25, మే 2017, గురువారం

Mallapragada ramakrishna Telugu Stories-20

ఓం శ్రీ రాం   శ్రీ మాత్రేనమ:


ఉపవాసము!
.
ఉపవాసం అనగా దగ్గరగా నివసించడం. ఉప అంటే దగ్గరగా వాసం అంటే నివసించడం అని అర్ధం. కొన్ని ప్రత్యేక పండుగల సమయాలలో ఈ ఉపవాస దీక్షను చేపడతారు. ఉపవాసం ఉండాలనుకున్న రోజు దేవుని యందు మనస్సు లగ్నం చేయడానికి ఆహార, పానీయాలను తీసుకోకుండా లేదా కొద్ది మొత్తంలో తీసుకుని పస్తు ఉంటారు. ఈ ఉపవాసం చేసే దీక్షను బట్టి ఒక పూట లేక ఒకరోజు లేక కొన్ని రోజుల పాటు కొనసాగుతుంది.
.
భక్తితో కావచ్చు.. బరువు తగ్గేందుకు కావచ్చు.. కారణమేదైనా చాలామంది తరచూ ఉపవాసం చేస్తుంటారు. సరైన అవగాహన లేకుండా తరచూ ఉపవాసాలు చేస్తుంటే చాలా రకాల అనారోగ్య సమస్యలు చుట్టుముడతాయి. ముఖ్యంగా అస్సలు ఆహారం తీసుకోకుండా ఖాళీ కడుపుతో ఉండిపోతుంటే బలహీనత, అసిడిటీ, డస్సిపోవటం, తలనొప్పుల వంటి బాధలు చాలా వేధిస్తాయి. కాబట్టి ఉపవాసం అంటే పూర్తిగా ఏమీ తినకుండా లంఖణం చేయటం కాదని, ఈ సమయంలో కూడా శరీరానికి పోషకాలు అవసరమని గుర్తించాలి.

మధుమేహం, అసిడిటీ వంటి సమస్యలున్నవారు, గర్భిణులు, పిల్లలు.. అసలు ఉపవాసం చేయకపోవటం మేలు. మరోవైపు చాలామంది ఉపవాసం ముగిస్తూనే బాగా నూనె, నెయ్యి వేసి వండిన స్వీట్లు, కొవ్వు పదార్ధాల వంటివి దండిగా తింటుంటారు. ఇదీ మంచిది కాదు. దీనివల్ల ఉపవాస ఫలమూ ఉండదు. కాబట్టి ఉపవాస సమయంలో- మన శరీరానికి అవసరమైన పోషకాహారం, మితంగా తీసుకోవటం మంచిది. ఇలా చేస్తే ఉపవాసం తర్వాత శరీరం మరింత ఉత్తేజంగా, తేలికగా, ఉల్లాసంగా అనిపిస్తుంది.

 ఉపవాస సమయంలో- పండ్లు, కూరగాయ ముక్కల వంటివి ఎక్కువగా తీసుకోవటం మంచిది. పండ్లు దండిగా తింటే కడుపు నిండిన భావన కలుగుతుంది, శక్తికీ కొదవుండదు. అలాగే పాలు కూడా తప్పనిసరిగా తీసుకోవాలి. పాలు, క్యారెట్ల వంటివాటితో చేసిన పదార్ధాలు తీసుకుంటే శరీరానికి కావాల్సిన శక్తి, మాంసకృత్తులు, క్యాల్షియం వంటివన్నీ లభిస్తాయి. ఉపవాస సమయంలో- మజ్జిగ, పండ్ల రసం, నిమ్మ నీరు, కూరగాయ సూపుల వంటి ద్రవాహారం తరచుగా తీసుకోవాలి. ఇలా చేస్తే అసిడిటీ బాధ కూడా ఉండదు.

 ఉపవాసం ముగిసిన తర్వాత కూడా కొవ్వు పదార్ధాలు కాకుండా.. మెంతికూర కలిపి చేసిన మేథీ చపాతీ; సగ్గుబియ్యం, కూరముక్కల వంటివి కలిపిన ఖిచిడీ; పాలు, పెసరపప్పు వంటి వాటితో చేసిన పాయసం వంటివి తీసుకోవటం ఉత్తమం.


. హిందూమతంలో ఉపవాసదీక్ష
శివరాత్రి
నాగులచవితి
తొలి ఏకాదశి
కార్తీక సోమవారం
.ఇస్లాంలో ఉపవాసవ్రతం!


సౌమ్

సౌమ్ అనగా ఉపవాసం. ఇస్లాం ఐదు మూలస్థంభాలలో మూడవది. ఖురాన్ ప్రకారం రంజాన్ నెలలో విధిగా అచరించవలసిన నియమం ' ఉపవాసవ్రతం' . ఈ ఉపవాసంను పార్సీ భాషలో రోజా అని అంటారు. అరబ్బీ భాషలో సౌమ్ అని పిలుస్తారు.
రామాయణం లో వాల్మీకి మహాముని వర్ణించారు ఉపవాసం ఆరోగ్యానికి ఒక దివ్వఔషధము. చెట్లకు సమస్త జీవరాశికి పరిణామ దసలున్నాయి అవేవి మనిషిలా పలురకాల ఆలోచనలతో కుంగి పోవు. వాటికి వర్తమానమే ముఖ్యం దాన్ని అవి ఆనందందంగా గుర్తిస్తాయి. పోను పోను చెట్లు మొడు లౌతాయి పచ్చదనం లేని కట్టెలౌతాయి ఆచెట్లపై ఉన్న పక్షులకు అది గడ్డు కాలమే అవుతున్నది. అయినా నాలుగు చినుకులు పడితే తరువు తనువూ సమస్తము పత్ర హరిత మయమవుతున్నది. పువ్వుల కాయలతో నిండుగా ఉంటుంది.

అదే మనుష్యులు ఆశతో ఆకలితో ఎక్కడా దొరకనట్లుగా చూసిన ఆహారాన్ని ఎక్కువగా తింటారు కొందరు, కొందరు ఏది చూసిన అను మానంతో తింటారు, మరికొందరు ఉదరపోషణ ధర్మానికి శక్తిని ఇచ్చే పోషపదార్ధాల ఆహారాన్ని తింటారు. ఎంత తిన్న వయసు పెరిగిన కొద్ది మన శరీరంలో మార్పులు వస్తాయి. అమర్పులకు తగ్గట్టుగా మనం ఆహారం తీసుకోవాలి, వయసు పెరిగితే చెట్లలాగా వికసించే శక్తి మనకు ఉండదు.

అందుకే శనివారం, మంగళవారం ఉపవాసము ఉండుట మంచిది అని పెద్దలు చెప్పారు ఎందుకనగా మనం తిన్న ఆహారము జీర్ణము కావాలి అది ఒక సంచి అదే పనిగా తిండిని తొక్కుతూ పోతే శరీర భాగాలు పని చేయటం తగ్గు గుతుంది.  బద్దకం పెరుగుతుంది, నిద్రముంచు కొస్తుంది. ఇది ఎవరికీ మంచిది కాదు.               

ఉపవాసం ఆరోగ్యానికి, వీర్యశక్తికి తప్పని అవసరం. ప్రకృతి ని బట్టి మానవులు అసలు విషయము గ్రహించి ప్రస్తుత స్థితిని బట్టి ఆనందము అను భవించుటకు ఉపవాసము అవసరము.   

కామెంట్‌లు లేవు:

కామెంట్‌ను పోస్ట్ చేయండి