ఓం శ్రీ రామ్ - శ్రీమాత్రేనమ:
మానవులంతా సమాన మన్న భావన వెళ్ళు విరియాలి, ఎవరిలోపాలను వారే గ్రహంచి వాటినుంచి బయట పడాలి. మహోన్నత లక్ష్యాలకు అనుగుణంగా మానవాళి వ్యవహరించాలి. అందరిలో అవగాహన, త్యాగనిరతి వికసింప చేయుటమే నా లక్ష్యం అన్నాడు రావుగారు.
అవును రావుగారు నేను కూడా మీతో ఏకీభావిస్తాను, నీతోపాటు నేను కుడా సేవాదృక్పధముతో సహకరిస్తాను.
మమత
రావు
గారు మిమ్మల్ని చూస్తే నాకు ప్రేమ, కోపము, జాలి కనిపిస్తుంది,
మానవత్వాన్ని బట్టి మమతను స్నేహమును పంచుతున్నావు, అందరు సమాన మంటావు
ఎందుకలా మారావు అని అడిగాడు.
కూర్చో
" పతి గారు " కాలాన్ని బట్టి నేను నడుస్తున్నాను, అన్ని మతాలలో ఉన్నది
ఒక్కటే తోటివారికి సహాయపడు, లేనివాడికి దానం చెయ్, మన: శాంతిగా బ్రతుకు
అనేది కదా.
అది నిజమేననుకో. ఈలా మారటానికి ఏదైనా కధ ఉన్నదా. అదేం అంత పెద్దది కాదు నా అనుభవంలో తారస బడిన కొన్ని సంఘటన చెపుతా విను.
నాకూతురి
పెళ్లి నిమిత్తం దాచిన సొమ్మును పెళ్లికి ముందు రోజు బ్యాంకు నుండి
తీసుకోని వస్తున్నాను, దారిలో ఒక్క సారిగా కుంభవృష్టి కురిసినట్లు వర్షం
పడటం మొదలైనది, నాలో అప్పుడే భయము పెరిగినది, స్కూటర్ ఆగినది, ఇంటికి
పోవాలంటి ఇంకా ఆరగంట పడుతుంది గత్యంతరం లోక ఒక ఇంటి తలుపును కొట్టా,
లోపలనుండి
ఒక వృద్ధురాలు టవల్ తో వచ్చి నా తలను తుడవబోయినది, నేను తుడుచు కుంటాను
అని తీసుకోని తుడుచు కున్నాను, రొట్టె, వేడి ' టి ' ఇచ్చింది. వర్షము
తగ్గింది ఉంటావా వెళతావా బాబు అని అడిగింది, ఆమెతో పెళ్లి విషయం చెప్పాను,
అంతే అప్పుడే నా దగ్గరకు వచ్చి నూతన వస్త్రములు, కొంత డబ్బు నా చేతిలో
పెట్టి ఇవి నీ కూతురికి నా కానుకగా ఇవ్వు బాబు అన్నది. అప్పడని పించింది
దేవుడున్నాడు, ఆపదలో ఆదుకొనే వారిని పంపిస్తాడు అనుకుంటూ అక్కడ ఉన్న
ఏసుప్రభుకు నమస్కరించి ఆ తల్లికి నమస్కరించి వెనుతిరిగాను.
తరువాత
నా కూతురి పెళ్లి ఘనంగా జరిగింది, కాపురానికి వెళ్ళింది. ఒక్కసారిగా
వృద్ధురాలు గుర్తుకు వచ్చి అక్కడకు వెళ్లగా ఆప్పుడో చని పోయింది అని
చెప్పారు. ఎవ్వరు పట్టించు కోవటం లేదు, ఎందు కనగా అని విచారించగా ఆమెకు
ఇద్దరు పిల్లలు ' కొడుకు కూతురు ' ఎక్కడున్నారో ఎవ్వరికీ తెలియదట అన్నారు.
అప్పడే నేను ఆమెకు క్రైస్తవ పద్దతిలో ఆమె పుణ్యలోకాలకు పోవుటకు సహకరించాను.
అప్పటి నుంచి నేను ఆ ప్రభువుని వేడు కుంటున్నాను, ఆమె చని పోయిన రోజు
గుర్తు పెట్టుకొని సమాధి వద్దకు పోయి ప్రార్ధిస్తాను అన్నాడు.
అవును రావు గారు ఆవృద్దురాలి
తరఫున ఎవ్వరు రాలేదా అని అడిగాడు పతి. తర్వాత వారు వచ్చారు, వారు నాకు
డబ్బు ఇవ్వ బోయారు, అవి తీసుకో లేదు నేనే వారికి ఆవృద్దురాలికి
సంబంధించినవి వారికి ఇచ్చి నేనే వారికి కొంత ధనము ఇచ్చి పంపాను.
మానవులంతా సమాన మన్న భావన వెళ్ళు విరియాలి, ఎవరిలోపాలను వారే గ్రహంచి వాటినుంచి బయట పడాలి. మహోన్నత లక్ష్యాలకు అనుగుణంగా మానవాళి వ్యవహరించాలి. అందరిలో అవగాహన, త్యాగనిరతి వికసింప చేయుటమే నా లక్ష్యం అన్నాడు రావుగారు.
అవును రావుగారు నేను కూడా మీతో ఏకీభావిస్తాను, నీతోపాటు నేను కుడా సేవాదృక్పధముతో సహకరిస్తాను.
కామెంట్‌లు లేవు:
కామెంట్‌ను పోస్ట్ చేయండి