18, మే 2017, గురువారం

Mallapragada Ramakishna Telugu stories -18

 ఓం శ్రీ రామ్ - శ్రీ మాత్రేనమ:
ప్రేమంటే ఏమిటి -( ?)

కుర్చీలో కూర్చొని పేపర్ లో సినిమాలు చూస్తున్నాడు, అప్పడే గుండె కొట్టుకోవటం మొదలు పెట్టింది, ఆగు ఆగు అంటూ గుండెపై చెయ్ పెట్టాడు, అప్పుడే గజ్జల శబ్దం వస్తున్నది, ఎక్కడా అని చూస్తున్నాడు మాధవ్, ఆ ఇంటిలో అడుగు పెడుతున్న అందాల అతిలోక సుందరి నీడ గుమ్మం దగ్గర పడుతున్నది, సూర్య కిరణాల వెలుగులో పోత పోసిన బంగారంలా కనబడుతూ కిల కిల నవ్వులతో అలా లంగా పైకెత్తుకుంటూ, జడ కుప్పెలు సవరించు కుంటూ కుడిపాదం పెట్టి లోపలి వస్తూ రావచ్చా అని అడిగింది రాధ.

ఆరూపాన్ని చూడగానే కొట్టు కుంటున్న గుండె ఆగినంత పని అయ్యింది, నోరు తెరచి కళ్ళు పెద్దవి చేసి అలా చూస్తూ ఉండి పోయాడు, ఎప్పుడూ చూడని అందాలు విరజిమ్మే బంగారు గులాబీ అనుకున్నాడు మాధవ్ .

ఏమిటిరా మాధవ్ అలా బిత్తర మొహం వేసి చూస్తున్నావు, ఆడపిల్లని చూడని మొహంలా అన్నది తల్లి.

లేదమ్మా, ఎం లేదు ఎదో ఆలోచిస్తూ అలా చూస్తున్నా, బంగారు సీతాకోక చిలుక కనబడింది దాన్ని చూస్తున్న. నీవు ఎవరిని చూస్తున్నావో నాకు తెలుసు,   ఇదిగోరా అలా షాపుకు పోయి, ఈ కాగితంలో వ్రాసినవణ్ణి తీసుకురా అని అట్లాగేనమ్మా అంటూ బయటకు నడిచాడు మాధవ్ .

రాధ నవ్వును చూసి రామచిలుక ఓరాధ ఇటురా, నిన్ను చూస్తుంటే ముద్దు పెట్టాలని ఉంది అని అరుస్తున్నది. అక్కడున్నవారు నెవ్వర పోయారు.

రాధ లోపలకు అడుగు పెట్టగానే దిష్టి తీసి మరీ బయట పారబోసింది ఎర్రనీరు కన్నతల్లి.

పక్కపోర్షన్ లో ఉన్న మాధవ్ ఇంటర్లో రాధ చేరాలిట కాస్త నీవు తోడుగా వెళ్ళు. 

మంచిగా తలదువ్వాడు ఫుల్ ప్యాంటుషర్టు వేసి కళ్లజోడుపెట్టి, షూస్ వేసుకొని నెమ్మదిగా నడుస్తున్నాడు రాధతో .

ఎం మాధవ్ ఏవన్నా మాట్లాడు సరదాగా,  వెంటనే అన్నాడు, నీవు చాలా అందంగా ఉన్నావు,
ఎలా తెలుసుకున్నావు

నిగనిగలాడే నైలాన్ గౌనులో తళ తళ మెరిసే పావడా పైన ఉన్న లోన అందాలు చూసే వారికి మతి పోతున్నది, కురులలో మల్లెపూల గుబాళింపు, నడకలో నాజూకైన శ్వరాలు, ఇంకా ఏమని చెప్పేది, ఎలా చెప్పేది అన్నాడు .

ఇకచాలు ఆపు నీ మాటలు నాకు నచ్చుట లేదు    
అప్పుడే జేబులోనించి ఒక కాగితము తీసి ఇలా చదవటం మొదలు పెట్టాడు. 

చిగురించిన తోటలలోనో,  వికసించిన పువ్వులలోనే, అమృత వలయములు జనించినప్పుడు, విలయములై జ్వలించి నప్పుడు,  కాలానికి నమస్కారం చేద్దాం, ప్రేమకు గొళ్ళెం తీద్దాం, ఆనందపు అంచులు చూద్దాం, భవిషత్తుకు పునాది వేద్దాం, నవ వసంత మార్గంలో యవ్వన సమరంలో పోరాడి గెలుద్దాం, స్వర్గ సుఖాలు అనుభవిద్దాం అని చదివాడు  మాధవ్. 

ఆమ్మో ప్రేమ భావాలు నాకు అర్ధం కావు, నేను చదువు కోవాలి,   బాగా చదువు కోవాలి నీకు తోడుగా నేను చదువుతా అన్నాడు రాధతో, కోఎడ్యుకేషన్ కాలేజీలో ఇంటర్లో చేరింది, మాధవ్ డిగ్రీలో అడుగు పెట్టాడు. 

కొత్తగా చేరిన వారిని రాగింగ్ చేయుట అనాదిగా వస్తున్నది.
అప్పుడే రాధను చూసిన కొందరు కొంటె విద్యారులు ఈ విధముగా అడిగారు - "వన్ ఫోర్ త్రి " అంటే ఏమిటో చెప్పి వెళ్ళండి. ఇది రాగింగ్ కాదు చెప్పలేక పోతే ఇంకా ప్రశ్నలు వేస్తాము, రక రకాల పద్దతిలో వేదిస్తాం అన్నారు.
వెంటనే తనతో వస్తున్న మాధవ్ వంక చూసింది ఓరచూపుగా, సీనియర్గా చెపుతున్నా వదిలేయండి అని గట్టిగా అన్నాడు.

దమ్ముంటే నీవే నీతో వస్తున్న అమ్మాయికి చెప్పాలి అన్నారు.
     
అప్పుడే డిగ్రీ సీనియర్లు వచ్చి మేము చేసే రాగింగ్ కు నీవు వప్పుకోవాలి, అప్పుడే అమ్మాయిని నిన్ను వదిలేస్తాము, లేదా దానికి సమాధానము చెప్పి వెళ్ళాలి  అన్నారు.

143 అంటే - ఐ లవ్ యు - మాతో చెపతా వేమిరా ఆ అమ్మాయి మొఖం చూస్తూ చెప్పాలి - చెకచెకా చెప్పాడు.
అట్లా కుదరదు. అంకెలను తెలుగులో వర్ణించి చెప్పాలి అన్నారు
     
అప్పుడే మాధవ్ ఇలా చెప్పాడు  కాలేజీలో 143 అంటే - వన్ అనగా ఒంటరిగా ఒకరుకి  ఒకరు కలుసుకొని ఒక టవటం - ఫోర్ అనగా నాలుగు దిక్కుల మధ్య, నమ్మకంతో నయనాల చూపులు కలిపి, రేండు చేతులు రెండు కాల్లకు బందాలై అనుబంధం గామారటం - త్రి అనగా త్రికరణ శుద్ధిగా మనసు మనసు ఏకమై తనువూ తనువూ కలసి సంతృప్తి పడుటే అన్నాడు అంతే ఆటే వెళుతున్న తెలుగు మాష్టర్ చప్పట్లు కొడుతూ అక్కడకు వచ్చాడు, మిగతా విద్యార్థులందరూ ప్రక్కకు తప్పుకున్నారు, మీరిద్దరూ నాతో రండి అని లోపలకు తీసికెళ్ళాడు, మాష్టర్ గారు తెలుగు భాషతో వీళ్ళిద్దర్నీ తింటాడు మనదారి మనం వెళదాం అని క్లాస్ రూమ్ లోకి వెళ్లారు విద్యార్థులు.

మాష్టర్ ఇలా చెప్పటం మొదలు పెట్టాడు
 
ధనము చేత "ధర్మము" రక్షించ బడును. యోగము చేత విద్య రక్షించ బడును. సత్ స్త్రీల చేత గృహము సురక్షితమగును. మృదుత్వముచే భూపాలురు రక్షితులు అగుదురు.ప్రేమ చేత అందరూ బతక గలరు. కొంటె తనానికి తగు విధముగా బుద్ధి చెప్పితేనే తోటి వారు బ్రతుకుతారు  అన్నాడు.

గురువు ధర్మ వర్తను డైతే విద్యార్థులు కూడా ధర్మ ఆచరణ శీలురు ఔతారు. విద్యార్థులు మూర్ఖులుగా మారితే తల్లి తండ్రుల భాదించిన వారౌతారు. అలాగే చిన్న వయసులో ప్రేమ అని చదువు పాడు చేసుకోకండి, బాగుగా చదువుకొని మంచి ఉద్యోగము సంపాదించి వివాహము చేసుకుంటే సుఖము సౌఖ్యం, అందుకే చిన్నప్పుడే ప్రేమ బీజం అంత  మంచిది కాదు మీకు చెప్పాలనే ఇక్కడకు పిలిపించా అన్నాడు తెలుగు మాష్టర్ !


అప్పుడే మాష్టరుకు ఒక నోటీస్ తెచ్చి ఇచ్చారు.

ఇప్పుడే తెలిసింది మనకాలేజీ బాలికల విభాగము ప్రాత్యేకముగా ఇక్కడనుండి మార్చటం జరుగుతున్నది కొత్త భవనంలోకి అని చెప్పాడు.

అప్పుడే రాధా - మాధవ్ ఒకరి కొకరు చేతులు ఊపుకుంటూ విడిపోయారు.

అప్పుడే ఒక విద్యార్థి మాష్టర్ వద్దకు వచ్చి ప్రేమకు మరణం లేదు అన్నారు దాని గురించి చెపుతారా .
గంట మ్రోగింది నేను క్లాసుకు వెళుతున్న ఇంటికిరా అన్ని వివరంగా చెబుతాను అన్నాడు మాష్టర్ , అట్లాగే అన్నాడు విద్యార్థి .