27, జనవరి 2014, సోమవారం

108. Love Story 12 ( భంధం )

భంధం

శారదాదేవి సుర్యాస్తమైన  తర్వాత తులసి చెట్టు వద్ద దీపం వెలిగించి ప్రదక్షణాలు తిరిగి కుంకము బొట్టు పెట్టుకొని ప్రసాదం నైవైద్యము పెట్టి ఎవరికైనా పెట్టినతర్వాత తను తినేది ప్రసాదాన్ని.

అప్పుడే వచ్చింది పనిచేసే  రాములమ్మ, ఎ రాములమ్మ ఈరొజు ఎక్కడా పనిలేదా ముందే వచ్చావు, ఉన్దమ్మగారు రొజూ చేసే ఇల్లెగదా ఒక్కరోజు పోకపోతే ఏంకాదు, వారేమన్న గిన్నెలు తోవుతారా ఏమిటి గొణుక్కుంటూ ఉంటారు మొతం నా మొహాన కొట్టి, రాలేదని సాపనార్దాలతొ తిట్టి, ఏదో బెదిరింపు మాటలతో సతాఇస్తారు.

నేను ఎపుడైనా నీవు రాకపోతే అట్లా చేసానా, మీరు దేవత అమ్మగారు, మీ మాట ఒక వేదవాక్కు, మాటలు వింటుంటే నాకు ఎక్కడికి పనికి పోకుండా వినాలనిపిస్తుంది.

నాలుగు రోజులనుంచి గమనిస్తున్నాను మీరు దిగులుగా ఉన్నారు, ఎందుకో అడగాలని అడగ లేక పోయినాను  ఇప్పుడడుగుతున్నాను,  చప్పండి మీ కధ ఏమిటో అని నేలపై చతికల పడింది, గుమ్మం ముందు  ఉన్న అరుగుపై కూర్చొని తన కధ చెప్పటం మొదలు పెట్టింది ముందు ఈ ప్రసాదం తిను తర్వాత నే చెప్పే కధ విను.

నేను గుంటూరులో ఇంటర్ లో స్టేట్ ఫస్ట్ వచ్చాను,  పై చదువులు చదివించమని ఏంతో  ప్రాధేయ పడ్డాను మా న్నాన్నగారిని, నిన్ను చదివించాననుకొ,   నీ  తోబుట్టువులను చదివిన్చాల్సి వస్తుంది. నీవు చదివిన చదువుకు ఎక్కడైనా ప్లే స్కూల్ లో పనిచేయవచ్చు అని చదువు మాన్పించారు మా నాన్నగారు.

ఎక్కడో దూరపు చుట్టము  ఒకాయన వచ్చి మా అబ్బాయి మీ అమ్మాయిని కాలేజి దగ్గర చుసాడుట అప్పటినుంచి నేను పెళ్ళిచేసుకుంటే ఆ అమ్మాయిని చేసుకుంటానని పట్టుపట్టాడు.

ఆ అబ్బాయె     మీ అయ్యగారు " శివానంద్ " అప్పట్లో డిగ్రి తప్పి ఇంట్లో  కూర్చొని సినమాల  వెంబడి, పార్కుల వెంబడి, కాలెజీల వెమ్బడి తిరిగేవాడు. వాడి బుద్ధి మారుతుందని నాకు ఇచ్చి పెళ్లి చేసారు, నేనొక పిచ్చి మాలోకం, మానాన్నగారు అన్ని తెలిసి పెళ్ళైతే బాగుపడతారని తెలిసి మరి నాకు పెళ్లి చేసాడు.

నా అదృష్టం కొద్ది నా భర్తను ఇంటి యందె చదివించి డిగ్రి పూర్తి  చేఇంచాను, తర్వాత బి.ఐ.డి కూడా చదివించాను, నాకు కాన్వెంటు లో ఇచ్చే జీతముతొ పట్టుదలతో చదివించాను, నాకు అప్పుడు ఇద్దరు పిల్లలుకూడా కలిగారు.

పిల్లలను బాగా చదివించాలని ఊరు కాని ఊరు వచ్చాము, అప్పుడు మావారు నీవు ఉద్యోగము చేయనంటేనే
పిల్లలను చదివిస్తాను, నేను ఎక్కడైనా స్కూల్లో మాస్టర్గా చేరుతాను మనం హాయిగా ఉందాం అని ఇక్కడకు తెచ్చారు.

మా కాపురం మూడు కాయలు ఆరు పువ్వులగా మారింది, సినామాలకు, షికార్లకు వెల్లేవాల్లము, నా అంత సంతోషం వేరెవ్వరికి ఉన్దదనుకొనె దాన్ని, మావారుచాలా మంచివారు అని అన్దర్కి చెప్పెదాన్ని, నా కాపురం ఇలా సాగిపోతున్నది, సముద్రములో నావ కదిలనట్లు కదులుతున్నది ఇదే మా పచ్చని కాపురం.

అందరి చెప్పే కధ మీరు చెప్పారు దీనిలొ ప్రెత్యెకత ఏముంది, మీరు భాధాపడటం గురించి నేనడిగాను దానిగురించి.

అది చెప్పిన ఆర్చెవారెవరు తీర్చెవరెవరు, " ఎవరొచెప్పారొ కాని ముల్లోచ్చి ఇస్తరాకుమీదపడ్డ, ఇస్తరాకు వచ్చి ముళ్ళు మీద పడ్డ బొక్క ఇస్తరాకుకెకదె "

అవునమ్మగారు ఈ మొగవాళ్ళు అవసరమైతే కాళ్ళు పట్టుకుంటారు, కాదనుకో నోటికి వచ్చినట్టు తిడతారు అది మొగవాళ్ళ గర్వం "నేనే మొగాన్ని " అనేది.

ఎందుకె అంత పెద్ద మాటలంటావు, మేమైతే పచ్చి బూతులు తిట్టుకుంటాము, ఒకరి కష్టం ఒకరు పంచుకుంటాము, మాకు పెద్దగా చదువు లెద్దమ్మ "రోజుకూలికి పోవటం " తినటం త్రాగటం పడుకోవటం మే మా పని" నీదగ్గరకు వచ్చి  నా విషయం చెపుతున్నాను అన్నది రాములమ్మ.

ఒకరి విషయాలు ఒకరికి చెప్పుకుంటేనే మనసు తృప్తి,  సంతోషము ఉంటుంది. ఏమిటో ఈరొజు నామనసు చాల  తేలికైనది, అన్నది శారదా దేవి.                              

రాములమ్మ మేము వచ్చిన కొత్తలో సరదాగా సినామాలకు పార్కులకు పిల్లలతో తిరిగాము, మావారు స్కూల్లో ఉద్యోగము వచ్చింది. అప్పటినుంచి మామీద శ్రద్ధ తగ్గింది.

ఒకరోజు అందముగా ప్యాంటు,షర్టు ఇన్షర్ట్ వేసుకొని, షూషు  వేసుకొని బయలుదేరారు మావారు, నేను మిమ్మల్ని చూస్తుంటే, నా దిష్టే తగిలేట్టుంది అన్నాను. ఎందుకె భయపడతావు నేనేమన్నా చిన్న పిల్లవాడినా, ఇద్దరు  పిల్లలు గల తండ్రిని అన్నాడు.  నిన్ను వదలి నేను బ్రతక గలనా అని దగ్గర తీసుకొని మరి ముద్దిచ్చేవాడు.

మరోసారి చొక్కాలను సర్దుతుంటే నాకు పాన్ పరాఖ పొట్లాలు ఉన్నాయి, అడిగితె ఏదో సరదాగా వేసు కుంటున్నాను, అన్నింటికీ నీకు భయమే, ఈ భయముతో ఈ భగ్యనగరములొ బ్రతకలేవు, ఇక్కడ హిందీ కుడా నేర్చికోవాలి అని హెచ్చరించాడు.  అపుడే కొంత మా వారుపై అనుమానం పెరిగింది.

నా  మొగుడు ఏది అడిగితె  అది చేసి పెట్టేదాన్ని, ఇల్లు దాటి బయటకు వచ్చేదాన్ని కాదు, పిల్లలను ఇంట్లో చదివించేదాన్ని. భర్తకు రోజు క్యారేజ్ ఇచ్చి పంపేదాన్ని. ఇల్లంతా శుభ్రముగా ఉంచేదాన్ని.

కాని భర్త రావాడం అదిబాగొలెదు, ఇది బాగోలేదు అని అరిచేవాడు.

ఇంటికి ఆలస్యముగా వస్తూ ఉండేవాడు, కారణమడిగితే స్కూల్లో పని పెరిగిందని, ఇంట్లో కూర్చొని యక్ష ప్రశ్నలు వేస్తున్నావు, నా బట్టలు ఇస్త్రి కూడా చేయటము లేదు,  ఇంట్లో కూర్చొని ఎమ్చెస్తున్నావు, అనేవాడు.

నివు ఇంటికి  కావలసినవన్నీ తెచ్చుకొమంటే నన్నే తేమంటావు, తెచ్చినతర్వాత  ఇది బాగోలేదు అది బాగోలేదు అంటావు (నేను ఏమి అనక పొఇన నాతొ వాదనకు దిగేవాడు రాములమ్మ.)

ఈ మోగోల్లంతా ఇన్తెనమ్మ, అందితే జుట్టు పడతారు, అందకపోతే కాళ్ళు పట్టుకుంటారు. వాళ్ళ అవసరాళ్ళు తిరిస్తెచాలు ఏమనకుండా ఉంటారు.

మా వారు  ఆలస్యముగా వస్తున్నాడు, ఎదోఒక  సాకు చెప్పేవాడు, పిల్లలను దగ్గరకు తీసుకోవడం మానేసాడు,  నన్ను కూడా  దూరంగా ఉంచడం మొదలు పెట్టాడు. కారణం ఏమి ఉంటుందా అని చాలాసార్లు ఆలోచిన్చేదాన్ని. ఫలితం లేక నిద్ర మాత్రలు వేసుకొని నిదించెదాన్ని.

ఇరుగు పొరుగు వారు అనగా విన్నాను, తనతో పనిచేస్తున్న స్కూలు టీచరు మోజులో పడి  దాని చుట్టూ తిరుగుతున్నాడని తెలిసింది. నేను ఎవరికీ చెప్పుకోవాలి, ఏమని చెప్పుకోవాలి, చెపితే పరువుపోతుంది, చెప్పకపోతే నా కాపురమే నాశనమవుతుంది. ఇంకా మారుతాడని ఓపికతో ఉన్నాను రాములమ్మా.

పిల్లల కోసం అవమానం సహించాను, దెబ్బలు భరించాను, తిట్లు సహించాను, ఆకలి సహించాను, కాని నాభర్త ధోరణి మారలేదు            
ఒకరోజు నేను మా స్నేహితులతో ఇంటికి వస్తున్నాను, కాఫీ టిఫిన్లు రడీ  చేయ మన్నాడు, ఇంట్లో సరుకులు లేవన్న ఇంటిదగ్గర షాపులో వస్తువులు తీసుకోమని మరి చెప్పాడు, చేసేదిలేక చేతనైనంతవరకు కాఫీ టిఫిన్లు రడీ చేసాను.

మరలా ఫోన్లో మెముమగవాల్లము మన ఇంట్లో పేక అదెందు వస్తున్నాము, మెమువఛి వెళ్ళేదాకా ప్రక్క ఇంట్లో కూర్చొ అన్న మాటలకు నా తలతిరిగింది. అన్ని బల్ల మీద సర్ది పిల్లలను తీసుకోని ఎదురింటి వారిని పలకరిస్తూ కూర్చున్నాను.

మరునాడు మీరు ఇట్లా ఇంటికి ఎవరినిపడితే వారి తెస్తే చేసే ఓపిక నాకు లేదు అన్న మాటలకూ విపరీతమైన కోపముతో నే చెప్పిన పని చేయాలి, నా ఇష్టమైన వారితో తిరుగుతాను, నీకు కావలసినది నిన్ను పిల్లలను చూసు కోవడమెకద అన్నాడు.  అవును అది చాలు ఇంత మూర్ఖముగ మాటలొద్దు అన్నాను కొంచం ధైర్యము తెచ్చుకొని.  

అంటే నా మీద కోపముతో నాకే ఎదురుచెప్పె సాహసము చేస్తావా, నా మాటలు లెక్కచెయవా, అని నే బయటకు వెళుతున్నాను మూడు రోజులు దాకా రాను ఇంట్లో కూర్చొని అష్టమ చెమ్మ ఆడుకో అని వెళ్ళేవాడు.

ఆ కోపముతో పిల్లలను కొట్టేదాన్ని, మూర్ఖముగా ఉండే భర్తతో కాపురము చేసేకన్నా హుస్సేన్ సాగరంలో పడి చావాలని అనుకున్నా, అమ్మ అని పిల్లల మాటలకు వీరికొసమైన బ్రతకాలని బ్రతికి ఉన్న.

మరో రోజు త్రాగి వచ్చాడు, పిల్లలను ఇష్టమొచ్చినట్లు తిట్టాడు, నాపై  ఒక పశువుగా ప్రవర్తించాడు, విపరీతముగా అరిచాను, నా కష్టం, నా సుఖం, ఎమన్నా పట్టిన్చుకుంటున్నావా అని ఎదురు తిరిగాను. ఇక్కడ నాకు సుఖం లేదు అంటూ బయటకు వెళ్ళిపోయాడు.

నేను అన్న వండటం మానివేశాను, తినటం మాని వేసాను, నీరసముతొ మంచము ఎక్కాను, కాని పిల్లల ఆకలి తీర్చాలి  అని ఎన్తొ ఓపికచేసుకొని వండి పెట్టేదాన్ని "చివరకు పిల్లలకోసం నేను బ్రతకాలని  నిర్ణ ఇంచు కున్నాను,  మూగదానిలొ భర్తకోసం ఎదురుచూస్తున్నాను అన్నది శారదాదేవి రాములమ్మతొ.

నేను మీకు చెప్పేంత దానిని కాదు ఐన మీ కదా విన్న తర్వాత మీకు ఒక సలహా ఇద్దా మను కుంటున్నాను
ఇక్కడ దగ్గరలో హనుమాన్ విద్యామందిర్, హనుమాన్ జ్ఞాన మందిర్, హనుమాన్ ఆరోగ్య సేవా మందిర్, ఇలాంటివి చాల ప్రజా సేవకొరకు మల్లాప్రగడ  రామకృష్ణ గారు ఏర్పాటు చేసారు, వారిని కలిస్తే నీకు  ఏదైనా మంచి జరుగుతుందని నాకు అనిపిస్తుంది. 

ఆ హనుమంతుని నమ్ముకో, ఆ హనుమంతుని గుర్తుతెచ్చుకో , ప్రార్ధించు ధైర్యముతో వారు ఏమిచేపితే అదే చే యి, నీభర్తను గురించి ఆలోచన తగ్గించు, నిపిల్లల భవిషత్ గురించి ఆలోచించు, నీ ప్రేమ ఉన్న్నన్తకాలమ్ నీ భర్త న్నిన్ను వదలి ఉండలేడు, కొన్నాళ్ళు భర్తకు దూరముగా తెలియకుండా అజ్ఞాతముగా ఉండి నీ భర్తను గమనిస్తూ ఉండు అని నేను చెప్పే సలహా .

నీవు చెప్పినట్లుగా వారిని ఈరొజె కలుస్తాను ఆ దేవుడు కల్పించే ఆటలో నేను ఒక పావును, పంజరములో చిక్కిన  చిలకను ఐన పంజరాని చేదించి బయటకు వస్తున్నాను. అంటూ ఇంటి వారికి మా వూరు పోతున్నాను మావారు వస్తే తాళం ఇవ్వండి అనే చెప్పి బ్రతుకుతెరువు కోసం ఆధునిక   ప్రపంచములో అడుగుపెట్టింది


హనుమాన్ జ్ఞాన మందిర్ వద్దకు చేరింది శారదా దేవి, అక్కడ వారిని " రామకృష్ణగారు " ఉన్నారా అని అడిగింది. ఇప్పుడే భార్యా భర్తల భంధం గురించి చెపుతున్నారు. ఆ ఉపన్యాసం ఐన తర్వాత కలవచ్చు, ఆక్కడ కూర్చున్న వారితొ కూర్చొమ్డి అన్నాడు, మందిరానికి వచ్చిన భక్తుడు. పిల్లతో అక్కడే కూర్చొన్నది.

అప్పుడే ఉపన్యాసం ప్రారంభమైనది. నేను చెప్పేవన్ని అనుభవ సారాంశాలు, ప్రక్రుతి రహస్యాలు, మేధావులు రచించిన విషయాలు, మంచిని గ్రహించి జీవితము సార్ధకము చేసుకొని హనుమంతుని ద్యానిస్తు మనోధైర్యముగా, నిగ్రహశక్తి తొ  జీవితము గడపాలి, ఉప్పెన వచ్చిందని భయపడకూడదు, చికటి  వెలుగులు, మనుష్యులను వెమ్బడిస్తాయని మరువకండి.

స్త్రీ గొప్ప అని , పురుషుడు గొప్ప అని కొందరు వాదించు చున్నారు, స్త్రీ పురుషులు సమానమని, దయార్ద కరుణ కలిగిన వారని, మానవత్వం ఉన్న మనుష్యులని, ఇరువురి అవసరముతొనె సృష్టి మెదలైనదని నేనంటాను.
       
ఎగిరి ఎగిరి (స్త్రీ ) అనే రక్కలగల పావురము, ఆకులు కొమ్మలు రమ్మలు బలంగా ఉన్న చెట్టు (పురుషుడు ) దొరికిందని ఆ చెట్టే తన సర్వస్వమని భావించి ఎంతో సంబరపడి అందే ఉండిపోతుంది, ఆశ్రయము కల్పించి ఆదుకోవటమే చెట్టు లక్షణం  అని నేనంటాను.  
               
చలికి, వానకి, ఎండకి, ఎండి, మేక్కగా పెరిగి పువ్వునై, వెరొకపంచన చేరి,  సువాసనలు,  సుగంధాలు, అందించి చివరకు దేవుని పూజా పుష్పముగా మరుదున్దని నేనంటాను.

రక్షణ వలయములో ఉండి, ప్రేమగా ముద్దుగా పెరిగి, ప్రక్రుతి సౌందర్యాలను చూడాలని, అనుమతితో ప్రవేశించిన లేడి పిల్ల బెదురు చూపులతొ రక్షణ కర్తను చేరి మనసు విప్పి మట్లాడి, మనసును అర్పించటమే, ఆనందాన్ని పంచి అనుభవించటమే ప్రేమ అని నేనంటాను.

మాటల రంగుల్లో, మనసుల ముసుగుల్లొ,  రంజిమ్పచెసి, రక్తికట్టించి నటనతో వసపరుచుకొని, ఇది ఒక నాటకమని నేను పాత్రదారుడునని, నమ్మించి మోసంచేసి ఎమీ తెలియదని అమాయకులమని అనే స్త్రీ పురుషులు ఉన్నారని నేనంటాను.

అఖండ ఆశా జ్యోతి కోసం కాళ్ళవద్ద ఉన్న దీపపు బుడ్డిని ప్రక్కకు జరిపి మిడి మిడి మిణుగురు పురుగుల వెలుతురులో ప్రలోభాలకు లొంగి కాపురాలు నడి సముద్రములొ ఉన్న గాలికి కదిలే పడవలా, దిక్కుతోచని పక్షులు ఎలా విలపిస్తాయొ, పిల్లలను భర్తను దారి తెచ్చు కోలేక విలపించెది స్త్రీ లేనని  నేనంటాను,.

సుఖం అందించలేని స్త్రీ కాని,  పురుషుడుకాని పెళ్లి చేసుకోవటం వ్యర్ధం. పెళ్లి చేసుకున్న తరవాత (స్త్రీ పురుషులు సంసారానికి పనికి రారని తెలుసుకున్న)  క్షణాన కలిసి జీవించడం వ్యర్ధం,  విడి పోయి వేరొకరిని మొసగించ కుండా  జీవితకాలములొ ఒంటరిగా బ్రతుకుటే న్యాయమని నేనంటాను.

స్త్రీ  పురుషులమద్య కాంక్షా రహిత సంభంధం, అలోకిక సంభంధం, శరీర రహిత సంభంధం, ఉండవచ్చు అంత  మాత్రాన నైతిక విలువలు మరచి ధర్మం తప్పి ప్రవర్తిస్తున్నారు ఎందుకని నేనంటున్నాను.

కుటిల పాండిత్యముతో  అమాయక ప్రాణులను లోబరుచుకొని,  మానాలను హరించి, వీధిన విసిరేసిన చెత్త సంచీలుగా మార్చి,  దిక్కునావారి చెప్పుకోమని, కోపముతో హతమార్చిన నరహన్తకులన్నరని నేనంటున్నాను.

ఒక శబ్ద తరంగమ్ చేవునికి చెరినన్త మాత్రాన బి.పి., పెంచుకోమని, కోపం తెచ్చు కోమని, ఆలోచన శక్తి మొద్దు మారినట్లుగా ప్రవర్తింమ్చుట ఎందుకని, మనస్సుని నిగ్రహించుకొని ఉండ లెక పొతున్నారు స్త్రీ పురుషులు ఎందుకని నేనంటున్నాను.

జాజి పూల సన్నని సువాసన మతిబ్రమిమ్చవచ్చు, చల్లని నీటి తుమ్పరులు మనస్సును ప్రెరెపిమ్ప వచ్చు, చలిని తట్టుకోలేక వేడికోసం వెమ్పర్లాడ వచ్చు, కాని మనస్సును నిగ్రహిమ్చెకొనె శక్తి ఆ దేవుడు మనకిచ్చాడు దానిని సద్వినియోగము చేసుకోలేక భాదపదుతున్నారని నేనంటున్నాను.

నిర్ణయాలన్నీ సహజ అమోదాలుగా భావించి వాని ఫలితములు, దుస్పలితములు తెలుసుకొని సరిదిద్దుకోవాలి స్త్రీ పురుషులు అంతే కాని ఎవరో చెప్పారు, నేను చేసాను, అని వారిని దూషించుట తగదు, వర్ని హేళన చేయుట తగదు, గుణఫాటాలే అనుభవాలని తలంచి జీవించాలని నే నంటాను.

స్త్రీపురుషులు ఇద్దరు ఉల్లాసముగా,  ఉత్చాహముగా,  ఆరోగ్యముగా మనస్సును ఆకర్షించే విదముగ, లక్షణ విలక్షణముగా, వైవిద్య భావాలు మనస్సున రానియక, అసభ్య పదాలు వాడకుండగా, మనిషిని బట్టి వారి మనసుని బట్టి ఏది మాట్లాడాలో అంతవరకూ మాటలతో సంతోషపరిచి, మానవాతీత శక్తిని పదర్సిమ్చి నలుగురిలో మంచివారని, మంచి కుటుంబమని అనిపించుకుంటే చాలని నేనంటాను.

వినోదాన్ని అందించి చమత్కారాన్ని సొంతం చేసుకోవాలి, అనుకున్న భావాన్ని ఇరువురు తెలుసుకొని అమలు జరపాలి,  సుఖదుక్ఖాలు ఇద్దరి వళ్ళ వచ్చు నని అనుకోవాలి, సూర్య చన్ద్రులులాగ వేళ తప్ప  కుండా  దేవుని నమ్ముకొని బ్రత కాలని నేనంటాను.

ఇంద్ర ధనుస్సు ల వెలిగిపోతూ, మనస్సులోని కోరికలను సామరస్యముగా తీర్చుకుంటూ, ప్రశాంత వాతావరణము లో ప్రక్రుతి వడిలో పున్నమినాడు వెన్నెల కిరణాల వలె ఒకరి మాట ఒకరు అర్ధం చేసుకొని జీవించాలి, కోపముతో గాని, తాపముతో గాని, అసభ్య పదజాలముతొ ఒకరికొకరు వాదనలు చేయుట  మంచిదికాదు,  అందులో పిల్లల ముందు ప్రవర్తించటం అంతకన్నా మంచిది కాదని  నేనంటున్నాను.

మనసు మనసు కలసిన నాడు ఏర్పడును భంధం, మనసు విరిగిన నాడు ఇంకా పెరుగును భంధం, పిల్లల ప్రేమను పంచు కొనె టప్పుడు ఉంటుంది భంధం, పిల్లలు ప్రయోజకులై వృద్దిలోకి రావటమే నిజమైన భంధం అని నేనంటాను.

తప్పు ఎవరిదైన వేలెత్తి చూపకు, పదే పదే విమర్సిమ్చకు,   చీకటి  తరిమే వెలుగు ఉంటుందని మరువకు, సుఖం, దుఖం ఎప్పుడు ని వెనుకే ఉంటాయి వాటిని చూసి భయపడకు, వాటికోసం పరుగెత్తకు, భార్యా భర్తలనెవారు కావడి  కుండల్లా  కదులుతూ మనందరినీ భరిస్తున్న భూమాతను, కావడిని మోస్తున్న ఆ పరమాత్మునితో  ఉండాలి భంధం.

బురదలో పడ్డ బయటకు వచ్చి సుబ్రముగా  కడుక్కొని బ్రతకాలి,   కాలమే మనకు ఆశలు రేపుతుంది, అవకాశములు కల్పిస్తుంది, ఆనందాన్ని పంచుతుంది, దుఖాన్ని దూరమ్ చేస్తుంది.

ప్రతిఒక్కరు మనసు ప్రశాంతముగా ఉషోదయ  కిరణాలులా, దేవునికి అర్పించే పుష్పాలలా, నలుగురితో కలసి జీవిమ్చటమే నిజమైన భంధం.

ఒక చెరువులొ ఉన్న మంచి నీరు భూమిని తడుపుతూ  మరొక చెరువులొ కలసి కలకల లాడుతూ అందరికి ఉపయొగ పడేవిధముగా, భార్యాభర్తలు కలసి జీవిమ్చటమే భంధం, మానవసేవే మాధవ సేవని భావించటమే  నిజమైన భంధం.                            

ఉపన్యాసము అంతా విన్న తర్వాత ఆ హనుమంతునికి నమస్కరించి " రామకృష్ణగారి దీవెనలుతీసుకొని ధైర్యముగా భర్త బలహీనతను గమనించి, వలలో వేసుకున్న దానికి బుద్ధి చెప్పి ఉన్న ప్రాంతమును మారి భర్తతోపాటు టిచర్గా  పనిచేసి పిల్లలకు మంచి విద్య వచ్చుటకు తనవంతు కష్టపడింది శారదాదేవి అదే భంధం

ఈకధపై మరియు నేను వ్రాస్తున్న కధలపై మీ అభిప్రాయలు మీ స్నెహితులతో పంచుకుంటూ మనస్సు ప్రశాంతముగా ఉండాలనేదే నా భావన.

                                      

                                               

      అంటి అంట నట్లుగా, చూసి చూడ నట్లుగా, విని విన నట్లుగా , మాట్లాడి మాట్లాడ నట్లుగా , ప్రతి విషయాన్ని తేలిక తీసు కోవటమే కలియుగ భంధం అని నేనంటాను.