ప్రేమతో - ప్రేమ లేఖ (1)
చూడు
రాధ నిన్ను మరవలేకున్నాను, నీ జ్ఞాపకాలు నన్ను వెంట బడు తున్నాయి, మనం
కలసిన రాత్రులు గుర్తుకు వస్తున్నాయి, నీ నవ్వును ఒక అక్షర మాలాగా
వర్ణించాలని ఉన్నది, నీ నవ్వే చీకటిలో వెన్నెలను పంచె ఒక నక్షత్రం లాగా
నాకు కనబడింది, నీ అమృత భాష్యం ఎంత మరవాలన్న మరువ లేకున్నా నంటే అంత
అద్భుత శ్రవణా నందముతో, సత్య స్పూర్తితో, కరుణ రసముతో, కావ్య భావాలతో
వక్తపరిచి మనసును దోచిన, జ్ఞాపకాల వలయ సుందరివి నీవు.
తొలిసారి
నిన్ను చూశా, నీ చిరునవ్వులో కలిశా, నీ సౌందర్యాన్ని ఆస్వాదించా, నీ
కళ్ళల్లో నా నీడను చూశా, నీ పెదాల విరుపు చూశా, నా హృదయ స్పందన తెలియ
పరిచా, నీ ఓర కంటిలో నిలిచా, నీ పెదాలలో తడిశా, నిన్ను నేను మరువ లేక నీపై
పెంచుకున్నాను ఆశా
నాకు
తెలుసు నీ కవ్వింత, నేను గమనించా నీ పులక రింత, వలపు చూపుతూ చూపించావు
నాకు తుళ్లింత, నీ పులకరింత నాలో పెంచును తపనంత, నీకె పంచాలని నాలో పరుగును
గిలిగింత, చెప్పాలని ఉన్నది నాకు ఇంకా కొంత, నీ సంతోషము కొరకు వేచి ఉంటాను
జీవితమంతా
నీ
పరిచయముతో పరవశించా, నిను దగ్గరగా పరికించా, నీకు కావలసినవన్నీ చేయించి
ఉంచా, జతగా అందించి తరించా, కలవరింత తొలగించి ఆనంద పరిచా, నీ విచ్చిన
వింతను గ్రహించా, హమేషా నీకు తోడుగా నడిచా, నీ మనసును బట్టి ప్రవర్తించా,
నా తనువును నీకె అర్పించా, నిను వదలి కొంత కాలం జీవించా, ఇక బ్రతుకంతా
నీకోసం వేచి ఉండ దలిచా
ఓ
మాధవా నీ ఉత్తరమునకు నా ప్రత్యుత్తరము నా హృదయాంతరములో ఉన్న
భావాలను ఒక్కసారి నీకోసం వక్త పరుస్తున్నాను, నీవు చదివి నీ ప్రేరణలను నాకు
తెలియ పరుచు
నీవు
నామనసులో నిలిచిన ఒక గిరి, అదే నాకు నిరంతరము కల్పిస్తుంది సిరి, అందుకే
నీవంటే నాకు ఎప్పుడు గురి, నీకోసం నేను వేచి ఉంటా తప్పని సరి, నీవు
నామనసులో నిలిచి పోయిన పోకిరి, గుర్తుకొస్తున్నది నీవు చేసిన అల్లరి, నీతో
వేగ లేక ఎప్పుడూ అంటాను సరి సరి, అందుకే నీతో కలిసే దాకా ఉంటుంది నా
ఊపిరి.
నా
కల్లల్లో ఎప్పుడు ఉంటుంది నీ ఆకృతి, అదే నేర్పింది నాకు సంస్కృతి, అది ఒక
కృతి, అందుకే నాకు నిత్య సంక్రాంతి, నీ తలపుల వల్లే నాకు నిర్మల ప్రకృతి,
అందుకే నన్ను బ్రతికిస్తుంది కొత్త అనుభూతి.
నా
కళ్ళలో నిలిచి పోయినది మెరుపు, నాకు గుర్తు తెస్తుంది తొలివలపు, అదే మన
ఇద్దరి మధ్య నిలిచిన మలుపు, ఇది ఓటమి కాదు మన ఇద్దరి గెలుపు, కాలమే మన మధ్య
చూపుతున్న మేలుకొలుపు
సరసం
మనల్ని త్తేజ పరిచింది, విరహం మనల్ని ఏకం చేసింది, ఆశయాల మార్గంలో
నడిపించింది, మధుర క్షణాల సాఫల్యం ఫలించింది, మధురాతి మధురం మన మధ్య దాపత్య
సుఖం. దాన్నే గుర్తు చేస్తూ మనమధ్య ఎడబాటు ఉన్న ప్రేమలేఖలు మనల్ని
బ్రతికిస్తుంది.
అంటూ ముగించింది రాధ మాధవకు ప్రేమలేఖ.
__(())--
కామెంట్‌లు లేవు:
కామెంట్‌ను పోస్ట్ చేయండి