13, జనవరి 2014, సోమవారం

104. Comedy Story-8( ఆధార్ కార్డు )

                                                                              

ఆధార్ కార్డు

చెల్లెమ్మ బావగారున్నారా అంటు లోనికి వచ్చాడు "సోది సుబ్బారావు", చెల్లెమ్మ ఇపుడే తొమ్దరొద్దు  టిఫిన్ చేయకు ఒక అరగంట తర్వాత చేయొచ్చు అన్న మాటలు వింటూ భజగోవిందం లోపల  నుండి హాలులోకి వచ్చాడు.

సుబ్బారావుగారు అమ్దరూ బాగున్నారా, మీ కాలక్షేపము బాగా జరుగుతుందా, ఏమిటి ఈ నాటి స్పెషల్ ఎమీ లేదు మిమ్మలన్ని ఒక్కసారి కలసి ఆధార్ కార్డు పోస్టు లో  వస్తుందట అది వచ్చిందా అని  అడుగుదామని వచ్చాను.

కూకట్పల్లి లో ఉన్న మా మావగారి ఇంటిలో  ఉన్నప్పుడు ఫోటోలు దిగాము అవి ఇంతవరకు రాలేదు.అవి ఎప్పుడొస్తాయో మాకే తెలీదు. ఐతే ఇప్పుడు మీకు గ్యాసు ఇవ్వరూ, ఆధార్ కార్డు లెకపొతె బ్యాకులొ ఎకౌంటు  ఓపెన్ చెయనీయరు, లోన్ ఇవ్వరూ తెలుసానీకు, ముందు ఆధార్ కార్డు సంపాదించు.

చెల్లెమ్మ టిఫిన్ పెట్టమ్మ తిని నేను పోస్టఫీసుసుకు పోవాలి, నాకేమన్న మనియా ర్డర్ వచ్చిందేమో కనుక్కొని, దానితోపాటు ఆధార్ కార్డు వచ్చిందేమోనని కనుక్కొని వస్తాను.

టిఫిన్ బాగుందమ్మా వెల్లొస్తాను భజగోవిందం గారు.అబ్బ ఇప్పుడే పోయి ఎమ్చెస్తావు పోస్ట్మాన్ రావాలికదా "టి "త్రాగి పోవచ్చు అన్నాడు భజ గోవిందం.  

ఆశ్చర్యకరమైన విషయమేది అని భజగోవిందం అడిగాడు సుబ్బారావుని " నన్నే అడిగావు నాకు తెలిసింది చెపుతాను అంతే సరే అదే చెప్పు ,  "ఒక  పమ్జరమును తయారుచేసి దానిలో చిలకను ఉంచటం ఆశ్చర్యము కాదు కానీ పెద్దదిగా ఉన్న మూతలేని పంజరంలో చిలక ఉంచితే అది ఎగిరాకుండా ఉండటమే ఆశ్చర్యం అన్నాడు "  నువ్వు చెప్పింది ఖచ్చితమే అయినా మానవసరీరములొ " నేను " అనే చిలక అలాగా ఉంటుంది నవరంద్రాలు ఉన్న బయటికి పోయే గుణమున్న అది బయటకు పోలేదు, అదే ఆశ్చర్యకరమ్,  అత్యంత ఆశ్చర్యకరమైన విషయము ఏమిటంటే ప్రాణము ఎప్పుడు ఉంటుందో , ఎప్పుడు పోతుందో ఎవ్వరూ చెప్పలేరు.

భారత పౌరుడుగా నేను అనే " ఆధార్ " ఉంటే ప్రభుత్వమువారికి సలహాలు ఇవ్వవచ్చు, ప్రజలకు సెవచేయవచ్చు ఎక్కడకు పోయినా నేను భారతీయుడని, తెలుగు వాడ్ని అని  సగర్వగా చెప్పు కొనవచ్చు అన్నాడు భజ గోవిందం.   మీ రిద్దరు మాటల్లో దిగితె కాలమే తెలియదు ఇదిగో "టి " త్రాగండి అన్న మాటలకు ఇద్దరు అందుకొన్నారు " చాలా బాగా ఉన్నది చెల్లి "టి" నాకు పనుంది. వెల్లొస్తాను అంటు బయటకు వచ్చే సాడు సుబ్బారావు.

ఈ సోది స్నేహితుడు ఎక్కడ దొరికాడు అని భార్య అడిగింది భజగోవిమ్దమును.

ఎమిలెదే ఆకలేసింది పెళ్ళాం ఇంట్లో లేదు అందుకనే వచ్చాడు రోజు వస్తున్నాడా ఏమిటి

"రోజూ వస్తే మాత్రము నేను టిఫిన్ చేస్తానా ఏమిటి "అని భార్య లోపలకు వెళ్ళింది.    
          
పేపరు తీసుకొని పడక కుర్చీలొ పడుకొని చదువుతున్నాడు భజగోవిందం

అంతలో బయట ఇంత అన్నం ఉంటే పెట్టమ్మ అన్న మాటలకు " భారతి " ఇంట్లో ఉన్న వేడి వేడి చెపాతీలు పెట్టడానికి తీసుకెల్తున్నది.

:"ఎప్పుడు లేంది బిచ్చగాడికి దానం చెస్తున్నావెంటి" ? ఆశ్చర్యముగా అడిగాడు భర్త

ఆ ఏమిలేదు "వచ్చే జన్మలో మంచి భర్త లభిస్తాడని ",  దీవిమ్చాడు బిచ్చగాడు  మీరు  చెప్పినమాట వింటాడని ఆ .........  అంటు నవ్వుతూచెప్పిమ్ది భారతి.

ఏమే ఇప్పుడు నీకు మంచి భర్తను కాదె అది మీకే తెలియాలి అంటు ఇంట్లోకి పొఇమ్ది "ఆడవాళ్ళ మాటలకు అర్ధాలే వేరు "  ఆడవాళ్ళ కోరికలను, మాటలను  ఆ బ్రహ్మ దెవుడు కుడా అర్ధం చేసుకోలేడు.


పండుగ కాదు, ఎవరూ పిలువలేదు, లేడికి లేచిందే ప్రయానమన్నట్లు ఇపుడు పోవుట అవసరమా అక్కడికి.  అన్ని మీకు విడమరచి చెప్పాలి మా పుట్టింటిలొ ఉన్నప్పుడు ఫోటోలు దిగాము కదా అవి పోస్టులో వచ్చాయో కనుకొని మా అమ్మ నాన్నలు చూసి ఇక్క డున్నట్లుగా వచ్చేస్తా.

నేను లేను గదా అని ఎక్కడపడితే అక్కడ తిని తిరగోద్దు, ముందు డాక్టర్ వద్దకు పోఇ చూపిమ్చుకొండి. నేను కుడా అక్కడకు వస్తాను ఇద్దరం కలసి మల్లి తిరిగోద్దము అన్నాడు భజగోవిందం  బారతితొ " మావారు ఎంత మంచివారో " అంటు బయలు దేరింది.

డాక్టర్ కలిసాడు బజగోవిందం
డాక్టర్ : ఏమిటిసార్ ఎప్పుడొచ్చినా "బి. పి." చాలా ఎక్కువ ఉండేది ఇవ్వాళ నార్మల్ గా ఉందేమిటి "అంటే నా మందులు బాగా పని చేస్తున్నాయన్న మాట ".
భజగోవిందం:  మీ మందుల వళ్ళ కాదు మా ఆవిడా ఇప్పుడు ఇక్కడ లేదుగా పుట్టింటికి పొఇమ్ది. అదీ సంగతి.
డాక్టర్ : ఎమన్నా స్పెషల్ ఉన్నదా
భజగోవిందం: ఎ స్పెషల్ లేదు వెళ్ళింది ఆధార కార్డు కోసం "మీకు ఎమన్నా ఫీజు వస్తుందేమోనని కలలు కనవద్దు "
డాక్టర్ : ఆ ....................
భజగోవిందం: నర్సు డాక్టర్ గారికి:"బి.పి. " పెరిగి నట్లుంది  ఒక్కసారి చూడు. అమ్తూ ఇంటిదారి పట్టాడు భజగోవిందం

" అదేమిటమ్మాయి అప్పుడే వచ్చేశావు అల్లుడుగారు నిన్ను పువ్వుల్లో పెట్టుకొని చూస్తానని మాట ఇచ్చారుగా " కంగారుగా అడిగింది. భారతి తల్లి పార్వతమ్మ.
ఆ పువ్వులు కొనటానికి డబ్బులు తెమ్మని పమ్పిమ్చాడను కుంటున్నావమ్మ అదేమ కాదమ్మా నన్ను పువ్వుల మీద నడిపిస్తున్నాడు మా అయన కాలు కుడా క్రింద పెట్ట నివ్వటలెదు.
నేను ఆధార్ కార్డు కోసం వచ్చాను 

నాన్న బాగున్నావా ఆ బాగున్నాను అల్లుడుగారు కూడా వస్తే బాగుండును కదా వెనుక వస్తానన్నారు నాన్న. ఎప్పుడు బయలు దెరావొ ఏమో కాస్త ఏమ్గిలిపడు అంటు, నేను పోస్టాఫిసు వద్దకు పోయి వస్తాను తలుపులు వేసుకోండి, అమ్ట్ బయటకు నడిచాడు.

ఇక్కడ భజగోవిందం పడక కుర్చీలొ పడుకొని  కలలు కంటున్నాడు.  


యమదూతలు కలలో ఈ భూలోకం చాలా మారి పోయింది చని పొఐనవారిని గుర్తించటం చాలా కష్టమవుతుంది అన్నారు యమభటులు, అందులో ఒకడు అంత కష్ట పడ నవసరము లెదు ఇప్పుడు ప్రతిఒక్కరికి అదార్ కార్డు  ఉంది  దాని పట్టి గుర్తించవచ్చు.

మనకార్డులు అవి ఒక్కటే అని గుర్తించేవారు ఒకరుఉండాలి కదా ఐతే ఆ భజగొవిమ్దాన్ని సాక్షిగా పెట్టుకుందాం

భజగొవిమ్దాన్ని కలిసారు అప్పుడు మరి నాకేంటి అనిచెఇ చాపాడు భజగోవిందం చనిపొఇన కుటుంబ సభ్యులు మిత్రులు ఏమనుకుంటున్నారో అదే నెరవెరుస్తామ్ అని వాగ్దానము చేసినారు.యమదూతలు
చని పొఇనవారు  5 గురు డాక్టర్ 2.లాయర్ 3.డ్రైవర్ 4. టిచర్ 5. మంత్రి అందరిని  గుర్తించాడు భజగోవిందం  

ప్రజలందరూ డాక్టర్ను చూసి "మంచి డాక్టర్ చనిపోయాడు ఎమ్దరికి ప్రానదానము చేసి చనిపోయాడో అని అనుకోవాలి అన్నడు " యమ భటులు తధాస్తు
ప్రజలందరూ లాయరు ను చూసి డబ్బు తీసుకో కుండ కేసులు వాదించి గెలిచాడని అమ్దరూ అనుకోవాలి
 అన్నడు " యమ భటులు తధాస్తు
ప్రజలందరూ డ్రైవర్ని యితడు త్రాగాడు ఎప్రాణి మీద కారు పొనీయలేదు, అమ్మాయల వెంట తిరిగే  వాడు కాదు అను కోవాలి  యమ భటులు తధాస్తు
ప్రజలందరూ నా అంత కోప్ప టిచర్ లేడని, ఎందరో భవిషత్ తీర్చిదిద్దారని  గొప్పగా చెప్పు కొవాలి అన్నాడు  యమ భటులు తధాస్తు
నేను ప్రధాన మంత్రి  అవుదామని కున్న కనీసమ్ నాపిల్లవాడి కోరిక తీర్చమ్ది అని యమభటులను  కోరాడు  ఆటే ఆపిల్లవాడు ఏది అడిగితె అది తీర్చి మేము పోతాము దీనికి ఈ భజగోవిందం స్సాక్షి అన్నారు అట్లాగే             

" నాన్న అప్పుడే చనిపోయావా నా మనవాడి పెళ్లి చూస్తావనుకున్నాను అన్నాడు "

ఎంత పని చేశావయ్యా నిన్నుభూలొకానికి పంపిస్తున్నాము ఈ మంత్రిగారు ఫోటో తప్పు వేసారు ఆధార కార్డు నందు అని చెప్పెదము అన్నారు భజగోవిమ్దమ్తొ చెప్పి వెళ్లారు, వె రే ప్రాణిని తీసుకొని వెళ్తాము అన్నారు. 

అప్పుడు భజగోవిందం అదార్ కార్డు ఒక ప్రాణిని రక్షించింది అన్నాడు  


అంతలో ఒక్కసారిగా తలుపు చప్పుడు వినబడింది వెంటనే లేచి  తలుపు తీసాడు, ఏమిటండి పగలు కూదా నిద్రపోతున్నార ఏమిటి ? కలలు కంటున్నార ఏమిటి ?

అవునే యమభటులు మధ్యవర్తిగా నన్నుమ్చారు వారికి నేను న్యాయం చేసాను నీకు తెలుసా, కొయ కండి కోతలు ఇదిగో మన ఇద్దరి అదార్ కార్డుస్ అంటు చేతిలో పెట్టింది భారతి.

అపుడే సోది సుబ్బారావు అడుగు పెట్టాడు చెల్లెమ్మ బాగున్నావా అన్నాడు.

అంతలో భారతి మీకు కాఫీ పెట్టి తీసుకొస్తాను మాట్లాడుకుంటూ ఉండండి అన్నది.

చూడు సుబ్బారావు ఈ ప్రభుత్వము వారు చాలా కార్డుస్సు పెడుతున్నారు  నీకు తెలుసా      

నాకెందుకు తెల్వదు చిన్నప్పడ్నిమ్చి నేను చూస్తునె ఉన్నాను.

మొదట పోష్ట కార్డులో ఉత్తరము వ్రాయమన్నారు, ఇప్పుడు మెయిల్ చెయ్య మంటున్నారు.

నెంబరింగ్ కార్డు ఉండేది, అది చట్ట విరుద్దమన్నారు ఆవి తీసి వేసారు, మరి ఇప్పుడు "ప్లైన్ కార్ద్సు ఆడుతున్నవారిని, వీదియొ గేమ్సు ఆడుతున్నవారిని ప్రొస్చ హిమ్చుతున్నారు.       

పిల్లలకు ప్రోగ్రస్ కార్డు ఇచ్చేవారు కాని ఇప్పుడు, పుస్తకములో  నూటికి తొంభైతొమ్మిది మార్కులు వేసి
గ్రేడ్ వన్ అని చెపుతున్నారు.

బస్సు ప్రయాణములో కూడా రాఇతీలు ఇస్తున్నారు, స్టూడెంట్స్ పాస్, క్యాట్ కార్డ్ ఇమ్కానెకమైనవి కల్పిస్తున్నారు

అలాగే రైల్వే వారుకూడా  కొందరికి రాఇతీలు ఇస్తున్నారు ఉద్యోగులకు మన్త్లీ పాస్ ఇస్తున్నారు.

ఇంకం  టాక్సు వారు పాన్ కార్డుఖచ్చితముగా అమ్దరూ తీసుకొవాలని నిర్ణయం చేసారు
 
బ్యాంకుకు పోకుండా ఎ. టి. యం.కార్డు ద్వారా డబ్బు తీసుకొవ్తనికివీలు కల్పిస్తున్నారు.

అట్లాగే ఆదార్ కార్డు అనేది భారతదేశం మొత్తం మీద అమలు చేయుటకు ప్రయత్నమూ జరుపుతున్నారు దాని వళ్ళ వాల్ ఉపయోగాలు చాల ఉంటాయని అమ్దరూ చెపుతున్నారు.

ఉద్యోగస్తులకు హెల్త్ కార్డు కు ఆధార కార్డు ఖఛితమని వాదిమ్చుతున్నారు.            

ఇలా చెప్పుకు పొతూ ఉంటే ప్రజల ఉపయోగము కన్నా నాయకుల ఉపయ్యోగము ఎక్కువ కనిపిస్తుంది అన్నాడు సుబ్బారావు

చాలా తెలుసుకున్నావె సుబ్బారావు అన్నాడు భజగోవిందం

నేనొకటే చెపుతున్నాను సుబ్బారావు   


మన ఆలోచన ధోరణే ఆహ్లాదాన్ని, ఆనందాన్ని, ఆరోగ్యాన్ని పెంచుతుంది
ఆలోచనలను మార్చుకుంటే ప్రపంచాన్ని మార్చి సక్రమముగా ఉంచవచ్చు
వ్యర్ధాల్లొచనలవళ్ళ  వచ్చును అనర్ధం, చేయగల పని గూర్చి మాత్రమె ఆలోచించు
ప్రభుత్వమువారు చేసే పనులన్నీ మన దాకా రావటము లేదు అనే బదులు, మనం ప్రభుత్వమువారికి ఏమి సహాయము చేస్తున్నాము, తోటివారికి ఎంత సహాయపడుతున్నాము అని,  ఒక్కసారి గుమ్దెమీద చెయ్ వేసుకొని కాలంతో పాటు మంచిని పంచి, దుర్మార్గాన్ని అరికట్టి ము0దుకు సాగాలి

సంకల్ప్ బలం ఉన్నవాడికి ఎ కార్డ్సు ఆపలేవు

సుఘమ్ద పరిమళాలు  వెదజల్లు పుష్ప శుద్ధి 
ఇంట్లో పోపు  గుబాళిమ్చు పాక శుద్ధి
చిమ్తలన్నియు బాపు చిత్త  శుద్ధి
కష్టములన్నియు తీరు కార్య శుద్ధి

ఈ కధ కేవలము కల్పితము ఎవరిని ఉద్దేసించి వ్రాసినది కాదు కేవలము ప్రకృతిలో జరిగిన సంఘటనలను ఆధారముగా వ్రాయుట జరిగినది