ఓం శ్రీ రామ్ - శ్రీ మాత్రేనమ:
నిజాయితి?
క్యాలండర్ ఎంతో ఆశగా ఎదురు చూస్తూ ఉంటారు ఎందుకో తెలుసా రాబోయే పుట్టిన రోజు, పెళ్లి రోజు గూర్చి ఆలోచనలు మనసుకు చేరి ఎంత ఖర్చు పెట్టాలి ఎంతమందిని పిలవాలి ఎక్కడ చేయాలి అని ఆలోచిస్తారే తప్ప ఒక బీదవానికి చదువు సహాయము చేద్దామని, ఆలోచన చేయరు ఎందుకు ? ఇది నా సంపాదన నాయిష్టం అని అనుకుంటారు కదా ! మనం చేసే పని ఇతరులను తృప్తి పరిచే విధముగా ఉండాలని గమనించారు ఎందుకు?.
ఆసక్తి కరమయిన విషయాలు, బుద్ధిపూర్వకంగా చిట్కాలు, సమావేశాలు, సమీక్షలు జరుపుతారు ఆచరణకు వచ్చేటప్పటికల్లా ఆర్ధిక వనరులు తక్కువని, తాహాతుకు మించి పోకూడదని సర్దుకొని జీవనం గడుపుతారు.
సాంకేతిక పాపంపంచంలో కేవలము టెక్నాలజీని నమ్ముకొని ముందుకు పోతున్నారు, అది ఎప్పుడు చెడునో ఎవ్వరు చెప్పలేరు. ఒక గొర్రె గట్టు దాటిందనుకో మిగతా గొర్రెలన్నీ గట్టు దాటుతాయ్
కష్టంలో నుంచి సుఖం పుడుతుంది. సుఖం అలవాటు చేసి కష్టపడ మంటే ఎంతో కష్టం. మనిషి మేధస్సు ను ఉపయోగించుకోండి. సమయము ఎక్కువ తీసుకున్న శాస్వితంగా పని జరుగుతుంది. ఒక్క రోజు విధ్యుత్ ఆగిపోతే లక్షల ఉద్యోగలు ఏమి చేయలేక ఉన్నారు, ఇటువంటి సాంకేతిక విద్యమనకవసరమా?
సాంకేతికత ప్రపంచాన్ని మరింత అసమానంగా చేస్తుంది. కేవలం టెక్నాలజీ దీనిని పరిష్కరించగలదు
సాంకేతిక పరిజ్ఞానం ద్వారా చెడుగా నడపబడుతున్న లేదా అవినీతి రాష్ట్రాల్లో అసమానత పెరుగుతుంది - అయితే ఈ రాష్ట్రాలను అస్థిరమివ్వడానికి సాంకేతికతను కృతనిశ్చయంతో కూడా ఇది సులభం. భవిష్యత్ విజయం ఏది?
దేశం ఒకసారి వేగంగా ముందుకు పోతున్నది మరియు ధరలను తగ్గించి ప్రజలకు సేవచేయాలని సంకల్పంతో ఉన్నది . ఖర్చులు ఎక్కువగా ఉన్నాయని ప్రాజెక్టులు ఎందుకు ఎక్కువ సమయం తీసుకుంటారో ప్రజలకు అందుబాటులో తేలేకపోతున్నారు ఇప్పుడు నిపుణులు ఆలోచిస్తున్నారు.
సలహా సాధారణంగా నిర్లక్ష్యం చేయుట మరియు నియమాలు మామూలుగా జరుగుట వలన, ఈ చిన్న ముత్యాలను కేవలం "సూచనలు" గా పరిగణిస్తున్నారు తప్ప ఆచరణకు నోచుకోవటంలేదు .
మానసిక ఉల్లాసానికి సంగీతాన్ని వింటున్నాను. మేల్కొలపడానికి మరియు సంగీతాన్ని ఆన్ చేస్తున్నాను, మ్యూజిక్ వింటూ నేను నిద్రపోతున్నాను, నిజాయితీగా నేను సంగీతాన్ని వింటున్నాను, పార్కులో ఉన్నప్పుడు మరియు వీధిలో నడుస్తున్నప్పుడు మరియు నేను సంగీతానికి నా చెవులు తెరిచి ఉంచుతాను. అతి వినోదం అనర్ధం అన్నట్లుగా అదేపనిగా విన్న శ్రవణ నాడులు చెడిపోతాయి అని గమనించలేకపోతున్నారు నేటి యువ ప్రపంచం.
స్వార్ధం, కృరత్వం, ఆధిపత్యం ఎక్కవగా పెరుగుతున్నది.
దాన్ని తట్టుకొవాలంటే జ్ఞానోదయం కలిగించే విద్య నేర్చుకోవాలి.
ఒకరోజు అనుకోకుండా ఒక స్కూలు వద్దకు పోయాను
నేను పక్కనే ఒంటరిగా బెంచ్ మీద కూర్చున్న నాలుగేళ్ల బుడ్డోడు నన్ను ఆకర్షించాడు .....
వెళ్లి పక్కన కూర్చుని " ఏమ్మా ఇంకా అమ్మ రాలేదా తీసుకెళ్ళడానికి "? అని అడిగాను ...
" అమ్మలేదు " అన్నాడు అదోలా... నాకు మనసు చివుక్కుమంది..
" ఓహ్ నాన్న వస్తారా అయితే నిన్ను తీసుకెళ్ళడానికి " అనడిగా.
.
" నాన్న లేడు" అన్నాడు అదే భావంతో ...
నా మనసనే కడలి కల్లోలమై కన్నీరు కెరటాల్లా రాబోతుండగా ..
" మరి ఎవరు తీస్కేల్తారు "అని అడిగా .....
బేలగా చూస్తూ " మమ్మీ గానీ డాడీ గానీ వస్తారు" అన్నాడు వాడు టక్కున.
ఎందుకు పిల్లలు చెడిపోతున్నారో నాకు అర్థమైనది, దానికి కారణం తల్లి తండ్రులే ఆధునిక విద్య మోజులో పడి మాతృ భాషను మరుస్తున్నారు. టివి లలో అసభ్యకరమైన దృశ్యాలు చూడకుండా జాగర్త పడక సహకరిస్తున్నారు ఇది అవసరమా ? . మీ పిల్లలకు కనీసం మీ పేర్లయినా తెలుగులో నేర్పించండి.... మనసంస్కృతి సాంప్రదాయాన్ని నిలపెట్టండి. దేశప్రగతికి తోడ్పడండి, నిజాయితిగా బ్రతకండి.
కామెంట్‌లు లేవు:
కామెంట్‌ను పోస్ట్ చేయండి