11, జూన్ 2017, ఆదివారం

విశ్వంలో జీవితం -20

ఓం శ్రీ రామ్ శ్రీ మాత్రేనమ:
తనువు పిలుపు

హద్దు మీరవా  , అలక తీర్చవా, అందాన్ని ఆస్వాదించవా, ఆశయాలు నెరవేర్చు కోవటానికి, ఆశలు  తీర్చకోటానికి రావా,  ఆరాటం తగ్గించుకొని అందు బాటులోఉన్న దాన్ని అందుకోవా, మనసు అందించి, మమతను పంచి మధురాతి మధురాన్ని అందుకోవా, మది తలుపు మర్దన చేయకు, వికసించిన పువ్వు పరిమాళాన్ని అందుకోవా, మౌనం వీడవా, మోజుతీర్చవా, మొఖమాటం పడక, మలుపు మార్గం చూపవా, ముత్యపు చిప్పలో ఉన్న ముత్యాన్ని, ప్రకృతి సౌరభంలో పరవసిస్తున్న దాన్ని, ముగ్గులోకి లాగుతున్నానని అంటావా, ప్రాకృతి ధర్మాన్ని అనుసరిస్తున్నానని అనుకోవా,   అధరామృతాన్ని అందించాలని ఆశగా ఉన్నాను అందుకోవా, ఆలసించినా ఆశాభంగం అనుకోవా, వయసులో ఉన్న ఉడుకు రక్తాన్ని చల్లపరిచి పోవా.

మగువ ముఖలితభావాన్ని అర్ధం చేసుకోవా, మండుటెండల్లో మంచుకన్నా చల్లదనాన్ని అందిస్తానని తెలుసుకోవా, అర్ధాన్ని అర్ధం చేసుకొని, అనురాగాన్ని అందుకోవా, ఆదమరచి నిద్రపోక అదును చూసి ఆడుకోవా, ఆలోచన మార్చుకొని మానుకు చుట్టిన మల్లెతీగలా చుట్టుకోవా, అన్యం  పుణ్యం ఎరుగని అమాయకురాలిని గమనించావా, అహం ప్రక్కిన పెట్టి ఆనందాన్ని ఆస్వాదించుటకు ముందుకు రావా, ఆశా నిరాశలమధ్య నలిగి పోతావా, ఆకలి చంపుకొని, ఆరోగ్యం పాడుచేసుకొని ఆలస్యం చేసినా అనుకున్నది పొందలేవని తెలుసుకోలేవా, అడుగు వేసి ఆణువణువూ తనువు తపనలను తగ్గించుకో లేవా, ఆవేశాలకు అడ్డు కట్ట వేసి, అరమరికలు లేని వెన్నవంటి హృదయాన్ని, తేనెవంటి మాటలతో, వెన్నెలలో విహరించటానికి సహకరించావా.

కౌగిలింత ఆత్మీయతకు నిదర్శనమని తెలుసుకో లేవా, ఓ ఆకాశమా మేఘపు జల్లులతో ఈ తనువు చల్లార్చవా, ఓ సముద్రమా నీ కెరటములలో నన్ను ముంచేయవా, ఓ పుడమి తల్లి నా వాంఛ తీరే  మార్గం చెప్పలేవా, ఓ కాలమా నా ప్రశ్నకు సమాధానము చెప్పలేవా, సుమపరిమళాలను అందించాలను కున్నా, నా మాటలలో తప్పులుండవచ్చు నా నడకలో మాత్రం తప్పులుండవు, నా పరుగులో ఆశలుండవచ్చు కానీ నా ధ్యేయం ఆనందం అందించాలని, హర్షం ప్రకటించాలని, నా ధ్యాస ఎప్పుడు నీ మీదనే అందుకే మనసు ఉండ పట్ట లేక వ్రాస్తున్నాను లేఖ. కొంచం ఘాటుగా, కొంచం ఇష్టంగా, కొంచం వ్యగ్యంగా, వ్రాసిన నా భావాలను అర్ధం చేసుకుంటావని నీ ప్రియాతి ప్రియమైన ప్రేయసి లేఖ.                             

కామెంట్‌లు లేవు:

కామెంట్‌ను పోస్ట్ చేయండి