ఓం శ్రీ రామ్ - శ్రీ మాత్రే నమ:
విశ్వములో జీవితం -2
ఒకరికి ఒకరు
ఈ విశ్వములో కేవలము విద్య ఒక్కటి మాత్రమే కాదు, విద్యతో పాటు వినయము కూడా ఉండాలి, వీటికి తోడు దానగుణము తప్పక ఉండాలి, అనగా విద్యను దాచకుండా తాను తెలుసుకున్న విద్యను తోటివారికి అందించటమే, విద్యా " జ్ఞానము " వళ్ళ మానవులకు మంచి చెడులు తెలుసుకొని మాయ మాటలకు నమ్మకుండా జీవితాన్ని ఓర్పుతో నేర్పుతో సరి దిద్దు కోవటమే ముఖ్యమైన లక్షణం. .
విద్య
లేని వారు వింత పశువు అనే వారు, కానీ అది తప్పు, అందరు అందలం ఎక్కే
వారయితే మోసేవారు ఎవరు అనే ప్రశ్న వస్తున్నది. కానీ అవిద్యా ప్రభావము వళ్ళ
కొంత నిరుత్సాహము తప్పదు, ఆయినప్పడికి ప్రకృతి సహకారంతో, తోటి వారి
సహాయముతో తాను సంపాదించినదే సంతృప్తిగా భావించితే జీవితం అంతా సుఖమయం. కానీ
ఎదుటి వారిని చూసి ఆలోచించి, ఆరోగ్యాన్ని పాడు చేసుకోవటం, అసంతృప్తిగా
ఉండటం అవసరమా ?
రాత్రి
వచ్చే కల తెల్లవారితే మాయ మవుతుంది, దాని వళ్ళ ఎటువంటి హాని ఉండదు, కలలు
రావటానికి కారణం మనలో ఉన్న అసంతృప్తి ఒక కారణం, మరియు మనం చూసిన కొన్ని
సంఘటనలను ఉహించుకొని నిద్రపోవటం వల్లనే. అందుకే మనం నిద్రపోయేప్పుడు తల్లి,
తండ్రి, గురువు, దైవాన్ని తలచుకుంటే మంచిది. శ్రమ తక్కువగాను ఆలోచన
ఎక్కువగాను ఉండటం వళ్ళ కలలు ఱావచ్చును.
నా
ఉద్దేశ్యములో ఏ రోజు పని ఆరోజే చేసుకొని రేపటి గురించి ఆలోచన చేయకుండా ఉండ
గలిగిన వాడికి, బాగా కష్టపడి కడుపు నిండా భోజనము చేసిన వాడికి మంచిగా
నిద్రవస్తుంది.
నమ్ముకున్నదానిపైన
నిరంతరం దృష్టి ఉంచడం. ఒకసారి ఏదైనా చేయాలనే నిర్ణయానికి వస్తే
ఎవడేమనుకున్నా వెనక్కు తిరక్కుండా ‘జంకుగొంకు లేక ముందు సాగిపొమ్మురా!‘
అనుకుని, అనుకున్నదాన్ని సాధించేవరకు కష్టించడం, ఫలితాన్ని మాత్రం
మాట్లాడకుండా స్వీకరిచడం - మంచైనా చెడైనా తప్పదు. మనం మన మనస్సు బట్టి
నిర్ణయాలు తీసుకుంటాం, సహకరించే వారి సలహాను పాటిస్తాం, సరైన జ్ఞానము వళ్ళ
బుద్ధి వికసించుతుంది.
ఎర్రని
పుష్పము క్రిష్టల్ ముందుంచి నప్పుడు ఎర్రదనం క్రిష్టల్ ల్లో ప్రతి
బింబిస్తుంది. అట్లాగే మనచుట్టు వున్నా వారి ప్రభావము మనపై కొంత పడి,
చేసేపనిలో కొంత ఆసౌకర్యము కలుగవచ్చు, ఆయన పట్టుదల విడవకుండా ప్రయత్నిమ్చటమే
మానవులకు ఉన్న నిజమైనా ధర్మం.
ధన వనితాది విషయం భోగాలకు చిక్కకుండా విశ్వములో జీవితాన్ని సాగించాలి. బురద నీటిలో కలువ పువ్వు కాడ ఉండి పైన అందాలు విరజిమ్మే విధంగా ఉండే పువ్వుని గమనించాలి. సముద్రములో ఎగిరే చేపలు లాగా ప్రేమను పంచుకుంటూ ఒకరికి ఒకరై విశ్వములో జీవించాలి.
--((*))--
కామెంట్‌లు లేవు:
కామెంట్‌ను పోస్ట్ చేయండి