26, జూన్ 2017, సోమవారం

విశ్వములో జీవితం

ఓం శ్రీ రామ్ - శ్రీ మాత్రే నమ:  

జీవితగమ్యం
తెలుసుకో ఈ మెట్లు 
ఎక్కటానికి ప్రాయత్నం చేయు ఇట్లు 

ఓ మనిషీ తెలుసుకో
 మమ తెఱిగి మసలుకో

కొడుకు కొడుకు అని అంటావు
కోరుకున్న వన్నీ అందిస్తావు
తల కొరివి పెట్టేవాడ వను కుంటావు
పెళ్లి తర్వాత గుణం ఎలానో తెలపలేవు

కూతురు కూతురు అని అంటావు
చదువు చదువు అని చదివిస్తావు
పెళ్లి చేద్దామని తిరుగుతావు
వయసులోనే ప్రేమించాను అంటే చెప్పలేవు

స్నేహితులను ఆదుకుంటావు
స్నేహాన్ని పెంచుకొని బ్రతుకుతావు
స్నేహమే శాస్వితమని అనుకుంటావు
స్నేహితులు నీకష్టంలో కానరాక భాధపడతావు

సంపాదనలో మునిగి పోతావు
ఆరోగ్యాన్ని లెక్క చేయక తిరుగుతావు
భార్య పిల్లల కోరికలు తీరుస్తావు
సంపద పొతే భార్య పిల్లలకు చులకనై పోతావు

అన్నా తమ్ములను, అక్క చెల్లెలల్ను ఆదరిస్తావు
సంసారం లో ఉన్న చిక్కుల్ని ఎదుర్కొంటావు
పెద్దలను గౌరవించటాడనికి ప్రయత్నిస్తూనేఉంటావు
ఆస్తి పంపకంలో మనస్పర్ధలను ఎదుర్కొంటావు

పిల్లలపై ఆశ పెంచుకొని బ్రతుకుతావు
కష్టమంతా ధారపోసిన గుర్తించలేదని భాదపడతావు
నాకేం చేశావంటే చెప్పలేక మదన పడతావు
వృద్ధాప్యంలో స్వతంత్రంగా బ్రతకాలను కుంటావు

భార్య అనారోగ్యాన్ని భర్తగా భరిస్తావు
భార్యే సర్వమని చివరిదాకా ఆదుకుంటావు
అనారోగ్యాన్ని కూడా లెక్క చేయక సహకరిస్తావు
జీవితగమ్యంలో ఒకరికొకరు కలసే ప్రేమను పంచాలంటావు

ఓ మనిషీ తెలుసుకో
 మమ తెఱిగి మసలుకో
--((*))--

జీవితగమ్యం -2
తెలుసుకో ఈ మెట్లు 
ఎక్కటానికి ప్రాయత్నం చేయు ఇట్లు 

ఓ మనిషి తెలుసుకో
 తెలుసుకొని మేలుకో

ఆకలి పెంచుతుంది అహం
ఓర్పు కోరుతుంది సమం
వయసు కోరుతుంది కామం
మనసు కోరుతుంది సమం

అన్నం లేకపోతె ఉపవాసం
దొరికిన నీరే దేవుని తీర్ధం
భక్తితో గుడికి పొతే ప్రసాదం
రక్తితో గూటికి చేరితే విషాదం

ప్రేమకు అతిప్రమే ప్రమాదం
మనసుకు మాయే వసంతం
కాలం తీరుస్తుంది పరిష్కారం
విషమిస్తే కలుగును ప్రేమోదం

నమ్మకంలో ఉన్నది సుఖం
దాపరికంలో ఉన్నది దుఖం
సాధనలో ఉన్నది సంతోషం
ప్రేమ ఉంటె ఉండదు ప్రమాదం  

సఖ్యతలో పెరుగు అనురాగం
జీవితంలో జరుగు సమరం
ఇది సుఖదు:ఖాల వలయం
సాగించాలి నీవు సంసారం

ఓ మనిషి తెలుసుకో
 తెలుసుకొని మేలుకో

--((*))--

జీవితగమ్యం -3
తెలుసుకో ఈ మెట్లు 

ఎక్కటానికి ప్రాయత్నం చేయు ఇట్లు 


ఓ మనిషీ తెలుసుకో
 మమ తెఱిగి మసలుకో

కలలో కల్లోలం గమనించురా 
కల్లాకపటం ఎరుగక జీవించురా 
కళ్ళలో నీటిని గమనించాలిరా 
కనుచూపుతో కనికరం చూపురా 

కంచెను గమనించి నడవాలిరా 
కనకం కోసం ఎప్పుడు వేట వద్దురా 
కాంత కోసం కష్టాలు తెచ్చుకోకురా 
కందకంలో పడక జాగర్త పడాలిరా 

కోరిక కోపాన్ని పెంచునురా 
కోపం అదుపులో ఉంచాలిరా 
కోమలి ప్రేమను పంచురా 
కోరుకున్న సుఖం దొరుకునురా 

కృషిని నమ్ముకొని జీవించాలిరా 
కృపచూపి నీవు కీర్తిని పొందాలిరా
కృష్ణుని ఆరాధించి బతకాలిరా 
కృత కృత్యుడై ఎప్పుడూ మెలగాలిరా  

ఓ మనిషీ తెలుసుకో
 మమ తెఱిగి మసలుకో
--((*))--
ప్రాంజలి ప్రభ -జీవితగమ్యం -4
ఓ మనిషి తెలుసుకో 
 తెలుసుకొని మసలుకో 
తెలుసుకో ఈ మెట్లు 
ఎక్కటానికి ప్రాయత్నం చేయు ఇట్లు


మనసు ఎరుగవోయి 
మాధుర్యం పాందవోయి 
మృగంలా మార కోయి  
మాటను గమనించ వోయి 

అలుక మానవోయి
నటనను చూపకోయి
నాట్యము చూడవోయి
హాయి పొందు ఈ రేయి
      
మర్మం గ్రహించ ఓయి 
మగువ చూపు చూడవోయి
మందిరం బోసి పోయి
మది తలుపు తెరిచా రావోయి      

ఈసు కన్నుల దోయి
చూచు చెడుపుల వేయి
గుడ్డి ప్రేమే హాయి

ఓ మనిషి తెలుసుకో 
 తెలుసుకొని మసలుకో
--((*))--


ఆరుద్ర కూనలమ్మ పదాలు
+++ ×++ +++
పెద్ద జంతువు దంతి
వెడద దంతుల దొంతి
సమము ఒక్క వదంతి
ఓ కూనలమ్మ

గుడిని వీడెను శివుడు గోడ రాలును చవుడు
కానడే మానవుడు
ఓ కూనలమ్మ
లంచ మనియెడి పట్టి
మంచ మేమిటి గట్టి
ఇనుప మేకుల తొట్టి
ఓ కూనలమ్మ
తాను మెచ్చిన కొమ్మ
తళుకు బంగరు బొమ్మ
వలపు గుడ్డి కదమ్మ
ఓ కూనలమ్మ
సగము కమ్యూనిస్టు
సగము కేపిటలిస్టు
ఎందుకొచ్చిన రొష్టు
ఓ కూనలమ్మ
తాగుచుండే బుడ్డి
తరుగుచుండే కొద్ది
మెదడు మేయును గడ్డి
ఓ కూనలమ్మ
మనసు తెలుపని భాష
మంచి పెంచని భాష
ఉత్త సంద్రపు ఘోష
ఓ కూనలమ్మ
కొంతమందిది నవత
కొంతమందిది యువత
కృష్ణశాస్త్రిది కవిత
ఓ కూనలమ్మ
సన్యసించిన స్వామి
చాలినంత రికామి
చాన దొరికిన కామి
ఓ కూనలమ్మ
రెండు శ్రీల ధరించి
రెండు పెగ్సు బిగించి
వెలుగు శబ్ద విరించి
ఓ కూనలమ్మ
తములపాకుల నముల
దవడతో మాట్లాళు
తానె వచ్చును తమిళు
ఓ కూనలమ్మ
మిసిమి మెచ్చెడి తులువ
పసిడి కిచ్చును విలువ
నాకు చాలును చెలువ
ఓ కూనలమ్మ
అణువు గుండెను చీల్చి
అమిత శక్తిని పేల్చి
నరుడు తన్నున బాల్చి
ఓ కూనలమ్మ
కొంటె బొమ్మల బాపు
కొన్ని తరముల సేపు
గుండె వుయ్యెల నూపు
ఓ కూనలమ్మ

కూనలమ్మ పదాలు / ఆరుద్ర రచనల నుండి గ్రహీతము
సేకరణ :-