28, మే 2017, ఆదివారం

విశ్వములో జీవితం -6

ఓం శ్రీ రామ్ - శ్రీ మాత్రే నమ:


విశ్వములో జీవితం -6 

జీవితమ్ లో మనం అనేక సంఘటనలు చూస్తాము. అనేక మందిని కలుస్తాము, స్నేహాన్ని పెంచు కుంటాము. మన శరీరాన్ని జాగర్త 

చేసుకుంటూ జీవిస్తాము.
    
ఒకనికి నలుగురు భార్యలు వారిని ఎంతో ప్రేమగా చూసుకుంటాడు, వయసు ఉడికిన తర్వాత భార్యలు కూడా చూడటం తగ్గించారు ఎందుకు ?
నాల్గవ భార్య వద్దకు చేరి నేను సుఖ పెట్టలేనుగా కొంత డబ్బు తీసుకోని వెళ్తావా, నాతో జీవితాతం ఉంటావా అని అడిగాడు?     
మీ అందాన్ని చూసాను ఆనాడు, అది ఇప్పుడు నాకు కనబడుట లేదు, నన్ను చూసే కళ్ళే నీకు   కనబడుట లేదు, శరీరము సహకారించుట లేదు, మిగతావారు నీకున్నారు నా బతుకే ఎడారి కాకుండా నీవే మార్గం చూపు అన్నది నాల్గవ భార్య. 


అర్ధం చేసుకొనే తత్త్వం తో చెపుతున్నా, బలవంతంగానో హింసతోగానో ప్రేమ పొందటం సాధ్యం కాదు,
నీ  ఆలోచనలకు నేను అడ్డురాను, నా సహాయము ఎప్పుడు నీకు ఉంటుంది అన్నాడు.

మూడవ భార్య వద్దకు పోయి నేను నీకోసం ఎంతో ఖర్చు చేసాను, నీవు కోరిందల్లా కొని పెట్టాను, ఈ వయసులో నాకు తోడుగా ఉండి సేవలు చేస్తావా అని అడిగాడు. ధనం మీకు ఉన్నది, ఎవరు సేవలు చేయమన్నా చేస్తారు నేనే చేయాలా?
నీ సంపద చూసి నేను నీదగ్గర చేరాను అది క్రమేపి కరిగి పోతున్నది. నాకు న్యాయం చేసే భాద్యత నీ మీదే ఉన్నది, నీవు ఆటో ఇటో అయినా వనుకో నా బ్రతుకు ప్రస్నార్ధకం అవుతుంది, ముందు అది తేల్చండి ఆ తర్వాత మీకు సేవలు చేస్తానో చేయనో తెలుపుతాను అన్నది. ఆశ ఎన్నటికీ హితవు కాదు శాంతి ఎప్పటికి చేటు కాదు, నా సహాయము ఎప్పుడు నీకు ఉంటుంది అన్నాడు.

రెండవ భార్య వద్దకు పోయి  ఇదే విధముగా అడిగాడు, బంధు
వుల ప్రోత్సాహముతో నాకు వేరే మార్గము లేక నీతో కలిసాను, ఇంతకన్నా నేను ఏమి చెప్పలేను అన్నది. నా సహాయము ఎప్పుడు నీకు ఉంటుంది అన్నాడు.

మొదటి భారీవా వద్దకు పోయి నీకు అన్యాయం చేసాను నన్ను క్షమించ గలవా అన్నాడు. నేను ఎప్పుడు నీకు దాసిని, నన్ను క్షమాపణ అడగకండి, నేను
నీ సుఖం కోసమే సర్వస్వం అర్పించాను , నాలో ప్రేమ లేదని వేరొకరిని ఆశ్రయించిన నోరెత్తకుండా నీకు సేవలు చేసే ధర్మ పత్ని నండి, నీమాట ఎప్పటికీ జవదాటను మీతోపాటు నరకమునకు రమ్మన్నా వస్తాను అన్నది.                            
       
ధనముందని ఆశ పడ్డ, యవ్వన ముందని స్త్రీలను వివాహమాడిన వయసు పెరిగిన తర్వాత ఆదుకునేది ఒక్క భార్య మాత్రమే.  

మంద ఎక్కువైతే మజ్జిగ పలచన అన్నట్లు,  భార్యలు ఎక్కువైతే వత్తిడి ఎక్కువైనట్లు, దిగుడు బావిలో నీటిని నాచు కప్పి వేసినట్లు, నిమ్మ చెట్టు మొదలు తొలగించిన జల సంసర్గమువల్ల పెద్ద చెట్టు అయినట్లు, స్త్రీ వ్యామోహంలో చిక్కిన ఎవరైనా జీవితంలో ఎదగలేనట్లే.