27, మే 2017, శనివారం

విశ్వములో జీవితం -1

ఓం శ్రీ రామ్ - శ్రీ మాత్రేనమ:
విశ్వములో జీవితం -1
ఒక్క సారి ఆలోచిస్తే?
మనం ఒక్క సారి ఆలోచిస్తే మనకు ప్రతి రోజూ కొత్తగా కనిపిస్తుంది, నిద్రపోవటం తెల్లవారితే లేవటం కష్ట బడటమ్ ఇదే జీవితం అని అందరికి తెలుసు కానీ రేపు ఏమి జరుగుతుందో మాత్రం ఎవ్వరు కనుగొనలేరు ఎందుకు? మనం అద్దం  లో చూసామనుకో మనబొమ్మే కనబడుతున్నది కానీ వేరే బొమ్మ అక్కడ కనబడదు.

మంచి చెడు గమనించి బ్రతికే శక్తి మానవులకు ఉన్నది, కానీ జ్ఞానేంద్రియాలు తెలిపే ఆనందాన్ని దు:ఖాన్ని సమానంగా అనుభవిస్తాం.
సినిమా చూసి మనసు ఉల్లాసం ఉత్సాహం గా మార్చుకోవడం, లేదా  భయాందోలనకు దిగుతాం, అది  తెలిసి వెళతాం కానీ దాని వెనుక ఎందరో కృషి ఉన్నది, తెరమీద బొమ్మల రావటానికి ఒక ప్రొజక్టర్ ఉన్నది, దానికి కనిపించని కరంటు పంపితే గాని చిత్రాన్ని చూపలేదు. అనగా ఎదో శక్తి మనచుట్టూ పరిభ్రమిస్తూ ఉన్నది అనగా ప్రకృతిలో మారే ప్రతి చర్యకు ఎదో ఒక కారణం  తప్పక ఉన్నది అని గ్రహించవలెను.              

మనం ఏదైనా తెలుసుకోవాలంటే ఎవరినయినా ఆశ్రయించాలి, లేదా మనమే శోధన ద్వారా తెలుసు కోవాలి, తెలుసుకున్న దానిని ప్రపంచానికి తెలియ పరిస్తే అర్ధం చేసుకున్నవారికి కొంత మంచి ఉండవచ్చు, అర్ధం కానివారికి తేలిక భావంగా ఉండవచ్చు,  అర్ధాన్ని ఆచరించటం, గమనించటమే మనకు అవసరము, చెడును వేలెత్తి చూపి మంచిని పెంచుట అవసరం, మానవులలో మార్పు రావటానికి సహకారం మరీ అవసరం.      

ఎవరి శక్తి వారికి తెలియదు, ఎందు కంటే మన ఆలోచన మన సంసారం భాదలు సుఖాలు కమ్మి వేస్తాయి, ఏదైనా అడిగిన దానికి వెంటనే చెప్పలేరు. అంత మాత్రాణ శక్తి హీనులు కాదు, ఎందుకంటే మనలో అహం అడ్డు పడుతుంది, మనకెందుకు జరిగేవి జరుగక మానవు అని వాదనలో ఉండుట మంచిది కాదు. మనలో ఉన్న శక్తి తో ఎదుటి వానిలో ఉన్న జీవాన్ని ఉత్తేజ పరుచుటకు ప్రోత్సహించాలి. అది మంచి మాటలతో అందరిని ఉత్తేజ పరచాలి .       

మానవులకు మానసిక పరిస్థితిని గ్రహించటం ఎవరి వళ్ళ కాదు, మెలుకవలో అంతర్గతముగా మనస్సులో కలిగే మార్పులే నిగ్రహ శక్తిని పెంచు తాయ్ నిద్రలో ఎటువంటి కలలు రాకుండా మనసు ప్రశాంతముగా నిద్రపోతే ఉషోదయం ఎప్పుడు ప్రశాంతముగా ఉంటుంది. 

మన హృదయంలో విజ్ఞాన సంపద నిండి ఉంటుంది, అదే ప్రేమగా మారి సుఖ మార్గముగా చూపు తున్నది, గడియారం కదిలినట్లు గుండె చప్పుడుతో నిజమేదో గ్రహించు అని హెచ్చరిస్తున్నది అని తెలుసు కోవాలి. బుద్ది వికసించి బలహీనత నుండి బయట పడితే మానవ బలం పెరుగు తుంది. 

సూర్యుని బింబము నీటిలో చూసి పట్టుకోవటానికి ప్రయత్నిమ్చే మనస్సు మనది, అది సాధ్యము కాదని మనకు తెలుసు, ఒక మూర్ఖుడుగా ప్రయత్నీమ్చితే ఫలితము ఉంటుందా ? మొండి వాదనకు దిగటం తప్ప,  అది అవసరమా ?            

కుండ నీళ్లలో ఉన్న సూర్యుణ్ణి పట్టలేము, తలయెత్తి నింగి నున్న సూర్యుణ్ణి చూడలేము కానీ నిత్యమూ దర్శనముగా ప్రత్యక్షంగా కనిపించే దేవుణ్ణి ఒక్కసారి రెండు చేతులతో నమస్కరించుటే మనం చేయగల నిజ స్థితి . 

అదేవిధముగా ప్రతిఒక్కరు తన తోటి వారికి వెలుగు చూపటం నేర్చు కోవాలి, కొవ్వొత్తి వెలుగు చూపి కరిగినట్లు మనం పరులకు సహాయం చేయటం, వెలుగును పంచటం వళ్ళ కష్టములు ఎదురైనా సంతృప్తి వళ్ళ మానవులకు జీవనా ధారము అని గమనించాలి .   
--((*))--

కామెంట్‌లు లేవు:

కామెంట్‌ను పోస్ట్ చేయండి