om sri raam - sri maatrenama:
విశ్వములో జీవితం -7
ప్రాంజలి ప్రభ - సమస్య
నా కష్టాన్ని సమస్యలను, ఎన్నడూ ఎవ్వరికి తెలిపను, నేను చేసేది నిజాయితీగా ఉండాలి, ధర్మం తప్పకుండా ఉండాలి అనుకునేవాడిని, అప్పుడే అనుకోని విధముగా నాలో ఉల్లాసం, ఉత్సాహం వస్తుంది, అప్పుడే నాకు తెలియని శక్తి నన్ను నడిపిస్తున్నదని తెలుస్తున్నది. కష్టాలు భగవంతుడు కల్పిస్తాడు. మంచి మాటతో, శక్తి తో కష్టాలు తొలగించుకో మన్నాడు.
నేను మట్టిని నమ్ముకున్నాను, మట్టినుండి ఖనిజాలను తీసి వ్యాపారం చేస్తున్నాను, మట్టి యందు పంట పండించి అన్నము అందరికి దొరికేలా చేస్తున్నాను, అనుకోని విధముగా నాకు పెరిగిన సంపదను నలుగురికి పంచాను, సంపదున్నా లేనివాడినై ఇతరుల హృదయంలో సంతోషం చూడాలని సంపదతో సహకరిస్తున్నాను. అందుకే భగవంతుడు మట్టిని అందించాడు. మానవులు బుద్దితో మట్టిని బంగారము చేసుకో మన్నాడు.
పిరికితనం అంటే నాకు తెలియదు, ఎటువంటి సంఘటనలను సమస్యలను ఎదుర్కొనే శక్తి ఉన్నది, సంపద ఉన్నది, దానికి తోడు సాహసాలు చేసే ధైర్యం ఉన్నది. ప్రమాదాలు ఎన్నిఎదురైనా గుండె నిబ్బరముగా, దైర్యంగా ఎదుర్కొనగలను, సముద్రంలో చిక్కినా వడ్డుకు చేరగలను , అంతరిక్షము లో వదిలినా తిరిగి రాగలను, అందుకే భగవంతుడు ప్రమాదాలు కల్పిస్తా డు ధైర్యంతో ఎదుర్కొనే శక్తి ధైర్యం మానవులకు ఇస్తాడు.
మనం ఎ0దరినో కలుస్తాం, మ రెందరివో సలహాలను పాటిస్తాం, మనం చేసే పనిలో పటుత్వం కోసం అందరి సహాయ సహకారం ఆరాధిస్తాం, మనకు ఎన్నో అవకాశాలు వస్తాయి, వాటిని సద్వినియోగం చేసుకోవటం చేతకావాలి. దేవుడు కల్పించిన అవకాశమును బట్టి నీవు పొందాలను కున్న, వరాలు పొంది దుర్వినియోగం చేయక జీవించ మన్నాడు.
ప్రేమ ఎక్కడుంటుందో, ఎలాఉంటుందో, ఎవ్వరు చెప్పలేరు, చూపలేరు అప్పుడే భగవంతుని కోరాను ఆపదలలో ఉన్నవాడి వద్దకు నన్ను పంపాడు, వాడిని రక్షించాను, అతని మాటల్లో ఉన్న మాధుర్యాన్ని గమనించాను కల్ముషము లేని ప్రేమతో పలికాడని తెలుసుకున్నాను. అతని కళ్ళవెంబడి నీరు ఆనందబాష్పాలు నన్ను కూడా కన్నీరు తెప్పిచ్చాయి.
సమస్యలను ఎదుర్కొనుటకు ప్రతిఒక్కరు కొంత విద్యను సంపా దించాలి, అవిద్య వళ్ళ సమస్యలను సులభ మార్గమున తీర్చుకు తెలివి నుపయోగించాలి.
--((*))--
--((*))--
కామెంట్‌లు లేవు:
కామెంట్‌ను పోస్ట్ చేయండి