ఓం శ్రీ రాం - శ్రీ మాత్రే నమ:
మనమధ్య ఉన్న ప్రేమను ఏ గ్రహము వేరు చేయలేదు ఇది తద్యం.
వియోగ ప్రేమ
భార్య
భర్తల మధ్య మనస్పర్థలు వచ్చి వియోగ వేదన ఎలావుంటోందో ఒక్కసారి ఆలోచిస్తే
ఎవరి తప్పు అయినా చీకటి పడిన ఒక్కటవటం లోక సహజం, తాడు తెగేదాకా లాగ కుండా
జాగర్త పడటమే మానవునియొక్క జీవిత లక్ష్యం.
మొగవారు
మూర్ఖులుకాదు కొంత కోపావేశముతో ఆడవారిని ఏమైనా అనవచ్చు అంత మాత్రాన ప్రేమ
లేదని వాదించుట స్త్రీకి అవసరమా, అలాగే స్త్రీలలో భర్త ననుసరించి తాను
అనుకున్నది సాధించాలని పట్టు పట్ట వచ్చు కానీ సంసారాన్ని వీధిని పాలు చేయట
కూడ, భాద్యత ఇద్దరిది. తప్పును వేలెత్తి చూడ కుండా సర్దుకు పోవటమే లోక
సహజము.
రమణీయం,
కమనీయం,అమూల్యమ్, అనిర్వచనీయం, రెండే అక్షరాలు ప్రేమ. అనంత సౌఖ్యాలు
కల్పించేది, మనస్సును ప్రశాంత పర్చేది ప్రేమ. కోటి కోట్ల వెలుగులను
అందించేది, మనస్సును నిర్మల పరిచేది, ఆనంద చైతన్య కెరటాలు ఇరువురి లో
ఉత్పత్తి అయి, మధుర మోహన మౌన రాగాలు ఉల్లా సము, ఉత్సాహము కల్పించేది
ప్రేమ.
దినములెన్నో కాదు హితము కోరి మనసు నెరిగి వయసులో కరిగి వృద్ధాప్యంలో ఒకరికొకరు తోడుగా నిలబడేది ప్రేమ.
ఎన్నో సంఘటనలు జరిగాయి మనమధ్య, నాకోసం నీవు ఎంతో కష్టపడ్డావు, నీకోసం నేను కూడా అంతే కష్ట పడ్డానని అను కుంటున్నాను.
ఆశ వచ్చినప్పుడు నీవు నాకు కనుల పండగ చేస్తావు, లోన నుండి వెలుగు జిమ్మి రూపు జూపి క్షణములో నేను ఎంతో నేర్పుగా ఓర్పుగా పలికిన మాటలకు నమ్మినట్లు, గౌరవించి నట్లు నటన చూపుతావె.
ఇరువదేండ్లు గడచి కూడ నింక నీకు నామీద నమ్మకము లేక నన్ను ఆడిస్తున్నవే, కరుణ యున్న దని దనుచు బలికి కష్టపెట్టు చున్నావే, నే నెప్పుడూ నీ దాన్నే అని బాసలు చేస్తూ దూరంగా ఉంటావే, నీ దరి ఉన్న లాభమేమి, తనివి నీయకున్నచో ?.
చక్కదన మంటూ చిక్కన వానిని ఊరించి దరిచేరగా దూరముగా జరిగి ఒక్క దినము ఒక్క రీతిలో మనసు నంతా కరిగించే పలుకులు పలికి, మాయకు చిక్కిన వాడు ఆడినట్లు ఆడించి తృప్తి పడుట ఎందుకు ?
ప్రేమను తేలిపే మార్గాలలో నిన్ను గౌరవించి తెలుపు తున్నాను, వయసు ఉన్నంత వరకు దేవుడు కల్పించిన సుఖము అనుభవించుట తప్పు కాదు, మనది జన్మ జన్మల బంధమని అనుకోవటం జరుగుట లేదెందుకు, నీ మానసిక బాధలకు కారణము నేనే అయతే అనేక విధములుగా నీకు వినతి తెలుపు తున్నాను, తప్పును తెల్పిన సర్దుకొని బ్రతక గలను. సామ దాన భేద దండోపాయముతో పం దేది ప్రేమ కాదు, మన:స్పూర్తిగా ఒకటిగా బ్రతికించేదే ప్రేమ.

ఎలాంటి పరిస్తితి లో ఐనా " నీ
జ్ఞాపకంతో " పెదాలపై అనుకోకుండా ఆహ్లాద కరమైన చిరునవ్వు తెప్పించేది,."నీ
దూరం" గుర్తు రాగానే అప్రయత్నం గా కన్నుల్లో నీటి చెలమలు చెంపలపై కార్చేది,
మనమధ్య జరిగిన ప్రేమ.
నిన్ను తల్చుకుని కనులు మూసుకుంటే , లోపలి భారందిగి పోఇ , మనసు తేలిక చేసేది, నీ దుఃఖపు కన్నీటి చుక్కను చూసి విలవిలలాడి తుడిచేందుకు తహతహలాడి చేయి చాపేది, వేదనలో ఉండి నీ భుజంపై తలవాలిస్తే , తిరిగి వేయిఏనుగుల బలం తెప్పించి , నిను నిలబెట్టేది మరచిపోలేని మనమధ్య ఏర్పడిన తనువులు కలిపిన బంధం, అదే జీవితంలో ,మరచిపోవాలన్న మరువ నీయని ప్రేమ.
యెంత దూరం లో ఉన్నా , సామీప్యం లో ఉన్న భావన ఇస్తూ ఉరట నిచ్చి , తిరిగి మరళా రెట్టింపు ఉల్లాసం ఇచ్చేది, మనమధ్య నలిగినా సుఖస్పర్శ ప్రేమ.
నీ ఉహ, నీ వస్తువు ఏది చూసినా, తాకినా , అంతరంగంలో అనన్య, అపురూప అనుభూతి కల్గించేది,
ఓటమి లో, నిరాశలో , ఒక నీ మాట , ఓదార్పు , తిరిగి ఊపిరి పోసి , ఉత్తేజం, ఉత్సాహం నింపేది,
నిద్దురలో, మెలకువలో, చీకటిలో, అశాంతి లో "నీ తోడుంది " అన్న ఆ భావన, ధైర్యంగా ముందుకు పంపేది నిజమైన ప్రేమ.
"మాధవా" నాదే తప్పు చెప్పుడు మాటలు విని అదే నిజమనుకొని మనమధ్య నేను ఒక అఘాతము సృష్టించు కున్నాను, దాన్ని దాటి రావటానికి నీ సహాయ సహకారము అర్ధిస్తున్నాను, ఇది విషమ కాలమని భావిస్తున్నాను, అన్యధా ఆలోచించక నన్ను నీదానిగా చేసుకో, నాసర్వస్వమూ నీకు అర్పించుటకు నేను సిద్దమే, కాలము మామధ్య బందాన్ని విడదీసింది అనుకున్నా, అదేకాలమే మనల్ని మరలా కలుపుతున్నది యిది దేవుడు ఆడుఇంచిన నాటకమే.
తోడూ నీడ
సముద్ర కెరటాన్ని చూసి భయ పడకు
ముసురును చూసి ముసుకెందుకు
ధనమును చూసి దిగులెందుకు
నమ్మకము- ఉన్నచోట-తోడూ నీడ- ఉంటుంది =

తలవంచి నమస్కారము చేయగా
నీ నీడను చూసి భయం చెందకు
నీకు తోడుగా నేనుండగా
ముసురును చూసి ముసుకెందుకు
నీ ప్రక్కన వెచ్చగా నేనుండగా
కాలమును చూసి కలలెందుకు
నిముషముకూడ విడవక నేనుండగా
నీవు చీకటిని చూసి భయపడకు
నీవు చీకటిని చూసి భయపడకు
వెలుగుగా నేనుండగా
గులాబీని చూసి గుబులెందుకు
సువాసనగా నేనుండగా
ధనమును చూసి దిగులెందుకు
ఖర్చుచేసేవాడిగా నేనుండగా
పక్కను చూసి పక్కగా పక్కగా ఎందుకు
నీ మోజును తీర్చె నేనుండగా
నమ్మకము- ఉన్నచోట-తోడూ నీడ- ఉంటుంది =
అహం - ఉన్నచోట- అంధకారము- ఉంటుంది
' ఆరుద్ర ' కూనలమ్మ పదాలు
×++ +++ +×+
×++ +++ +×+
జప తపంబుల కన్న
చదువు సాముల కన్న
ఉపకారమే మిన్న
ఓ కూనలమ్మ
చదువు సాముల కన్న
ఉపకారమే మిన్న
ఓ కూనలమ్మ
మగని మాటకు మాటి
కెదురు పల్కెడు బోటి
మృత్యుదేవత సాటి
ఓ కూనలమ్మ
కెదురు పల్కెడు బోటి
మృత్యుదేవత సాటి
ఓ కూనలమ్మ
కవితా రసపు జల్లు
ఖడ్గాల గలుగల్లు
కరణాలకే చెల్లు
ఓ కూనలమ్మ
ఖడ్గాల గలుగల్లు
కరణాలకే చెల్లు
ఓ కూనలమ్మ
భీష్ము డనుభవశాలి
భీముడే బలశాలి
కర్ణుడే గుణశాలి
ఓ కూనలమ్మ
భీముడే బలశాలి
కర్ణుడే గుణశాలి
ఓ కూనలమ్మ
అన్న మిచ్చిన వాని
నాలి నిచ్చిన వాని
నపహసించుట హాని
ఓ కూనలమ్మ
నాలి నిచ్చిన వాని
నపహసించుట హాని
ఓ కూనలమ్మ
కాపు వాడే రెడ్డి
గరిక పోచే గడ్డి
కానకుంటే గుడ్డి
ఓ కూనలమ్మ
గరిక పోచే గడ్డి
కానకుంటే గుడ్డి
ఓ కూనలమ్మ
దుర్యోధనుడు భోగి
ధర్మరాజొక జోగి
అర్జునుండే యోగి
ఓ కూనలమ్మ
ధర్మరాజొక జోగి
అర్జునుండే యోగి
ఓ కూనలమ్మ
ఆడి తప్పిన వాని
నాలి నేలని వాని
నాదరించుట హాని
ఓ కూనలమ్మ
నాలి నేలని వాని
నాదరించుట హాని
ఓ కూనలమ్మ
పై ఎనిమిదిన్నీ ప్రచారంలో ఉన్న పాత కూనలమ్మ పదాలు.
సేకరణ :-
డా !! సోమయాజుల త్యాగరాజ శాస్త్రి
శుభ సాయంత్రం !
డా !! సోమయాజుల త్యాగరాజ శాస్త్రి
శుభ సాయంత్రం !
అవును రాధా "దేవుడు ఆడించిన నాటకమే "
పురుష సూక్తము - తాత్పర్యము
వేదమంత్రాలలో భావగర్భితమైనది, మంత్ర శక్తిలో అతి ప్రధానమైనది పురుష సూక్తం. పురుషుడంటే భగవంతుడు. భగవంతుని మహాత్మ్యమును కీర్తించే సూక్తం ఇది. దేవాలయాలలో, ఇంట్లో, భగవదారాధనలో, నిత్య పారాయణలో, వైదిక ప్రక్రియలలో పురుష సూక్త పఠనం కద్దు. పురుష సూక్తం హిందువుల జీవితంలో ఒక అంతర్భాగమై ఉందన వచ్చు. పురుష సూక్తంలో సంహిత (దేవతా ప్రార్థన), బ్రాహ్మణం (యాగ వివరాలు), అరణ్యకం (ఉపనిషత్తులు) - సనాతన సత్యాన్ని తెలిపే సాధనాలు - ఈ మూడు గర్భితమై ఉన్నాయి. ఈ పురుష సూక్తం భగవంతుని మహాత్త్వాన్ని కీర్తించటంతో ప్రారంభమై, భగవంతుని త్యాగ ఫలంగా ఈ ప్రపంచము, జీవులు ఆవిర్భవించాయని చెబుతుంది. తరువాత జీవుడు భగవంతుణ్ణి పొందటానికి అజ్ఞానాన్ధకారాన్ని దాటే మార్గం చెబుతూ అందుకైన హేతువును, దారిని వివరిస్తుంది. ఈ విధంగా పురుష సూక్తం ఒక పరిపూర్ణ శాస్త్రంగా ఒప్పారుతోంది.
అథ పురుషసూక్తమ్ ||
ఓం తచ్ఛం యోరావృణీమహే | గాతుం యజ్ఞాయ| గాతుం యజ్ఞపతయే | దైవీ స్వస్తిరస్తు నః |
స్వస్తిర్మానుషేభ్యః | ఊర్ధ్వం జిగాతు భేషజమ్ | శన్నో అస్తు ద్విపదే| శం చతుష్పదే |
ఓం శాంతిః శాంతిః శాంతిః |
హరిః ఓం |
ఓం సహస్రశీర్షా పురుషః | సహస్రాక్షః సహస్రపాత్ |
స భూమిం విశ్వతో వృత్వా | అత్యతిష్ఠద్దశాంగులమ్ | ౧
పురుష ఏవేదగ్ం సర్వమ్ | యద్భూతం యచ్చ భవ్యమ్|
ఉతామృతత్వస్యేశానః | యదన్నేనాతిరోహతి | ౨
ఏతావానస్య మహిమా | అతో జ్యాయాగ్‍శ్చ పూరుషః |
పాదోఽస్య విశ్వా భూతాని | త్రిపాదస్యామృతం దివి | ౩
త్రిపాదూర్ధ్వ ఉదైత్పురుషః | పాదోఽస్యేహాఽఽభవాత్పునః |
తతో విశ్వజ్‍వ్యక్రామత్ | సాశనానశనే అభి | ౪
తస్మాద్విరాడజాయత | విరాజో అధి పూరుషః |
స జాతో అత్యరిచ్యత | పశ్చాద్భూమిమథో పురః | ౫
యత్పురుషేణ హవిషా | దేవా యజ్ఞమతన్వత |
వసంతో అస్యాసీదాజ్యమ్| గ్రీష్మ ఇధ్మశ్శరద్ధవిః | ౬
సప్తాస్యాసన్పరిధయః | త్రిః సప్త సమిధః కృతాః |
దేవా యద్యజ్ఞం తన్వానాః | అబధ్నన్పురుషం పశుమ్ | ౭
తం యజ్ఞం బర్హిషి ప్రౌక్షన్| పురుషం జాతమగ్రతః |
తేన దేవా అయజంత | సాధ్యా ఋషయశ్చ యే | ౮
తస్మాద్యజ్ఞాత్సర్వహుతః | సంభృతం పృషదాజ్యమ్ |
పశూగ్‍స్తాగ్‍శ్చక్రే వాయవ్యాన్ | ఆరణ్యాన్గ్రామ్యాశ్చ యే | ౯
తస్మాద్యజ్ఞాత్సర్వహుతః | ఋచః సామాని జజ్ఞిరే |
ఛన్దాగ్‍ంసి జజ్ఞిరే తస్మాత్ | యజుస్తస్మాదజాయత | ౧౦
తస్మాదశ్వా అజాయంత | యే కే చోభయాదతః |
గావో హ జజ్ఞిరే తస్మాత్ | తస్మాజ్జాతా అజావయః | ౧౧
యత్పురుషం వ్యదధుః | కతిధా వ్యకల్పయన్ |
ముఖం కిమస్య కౌ బాహూ | కావూరూ పాదావుచ్యేతే | ౧౨
బ్రాహ్మణోఽస్య ముఖమాసీత్ | బాహూ రాజన్యః కృతః |
ఊరూ తదస్య యద్వైశ్యః | పద్భ్యాగ్‍ం శూద్రో అజాయత | ౧౩
చంద్రమా మనసో జాతః | చక్షోః సూర్యో అజాయత |
ముఖాదింద్రశ్చాగ్నిశ్చ | ప్రాణాద్వాయురజాయత | ౧౪
నాభ్యా ఆసీదంతరిక్షమ్ | శీర్ష్ణో ద్యౌః సమవర్తత |
పద్భ్యాం భూమిర్దిశః శ్రోత్రాత్ | తథా లోకాగ్‍ం అకల్పయన్ | ౧౫
వేదాహమేతం పురుషం మహాంతమ్ | ఆదిత్యవర్ణం తమసస్తు పారే |
సర్వాణి రూపాణి విచిత్య ధీరః | నామాని కృత్వాఽభివదన్ యదాస్తే| ౧౬
ధాతా పురస్తాద్యముదాజహార | శక్రః ప్రవిద్వాన్ప్రదిశశ్చతస్రః |
తమేవం విద్వానమృత ఇహ భవతి | నాన్యః పంథా అయనాయ విద్యతే | ౧౭
యజ్ఞేన యజ్ఞమయజంత దేవాః | తాని ధర్మాణి ప్రథమాన్యాసన్ |
తే హ నాకం మహిమానః సచంతే | యత్ర పూర్వే సాధ్యాః సంతి దేవాః | ౧౮
|| ఓం నమో నారాయణాయ ||
|| ఉత్తరనారాయణమ్ ||
అద్భ్యః సంభూతః పృథివ్యై రసాచ్చ | విశ్వకర్మణః సమవర్తతాధి |
తస్య త్వష్టా విదధద్రూపమేతి | తత్పురుషస్య విశ్వమాజానమగ్రే | ౧
వేదాహమేతం పురుషం మహాన్తమ్| ఆదిత్యవర్ణం తమసః పరస్తాత్ |
తమేవం విద్వానమృత ఇహ భవతి | నాన్యః పంథా విద్యతేయఽనాయ | ౨
ప్రజాపతిశ్చరతి గర్భే అంతః | అజాయమానో బహుధా విజాయతే |
తస్య ధీరాః పరిజానంతి యోనిమ్| మరీచీనాం పదమిచ్ఛంతి వేధసః | ౩
యో దేవేభ్య ఆతపతి | యో దేవానాం పురోహితః |
పూర్వో యో దేవేభ్యో జాతః | నమో రుచాయ బ్రాహ్మయే | ౪
రుచం బ్రాహ్మమ్ జనయంతః | దేవా అగ్రే తదబ్రువన్ |
యస్త్వైవం బ్రాహ్మణో విద్యాత్ | తస్య దేవా అసన్ వశే| ౫
హ్రీశ్చ తే లక్ష్మీశ్చ పత్న్యౌ| అహోరాత్రే పార్శ్వే |
నక్షత్రాణి రూపమ్ | అశ్వినౌ వ్యాత్తమ్| ఇష్టమ్ మనిషాణ |
అముం మనిషాణ| సర్వమ్ మనిషాణ | ౬
ఓం తచ్ఛం యోరావృణీమహే | గాతుం యజ్ఞాయ| గాతుం యజ్ఞపతయే | దైవీస్స్వస్తిరస్తు నః |

తాత్పర్యము:
భగవంతుడు వేలాది తలలు కలవాడు, వేలాది కన్నులు కలవాడు, వేలాది పాదాలు కలవాడు; భూమండలం యావత్తూ వ్యాపించి పది అంగుళాలు అధిగమించి నిలిచాడు.
మునుపు ఏది ఉన్నదో, ఇక ఏది రాబోతున్నదో సమస్తం భగవంతుడే. మరణం లేని ఉన్నత స్థితికి అధిపతి యైన వాడూ ఆయనే. ఎందుకంటే ఆయన ఈ జడ ప్రపంచాన్ని అతిక్రమించిన వాడు కనుక.
ఇక్కడ కానవస్తున్నదంతా భగవంతుని మహిమే. కానీ, ఆ భగవంతుడు వీటికంటే శ్రేష్ఠుడు. ఉద్భవమైనవన్నీ ఆయన పావు భాగమే. ఆయన ముప్పాతిక భాగం వినాశములేని గగనములో ఉంది.
భగవంతుని ముప్పాతిక భాగం పైన నెలకొని ఉంది. తక్కిన పావు భాగం ఈ ప్రపంచంగా ఆవిర్భవించింది. తరువాత ఆయన ప్రాణుల జడ పదార్థాలన్నిటిలో చొరబడి వ్యాపించాడు.
ఆ ఆది పురుషుని నుండి బ్రహ్మాండం ఉద్భవించింది. దానితో పాటు బ్రహ్మ ఆవిర్భవించి సర్వత్రా వ్యాపించాడు. తదనంతరం ఆయన భూమిని సృజించాడు. ఆ పిదప ప్రాణులకు శరీరాలను సృష్టించాడు.
భగవంతుణ్ణి ఆహుతి వస్తువుగా చేసుకొని దేవతలు నిర్వర్తించిన యజ్ఞానికి వసంతకాలం నెయ్యిగాను, గ్రీష్మకాలం వంట చెరుకు గాను, శరత్కాలము నైవేద్యము గాను అయినవి.
ఈ యజ్ఞానికి పంచభూతాలు, రాత్రి, పగలు, కలిసి ఏడు పరిధులైనవి. ఇరవై ఒక్క తత్త్వాలు సమిధలయినాయి. దేవతలు యాగాన్ని ఆరంభించి బ్రహ్మను హోమ పశువుగా కట్టారు.
మొదట ఉద్భవించిన ఆ యజ్ఞ పురుషుడైన బ్రహ్మపై నీళ్ళు చలారు. పిదప దేవతలు, సాధ్యులు, ఋషులు, ఎవరవేరున్నారో ఆ యావన్మందీ యాగాన్ని కొనసాగించారు. (బ్రహ్మ పై నీళ్ళు చల్లి పవిత్రీకరించటం మొదలైన విధులతో యజ్ఞం ప్రారంభమవుతుంది).
ప్రపంచ యగ్నమైన ఆ యాగం నుండి పెరుగు కలిసిన నెయ్యి ఉద్భవించింది. పక్షులను, జింక, పులి వంటి వన్యమృగాలను, పశువు వంటి సాదు మృగాలను బ్రహ్మ సృష్టించాడు.
ప్రపంచ యగ్నమైన ఆ యాగంలో నుండి ఋగ్వేద మంత్రాలు, సామవేద మంత్రాలు, గాయత్రి మొదలగు ఛందస్సులు ఉద్భవించాయి. దాని నుండే యజుర్వేదము పుట్టినది.
అందులోనుండే గుర్రాలు, రెండు వరుసల దంతాలు గల మృగములు, పశువులు, గొర్రెలు, గేదెలు ఉద్భవించాయి.
బ్రహ్మను దేవతలు బలియిచ్చినప్పుడు ఆయనను ఏ ఏ రూపాలుగా చేశారు? ఆయన ముఖము ఏడిగా అయినది? ఆయన చేతులు ఎదిగా చెప్పబడినది? తోదలుగా, పాదాలుగా ఏవి చెప్పబడ్డాయి?
ఆయన ముఖము బ్రాహ్మణుడుగా అయినది. చేతులు క్షత్రియుడుగా, తొడలు వైశ్యునిగా, పాదాలు శూద్రునిగా ఉద్భవించారు.
మనస్సు నుండి చంద్రుడు ఉద్భవించాడు. కాంతి నుండి సూర్యుడు, ముఖము నుండి ఇంద్రాగ్నులు , ప్రాణం నుండి వాయువు ఉత్పన్నమైనారు.
నాభి నుండి అంతరిక్షము ఉద్భవించింది. శిరస్సునుండి స్వర్గము, పాదాల నుండి భూమి, చెవి నుండి దిశలు ఉత్పన్న మైనాయి. అట్లే సమస్త లోకాలు ఉద్భవించాయి.
సమస్త రూపాలను సృష్టించి, పేర్లను కూర్చి ఏ భగవంతుడు క్రియాశీలుడై ఉంటూ, మహిమాన్వితుడూ, సూర్యునిలా ప్రకాశించే వాడూ, అంధకారానికి సుదూరుడు అయిన భగవంతుని నేను తెలుసుకున్నాను.
ఏ భగవంతుని బ్రహ్మ ఆదిలో పరమాత్మగా దర్శించి తెలిపాడో, ఇంద్రుడు నాలుగు దిశలలో అంతా చక్కగా చూసాడో, ఆయనను ఇలా గర్హించిన వాడు ఇక్కడే, అంటే ఈ జన్మలోనే ముక్తుడు అవుతాడు. మోక్షానికి మరో మార్గము లేదు.
దేవతలు ఈ యజ్ఞం ద్వారా భగవంతుని ఆరాధించారు. అవి ప్రప్రథమంగా ధర్మాలుగా రూపొందాయి. ప్రారంభంలో ఎక్కడ యజ్ఞం ద్వారా భగవంతుణ్ణి ఆరాధించిన సాధ్యులు, దేవతలు వసిస్తున్నారో, ధర్మాన్ని ఆచరించే మహాత్ములు ఆ ఉన్నత లోకాన్ని ప్రాప్తిన్చుకొంటారు.
(ఇక్కడి వరకే పురుష సూక్తము. కానీ దక్షిణాదిలో పురుష సుక్తాన్ని ఉత్తర నారాయణం, నారాయణ సూక్తం, విష్ణు సూక్తం లోని మొదటి శ్లోకంతో పాటు కలిపి పారాయణం చేస్తారు. ఈ కిందవి అవి).
నీటినుండి, భూసారము నుండి ప్రపంచం ఉద్భవించింది. ప్రపంచాన్ని సృజించిన భగవంతుని నుండి శ్రేష్ఠుడైన బ్రహ్మ ఉద్భవించాడు. భగవంతుడు ఆ బ్రహ్మ రూపాన్ని చక్కదిద్ది దానిలో వ్యాపించి ఉన్నాడు. బ్రహ్మ యొక్క ఈ ప్రపంచ రూపు సృష్టి యొక్క ఆదిలో ఉద్భవించింది.
మహిమాన్వితుడు, సూర్యునిలా ప్రకాశమానుడు, అంధకారానికి దూరుడు అయిన భగవంతుని నేను ఎరుగుదును. ఆయనను ఇలా తెలుసుకోనేవాడు ఇక్కడ ఈ జన్మలోనే ముక్తి పొందుతాడు. ముక్తికి మరో దారి లేదు.
భగవంతుడు ప్రపంచంలో క్రియాశీలుడై వెలుగు తున్నాడు. జన్మలేని వాడుగా ఉంటూనే ఆయన అనేక రూపాలలో ఉద్భవిస్తున్నాడు. ఆయన నిజ స్వరూపాన్ని మహాత్ములు చక్కగా ఎరుగుదురు. బ్రహ్మ వంటి వారు సైతం మరీచి మొదలైన మహాత్ముల పదవిని ఆకాంక్షిస్తున్నారు.
ఎవరు దేవతలకు తేజస్సుగా వెలుగొందుతున్నాడో, దేవతల గురువుగా భాసిస్తున్నాడో, దేవతల కంటే పూర్వమే ఉద్భవించాడో, ఆ ప్రకాశమానుడైన భగవంతునికి నమస్కారము.
భగవంతుని గురించిన సత్యాన్ని తెలిపేటప్పుడు దేవతలు ఆదిలో దానిని గురించి ఇలా అన్నారు: "భగవంతుణ్ణి అన్వేషించే వారు ఎవరైనప్పటికీ ఇలా తెలుసుకున్నాడంటే అతడికి దేవతలు వశులై ఉంటారు."
హ్రీ మరియు లక్ష్మీ దేవి నీ అర్ధాంగినులు. రేయింబవళ్ళు నీ పార్శ్వాలు. నక్షత్రాలు నీ దివ్య రూపం. అశ్వినీ దేవతలు నీ వికసిత వదనం.
ఓ భగవంతుడా! మేము కోరుకున్న దానిని ప్రసాదించి కరుణించు. ఈ ప్రపంచ సుఖాన్ని ఇచ్చి మమ్ము కరుణించు. ఇహపారాలలో సమస్తాన్ని ప్రసాదించి కరుణించు.
ఓం శాంతి శాంతి శాంతి

కామెంట్‌లు లేవు:
కామెంట్‌ను పోస్ట్ చేయండి