ఓం శ్రీ రామ్ - శ్రీ మాత్రేనమ:
ప్రేమ
హృదయ లోతుల్లో పరీక్ష జరిగితే గాని ప్రేమ ఉన్నట్లు తెలియదా? సహజంగా మాటల అర్ధం బట్టి
తెలుసుకోలేరా? హృదయం తలుపులు ఎప్పుడూ తెరిచే ఉంటాయి. నేనున్నాను అని శబ్దం చేస్తూ గడియారం లా కదులుతూ ఉంటుంది. ప్రేమను శుద్ధి చేయటానికి కొన్ని హృదయాలు తపిస్తూ ఉంటాయి.
సాధకుడు జ్ఞాణమా అజ్ఞాణమా అనేది ఎదో తెలుసు కోలేక పోతున్నాడు, మనసులో ప్రేమ ఉన్నా నోరు విప్పి చెప్పలేక పోతున్నాడు, పరిస్థితుల ప్రభావమా, వాతావరణ ప్రభావమా, ధైర్యము లేక ప్రేమను కుడా వ్యక్త పరచలేని పరిస్థితులలో ఉండుట ఎందుకు ? అప్పుడు చెప్పాలనుకున్నా కుదరలేదు, ఇప్పుడు చెప్పలేకున్నా, ఇంకా సమయము రాలేదు అని ఊరుకున్న, అదేపనిగా ఆలోచించినా ఎక్కాల్సిన రైలు రావటము పోవటం జరిగి పోతుంది.
నదికి నీరు లేకపోతె నిరుపయోగం, జేబులో ధనము లేకపోతె నిరుపయోగం, రక్త సంభందానికి ప్రేమ చూపక పోతే నిరుపయోగం, మనిషిని మనిషిగా గుర్తించలేకపోతే ప్రేమ ఉన్న లేనట్లే కదా ?
ప్రతియొక్కరు గమనించాలి మమతా కన్నా మనసు మిన్నా, మనసుకున్న ప్రేమ మిన్నా,ప్రేమ ఉంటె జీవిత మంతా సుఖమేనన్నా.
మృగాలకన్నా మనుష్యులు మిన్నా, ఎందుకంటే అవి భావాన్ని వ్యక్త పరచలేవు, మనమయితే భావంతో అటు ప్రేమను కుడా తెలియ పరచగలము.
వయసు కన్నా వలపు మిన్నా అన్నారు పెద్దలు, ఎందుకంటే వయసు కాదు సంతృప్తి పరచేది, వలపు ఉంటేనే ఇరువురి మధ్య ప్రేమ పెరుగుతుంది.
ఆదర్శాలు కన్నా ఆదరణ మిన్నా, ఎందుకంటే ఎన్నైనా చెప్పవచ్చు ఆచరించని వాడు, ఇతరులను ఆదరించి గౌరవించుట లోనే ప్రేమ కనబడుతుంది.
వెలయాలి కన్నా ఇల్లాలు మిన్నాఅన్నారు ఎందుకంటే ధనం ఉంటేనే వెలయాలి ఉంటుంది, ధనము లేకున్నా ఇల్లాలు సుఖమనే ప్రేమను పంచి ఆరోగ్యవంతునిగా చేస్తుంది.
సంపద కన్నా సంతృప్తి మిన్నా అన్నారు, ఎంత సంపద ఉన్నా ఆశ చావక పొతే అంతా నరకమే, సంపద లేకున్నా ఉన్న దానితో సంతృప్తి పడితే దానిలో నిజమైన ప్రేమ కనిపిస్తుంది.
పిల్లలను కనటం కన్నా ప్రేమను పంచటం మిన్నా అన్నారు ఎందుకంటే వయసులో ఉన్న ప్రేమ ప్రభావము వళ్ళ పిల్లలు పుడతారు, వయసుడికిన తర్వాత కూడా పిల్లలు ప్రేమను పంచగలిగితే ఆ మనుష్యుల యొక్క జీవితం నిశ్చ కళ్యాణం పచ్చతోరణంగా ఉంటుంది.
.
నా జీవితం నా అదృష్టం, నా తప్పులు నాకు పాఠాలు, మన జీవితమే ఒక అద్దం లాంటిది, మనం నవ్వితే నవ్వుతుంది, ఏడిస్తే ఏడుస్తుంది, కానీ ప్రేమకు రూపం లేదు అర్ధం చేసుకొనే మనస్తత్వం ఇచ్చాడు దేవుడు, నిదానంగా, నిలకడగా ఆలోచిస్తే ప్రేమ లేని మనుష్యులు ఈ లోకంలో లేరు, వారిని గుర్తించి ప్రేమను పొందటంలో ఉన్నది మానవ జన్మ సార్ధకం.
కామెంట్‌లు లేవు:
కామెంట్‌ను పోస్ట్ చేయండి