17, మే 2017, బుధవారం

Mallapragada Ramakrishna Telugu stories-16

ఓం శ్రీరామ్ - శ్రీ మాత్రేనమ:


కలసిన హృదయాలు
నాన్న నాకప్పుడే పెళ్ళికి తొందరెందుకు, నాకు మంచి ఉద్యోగము రాలేదు, ఈ ట్యూషన్సు వల్ల పెళ్లి చేసుకుంటే కష్టం కదా.
అట్లా నేను అనుకుంటే నాకు అసలు పెళ్లి అయ్యేదే కాదు, ఎందుకంటే నా పెళ్లప్పుడు మునిసి పాలిటీ అత్తర్, చెత్త వ్యాన్ డ్రైవర్  పనిచేసేవాడ్ని, అందరు పెళైన కొత్తలో చెత్తబాబాయి అనేవాళ్ళు, వాళ్ళు అలా అన్నారని మీఅమ్మను ఎప్పుడూ భాద పెట్టలేదు.
నీవేమి భయపడకు ఆ దేవుడు వ్రాసి నట్లే జరుగుతుంది అంతా మనకోసం జరిగిందను కోవాలి ఎంత చెట్టుకు  అంతే గాలి అయిన మానవ ప్రయత్నం చేయాలి కదా, నీవేమి ఆశలకు పోవటం లేదు కదా, కంతకు తగ్గ బొంతకోసం వెతుకుంటున్నావు, ఏమో నాన్న నీవు చెప్పావు కాబట్టి అమ్మాయిని చూసి వస్తా, నాకు నచ్చకపోతే నచ్చలేదని చెపుతా అంతకు ఇష్ట మైతేనే పిల్లని చూస్తా, సరే నీతోపాటు పక్క ఇంటి గోపాలం గారిని తీసుకొనివెళ్ళు అన్నాడు.
ఆలా పిల్లను చూడటం నచ్చలేదని  నాన్నకు చెప్పఁటం జరిగింది.  
ఎందుకు నచ్చలేదో చెప్పాలి, అమ్మాయి వాళ్లు నీచేత కంప్యూటర్ళ్లు కొని ఇంటర్ నెట్ సెంటర్ పెడుతారుట, స్వతంత్రంగా బ్రతకవచ్చు ఇలా ట్యూషన్సు చెప్పేబదులు అది తెలిక కదా. 
అది కాదు నాన్న పిల్లే నాకు నచ్చలా, పిల్ల కళ్ళు గాజుకళ్ళు, పగలు చూడాలంటే నాకు భయమేసింది, ఇక రాత్రి విషయం తలుచు కుంటే భయమేస్తుంది.
సరేరా మన గోపాలం గారి చుట్టలేవరో ఉన్నారట చూసి వస్తావా.
నాన్న నేను మాత్రం ముందు చూడను, నీవు చూసి నచ్చింది, చూడరా అంటే చూస్తాను అంతే
చివరికి మానాన్న గారు చూసిన సంభంధము కుదిరింది.    
పెళ్లి రంగ రంగ వైభవముగా జరిగింది, పార్వతి పరమేశ్వరులు అని దీవించారు, నాకు గవర్నమెంటు ఉద్యోగమూ వచ్చింది, నాన్న గారిని వదలి వేరొక ఊరులో ఉద్యోగ నిమిత్తము కాపురం పెట్ట వలసి వచ్చినది. (నాన్న గారు గుడిలో పూజారిగా ఉంటాను, ఈ వయసులో మీ మధ్య నేనెందుకు అని మమ్ము భాగ్య నగరానికి  పం పించారు.
ఇంతకీ నాపేరు చెప్పలేదు కదా, నాపేరు మాధవ్  భార్యపేరు రాధ 
ఇక సంసారంలో సరిగమలు వినండి
నన్ను పొద్దున్నే రాధ నిద్రలేపుతుంది వాకింగ్ పొమ్మంటుంది, తనేమో పాలు ఆలస్యముగా వస్తే వాడితో    గొడవ పెట్టుకుంటుంది, పని అమ్మాయి ముందు వస్తే నా నిద్ర చెడ గొట్టావ్ అని ఎగిరి పడుతుంది, నేను   తిరిగి వచ్చాక కూడా రుస రుస లాడుతూ ఉంటుంది,   పే పరు బాయ్ ఇంటిలోకి విసిరేశాడని వానితో గొడవ పెట్టుకున్నది, నేను ఎన్ని సార్లు చెప్పిన వాళ్ళతో తగాదా పడకూడ దన్న విని పించుకోదు, నన్నే ఉరిమి  ఉరిమి  చూస్తుంది, అప్పుడను కూనే వాణ్ని ఇలాంటి వాళ్ళను కాలమే బాగుచేయాలి,   నోటితో న్యాయం చెప్పఁటం కన్నా మౌనం గా ఉండుట మేలు అని తలచి కాపురము చేస్తున్నాను. టివి అదేపనిగా చూస్తుంది, సీరియల్సస్ లో లీనమై పోతుంది, వంటకాలు చూసి రోజుకొక  వంటకం తయారు చేస్తుంది . 
ఏదన్నా అంటే ఈ వయసులో కాక ఈవయసులో సుఖపడతాం అంటుంది, పిల్లలు మాత్రం ఇపుడే వద్దంటుంది, మీ సంపాదన పిల్లలు ఉంటే సరి పోదంటుంది. ఎవరు ఏమి చెప్పిన ఇట్టేనమ్మేస్తుంది, ఆఫీసులో ఆలస్యమైనదనుకో ఆరోజు నాకు పస్తే నోరు చేసుకొని కాపురం చేస్తుంది. 
        
ఒక రోజు నాన్నగారు మా ఇంటికి వచ్చారు, ఎరా ఆలా ఉన్నావు, కోడల పిల్ల లేవ లేదా, వంట్లో      నలతగా ఉన్నది. అందుకని నేనే గ్రైండర్ లో పప్పు రుబ్బి దోశలు వేయుటకు నేను రడీగా ఉన్నా నాన్న, నీవు కాళ్ళు చేతులు కడుక్కొని రా, నీకు దోశలు పెడతాను, నాకు తొందర లేదురా, ఇప్పుడే రైల్లో దిగి ప్రక్కనే ఉన్న హోటల్లో టిఫిన్  తిని వచ్చానురా, నీవు ఆఫీసుకు పోతావేమోనని తొందరగా వచ్చాను, నీవు అమ్మాయి తినండి,  నీ పరిస్థితి చూస్తుంటే నాకు దిగులుగా ఉందిరా, నాన్న నేను ఆఫీసుకు పోయి  వచ్చాక అన్నీ మాట్లాడు కుందాం, నేను  కూడా నా స్నేహితుని కొడుకు మ్యారేజ్ చూసి వస్తాను . అమ్మాయికి ఒకేమారు చెప్పి పోతాను పిలుస్తావా. 
రాధా అని పిలిచాడు. 
         మావయ్యగారు ఎప్పుడు వచ్చారు, ఏమిటి  చెప్పకుండా వచ్ఛారు, సరేలేండి భోజనం చేసి మరి వెళ్ళండి.
ఏమిటే ఆ  మాటలు నాన్నతో
నేనేం తప్పు మాట్లాడ లేదు ఉన్న నిజం చెప్పా అంతేకదా
బాబు మీ సంసారం చూసాక మీకు కొన్ని విషయాలు చెప్పి వెళతాను అన్నాడు అట్లాగే నాన్న.    
ఏమిటండి మీనాన్న నాకు చెప్పేది అన్నది
 మా నాన్నగారు వెళ్ళేదాకా అన్న నీ నోరు కంట్రోల్లో  పెట్టుకో, లేదా నేను చేయి చేసు కోవాల్సి ఉంటుంది,
ఏమిటి మీ చేయి లేస్తుంది, మీ నాన్న కోసం మీరు చెప్పినట్లుగా బుద్ధిమంతు రాలుగా ఉంటాను నోరు ఎత్తను అన్నది. 
చూడు బాబు మారాలి మారాలి భార్య అని ఆమె చెప్పిన వన్నీ కోపంతోగాని ప్రేమతో గాని చేయటం తప్పు కాదు,    కాని నేను ఉద్యోగం చేస్తున్నాను అని అహంకారము భార్య ముందు ప్రదర్శించ కూడదు, భార్య భర్తలలో ఎవరికి   ఎవరు ఎక్కువకాదు .. తక్కువ కాదు ... సమానమే
 మనస్పర్థలు రాకుండా ఎప్పుడూ నవ్వుతూ ప్రతి విషయము  సాల్వు చేసు కోవాలి, పెద్దలు కుదిర్చిన పెళ్లి ఆయన ఒకరి కొకరు ప్రేమను పంచుకొని సంసారాన్ని స్వర్గమయం చేసుకోండి, ఇంతకు ముందు ఎలా ఉన్నా ఇప్పుడు మాత్రం నాముందు కీచులాటలు మాత్రం ప్రవర్తించ కండి.
మీ సంతోషానికి నేను అడ్డురాను, మీరు ఏ తిండి పెడితే అదే తింటాను, నాకు   పెన్షన్ వస్తుంది అది కూడా మీకే నేను ఇక్కడ ఉన్నంత కాలము మీకే ఇస్తాను.

మీరు చేయాల్సిందల్లా ఒక్కటే నాకు మనవుడో  మనవరాలో ఇవ్వండి వాళ్ళతో ఆడు కుంటూ ఇక్కడే ఉంటా .
అప్పుడే మావయ్యగారు నన్ను  క్షమించండి  తప్పుగా మాట్లాడితే మన్నించండి, మీరు ఇష్టమున్న రోజులు ఇక్కడ ఉండవచ్చు
నాన్న మీరు ఎక్కడికీ పోనక్కరల్లేదు ఇక్కడే ఉండండి.
మీరు కీచులాట లాడితే మాత్రము ఇక్కడ ఉండలేను ముందే చెపుతున్నాను.        
చీకటి పడింది, మావయ్యగారు పడుకొనే  గది చూపించి, మంచి నీళ్లు పెట్టి ఏ అవసరము వచ్చిన మీ అబ్బాయి నా సెల్లు నెంబర్లు ఇవి ఫోన్ చేయండి అనిచెప్పి పడక గది చేరి భర్తతో ఇంటి పనులు అన్నీ నే చూసు కుంటా, ఆఫీసు పనులు మీరు చూసుకోండి
అబ్బా ఈ రోజు పండు వెన్నలుగా ఉన్నది మంచం పై ఒకరికొకరు తన్మయత్వంలో మునిగి తేలారు, ఏవండీ నేను కూడా ఉద్యోగం చేయనా, మీ నాన్నగారు కూడా ఉన్నారుగా, ఇప్పుడు మనకు డబ్బుని గూర్చి ఆలోచించ వద్దు పిల్లలగురించి ఆలోచిద్దాం, అవునండి మనకు పిల్లలు కావాలి, మీ నాన్నగారు కూడా ఉండాలి,   (శంకరం మనసులో   అను కున్నాడు  ఇంట్లో పెద్దలు ఉంటె ఆ యిల్లు సుఖశాంతితో ఉంటుంది)   అంటూ    వారిరువురి హృదయాలు ఆనందంతో నిండినాయి.    
  --((*))--