26, జనవరి 2014, ఆదివారం

107. comedy story -11 (నేను నేనే )

                                                                           
నేను నేనే


నిత్యము జరుగుతున్న సంఘటనలు ఆధారము చేసుకొని ఈ కధ వ్రాయుట జరిగింది. ఇది ఎవరిని ఉద్దేసించి వ్రాసినది కాదు, కేవలము మనుష్యులకు " నవ్వు ముఖ్యము " కనుక కాస్త చదువుకొని ఆనంద పడతారని ఆసిస్తూ ఇది వ్రాయుట జరిగింది దీనిలొ హిరో ఒకరు " వ్యాఘ్రెస్వర్  " ప్రేక్షకుడుగా  "బ్రహ్మానదం" ఇందు రెండు  సంఘటనలు ఉదహరిస్తున్నాను .

మన  హీరొ గోవిందు పబ్లిక్ రోడ్ లో ఉన్న బస్సు స్టాప్ లో తీరుబాటుగా  పేపరు చదువుతున్నాడు, కాసేపు తూర్పుకు తిరిగి మరీ చదివేవాడు.  కాసేపు నడుస్తూ చదివేవాడు చూసే వారికి  ఇతని ప్రవర్తన వింతగా ఉండేది, ఎవరన్నా కదిలించారను కో అంతే వలలో చిక్కిన పక్షిలాగా, వడ్డున పడ్డ చేపలాగా, పెళ్ళానికి చిక్కిన మొగుడ్ లాగా గిలగిల కోట్టు కుంటారని అనుభవజ్ఞులకు తెలుసు.

ఇదిగో మాస్టారు ఒక్కసారి పాపారు ఇస్తారా అని అడిగాడు బ్రహ్మానందం, అటు  ఇటు చూసి నన్నే అడిగేది నీవు అన్నాడు వ్యాఘ్రెస్వర్ , అవును సార్ ఏమిటి అడగటం తప్పా, అడగందే అమ్మైనా అన్నం పెట్టదు అది నీకు తెలుసా, తెలుసు. అయితే నిజంగా పాప్రు అడుగుతున్నావా , అవునండి ఎదో పేపరు కొద్దిగా చదువుదామని, అవును సార్ మీ లాంటి వారు ఇక్కడ ఎక్కవగా ఉండుట వల్లే దేశం ఈ స్థితి లోఉంది.   

ఇంతకీ ఈ పేపరులో  ఏమి చదువుతావు, చదవన్ సార్ చూస్తాను, " ఆబ్బా "  అంత చూసే బొమ్మలేమీ ఉంటాయి, లక్ష తొంభై ఉంటాయి అన్ని మీకు చెప్పాలా,  మీరు పేపరు  ఇస్తే ఇవ్వండి లేదా ఇవ్వనని చెప్పండి అన్నాడు. అబ్బో కుర్రోడివైన పట్టుదలగా మాట్లాడుతున్నావే, ఇంతకీ నీవు చూసెదేమిటి " మాహీరొ సినమా ఏ హాల్లో ఉందొ తెలుసు కొనేందుకు అన్నాడు.

తెలుసుకొని సినమా చూస్తావా, లేదా ఏమన్నారు మీరు "సినమా చూడక అక్కడ దాక పోయి బ్లాక్ టిక్కెట్లు అమ్మేవాడిలాగా" కనిపిస్తున్నాన అన్నాడు బ్రహ్మానందం.   


 
మీ సినమా నాయకుడెవరో తెలుసుకోవచ్చా, అతడా సార్, అవునూ ఎవరో చెప్పు అతనే నవ్వుల గోవిందు.
 

ఏమిటి అతని ప్రత్యేకత అట్లా అడిగితే ఎట్లా చెపుతాను , ఇపుడు రామారావు సినమా తీసుకోండి ఒక్కోసినమా రాజుగా, దేవుడుగా ఉంటుంది, అట్లాగే నాగేశ్వర రావు సినమా తీసుకోండి ప్రేమ ఎక్కువగా ఉంటుంది. మీరు చూస్తెతెలుస్తుంది. ఇంకా వారి సినమాలు వస్తున్నాయ, అదేంటి సార్ మొన్నేగా రామారావు, నాగేశ్వర రావు నటించిన సినమా వచ్చింది.

ఏమిటి కొత్తదే, ఏమిటి సార్ కొత్తడి కాకపొతే పాత దనుకుంటున్నారా, మీరు ఏ యుగంలో ఉన్నారో, మొన్నే చూసాను చాల అద్బుతముగా ఉంది , దానికి రాష్ట్రపతి అవార్డు కుడా ఇచ్చారు.  

ఇంతకీ ఎం చదువుతున్నావు, నేనా డిగ్రీ చదువుతున్నాను, మీ నాన్నగారు ఎం చేస్తున్నారు,  బట్టలషాపులో గుమాస్తా

మీనాన్న కష్టపడి నీకు డబ్బులు పంపిస్తే నీవు సినమాలని, షికార్లని, క్లబ్బులని తిరిగి డబ్బును తగలేస్తావు  కదూ.

ఏంటి సార్ అట్లా అంటారు, నేనేమన్నా మూర్ఖున్నా  చదువుతున్న వాడిని,   మానాన్న కష్టాలు మర్చిపోతానా, మా అమ్మ ప్రేమ మర్చి పోయే వాడిని కాదు సార్, నేను మా తల్లి తండ్రులను సుఖపెడతాను

ముందు పేపరు ఇవ్వండి సినమాకి వెళ్లి ఇంటికి పోవాలి.

ఇంతకుముందు మీ హీరొ సినమాలు ఏమైనా చూసావా, ఎందుకు చూడలేదు  గోల్ మాల్ గోవిందా ఏంతో  బాగున్నది సార్,

ఒకసారి సినమాకి వెళ్ళాను, ఒకటే నవ్వు , నవ్వు ఆపుకోలేక కళ్ళంబడి నీరు వచ్చాయి అంతే చేతిరుమాలు  తడిసి పో యింది తెలుసా, మర్లా వెంటనే  సీరియస్ గా డైలాగు చెపుతాడు, "చెల్లమ్మా నీకు సహాయము చెయ్యలేక పోతిని, నిన్ను కాపాడ లేక పోతిని, నిన్ను ఈ స్తితికి మార్చిన వాన్నీ   పట్టు కో లేక పోతిని, నన్ను క్షమించమ్మా, 
క్షమించమ్మా, నా బొందిలో ప్రాణం ఉన్నంతవరకు నిన్ను కాపాడు కుంటాను. నేను పెళ్లి కూడా చేసుకోను నీకోసం చెల్లెమ్మా " ఆ మాటలకు చీరలు తడిసినాయి స్త్రీలకు.

సినమా చూసి అంత ఇన్ స్పైర్ కాకూడదు, సినమాను కధలాగా చూడాలి, దానిలో ఉన్న నీతిని గ్రహించాలి, మనసుకు సంతోషము కలగాలి, ప్రశాంతముగా ఇంటికి  పోయిన తర్వాత నిద్రరావాలి.

ఆంటే మాయా బజార్ లాగా సార్, ఏమిటి ఆ సినమా చూసావా, నెనేమ్ పిచ్చోడ్ని కాదు సార్, మా బామ్మ చెప్పంగా విన్నాను.

ఇప్పుడు సినమాలు చూస్తే ఏంతో ఉచ్చాహంగా ఉల్లాసంగా ఆరోగ్యంగా ఉన్నాయి, రకరకాల సెట్టింగులు, సినమా చూస్తుంటే స్వర్గలోకంలో విహరిస్తున్నట్టు ఉన్నది

నీవు త్రాగుతావా అన్న మాటలకు " తాగనివాడు దున్నపొతుతో సమానమని ఒక కవి అన్నాడు, అందుకనే అప్పుడప్పడు త్రాగుతానండి, మరి సిగేరేట్టు ఇక దాని గురించి నన్నెందుకు  అడుగ తారండి కవులు సిగేరేట్టు దమ్ము మీద దమ్ము లాగి కధలు వ్రాసారని మా బామ్మ చెప్పేది, అందుకనే నేను త్రాగుతున్నాను.

కొంపలదీసి నీవు కధలు వ్రాయుటలేదు కదా, ఇంకా నాకు సమయ మెక్కడుంది సార్, ప్రొద్దున సాయంత్రం ఉమన్స్ కలెజీ చుట్టూ తిరగడం సరిపోతుంది.

ఎందుకో  ఏదైనా పిట్ట పడుతుందని, ఆశ .  ఏ వయసులో చేసేపని ఆవయసులో చేస్తే మంచి పిల్లలు పుడతారని మా బామ్మ చెప్పేది సార్.  మీ వయసులో అమ్మాయల వెంబడి తిరుగుతే చెప్పుతీసుకొని కొడతారు, మమ్మల్నైతే ముద్దుగా పిలిచి క్లబ్బుకు పోదామా పార్కుకు పోదామా అంటారు సార్ అదే సార్ మాకు మీకుతెడా. 
ఆహా 
అవును సార్ 
అబ్బో నీ దగ్గర నేను చాలా నేర్చుకోవాలి

ఇంతకీ  " గోవిందా గోవిందా " సినమా చాసావా

ఎందుకు చూడ లేదు సార్ చాలా బావుంది, దానిలో ప్రెత్యేకత ఏంటి

అమ్మాయిలతో గోవిందుడు ఆడతాడు చూడు, ఒక చెడుగుడు, ఒక కోలాట, ఒక బిళ్ళంగోడు ఆట ఒకరిపై ఒకరు దూకె ఆట, రంగులు కొట్టుకుంటూ జలకాలు ఆడతారు చూస్తుంటే నా మనసు నా మనసులో లేదుసార్ ఆ అమ్మాయల తో ఆడినట్లు ఉన్నది సార్.

ఇంకా ఏమైంది, అమ్మాయిల చీరలు మాయమైనయి, అంతే  బ్లూ ఫిలిం రీల్ కట్ హాలంతా గొడవ మీద గొడవ అదే అమ్మాయిలైతె, ఒక్కటే వీలలు, బూరలు ఎగరేసారు  సార్.

ఇంతకీ మీ హీరొ చూసావా అంటే నన్ను పిచ్చోడ్ని చేస్తారు సార్, రక్తపుతిలకాన్ని స్వయముగా దిద్దాను సార్ నాను పిలిచి కాఫీ టిఫిన్ ఇచ్చినీలాంటి అభిమానులు నాకు కావాలని ప్రొత్చహించారు సార్.

ఆహీరొని "  నేను నేనే "    ఆ అంటూ క్రింద పడ్డాడు.

ప్రక్కనవరు వచ్చి ఏమైంది సార్.

ఇటువంటి కారు కూతలు కూసేవారు ఈ దేశంలో ఉండ కూడదు, ఉన్నాడనుకో ఇతనితో ఉన్నవారు చెడిపోతారు , పచ్చని కాపురములో చిచ్చు పెట్టె రకం, ఆడపిల్లలను చూస్తే చిత్రకార్తి కుక్కల్లాగా వెంటపడే రకం, ఇలాంటి వారి తగిన మందు ఆసుపత్రి మాత్రమే. 

అంతలోకి అంబులెన్సు వచ్చింది, దానిలో నుండి దిగినవారు నమస్కారము పెట్టి ఇతన్ని ఎక్కడకు తీసికెల్ల మంటారు, పిచ్చాసుపత్రికి తీసు కేల్లండి వ్యాఘ్రెస్వర్ పంపారని చెప్పండి. డాక్టర్ కు అర్ధమవుతుంది.   ఇల్లాంటి వారు చాలామంది ఉన్నరు వారినుండి జాగర్తగా ఉండండి ఇటువంటి వారి మాటలు నమ్మకండి, మీ మనస్సు ఏది మంచిదైతే అదే చేయండి, వేరెవరో చెప్పారని చేయకండి, ఇలాంటివారు సినిమా రంగాని చాల చేటు చేస్తారు, ఎంతో కష్టపడి సినమా తీస్తే చూడ కుండా బాగోలేదు, చూడొద్దు అంటారు. ఎంతో మంది జీవితాలు ఒక్క మాటతో పాడు చేస్తారు.

ఇంతకీ మీరెవరు " నేను నేనే "