16, మే 2017, మంగళవారం

Mallapragada ramakrishna Telugu Stories -15

ఓం శ్రీ రామ్ - శ్రీమాత్రేనమ:
తాతయ్య కోచింగ్ - క్రికెట్ ఆట 
తాతయ్య నీకు క్రికెట్ గురించి తెలుసా అని అడిగాడు మాధవ్, నా చిన్నప్పుడు గవాస్కర్ ఆడుతున్నప్పుడు చూసినట్లు గుర్తు, ఆ తర్వాత ఈ పల్లెటూరుకు వచ్చి వ్యవసాయము చేస్తూ కాలక్షేపము చేస్తున్నాను, అయినా ఆ ఆటలు మనకు అచ్చిరావు, ఏంతో కష్ట పడ్డ గుర్తించటం చాలా కష్టం.

సాధనతో ఎటువంటి దైనా సాధించవచ్చు అన్నారు కదా, అవును అన్నాను, ఓర్పుతో పట్టుదలతో పొలాన్ని దున్ని, నీరుపెట్టి, నారుపోసి, కలుపుదీసి, మందు కొట్టి చిన్న పిల్లవాడ్ని రక్షించినట్లు పొలాన్ని రక్షించు కుంటూ ఉన్నా ప్రకృతి కని కరించక పోతే, పంట చేతి కందదు.

అంటే సాధన చేస్తే ఫలితం ఉండ దంటారా, ఆవిషయం చెప్పేలేదే, అందరు సహకరించాలి, ప్రకృతి సహకరించాలి  అప్పుడే అనుకున్నది సాధించగలరు అని చెప్పాడు తాతయ్య.

తాతయ్య  నేను క్రికెట్ నేర్చుకోవాలి, నాకు నేర్పు నీకు తెలిసినది నీ దగ్గర కొంత, మాస్కూల్ మాష్టర్ వద్ద కొంత పట్టుదలతో నేర్చుకుంటాను. అయితే నేను చెప్పిన వన్నీ ఎదురు చెప్పకుండా నీవే చెయ్యాలి, అట్లా చేస్తానని నాకు మాటయివ్వు అన్నాడు తాతయ్య. నీవు చెప్పినట్లు నేను చేస్తాను అన్నాడు.

అయితే ఈ రోజే నీకు ప్రాక్టీసుగా నేను చెప్పినట్లు చెయ్య్ అన్నాడు, అట్లాగే అన్నాడు మాధవ్
గంప ఎత్తి కోడి పిల్లలను వదిలాడు అవి పట్టు కొచ్చి గంప క్రింద పెట్టు అన్నాడు. ఏంతో అతి కష్టం తో కోడి పిల్లలను పట్టి పెట్టాడు. మరలా బుట్ట తీసి వదిలాడు అలా మూడు సార్లు వదలి మరలా బుట్టకింద పెట్టడంతో మాధవ్ అలసి నట్లు గమనించి ఈరోజుకు ఇది చాలు, ఇదిగో ఈ చెంబుడు పాలు త్రాగు అని చేతికి ఇచ్చడు.

ఈ ఆటకు ముఖ్యంగా పరిశుభ్రమైన ఆహారము తీసుకుంటూ ఆరోగ్యము జాగర్త చేసుకోవాలి, ఎటువంటి దుర్వసనాలకు బానిస కాకూడదు అన్నాడు తాతయ్య.

నీకు నిండా 14 సంవత్సారాలు రాలేదు ముందుగా మన ఊరు స్కూలు తరపున ఆడి గెలవాలి అది మొదటి స్టెప్ అన్నాడు. అట్లాగే తాతయ్య. రేపు మరలా వస్తా నాకు ట్రైనింగ్ ఇవ్వు అన్నాడు

మరునాడు మాధవ్ తాతయ్య దగ్గరకు వచ్చాడు మాధవ్ అప్పుడే కుక్కను పురమా యించాడు మాధవ్ పై కుక్క వెంబడి పడటం దాన్ని తప్పించు కోవటానికి ఇంటి చుట్టూ తిరిగాడు రెండుసార్లు, ఎం తాత కుక్కను పురమా యించావు, వేగంగా పరుగెత్తావో, క్రిందపడ్డావో, భయంతో వణికి పోయావో  చూద్దామని అట్లా చేశా, నా టెష్టులో గెలిచావ్ ఈ రోజు ఇదిగో ఈ రాగి సంకటి ముద్ద పళ్లెంలో పెట్టాడు, ఈ రోజుకు తిను అన్నాడు, ఏంతో బాగుందని అంటూ గబగబా తిన్నాడు.

తాతా మీ మనవారులు లేదా, ఉన్నదిరా పిలుస్తావుండు అంటూ రాధా అని పిలిచాడు, ఎం బావా బాగున్నావా అని అడిగింది, ఏమిటే బావా అంటావ్ నీకన్నా 5ఏళ్ళు చిన్న అలా పిలవకూడదు, ఆయితే మాధవ్ అనిపిలుస్తా, నేను రాధా అని పిలుస్తాను. మాధవ్ నాకు మామిడి పండు కోసి ఇవ్వవూ, నేను నిన్ను ఎత్తుతా అంటూ పైకి ఎత్తాడు, కాయ పట్టుకొని ఒక్క లాగు లాగింది అంతే ఇద్దరూ క్రిందపడ్డారు ఏమిటిరా అక్కడ మీరు చేసేది తప్పుకాదా అని అరుస్తున్నాడు, ఏమీ లేదు ఏమిలేదు అంటూ దులుపుకుంటూ ఎవరి దారిన వారు వెళ్లి పోయారు.

మరునాడు చెరువు గట్టుకు తీసుకెళ్లాడు మాధవ్ ని, పైనుంచి దూకి చెరువులో ఈదుతూ చాపలు పట్టాలి అన్నాడు. ఓసి ఇంతేనా అని దూకాడు, ఎంత కష్టపడ్డా చేపలు చిక్కినట్లు చిక్కి జారిపోతున్నాయి, చెప్పటం ఇష్టం లేక చొక్కా విప్పి చేపలపై వేసి కొన్ని పట్ట గలిగాడు. తరువాత తాతయ్య పైకి తెచ్చిన చేపలను మరలా నీటిలోకి వదలి ఈ రోజుకు చాలు, ఇదిగో ఈ జీడిపప్పు , బాదాం పప్పు తిని నెమ్మదిగా ఇంటికి చేరు, నేను ఒక్కసారి మీ మాష్టర్ ను కలసి వస్తాను నీకు క్రికెట్ ట్రైనింగ్ ఇవ్వమని చెపుతాను అన్నాడు.                                  

తాతయ్య మాష్టారును కలవడం 15మంది కుర్రాళ్లను సేకరించటం, గుడి స్థలంలో ఆడుటకు అనుమతి తీసుకోవటం అంతా క్షణాల్లో జరిగి పోయింది .

తాతయ్య వెళ్లిన పని కాయ పండా అని అడిగాడు మాధవ్ . గుడి స్థలాన్ని సుబ్రం చేసుకొని ఆడుకో మన్నారు వారం రోజుల్లో శుభ్రం చేస్తారుట తర్వాత నేర్పు తానని మాష్టారు చెప్పారు అన్నాడు.
మంచిది వారం రోజులు దాకా నే నాగను ఈ రోజు ఏం చేయాలో చెప్పు అన్నాడు.

రాధా అక్కడ ఉన్న తాడు పట్టుకురా ఈ వేప చెట్టుకు ఊల వేద్దాము అన్నాడు, ఆ చెక్క కూడా తీసుకురా, తాతాయ్య ఈరోజు అట్లతద్దా ఉయ్యాల వేస్తున్నావు అని అడిగింది. ఈ రోజు టుంగు టుయ్యాల ఊగించుట ప్రాక్టీస్ చేయిద్దాం అన్నాడు, నేను ఊగొచ్చా ఆడవాళ్ళకు వద్దు లేమ్మా చెక్క మీద కాళ్ళు కదల కుండా తాళ్లను పట్టుకొని ఊగాలి, తాత నేను కూడా ఊగతా సరే ముందు మాధవ్ ప్రాక్టీస్ చెయ్యని అన్నాడు సరే అన్నది రాధ.

చెక్క పట్టుకొని మాధవుని ఒక్కసారి గట్టిగా లాగి వదిలింది అంతే కాళ్ళు ముడుస్తూ లేస్తూ పైపై దాక ఊగాడు, తాకు కూడా భయం వేసేంది జాగర్త ఇక చాలు అన్నాడు, లేదు తాతయ్య ఈ రోజు ఆట చాలా బాగుంది గాలిలో తేలి నట్టుంది అన్నాడు, చాలురా చాలు ఇక ఆపు అన్నాడు, నెమ్మదిగా ఆపాడు,  ఆపెంగానే రాధ చెక్క పట్టుకుంది, దిగాడు మాధవ్.

నీవు మాములుగా చెక్క మీద కూర్చో నెమ్మదిగా చిన్న ఊపులు వేస్తాడు మాధవ్
నెమ్మదిగా లాగి ఊయల వదిలాడు అంతే లంగా పైకి ఎగరటం, దాన్ని అదుముకుని కూర్చోవటం, ఇకచాలు అనటం అంతా చూసాడు మాధవ్. నెమ్మదిగా దిగుతూనే అంతా చూసావా అంతా ఏంచూసావురా, పిరికితనం, భయం, అన్నాడు రాధతో, నవ్వుతూ చేతిని గిల్లి మరి వెళ్ళింది.

ఎందుకు గిల్లింది అని ఆలోచిస్తున్నాడు మాధవ్. ఇదుగోరా ఈ రోజుకు పెరుగన్నం అల్లం ముక్కలు పచ్చిమిరప కాయలు ఉప్పు కలిపి తిరగ మోత పెట్టి మరీ తయారు చేసింది రాధ.

రాధా చేసిందా అంటూ గబగబా తిన్నాడు. ఎమన్నా చదువుతున్నావా చదువుతున్నా తాత ఇప్పుడు 10వ తరగతి నేనే క్లాస్ ఫస్టు.

రాధ 10వతరగతి పాసై మూడేళ్లు పైనయింది కాలేజీలో చేర్పించ బోయావా అన్నాడు మాధవ్.
నేనా పెద్దవాడి నయినాను వాళ్ళమ్మ నాన్న యాక్సిడెంట్లో చనిపోయారు, దాన్ని పెళ్ళిచేస్తే భాగింటుంది అన్నాడు. ఎప్పుడేం పెళ్లి తాత చిన్నపిల్ల అన్నాడు. నీవు చిన్నవాడవని అందరు చిన్న పిల్లలను కుంటే ఎట్లా అన్నాడు.
అప్పుడే మాష్టారు తాతగారి దగ్గరకు వచ్చి రెండురోజుల్లో ప్రాక్టీస్ చేయిస్తా అన్నాడు అట్లాగే మాష్టారు అన్నాడు తాతయ్య.

రాధా ఆ నులక ఉండ ఇటు తీసుకురా అన్నాడు తాతయ్య తెచ్చింది దాన్ని చిన్నదిగా మార్చి బంతిలాగా చేసాడు, ఈరోజు ఇంకా మాధవ్ రాలేదా, అదిగో వస్తున్నాడు తాతయ్య ఎందుకురా ఈరోజు లేటు ఏమీ లేదు తాతయ్య కారు పంచరైతే చక్రం  పీకి చక్రం పెట్టివచ్చా అందుకే ఆలస్యము అయిందా, డబ్బు లేవన్నా తీసుకున్నావా వాళ్ళు ఇస్తామన్న వద్దని అసలే ఆలస్యమైనది అని పరుగేతుకుంటూ వచ్చా.

ఈరోజు రాధ నీవు కలసి అడాలిరా నాకు ఓపిక లేదు అన్నాడు తాతయ్య, ఏ ఆట తాతయ్యే ఈబంతి లాగుందే ఉండ విసిరేసుకుంటూ పట్టుకోవాలి ఆ మొదలు పెట్టండి నేను చూస్తూ ఉంటా అన్నాడు.

నెమ్మదిగా విసిరేసుకుంటున్నారు, ఇదేమన్నా బంతిపూల ఆట అనుకున్నారా వేగం పెంచండి అన్నాడు తాతయ్య రాధ విసిరేయడం మాధవ్ పట్టుకోవటం, ఒక్కోసారి పట్టుకోలేక ఛాతికి తగలటం జరుగుతున్నది, అదేవిధముగా రాధకు కూడా తగులుతున్నది, ఎదో అనుకోని హాయ్ అనిపిస్తున్నది రాధకు, మాధవ్ మాత్రం అంత వేగంగా విసురు తావెందుకు అన్నాడు, పట్టుకోవటం చేతకాక పోతే సరి అన్ని వొంకలు పెడతారు, సరే వేయి అన్నాడు, రకరకాల పద్దతులలో వంగి దగ్గరికి దూరంగాను విసిరింది, అంతే మాధవ్ పరుగెత్తే జింకపిళ్లను పులి పట్టినట్లు బంతిని పెట్టుకుంటున్నాడు పట్టుదలతో.

ఇక చాలు ఈరోజుకు ఇదిగో ఈ పళ్లిపప్పు చెక్క తినండి అని చేతిలో పెట్టాడు తాతయ్య.     
రాధ కూర్చొని రొప్పుతుంటే వక్షోజాలు ఎగిరినట్లు కనిపిన్చాయి మాధవ్ కు అవి చూసి ఎదో తెలియని అనుభూతి కలిగింది, ఏమిటిరా అదేపనిగా అట్లాచూస్తున్నావు ఎం కనిపించాయి అన్నాడు తాతయ్య.
ఆ చెట్టు మీద రెండు మామిడి కాయలు కనిపిస్తే చూసాను అంతే అన్నాడు.

తొందర పడకు మంచి ఆటగాడిగా మారు అప్పడు మామిడి పండు రసమే త్రాగొచ్చు అన్నాడు.

మాష్టర్ రావటం రేపటినించి క్రికెట్ ప్రాక్టీస్ చేయిస్తాను అని చెప్పఁటం జరిగింది.

తాతయ్య మరి ఈరోజు నాకు ఎక్సరసైజ్ ఏది అని అడిగాడు. అప్పుడే రాధా అని స్కిప్పింగ్ తెమ్మన్నాడు తెచ్చింది.
నాకు రాదు తాతయ్య, నేర్చుకుంటే అదే వస్తుంది, రాధా ఒక్కసారి ఆది చూపించమ్మ అన్నాడు తాతయ్య
రాధ ఆడి స్కిప్పింగ్  తాడులు మాధవ్ కు ఇచ్చింది. కొద్ది సేపు కష్ట పడ్డ ఆడగలిగాడు, ఇద్దరూ కలసి ఆడండి అన్నాడు తాతయ్య ఇద్దురూ  కలసి ఆడితే చమటకు వస్త్రాలు తడిసినవి. ఒకరి మొఖం  ఒకరు చూసు కుంటూ తుడుచు కుంటూ ఆగిపోయారు.

స్కూల్ తరుఫున బ్యాటింగ్, బోలింగ్ నెట్ ప్రాక్టీస్ చేసి అన్ని స్కూళ్ళ విజయం సాధించి, స్టేట్ వైడ్ లో మొదటి బ్యాట్స్ మెన్ గా సెలెక్టయ్, ఏకధాటిగా 300 రన్సు కొట్టిన బ్యాట్సమెన్ గా స్పోర్ట్స్ మినిస్టర్ ద్వారా బహుమతి పొంది అంతర్జాతీయములో ఆడుటకు భారతీయునిగా సెలెక్ట్ అయి ఇతర దేశాలలో ఆడుటకు బయలు దేరాడు మాధవ్.
చదువు 10వ తరగతితో ఆగిపొయిన్ది, తాతా పెద్దవాడగుట వల్ల రాధ భాద్యత మాధవ్ తీసుకొని తనతో తీసుకెళ్లటం జరిగింది. రాధా మాధవ్ ల ప్రేమ చెప్పలేనిది .

భారత దేశం తరుఫున అత్యధిక పరుగులు తీసిన వారిలో ఒకటిగా ప్రశంసా పత్రము, బహుమతి పొందాడు, క్యాప్టెన్  మారి దేశ  ప్రగతికి తోడ్పడుతున్నాడు.
ఎవరన్నా అడిగిన తాత చెప్పిన మాటలు చెపుతున్నాడు " అంచనాలు తారుమారు చేసి మహాశక్తిగా మారాలంటే ఓర్పు, పట్టుదల, సహకారం ఉంటే జయం తథ్యం, ఆటగాడిగా ఎదగాలంటే తామరాకు మీద నీటిబొట్టులా ఉండాలి, ఎటువంటి భావాలకు లొంగ కుండా జీవించాలి, తనదైన పద్దతిలో గమ్యం ఏర్పడుచుకుంటే ఆజీవితానికి ఒక అర్ధం, పరమార్ధం ఉంటుంది.
అప్పుడే తాతయ్యను ప్లేన్ లో దిగుతూ కని పించాడు తాత నీవిక్కడికి ఎలా వచ్చారు, నేను మీ మాష్టర్ కూడా వచ్చారు, ఇద్దరికీ పాదాభి వందనం చేసాడు మాధవ్.

తాత నేను మన ఊరు కోసం ఏదన్నా చేద్దామనుకున్నా 100 ఎకరాలు కొని ఆటస్థలములుగా మార్చాలనుకున్నా దానికి రాధ తల్లి తండ్రుల పేర్లు పెడదామనుకున్నా అన్న మాటలకు తాతయ్యకు కళ్ళవెంబడి నీళ్లు తిరిగి నేను చెయ్యాలను కున్న పని నీవు చేస్తుతున్నావు అని ఆలింగనం చేసుకొని ఇంత కన్నా నేను ఏమి ఇవ్వలేనురా మాధవ్, రాధ పలకరిస్తూ తాత నీవుకూడా మాతో ఉండాలి అన్నమాటలకు మీరు నాబిడ్డలురా మిమ్మల్నోదిలి ఎక్కడకు పోలేను  తా అన్నాడు.