27, మే 2017, శనివారం

విశ్వములో జీవితం -5

ఓం శ్రీ రామ్ - శ్రీ మాత్రేనమ:
విశ్వములో జీవితం -5  భార్యను బట్టి భర్త.

ఏమండి ఎందుకు అంత తొందరగా పరిగెడుతున్నారు, అంత డబ్బు తీసుకోని వెళుతున్నారు, ఎక్కడికి అని అడిగింది భార్య . నీకు ఎన్నో సార్లు చెప్పాను వెళ్ళేటప్పుడు అడగవద్దని అని బయటకు నడిచాడు.
అప్పుడే గురువు ఎదురయ్యాడు, నమస్కారం గురువుగారు అన్నాడు. నేను మందుల షాపు వద్దకు పోతున్నాను, ఆరోగ్యంగా ఉ
న్నావుగా ఎవరికీ మందులు , నాకే సార్ మన:శాంతి కోసం మందు తెద్దామని పోతున్నాను అన్నాడు.

గురువుగారు నీవు అమాయకుడిలా ఉన్నావు, ఇలా కూర్చో నేను చెప్పేవి విను అన్నాడు.

మనలో ఇష్టాన్ని మన: స్పూర్తిగా మనల్ని నమ్మైనవారికి చెప్పుకుంటే, అవతలవాని మనస్సు అర్ధం చేసుకో గలుగుతావు, 
నీ మనసు ప్రశాంతముగా ఉంటుంది  .
ప్రేమగా అక్కున చేర్చుకో కలిగితే ఇరువురి మద్య అనురాగం రెట్టింపు అవుతుంది.
కష్ట నష్టాలల్లో నేను నున్నానని తోడును గౌరవించు కోగలిగితే, మనస్సు ఉల్లాసంగా
ఉత్సాహంగా మారుతుంది.
భాగస్వామితో మాటలు పంచు కుంటూ, భాద్యత
ను  పంచుకుంటూ, ఎవరు గొప్పా అని ఆలోచించ కుండా, తప్పులను బలహీనతలను భూతద్దంలో చూడక ఒకరికొకరు క్షమాపణలతో మనస్సు కలత  చెందకుండా ఆరోగ్యమైన నవ్వులమధ్య సాగి పోవటమే నిజమైన జీవితం అన్నారు. 

అర్ధం లోని పరమార్ధాన్ని గ్రహించ కలిగితే నిత్యమూ శాంతిమయం
పోరు బాటలో నడవద్దు, మౌనంగా శాంతి బాటలో నడిస్తే ఆరోగ్య దాయకం

గూటీకి చేరిన భర్తను శాంతి వచనాలతో పలకరించి సంతోష పెట్టాలి
భార్య .
వాద ప్రతివాదానలకు దిగినా క్షణావేశానికి లోను కాకుండా మంచో చెడో  గమనించి ఓర్పతో ఓదార్పు చూపటమే మానవుల లక్షణం అని గమనించాలి.

టీచర్ గారు ఇంటి కొచ్చేంగానే భార్య మంచిగా గౌరవించక, "నాకేం క్లాస్ చెప్పనక్కర్లేదు ' లోపలకు దయచేయండి అంటే ఎట్లావుంటుంది?
ఇంజనీర్ ఎండలో దగ్గరగా ఉండి కార్మికులద్వారా పనిచేయించి ఇంటికి వస్తే భార్య "ఎందుకండీ ఆ ప్లాన్లు అన్నీ నామీద ప్రయోగిస్తారా " అంటే ఎలా ఉంటుంది ?
జడ్జిగారు కోర్టులో లాయర్ల మాటలు విని తీర్పు చెప్పి ఇంటికి వచ్చి  భార్యను
ముద్దుకు పలకరిస్తే వాయిదా అని మీ మాటలు మీకే చెపితే ఎలా ఉంటుంది ?
డాక్టరుగారు రోగులను రక్షించి ఇంటికి వస్తే భార్య మీ రోగం ఎలా కుదర్చాలో నాకు బాగా తెలుసు అంటే ఎలా ఉంటుంది?                                                       
పైలెట్ ఉద్యోగ
ము  ఆయిన తర్వాత ఇంటికి చేరగానే భార్య మీరు ఎగిరే విమానంలో పనిచేసినా నాముందు ఎగరకండి అంటే ఎలా ఉంటుంది?
న్యాయవాది కోర్టులో వాదించి ఇంటికి చేరగానే భార్య భగవద్ గీత పట్టుకొచ్చి అంతా నిజమే చెపుతా అబద్దం చెప్పను అని చెప్పించి లోపలకు రమ్మంటే ఎలా ఉంటుంది?   
నటుడు చిత్రంలో నటించి ఇంటికి చేరగా భార్య మీరు అక్కడ నటించండి నావద్ద మాత్రం నటించకండి అన్నప్పుడు ఎలా ఉంటుంది?.  
సాఫ్ట్ వేర్ ఉద్యోగము నుండి ఇంటికి చేరగా భార్య వైరస్ బుద్దులు నావద్ద చూపకండి నేను అస్సలే యాంటీ వైరస్ను అంటే ఎలా ఉంటుంది?
పూజారి గుడిలో పూజచేసి ఇంటికి చేరగా భార్య దక్షణ ఇంతేనా, ప్రసాదమింతేనా అంటే ఎలా ఉంటుంది ?
రాజకీయనాయకుడు ఉపన్యసించి ఇంటికి చేరగా భార్య మీ ఉపన్యాసం నాకు చెప్పకండి ప్రజలు నమ్ముతారేమోగాని నేను నమ్మను అంటే ఎలావుంటుంది?
పై నుదహరించిన భార్యలు, ఇంకా ఎందరో  భర్తలను ఆటపట్టించుటకు ఛలోక్తిగా మాట్లాడిన మనసు నొచ్చుకోకుండా భర్తలు భరించటం లో ఉంటుంది శాంతి. .
భర్తను బట్టి భార్య, భార్యను బట్టి భర్త ఒకరి కొకరు అర్ధం చేసుకొని జీవించాలి గాని పంతాలు పట్టింపులు ఎప్పుడు పనికిరావు.   
గురువుగారు మీరు చెప్పిన విషయాలు నాకు బాగా తెలిసినాయి,
ఇంటికి వెళ్లి నాతప్పు తెలుసుకొని ప్రేమను నా శ్రీమతికి పంచి ఆమె ప్రేమను పొంది మన:శాంతిగా బతుకుతాను.
గురువుగారు " తధాస్తు " 

--((*))__   
 

కామెంట్‌లు లేవు:

కామెంట్‌ను పోస్ట్ చేయండి