ఓం శ్రీ రాం - శ్రీ మాత్రే నమ:
ఆలింగనం అంటే ఏమిటి -(?)
మనసులు
కలసిన వేళ, హృదయం స్పందించిన వేళ, ప్రకృతి కరుణించిన వేళ, ప్రశాంత
వాతావరణంలో, పున్నమి వెన్నెల కాంతులలో, చల్లగా వీచే గాలియందు ఆణువణువూ
తపించే స్పర్శ హృదయాలు ఏకమవుటం లో ఉన్న ఆనందం, స్వర్గం కన్నా మిన్న అని
నేను అనుకుంటాను, స్వర్గాన్ని అయినా వర్ణించగలము కానీ, సుఖాన్ని వర్ణించటం
ఎవరి తరము కాదు. విద్యార్థులతో ఉన్న పెద్దలతో రామకృష్ణ శర్మ పంతులుగారు
ఈవిధముగా చెపుతున్నారు.
ఆలింగనం మనుషుల మధ్య
ఆప్యాయతకు అనురాగానికి గట్టి ఆనవాలు, తోలి వలపునకు అది ఓనమాలు, జన్మ జన్మ
బంధాలకు, ఆత్మీయతకు, జీవిత సాఫల్యానికి, తన్మయత్వ స్వభావానికి, తరుణం
మించకుండా తమకం తగ కుండా, చలామణి అవుతూ, నిత్య ఆశల వలయంలోకి లాగుతూ,
మనస్సును నిర్మలంగా ఏరోజుకారోజు మార్చేది ఇది.
ఒక్కో రకం ఆలింగనానికి ఒక్కో రకం అనుభూతి, వాత్సాయన గ్రంధంలో అనేక రకాల అనుభూతులు మనకు తెలియ పరిచారు.
పెద్దలు మనకు దీవెన ఒక ఆలింగనం అట్లాగే లాలన పాలన చూసి ఆనంద పడుతూ ఇచ్చేది ఆలింగనం .
కరచాలనం
చేసి, దరహాసముతో, మెత్తగా ప్రియమార హత్తు కొనుట మర్యాద పూర్వక ఆలింగనం.
దేశాధినేతలు, ప్రముఖులు, జరిపే మర్యాద పూరకముగా, గౌరవ సూచనగా జరిపేది.
ఒకరకం ఆలింగనం.
పాలిండ్లు పొంగారి యవ్వన గర్వంతో
బాహుబలిని ఆకర్షించి అనంత సుఖాలు పొందాలని ఆశించి, పెదాలు రుచిచూడాలని
ఘాడంగా ఆలింగనం చేసే శృంగార నెరజానుల ఆలోచనే వేరు, ఇది ఒక అనుభూతి.
ఆలింగనాన్ని
ఆశించకుండా దూరం దూరం అని మడి కట్టుకు కూర్చున్న, మన:స్పర్ధలు పెరిగి,
ఆరోగ్యము నలిగి, వయసు పెరిగి, ఆలోచనల మనిషి గా, అనుమాన మనిషిగా మారితే
అపార్ధం పెరిగి సంసారం వీధిన పడుటకు ఆలింగనం లేకపోవుట కుడా ఒక కారణం. ఈ
అనుభూతి పొందలేనివాడు సంసారిగా జీవిన్చలేడని నాభావన.
ఆశ్రయం
కోసమో, అనుభందం కోసమో మద పిచ్చితో మగువ, మగవాన్ని రెచ్చగొట్టి కోరిక
తెలియచేసి నేను కన్యను నీవు బ్రహ్మ చారివి మనమధ్య లేదు ఎటువంటి సందేహము నా
భాహు భాండాలలో చుక్కు మదనా అని వెంబడి పడేవారు, అటువంటి పరిస్థితులలో లొంగి
పోయేవారు సహజం.
విశ్వనాధ గారి వర్ణన ఒక్కసారి గుర్తుకు తెచ్చుకుందాం
పుష్కరతీర్థంలో
జలకాలాడిన మేనక నిలువెల్లా తడిసిన బట్టలతో విశ్వామిత్రుడి
దగ్గరకు వచ్చింది. ఆ 'సురవధూటి' జుట్టును ముని తుడవబోయాడు. ఆమే వారించి
తుడుచుకో, ఆమె తివురు ... అతడు వారించి తుడవగా . అతడు తివురు ...
చేతులందేయుచు పెనంగా చివరిదైన ఫలము తడి కౌగిలింతగా పరిణమించే అన్నారు.
అపనలతో తహ తహ లాడే శృంగార ఆలింగనాల పర్యవసానం చప్పుకో నవసరం లేదు.
నల్లని
మేఘాలలో వెలుగుల విరజిమ్మే విద్యుత్తుదాగి వున్నట్లే....మనం చేసే ప్రతి
కష్టంలోనూ సుఖం దాగి వుంటుంది. ఎదో కొత్తదనం మనలో దాగి ఉన్నది, అది
ప్రపంచానికి అందచేయటమే మనలక్ష్యం గా జీవించాలి, అలాగే మనం చేసే పని మనం
చేస్తున్నాము అనుకుంటాము, మనల్ని చేయిన్చేవాడు ఒక పరమాత్ముడు వెనక ఉండి
నడిపిస్తు న్నాడని అనుకోలేము, ఇది నా కష్టార్జితం అని, ఇది నా సుఖాల
సంతతని, నా తోడు ఆలింగన మని అనుకుంటాం, కానీ రుణాల భంధమని గమనించ లేక
పోతాం అయినా ఇది మాయా ప్రపపంచం, భాహు బందాలలో చిక్కి సుఖ సౌఖ్యాలు పొందిన
వానికే మనస్సు ప్రశాంతిగా ఉండ కలుగు తుందని నాభావనా.
తపస్సు
కొకరు, చదువుకు ఇద్దరు, సంగీతానికి ముగ్గురు, ప్రయాణానికి నలుగురు,
వ్యవసాయానికి ఐదు లేక ఏడుగురుండాలి.యుధ్ధానికి మాత్రం ఎక్కువమంది అవసరం.
ప్రతిఒక్కరి జీవితానికి స్త్రీ పురుషుని సంగమం ఒక్కటే ఒక్కటి, ఇరువురికి
నిత్యకల్యాణం పచ్చ తోరరణం, మనస్సు శాంతి కి సునాటికి మనోనిగ్రహ శక్తికి ఇది
ఒక మార్గం అని నా భావనా
ఈరోజు కొన్ని సామెతలను ఉదాహరింస్తున్నాను, మిగతా భాగము రేపు చెప్పుకుందాం
ప్రేమ కలయికకు ఒక నిదర్శనమైతే, దయ, కరుణ, స్నేహము, వాత్సల్యము, బంధము, ఆత్మీయత, అనురాగము అనేవి కుడా ప్రేమకు చిహ్నాలు.
ప్రతి
ఒక్కరు సృష్టి రహస్యానికీ తోడ్పాటుగా ఉండాలి " జోడు లేని బతుకు, తాడూలేని
బొంగరం " అంది ఒక సామెత ఉన్నది. అనగా బ్రహ్మచారి జీవితం తడులేని బొంగరం
ఒకటేనని దీని భావం ప్రతిఒక్కరు తప్పకుండా పెళ్లాడాలని, సమాజ పురోగతికి
తోడ్పడాలనేది మన పూర్వీకుల ఆకాంక్షగా ఈ సామెత చెపుతున్నది. పురుషులు కానీ
స్త్రీ కాని పెళ్లి కాకుంటే పరిపూర్ణులు కాలేరని మన పెద్దల నమ్మిక.
మీరందరూ
అనవచ్చు పెళ్లిళ్లు కావటంలేదు, చదువులు ఉద్యోగాలు అంటూ కాలయాపన చేస్తూ
వయసు ముదిరేదాకా ఉంటున్నారు, ఎంత ఉన్న సంపాదన సరిపోవటంలేదని ప్రతిఒక్కరు
అనుకుంటున్నారు, ప్రపంచ ఆధునిక పోకడలకు బానిసలై భయపడుతున్నారు, ఈవయసులో
చేయాల్సిన పని ఆవయసులో చేయక భాధను తెచ్చుకుంటున్నారు.
ఏది ఏమైనా మన పెద్దలు చెప్పిన సామెత ఒకటి గుర్తు చేస్తాను " కళ్యాణ మొచ్చినా, కక్కొచ్చినా ఆగవు "
పెళ్ళి
సంబందాల కోసం తిరగడం వాళ్ళ ఏడు జతల చెప్పులు అరిగా యంటారు. అంటే సంభందాలు
కుదరటం అంత కష్టమని భావన అయితే కొన్నిసార్లు పెద్దగా ప్రయత్నం లేకుండానే
పిల్లలకు మంచి సంభందాలు వచ్చి వెంటనే ఇరువైపులా అంగీకారం కుదిరి చెకఃచెకా
పెళ్లిళ్లు జరుగుతాయి. కక్కు వస్తే ఆపడం అసాధ్యం అలాగే సమయమొస్తే
ఇబ్బందులన్నీ తొలగి పెళ్లి తథ్యం.
ఆలింగన సుఖం తెలిసిన
వారి మధ్య బంధం విడదీయుట అసాధ్యం. రేపుకొన్ని విషయాలు తెలుసుకుందాం
మీకందరికీ వందనం అంటూ లేచారు తెలుగు మాష్టారు.
కామెంట్‌లు లేవు:
కామెంట్‌ను పోస్ట్ చేయండి