14, జూన్ 2017, బుధవారం

విశ్వంలో జీవితం -26


 ఓం శ్రీ రామ్ - శ్రీ మాత్రేనమ:
గీతాజ్ఞానమ్ - 2
 
మనలో ఉన్న తెలివిని మనమే గుర్తించ నవసరము లేదు మనము చేసే పనిని దృడ సంకల్పంతో చేస్తే చాలు మనలో ఎటువంటి అవలక్షణాలు ఏర్పడవు, ఆలోచన అనేదే మనకు రాదు ఎందుకనగా మనము ఒక పద్ధతిన అలవాటు పడతాము, ఆపద్ధతిన పోవుటకు ప్రయత్నము చేస్తాము, దానిలో ఒక విధమైన అనుభవము వస్తుంది అలాగే భూమి మీద ప్రాతి ప్రాణికి ప్రతి వస్తువుకీ ఒక విలక్షణమైన స్వభావము ఉంటుంది .

ఉదాహరణకు సూర్యభగవానుడు వెళతప్పకుండా ప్రయాణము చేస్తూ సర్వజీవులకు వెలుగు వేడి నందిస్తూ చీకటిని ఆహ్వానించి తన పని ఈరోజుకు అయినది అని తెలియపరిచి విశ్రాంతి తీసుంటారని
తెలుస్తున్నది, గాలి కనబడకుండా వియటం జరుగుతుంది సర్వజీవివులను రక్షించుతుంది ఇది దాని స్వభావం, కాల్చడం అనేది నిప్పు స్వభావం అనగా ఒక విధమైన జ్వాల  ఏర్పడి కారు చిచ్చుగామారి అడవిని దహించివేస్తుంది, ఆజ్వాలను నీటిపాత్ర క్రింద ఉంచితే నీళ్లను వేడి పరుస్తుంది అనగా జ్వాలను ఉపయోగించుకొనే పద్ధతిని బట్టి ఉంటుంది. పారడ మనేది నీటి స్వభావం అనగా నీరు సముద్రములో కలవవలసినదే కనుక నీటి ఉపయోగాలను ఉపయోగించు కొనే తెలివి మానవులకు ఉన్నది ఆవిధముగా నడుచు కోవటం మంచిది.           

అదే విధంగా ప్రతిదాంట్లో తల దూర్చడం, ఒక విషయం మీద నుంచి మరో విషయానికి దూకడం, విచిత్రమైన కోరికలు కోరడం, వేలాది విషయాల గురించి ఆలోచించడం, ఎన్నెన్నో సమస్యల గురించి దుఃఖించడం, గాలిలో మేడలు కట్టడం, మనకు అప్పగించిన పని గురించి కాకుండా మిగిలిన ప్రతి ఒక్క పని గురించి పట్టించుకోవడం, చేసింది ఒకటి, చెప్పేది మారొకటి, చేయాలనుకున్నది వేరొకటి ఇవి కాక ఇంకా ఎన్నో మానవుల లక్షణాలు ఉన్నాయి   – ఇదీ మనస్సు స్వభావం.

ఇటువంటి మనస్సును నియంత్రించ గలిగితే, మనం ఎంతటి ఉన్నత లక్ష్యాలనైనా సాధించ గలుగుతాం. మన శరీరంలోని ఐదు జ్ఞానేంద్రియాల పాత్ర ఇక్కడ వస్తుంది.

కళ్ళు, చెవులు, ముక్కు, నాలుక మరియు చర్మం – ఈ అయిదు మనసుకు వాహనాలు. జ్ఞానేంద్రియాలన్ని మనస్సును అన్ని వైపులా లాగుతూ ఉంటాయి. కాబట్టి, వివేకాన్ని ఉపయోగించడం ద్వార ఇంద్రియాలను అదుపులో ఉంచుకోవాలి. ఇలా ఇంద్రియాలను అదుపులో ఉంచడాన్నే సంస్కృతంలో ‘దమం’ అంటారు. నిజానికి ,ఇంద్రియాల సహాయం లేకుండానే స్వతంత్రంగా కూడా ఇష్టమొచ్చిన చోటుకు మనస్సు పోగలదు. అలాంటి సందర్భాలలో బుద్దిని ఉపయోగించి దాన్ని మళ్ళీ వెనక్కి తీసుకురావాలి. ఇలా తిన్నగా మనస్సును నిశ్చలంగా ఉంచే పద్ధతినే ‘శమం’ అంటారు.

ఏకాగ్రతతో కూడుకున్న మనస్సు నిజంగా ఓ సెర్చి దీపం లాంటిది. దూరంగా, చీకటి మూలల్లో పడి ఉన్న వస్తువులను కూడా మనకు కనిపించేలా చేస్తుంది.

ప్రాతి రోజు ప్రతి వ్యక్తి యోగాసనాలు వేయటం, ఇష్టదైవాణ్ని ప్రార్ధనలు చేయటం ధర్మం తప్పకుండా నిత్యకృత్యాలు చేయటం వళ్ళ ఏకాగ్రత పెరుగుతుంది. 
మనిషికి మనషి తోడు ఉంటె మనలోని భావాలను తెలియ పరుచుకొని మనసును తేలిక పరుచు కొని ఏకాగ్రతకు ప్రయత్నం చేయాలి.   

మనం ప్రతి నిత్యం సాధన చేస్తూ మన మనస్సును ఆత్మ జ్యోతి మీద ద్రుష్టి నిలిపివుంటే, పరిసరాలనే కాకుండా చివరకు తన దేహాన్ని సైతం మర్చిపోయి పూర్తిగా మునిగిపోతే, అదే ఏకాగ్రతకు కచ్చితమైన సూచన!.