణుడు నవ్వేవాడు, నరుడు ఏడుస్తాడు
పోయేటప్పుడు ఏడుస్తాడు. కాని జీవితాంతం ఒకరికొకరు కలసి ఉండటం తప్పదు.
అసలు
మానవుల మనసులో ఎక్కడో అసంతృప్తి ఉంటుంది. కారణం సృష్టించిన ఆ బ్రహ్మ
దేవుడే చెప్పాలీ. మంచి విద్య నేర్చుకున్న ఇంకా నేర్చుకోవాలని, డబ్బు
సంపాదించిన ఇంకా సంపాదించాలని, సంసారంలో సుఖ మున్నా ఎక్కడో ఉన్న సుఖం
కోసం వెంపర్లాడటం, ఇంకా ఎన్నో మానవ జీవితానికి ఈ ఆలోచనలు అవసరమా, అనవసరమా ఒక్కసారి ఆలోచించండి.
నిత్య
ధ్యానంతో మిద్ధ్యా వాదాన్ని విడిచిపెట్టి ప్రకృతి ననుసరించి కాలాన్ని
బట్టి నిగ్రహ శక్తితో బ్రతికి బ్రతికించు కోవటమే మానవజన్మ సార్ధకం
అసలు
దు:ఖం అంటే ... ఏడుపు ... వెలితి ... కొరత ... శోకం ... చింత ...
విచారము ... నిర్లిప్తత ... అయిష్టత ... చంచలత్వం ... ఘర్షణ ... వత్తిడి
..... ఇంకా ఎన్నో వీటికి విరుగుడు ఆనందం ఒక్కటే అదే సహజానందం ...
నిత్యానందం ... పరమానందం ... బ్రహ్మానందం ... వీటిని అందుకోవాలనుంటే
ప్రతి విషయాన్ని (+)వ్ గా తీసుకోవాలి, (-)వ్ ఆలోచనలు మనసులోకి
రాకుండా జాగర్త పడాలి . మనం విచక్షణా వివేకంతో జీవితాన్ని మార్చుకోవాలి.
జీవన
ప్రవాహం అంటే వచ్చేవారు లేనివారే ... .. ఉన్నవారు లేకుండా పోయేవారు
అయినప్పటికీ వివాహబంధం కలియుగ జీవనంలో ఒక భాగము అదే మన మనస్సును
మేధావంతునిగా మార్చేది, సంతృప్తి లేకుండా జీవిస్తే పిచ్చివాళ్ళగా మార్చేది.
అందుకనే తృప్తిలోనే సంతృప్తిగా భావించి సాగేదే నిజమైన జీవితం.
నూతన
వధువరులకు నేను వ్రాస్తున్న అక్షరమాల (పువ్వులమాల) ఒక్కసారి చదివి అర్ధం
చేసుకోగలరని ఆశిస్తున్నాను, అందరికి అభినందనలు, శుభాకాంక్షలు.
"అ
"ప్పటి ఎవరికీ వారే "వివాహం అనేటప్పటి కల్లా ఒకరి కొకరు వారి వారి
అభిప్రాయాలు ఏకం చేసుకొని ఒక నిర్ణయానికి వచ్చి నిశ్చయ తాంబూలం
ప్రధానానికి తార్కాణం.
"ఆ
" కాశమంత పందిరివేసి భూదేవి యంత పీటవేసి వధువు మేడలో మంగళసూత్ర ధారణ
వరుడు కట్టినతర్వాత, తలంబ్రాలు పెద్దల దీవెనలు చదివింపులు భోజనాలతో
ముగిస్తుంది పెళ్ళి, ఇదియే ఇరువురిమద్య కొత్త ఉరవడికి తోడ్పడే బం ధం.
"ఇ"
ల్లాలుగా అడుగు పెట్టి అత్తమామలకు సేవలందించి వారి ఆదరణతో, భర్త
అనురాగంతో ఇల్లాలుగా పేరు తెచ్చుకోవటం పుట్టినిల్లికి, మెట్టినిల్లికి
పేరుతెచ్చుటే ధర్మం.
"ఈ"
నాటి బంధం ఏనాటిదో అని భావించి, ఈ బందమే శాశ్వితముగా భావించి సకర్మ
మార్గంలో ఉండుటకు స్త్రీ - పురుషులు ఒకటిగా ఏకమై చేయాలి స్థిర కాపురం
"ఉ"ల్లాసంగా ..... ఉత్సాహంగా ... స్వర్గ సుఖాలు అనుభవించటమే తక్షణ కర్తవ్యం..
"ఊ" హల సఫలీకృతముగా ఊయలులో ఊగి మనసు ప్రశాంత పరుచుకొని ఒకరి కొకరు పొందాలి ఆనంద పారవశ్యం.
"ఋ " ణాలు లేకుండా ధనాశకు పోకుండా ఉన్న దానితో తృప్తి పడటమే ప్రేమికుల జీవిత ఆశయంగా ఉండటం.
"ఎంత ఎదిగిన ఒదిగి ఉండాలి, ఓర్పుతో పెద్దలను గౌరవించి మన్ననలను పొందటమే ప్రకృతి
ప్రభావంతో ఏకీభవించడం.
"ఏనాడు
తొందర పడకుండా ఎదుటి వ్యక్తిని అనుసరించి చక్కటి మాటలతో మనసును అర్ధం
చేసుకొని వారి భావాలను అర్ధం చేసుకుని నిదానంగా మాట్లాడటం.
"ఐకమత్యంతో జీవితాంతం కలసి ఉండటం, ఐకమత్యంతో దేశానికి సేవచేయడం.
"ఒ "కే మాట, ఒకే బాటగా జీవితాంతము ఒకరి మాటను ఒకరు గౌరవించుకుంటూ ఎవరు గొప్ప అని మనసులోకి రాకుండా జాగర్త పడటం.
"ఓ"టమి ఎరుగక జీవితము గడపాలి, ఓటమి ఎదురైనా మన జయమునకు నాంది అని భావించటం ఎదుగుదలకు ఇదే ప్రధానం అని భావించడం
"ఔ"న్నత్యం
తో జీవించాలి , ప్రతి ఒక్కరు భావించాలి జీవితమే సహజ ఆనందం, జీవితమే
నిత్యానందం, జీవితమే బ్రహ్మానందం, జీవితమే పరమానందం
"అం" తరాలు లేకుండా మమతానూ రాగాలతో సుఖ సంతోషాలతో నవ తేజంతో సుఖాలను భవించటమే ప్రేమికులు ఉద్దేశ్యం
"అ:హంకారాన్ని
కరగించుకొని ప్రేమ, దయ, కరుణ తో నిత్య అనంత సౌభాగ్యాలు అనుభవిస్తూ
దేశానికి సహయ సహకారాలు అందిస్తూ అనాథలను ఆదుకుంటూ మనో నిగ్రహ శక్తి తో
నేర్చుకున్న జ్ఞానాన్ని నలుగురికి పంచటమే నిజమైన బంధం. ప్రేమ ఉంటే సుఖం - ప్రేమ తగ్గితే సాధింపే
కామెంట్‌లు లేవు:
కామెంట్‌ను పోస్ట్ చేయండి