18, జనవరి 2014, శనివారం

105. Love Story-9 (ఆనంద భాష్పాలు)

                                                                              

ఆనంద భాష్పాలు

తెలుగు రచయతల సంఘంలోని  ప్రముఖులు కొందరు ఏర్పాటు చేసిన సన్మాన సభ . సన్మాన  గ్రహీత  " శ్రీ దేవి " వీరు రచించిన "మూగ జీవులు" కధకు జాతీయ అవార్డు రావడం ఒక విశేషం, ఈమె రంగారెడ్డి జిల్లా మరుమూల గ్రామంలో ప్రైవేటు స్కూలులొ " యల్. కే. జి " టిచర్ గా పనిచేస్తున్నారు వీరు చదివింది " బి. ఎ " అయిన పసిపిల్లలను తల్లిగా ఆదరించి, జోలపాడి, బుజ్జగించి అక్షరజ్ఞానం భోధించే టిచర్.
" శ్రీ దేవి " గారిని పిలిచి పుస్పగుఛము ఇచ్చి,శాలువా కప్పి ఆమె  రచించిన అనేక కధలను మెచ్చుకుంటూ  సన్మానము  చేయువారు ప్రశంసా పత్రమును ఇచ్చినారు.

ఈ సన్మానములో ప్రఖ్యాత  కధా రచయత "శ్రీధర్ "గారు మాట్లా తూ  "మూగజీవులమీద వ్రాసిన కధ " ఇంతగా మనసు ను కదిలించేది నేనింతవరకు ఎ కధ చదవలేదు. కధ చదువుతుంటే కళ్ళంబడి నీరు కారింది నాకు. నోరు లేని జీవులను హింసించకుండా కరుణతో సమాదరన చూపాలని సామాజిక చైతన్యం రగిలించిన కధ వ్రాసినందుకు పభుత్వమువారు గుర్తించి అవార్డు ఇచ్చినందుకు నా మనస్పూర్తిగా అభినందనలు అన్న మాటలకు సభకు వచ్చిన వారు అందరు కరతల ద్వనులు చేసారు.

" శ్రీ దేవి " మట్లాడుతూ జరుగుతున్న  సంఘటనలు ఆధారముగా ప్రక్రుతి ననుసరమ్చి మంచిని నలుగురికి పంచాలని భావనతో ప్రతిఒక్కరు మూగ జీవులను రక్షించాలని ఉద్దేశ్యముతో వ్రాసిన కధను ఆదరించిన అభిమానులందరికి వందనాలు అందిస్తున్నాను. 

ముందు వరుసలొ కూర్చున్న భర్త రామకృష్ణ చప్పట్లు కొట్టగా, కూతురు ప్రత్యూష మాత్రము తల్లి సన్మానాన్ని  చూసి సంతోష మొహము పెట్టలేదు, అది గమనించింది "శ్రీ దేవి "

సభ ముగిసింది అనేక ఫోటోలు తీసారు, విడియో తీసారు, ఇదేసమయములో "శ్రీ దేవి "  రచించిన కధల పుస్తకమును ఆవిష్కరించారు.

                                               


ప్రత్యూష కాలేజి చదువు పూర్తి చేసింది,కార్టున్సువేయడం, గ్రాఫిక్ తో  విడియో తీయడం,  చిన్న చిన్న ఫిలిమ్స్ తీయడం అలవాటైంది.

సన్మానం ముందు రోజే  బూజు కర్ర తీసుకొని బూజు దులపడం మొదలపెట్టింది, గూటిలో  ఉన్న ఎప్పటినుంచో పుల్లలద్వార  గూడు  పెట్టుకున్న పక్షులు  గూడు తీయపొఇనప్పుడు అడ్డు వచ్చింది తల్లికి ప్రత్యూష.
అవి పిచ్చుక గూడులు, ఇల్లంతా పుల్లలు పడేస్తున్నాఇ అన్నది. వాటిని తీసివెసిన మల్లి కట్టు కొగలవు అన్నది తల్లి. తల్లి మూర్ఖపు మాటలకు భాదపడింది ప్రత్యూష. 

అమ్మ ఆగూడు కదిలించే హక్కు నికేవరిచ్చారు దానిలో కళ్ళు కుడా తెరువని చిన్న పసి కూనలున్నాఇ.నీకు నిజంగా మూగ జీవులను ఆదరించి లక్షణం లేదు కాని కధలు మాత్రము అద్భుతముగా వ్రాస్తావు. మనం ఆచరిమ్చి నదె వేరొకరికి చెప్పాలని అన్నారు "రామకృష్ణ పరమహంస ".

అమ్మ బూజు కర్ర సంఘటన గుర్తువచ్చి నేను చప్పట్లు కొట్టలేదు అన్నమాటలకు  తల్లి దగ్గరకు తీసుకొని ఆలింగనం చేస్తూ నేను కూడా  అదెఅనుకున్నాను. 

సన్మానం నుంచి ఇంటికి చేరిన ప్రత్యూష గబగబా డాబా పైకి పోయి పావురాలకు మేత వేసింది. తన కెమారాతో  షూట్ చేసింది.            

ప్రత్యూష నీ టాలెంటు ఏదో చూపిమ్చి, నలుగురి మెచ్చే విధముగా నీ కెమెరాకు పనిపెట్టి, ఫిలిమ్సు తీయి, డబ్బు ఎంత ఖర్చు ఐన  వెనుకాడకు, అనుకున్నది సాధించేదాకా, కృషి చెఇ అన్నమాటలకు ఎక్కడలేని ఉత్చాహము వచ్చింది.  


ఒకరోజు ప్రత్యూశ పత్రికా విలెఖరలను, చినిమా ప్రముఖులను, విమర్శకులను మేధావులను , తనకు సహకరిమ్చినవారిని, స్నేహితులను, భమ్ధువులను   మరియు తల్లి తండ్రులను మినీ కాన్ఫరెన్సు హాలుకు అహ్ఫానిమ్చిమ్ది. పట్టుదలతో తను తీసిన విడియో డాక్యు మెంటరీ "ప్రగతి-1" ప్రదర్సిమ్చిమ్ది.
 " నల్లని మేఘాన్ని చీల్చుకొని  భాల భాను కిరణాలు నీటిపై బడి పగలు నక్షత్రాల మెరుపులు విరజిమ్మి చూసినవారికి ఒక అద్బుతము ఒక వైపు",  నదిలో నిలువెల్లా మునిగి స్నానము చేయు భక్తులు దేవుని ప్రార్ధనలు, వింతగా చూస్తున్న ప్రజలు మరోవైపు " ,                                                                     

"కాకులు కబుర్లు చెప్పుకుంటూ కరంటు వైర్ పై కూర్చున్నట్లు ఒక వైపు", ఉద్యోగాల కొరకు నిరుద్యోగులు వరుసగా కూర్చొని అనుభావాలు బ్రతుకు భారముగురిమ్చి చెప్పు కున్నట్లు  మరోవైపు ",                                      

మీనాలను వడిసి పట్టి గాలిలో లొకి ఎగురతున్న తెల్లటి కొంగలు ఒకవైపు, అప్పులవూబిలొ చిక్కి, బాకీలను తీర్చలేక కుటుంబాలు వీధిలొ పడిన పరిస్తితి మరొకవైపు.

పువ్వులపై వాలిన సీతాకొక చిలుకలను ఒకవైపు, అందముగా బంగారుఆభరనముల అలంకరముతొ అద్భుత వస్త్ర ధారనముతొ కుర్రకారులను మనస్సును కొల్లగొట్టే స్త్రీల ప్రవర్తనలు మరొవైపు.

పచ్చని కొమ్మలపై  పక్షులు వాలికిలకిల రావములు ఒకవైపు, సభలలో రంగుల వస్త్రాలతో ఎగురుచూన్న పావురాళ్ళ, వీధిన పడ్డ కుక్కల అరుపులు లా నాయకుల ప్రవర్తనలు మరొవైపు.

మురికివాడల నిర్మూలన, బీదవారికి ఆర్ధిక సహాయము, ప్రజల ఆరొగ్యరక్షణ, అర్ధరాత్రికూడా అందరికి రక్షకులుగా రక్షక భటుల వలయాలు ఒకవైపు, నాయకుల ఆస్తి కోట్లకు మారిని ఎక్కడనుంచి వచ్చింది అని అడగలేని ప్రభుత్వమువారి పరిస్తితి మరొవైపు.

తెలుగింటి ఆడపడుచులు, ప్రతిఒక్కరు కలసి జరుపుకొనే సంక్రాంతి పండుగ గురించి ఒకవైపు,   సంక్రాంతి పండుగకు కోడి పందెములు, ఎడ్ల పందెములు, నిషిద్దమని చెప్పి నాయకు రక్షక భటులు పందెములు కాయటం మరో వైపు,                                 

పూర్తిగా వ్యాక్యానాలతో చిత్రీ కరిమ్చిన ఫిలిమ్ను  ప్రతిఒక్కరు ఊపిరి బిగపట్టి ఏదో లోకములో విహరించినట్లు నిసబ్ధము చేదిమ్చుకొని ఒక్కసారి ధ్వనులు, చప్పట్లు వెలిసాయి ఆ ప్రాంగణములో అమ్దరూ మెచ్చుకున్నారు ప్రత్య్యుష తీసిన చిన్నసినమను.

తల్లి తండ్రులు మాత్రము ముభావముగా కూర్చొని ఉన్నారు అది గమనించింది ప్రత్యూ


అమ్మా ప్రత్యూష నీవు తీసిన ఫిలిం చాలా బాగుంది అన్దరూ చూపిమ్చె విధానమే కనిపించింది ప్రత్యేకత నాకు ఏమి కనిపించలేదు, ఫోటోగ్రాఫిక్లో  ఇంకా మార్పులు రావాలి అందుకనే నేను అమెరికానుండి ప్రెత్యెక విడియో కెమారాను ఖరీదైనా నీకొసమ్ తెప్పిస్తున్నాను దానిని ఉపయోగించి భారతదేశ ప్రగతి ప్రపంచ దేశాలు  గుర్తిమ్చెవిధముగా చిత్రాలు తీయాలని నా ఆకాంక్ష అంటూ ప్రోస్చహిమ్చాడు తండ్రి రామకృష్ణ.

తల్లికూడా కూతురు చేసిన  ఫిలిమ్ను చూసి సంతోషించి ఎప్పుడో నేను చదివిన కధ గుర్తుకొచ్చింది చేపుతావిను దానినిబట్టి నీ ఆలోచనలు నీ నిర్ణయాలు నీకె వదిలెస్తున్నాము ఎట్టి పరిస్తితులలో నిరుస్చాహ పడవద్దు ముందుంది అంతా మంచి కాలం అని గ్రహించు అంటూ కధా ప్రారమ్భిమ్చిమ్ది.

" లక్ష్మన్న పంతులు గారు రాజ్యమును ఏలుతున్నారు, రాజులు కాలము పోయి భ్రామ్మనులు ఏలే కాలము వచ్చింది. ప్రజలను కన్నబిడ్డలుగా, సకల కళలను అభివృద్ధి పరిచే విధముగా, బీద ప్రజలపై  పన్నులు విధిమ్చకుండా కేవలము ధనవమ్తులపై పన్నులు వేసి వేదము చదివిన పండితులను సన్మానిస్తూ ఉండేవాడు.

ఆ రాజ్య్యమునకు దేవుని భక్తుడు " స్వామీజి " ధర్మాలు ప్రభొదిస్తూ ప్రజలను సన్మార్గమున జీవనము స్వర్గముతో సమానమని సంతృప్తి జీవితము దేవునితో సమానమని చెప్పుతున్నాడు.

లక్ష్మన్న పంతులు మారు వేషమున  స్వామీజి ని కలసి పరాయి హక్కు లేకుండా ఎవరైనా ఉన్నారా అని అడిగాడు. వెంటనే లేకే ఉన్నారు ఈ ఊరు చివర ఒక ములమ్మ ఉన్నది కావాలంటే మీరు పరీక్షిమ్చ వచ్చు అనిచెప్పాడు " రాజు అని తెలిసి ".

ఆమె జొన్నలు పండించి, తిరగలితొ త్రిప్పి  పిండి చీసి, దారిన పోయే బాటసారులకు ఉచితముగా పెట్టి తగినంత నీరు అన్దిస్తూ జీవితము గడుపుతున్నది.

రాజు అవ్వదగ్గర పోయి నేను కాదు బీదవాన్ని ఆకలితొఉన్నాను అనగా నాయనా ఉండు నీకు రొట్టెలు పెడతాను తిని నీరు త్రాగి విశ్రాంతి తీసుకొని రెపువెల్లవఛు ఎన్తదూరము నుండి నడచి వచ్చావో అంటు లోపలకు వెళ్ళింది.

రొట్టెలు తీసుకొచ్చిన ముసలమ్మతో రాజు ఇది సుద్ధమైనదేనా? చెప్పు ఇందులో పరాయి హక్కు లేదుకదా ? అని అడిగాడు.

చూదు బాటసారి ఇది పూర్తిగా సుద్ధమైనది కాదు ఇందులో పరాయి  హక్కు వచ్చింది అది చెపుతాను విను " నేను రొట్టెలు చేస్తున్నపుడు పెళ్లి మెళము ఈ వీదిగా పోవటము జరిగింది ఆసమయాన నేను వెలిగించిన దీపపు గాలికి ఆరినది, అప్పుడే వచ్చ్చిన ఎల్లి ఊరెగిమ్పు గ్యాసు లైటుల వెలుగులో చేసాను ఇందులో ప్రై హక్కుగల వెలుతురు ద్వారా తయారు చేయడం జరిగింది ఇది తప్ప నా సంపాదనలో ఎటువంటి దోషము లేదు." ఈ మాత్రపు లోపం కూడా లేక చేయలేక పోయాను ఆకలితొఉన్న వాడికి ఆకలితీర్చాలని ,  అన్న మాటలకు ముసలమ్మ ధర్మభుద్ధిని మెచ్చుకున్నాడు. అమ్మా ఈ వయసులో కూడా  కష్టపడటం దేనికి అనగా ఓపికున్నంతవరకు నలుగురికి సహాయ పడాలి అదే నా మార్గం అన్నది.  


పర్వతము నుండి దావాలనము ఎగసి పడుతున్నది, చీకటిని తరిమి సూర్యొదయము కావడము, ప్రచండ భాను కిరణాలు ధియటర్ ల్లో అంతా వ్యాపించడం వాటి మద్య కధ, స్క్రీన్ ప్లెయ్, ఫోటో గ్రాఫిక్, సంగీతమ్  దర్సకత్వం,  "ప్రత్యూష " అని ఒక్క సారి అందరికి కనబడింది           

అది ఒక చీన్న పల్లెటూరు, సీతారామయ్య, జానకమ్మ  గారు పెద విద్యార్ధులకు" వేదం " భొధిమ్చుతున్నారు.
వీరికి లేక లేక ఒక మొగపిల్లావాడు జన్మించాడు. అతనికి చిరంజీవి అని పేరుపెట్టుకొని గారాబముగా పెంచుతున్నారు. 8 వ సంవమ్చరములొ ఉపనయనము చేసి వేదం నెర్పిమ్చుతున్నారు.

ఒకనాడు ప్రక్కగ్రామమునకు పోవలసి వచ్చినది ఎద్దులబండి మీద బయలు దేరారు ముగ్గురు. అంతలో మబ్బులు పట్టి, చిన్న చిన్న చినుకులు  మొదలు పెట్టి, గాలి వానగా మారింది. కూర్చున్న  ధియటర్ ల్లో ఒక్క సారిగా గాలి వచ్చినట్లు మీద వర్షం పడినట్లు భావం ఏర్పడినది.  ఎద్దుల మేడలో ఉన్న గంట చప్పుడులు, ఎద్దులు విడిపోయి చెల్లా చెదిరి  ధియటర్ లోపలి పై భాగాన పరిగెడుతున్నట్లు, అది అడవి మార్గము కావడమువల్ల చెట్ల కొమ్మలు విరిగి గాలిలో తేలినట్లు, క్రూర మ్రుగముల్లన్ని మీదకు వచ్చినట్లు బ్రమిమ్చె విధముగా 3 D ఎఫెక్ట్స్ వచ్చిన వారి నందరిని ఆశ్చర్యములో ముంచి వేసింది.

గాలివాన వెలిసింది,  కొమ్మలు విరిగి చెట్లు చెదిరి ఉన్నాయి,  పక్షులు చెట్ల కొమ్మలనుండి బయటకు వచ్చి ప్రాణులన్నీ స్వెస్చా వాయువులు తీసుకోవటానికి బయటకు వచ్చాయి,  చిరంజీవి భయము లేకుండా కొమ్మను పట్టుకొని కదలక ఉండటం వళ్ళ  ఎలుగు బంటు తను యదా విదిగా  క్రిందకు దిగింది. చిరంజీవి కూడా దిగి తల్లి తండ్రుల కొరకు వెతుకుట ప్రారంభించాడు. నెమ్మదిగా నడుస్తున్నాడు ప్రక్కనుండి  సింహము భీకర శబ్దము చేస్తూ ఉన్నది. ఆ  శబ్దము అంతా   ధియటర్లో ప్రతిద్వనిస్తుమ్ది,  ఆన్దరూ సినమాను ఆశ్చర్యముగా గుండెను చేతిలో పట్టుకొని చూస్తున్నారు. ఆ శబ్దము భాదతో మూలుగుతున్నట్లు వినబడింది చిరంజీవికి. ఎంత ప్రయత్నమూ చేసినా పైకి రాలేక పోయింది,  "మృగ రాజు ఐన కస్టాలు తప్పలేదు".

నాలుగు వైపులా చూసాడు "అడవిలో ఏనుగులు పట్టేందుకు ఏర్పాటు చేసిన కందకములో సింహము పడింది " అది గమనించాడు ఎట్లా బయటకు తీయాలి అని ఆలోచించాడు.

వెంటనే ఆచరణ పెట్టేడు. దగ్గరున్న విరిగిన కొమ్మలను దగ్గరగా పెట్టేడు, వాటిని చెట్ల తీగలద్వారా కట్టాడు, దానిని కన్దకము వడ్డు దాక తెచ్చాడు,  కందకము వద్ద ఉన్న చట్టుకు చెట్ల తీగలద్వారా వ్రేలాడ దీయుటకు రెన్దవకొనను పట్టుకొని చెట్టుపైకి ఎక్కి కూర్చొని నెమ్మదిగా వాటముగా కన్దకములొకి జార విడిచాడు. ఒక్కసారిగా తడిసిన కొమ్మల బరువుతో కట్టిన కొమ్మల వరుస లోపలకు జారింది.

అంతే ఒక్కసారి కట్టిన కొమ్మల పైకి ఎగిరి నెమ్మదిగా పైకి రాగలగిన్ది " సింహం ", అదే సమయాన ధైర్యముగా చెట్టును దిగి చిరంజీవి కుడా క్రిందకు వచ్చాడు,  ఆ సమయాన మ్యుజికే అద్బుతముగా ఉండటమువల్ల  ప్రతిఒక్కరి గుండె వేగము పెరగటం జరిగింది చిరంజీవిని ఎంచెస్తుమ్దా అని ఎదురుచూస్తున్నారు  " సింహం " ఒక్క అరుపుతో పైకి దూకిన్ది "  ఆ అరుపు ధియటర్ లో ఉన్న వారిమీదకు దూకినట్లుంది " అంతే కెవ్వు మనికెక వినపడింది," అదికేవలము మ్యూజిక్  రికార్డు మాత్రమె " .

ఒక్కసారిగా ఊపిరితీసుకున్నారు అందరు నెమ్మదిగా నడుస్తూ బయలు దేరాడు చిరంజీవి
ఒక్కసారి పక్షుల కిలకిల రావములతొ ధియటర్ మెత్తము అంతా ఆవరించింది అద్బుతమైన సంగీతము  వినబడుతుంది.

కొండలు  నడుమ జాలువారు నది  కనబడుతున్నది, ఆ నది ఒడ్డున చేరారు తల్లితండ్రులు పిల్లవనికొసమ్, వెతుకు తున్నారు. దూరము నుండి తల్లి తండ్రులను చూసడు చిరంజీవి .

చెట్ల మాటు నుండి చిరుతపులి తల్లి తండ్రుల పై దూక బోఇంది,  పెద్దాగా ఆగు ఆగు అంటూ అక్కడ పడి ఉన్న పెద్ద కట్టెను తీసుకొని పులిపై ఉరికాడు, పులి వెంటనే చిరంజీవిపై ఎగిరింది, తల్లి తండ్రుల గజగజ వణుకుతున్నారు భయకంపితులై చూస్తున్నారు.                               

ఇంతలో ఒక మహా సింహం భయంకరంగా గర్జించింది, ఆగర్జనకు చిరుతపులి తొకముదుచుకొని అక్కడనుండి పారి పోయింది. చిరంజీవి ముందు తొకాడిస్తూ నిలబడింది.
  
సింహం వంటి భయంకరమైన మృగం కూడా  ఉపకారము చేసిన వారని మరువలేదు.        

ఒక ఏనుగు పిల్ల వచ్చి వీరి ముందు ఆగింది,  ఏనుగు పైకి ఎక్కి కదలటంతో  "శుభం " కార్డు పడింది.
  "జైహింద్ "  అంటూ జనగణమన పాట మెదలైంది అన్దరూ లేచి నుంచొని భారతమాతకు ఒక్కసారి వందనములు అర్పించారు .
     చిత్రమును చూసిన  తల్లి తండ్రులకు కళ్ళ వెంట జాలువారాయి ఆనంద భాష్పాలు                                       
 
                                              

.

1 కామెంట్‌: