27, మే 2017, శనివారం

విశ్వము లో జీవితం-3

ఓం శ్రీ రామ్ - శ్రీ మాత్రే నమ:
విశ్వము లో జీవితం-3
బ్రతికి బ్రతికించు 
మానవులమై ఉండి మనం కొన్ని విషయాలు   తెలుసుకోవాలి, సృష్టికి ముందే పంచ భూతాలు ఉన్నట్లు మనపెద్దలు చెప్పగా, సంస్కృత గ్రంధాల ద్వారా మనకు తెలుస్తున్నది. వాటిని ప్రత్యక్షంగా చదవ గలుగుతున్నాము. వీటి అన్నింటికీ మూల గురువు పరమేశ్వరుడు, భూమి, ఆకాశం, గాలి, జలము,  అగ్ని సృష్టించినవారు. భూమి మీద వృక్షాలను, జీవరాశిని సృష్టించాడు.

సృష్టి అనేది  పుట్టుకు వీలుగా ఒక అధిపతిని నియమించినట్లు మనకు తెలుస్తున్నది. నుదుటిమీద రేఖలద్వారా జీవన కాలము వ్రాసి భూలోకం లో జీవించాలని, ప్రకృతి ననుసరించి బ్రతకాలని ఆ విధాత వ్రాసి నట్లు తెలుస్తున్నది.   సృష్టిని పాలించేవారు శ్రీ మహావిష్ణు అని తెలుస్తున్నది. త్రిమూర్తులకు గురువు ఆదిపరాశక్తి అని తెలుస్తున్నది.       పార్వతి ఈశ్వర శక్తిగా, బ్రహ్మిణి బ్రహ్మ శక్తిగా, లక్ష్మి విష్ణు శక్తిగా ఆ త్రిమూర్తులు వారి భార్యల శక్తి మానవులందరిని రక్షించు చున్నదని ప్రతి ఒక్కరు గ్రహించగలరు.

విషయానురక్తి బట్టి బంధము నిలబడు తుంది, ఈ బంధమనేది ఇరువైపులా పదునున్న కత్తి వలే ఉంటుంది. మంచి మాటలు వ్రాసే కలములా, చెడు ఎదిరించే కత్తిలా మానవులు బ్రతకాలని తెలిపేది.           

కొందరిలో బుద్ధి వికసించు తుంది, దానివల్ల సకర్మలు చేయుచు, సన్మార్గములో సంపాదన చేస్తూ, ఉన్నదానిలో రేపటి గురించి ఆలోచించ కుండా దానం చేసేవారు, ముక్తి మార్గం కోసం జీవితంలో కష్ట సుఖాలు అనుభవించి తన జీవన సాఫల్యాన్ని తెలుసుకొని జీవించటానికి ప్రయత్నీస్తారు. ఇటువంటి వారికీ ఇంద్రియాలు అదుపులో ఉంటాయి, అట్టివారు పాపాలకు, కళంకాలకు, చావుకు, విచారానికి, బంధానికి చిక్కకుండా నిర్మల మనస్సుతో, ప్రశాంత వాతావరణంలో బ్రహ్మా నందం   పొందుతున్నారు. వారి వాక్కు వేదవాక్కు, స్వయం ప్రకాశముతో వెలుగుతూ ఎవ్వరికి భయపడని స్థితిని చేరుతారు.    
           
వారు పాపాలకు, కళంకాలకు, చావుకు, విచారానికి దూరమై బ్రహ్మానంద స్థితిలో ఉంటారు. స్వయం ప్రకాశముతో తాను ఎవరికి భయపడడు.

అదే జ్ఞానము. అదే శాశ్వతము, స్వచ్ఛమైనది. అత్యున్నతమైనది. తనను తాను వ్యక్తీకరించుకొన్న స్థిరమైనది. కనిపించని ఆనంద స్థితి. అది జీవాత్మ కంటే వేరైనది కాదు. లోపల, బయట ఉండేది అదే. అది ఎల్లప్పుడు విజయాన్ని సాధించేది. మోక్ష మార్గాన్ని చూపేది.

విశ్వ మంతా అజ్ఞానము కమ్ము కుంటున్నది, మిడి మిడి జ్ఞానంతో తాను చెప్పేది సత్యమని, తాను చేసేది ధర్మమని, తానూ బోధించేది న్యాయమని వాదించే వారు పెరుగుతున్నారు వారి నుండి జాగర్త వహించటం ప్రతి ఒక్కరి లక్ష్యం.      

శుద్ధిగా ఉన్న బంగారాన్ని అనేక ఆభరణాలుగా మార్చవచ్చు, పత్తిని అనేక రకాల వస్త్రాలుగా తయారు చేయవచ్చు, మట్టితో అనేక రకాల పాత్రలు తయారు చేయవచ్చు అట్లాగే మనిషిలో ఉండే గుణం ఒక్కటే ఇది అనేక విధాలుగా పరిభ్రమించినా మంచి మార్గం లో ఉంచి  బ్రతుకు సాగించటమే శక్తికి తగ్గ (ధనాన్ని)బంగారాన్ని, వస్త్రాన్ని, మట్టిని ఉపయోగించి బ్రతికి బ్రతికించటానికి  ప్రతి ఒక్కరు ముందుకు రావాలి      
--((*))--