4, జనవరి 2014, శనివారం

101. Love Story-5 (సంక్రాంతి పండగ)

                                                       


సావిత్రి నామాటలో ఉన్న అర్ధంను అర్ధం చేసుకోవాలి
మా అమ్మకు అనా రోగ్యముగా ఉందిట ఇక్కడకు తెచ్చి  చూపిమ్చాలి
మా తమ్ముడు జీతమ్ తక్కువ నేనే ఈ పని చేయాలి
నా కర్తవ్యావే నికి నీ వంతు కూడ సహకరించి సేవచేయాలి. 

అత్తగారి ఆరోగ్యం గురించి చూపిస్తానంటే నేనొద్దంటానా
కాని ఆసుపత్రికి పోవాలి అని అంటే కుదర దంటున్నా
తోడుగా ఒక పని పనిమనిషిని పెట్టుకుందామని అంటున్నా డబ్బు ఖర్చు అవుతుంది అని పదే పదే అనవద్దంటున్నా. 

మానాన్న నన్నే ఎక్కువ చదివించారు, మీరే ఆదుకో వాలన్నారు. ఒకరికి సహాయం చేస్తే మనల్ని ఆపదలో ఆదుకుంటుం దనేవారు. ఈ వయసులో కూడ తన వంతు కష్ట పడుతూనే ఉంటున్నారు. అమ్మ నాన్నలు కలసి వస్తారు ఇక్కడ ఎక్కువ రోజు లుండరు. 

మా నాన్నగారు ఎంతో కొంత పైకము వద్దన్న నాకిస్తారు
వాళ్లకు అయ్యే మందులు కర్చు వాళ్ళే పెట్టు కుంటారు
నిన్ను ఇబ్బంది పెట్టి వేదించే వారు మాత్రము కారు
నీవు ఏది వండితే అది తిని సంతృప్తి  పడే వారు

మీ రంతగా  పదే పదే నాకు చెప్పా నక్కరలేదు
సేవ చేయ్యలేదని సతోష పెట్టలేదని  అనవలదు  
పిల్లలు హైస్కూలుకు వచ్చారు వారి చదివించాలి
మీకు తెలుసు నా ఆరోగ్యము అంతగా బాగుండటం లేదు

కాలాన్ని మార్చలేను, వచ్చిన వారిబట్టి మారటానికి ప్రయత్నించు. 
పెద్దల్ని మార్చలేను,  నీవు సంతోషంగా ఉండటానికి ప్రయత్నించు. 
నావంతు నేను చేస్తాను నీవంతు సేవలు చేయటానికి ప్రయత్నించు.
పెద్దలకు చేసే సేవ అదృష్టం జన్మ జన్మ ల భంధం అని భావించు. 

నేను అమ్మా నాన్నలను తేవటానికి స్టేషన్కు వెళ్తున్నా
నీవు కూడా అంత సర్ది శుబ్రంగా ఉండా  లంటున్నా  
పిల్లకు కూడా మంచి దుస్తులు వేసి రడీగా ఉండా లంటున్నా
అవసరమైతే అందరం కలసి హాస్పటల్కు పోయే అవకాశముంది

కాలాన్ని ఎదురీది వేల్లగల వారవ్వారు లేరు
మమతలు పంచు కుంటు తిరుగుట వేరు
ప్రతి విషయములో సర్దుకు పోవడం వేరు
దంపతులన్నాక సుఖ దుఖాలు పంచుకోవటం తప్పదు
 
ఉండండి పిల్లలు వచ్చే లోపు నేను కూడా మీతోపాటు స్టేషన్ కు వస్తా అని బయలు దేరారు ఇద్దరు

పిల్లలు వచ్చి తాళాలు తీసి ఇంట్లో కూర్చున్నారు
సంక్రాంతి పండగ గురించి వ్యాసం రాయలనుకుమ్తున్నారు
ఎవరు చేపతారా అంటు సీత గీత కూర్చున్నారు
ఆటలో బామ్మ తాతయ్య రావడంతో కొండంత సంతోషం వచ్చింది వారికి

అమ్మానాన్నలు మీకొసమె స్టేషన్కు వెళ్ళారు
తాతగారు బాగున్నారా అంటు సీత గీత అడుగుతున్నారు
పిల్లలను చూసి అప్పుడె పెద్ద వారయ్యారే అన్నారు
తాతగారు టిఫిన్ కాఫీ తీసుకోండి అమ్మ చేసి వెళ్ళింది

అమ్మ నాన్న వాళ్ళు వచ్చే లోపు సంక్రాంతి గురించి చెపుతారా .
మీరు సంతోషముగా అడుగుతుంటే చెప్తాను పాపలు కూర్చోండి.   


సంక్రాంతి ఆంద్రుల అతి పెద్ద పండుగ రోజు !
శ్రీ మహావిష్ణువు అసురలను మంధరపర్వతం క్రింద మట్టుపెట్టిన  రోజు !
భగిరధుడు శివుని ప్రార్ధించి  గంగను భూమిపై ప్రవహింప చేసినరోజు  !
కాలము విలువ తెలిసుకొని ప్రతిఒక్కరు జీవితము సుఖమయం చేసికొనేరోజు !

చిక్కని చీకటిలో, వెలుగు చిమ్మే వెన్నలలో గజ గజ వణికించే చలి !

వాకిళ్ళు సుబ్రముచేసి ఆవు పేడతో కల్లాపు చల్లె తెలుగింట ముంగిలి !
కుటుంబ సభ్యులు అందరు కలసి ముగ్గులు పెట్టి సంతోషపు లోగిలి !
సూర్యోదయం కాకమునుపే స్త్రీలు ఓపికతో శ్రద్ధగా వేసే ముగ్గుల కూడలి !

సింధు లోయలలోని శిధిలాల్లో, హరప్పాలో, మెలిక ముగ్గుల చిత్రాలు !

తమిళనాడులోని పసుపతీశ్వరాలయ శిల్పాలపై ముగ్గుల చిత్రాలు !
తమిళనాడులోని ఔషధీశ్వరాలయలో  మూడు త్రిభుజాలలో మెలిక ముగ్గులు !
ఆముక్తమాల్యద, విజయ విలాసం, మరియు అనేక గ్రంధాలలో ముగ్గుల వివరణలు !    


ముగ్గులమధ్య  ఉంచుతారు పసుప,కుంకుమ అద్దిన గొబ్బెమ్మలు !
నాలుగు  గొబ్బెమ్మల మధ్య ఒక పెద్ద గొబ్బెమ్మ ఉంచి పూల అలంకరణలు !
హరి కీర్తనలు చేస్తున్న హరిదాసుకు తలపై ఉన్న పాత్రలో పోస్తారు ధాన్యపు గింజలు !
గంగిరెద్దు సహిత శంకర పరివారంకు ఇస్తారు వస్త్రాలు, ధాన్యపు గింజలు, పైసలు !

గగనసేమలో పగటిపూట నక్షత్రాల వలె ఎగరవేస్తారు గాలిపటాలు !

సంబరముగా అల్లుడు అత్తగారింటికి వచ్చి మరదల్లతో ఎకసక్కాలు !
ఊరు అంతా ఒకచోటచేరి కాస్తారు కోడిపందేములు,ఎడ్ల బండి పందెములు !
రైతులు చెమటోట్చి పండించిన ధాన్య్యమును కొందరు చేస్తారు దానములు !

ఇంట్లో ఉన్న పాత టేకు వస్తువులను ఒక చోట చేర్చి వేస్తారు భోగిమంటలు !

ధనుర్మాసమున రొజూ తెల్లవారుజామున భక్తులు చేస్తారు  నగర కీర్తనలు !
భోగిసాయంత్రమున, ముత్తైదువులను పిలిచి బొమ్మలకోలువుకు పారంటములు !
రేగిపళ్ళు,సనగలు,పూలు,పైసలు కలసిన వాటిని పిల్లలపై  కుమ్మరించి ద్రిష్టి తీస్తారు ! 


సంక్రాంతి రోజున పాలుపొంగించి దానితో తయ్యారు చేస్తారు తీపిపదార్ధాలు !
కబుర్లతో అరెసలు,బొబ్బట్లు,పులిహొర,పొంగలి చేస్తారు పిండి వంటకాలు !
సంక్రాంతి నాడు పితృ దేవతలకు వదులుతారు తర్పణాలు, చేస్తారు దాణాలు !
సంక్రాంతి నాడు వైష్ణవ భక్తులు ధనుర్మ్సవ్రతమును ఆచరించి గోదా కళ్యాణం చేస్తారు !

సూర్యుడు తనకుమారుని శని ఇంటికి వెళతాడని చెపుతున్నాయి పురాణాలు !

ఉత్తరాయనమునందు మరణించినవారు పుణ్యలోకాలకు పోతారని నమ్మకాలు !
భారతీయ సాంప్రదాయము ప్రకారం చాంద్రమానాన్ని  నను సరించి వస్థాయి పండుగలు !
ఆది శంకరా చార్యులు సన్యా సము పుచ్చుకొన్నది  సంక్రాంతి పర్వదినము నాడు !  


మామయ్య్యగారు ఆత్తయ్యగారు ఎట్లా వచ్చారు మీరు
హాస్పటల్ లో చూపిమ్చుకొని మందులు తీసుకొని వచ్చాము
నీన్ను పిల్లలను చూసి పోదామను కుంటున్నాము
సంక్రాంతి పండగ ఐనతర్వాత పోదామను కుంటున్నాము. 

ఒక్క మాట చెపితే మేమే హాస్పటల్కు వచ్చే వాళ్లము కదా
మీ అబ్బాయి నేను మీగురిమ్చి ఆలోచిస్తున్నాము కదా
మీకు సేవలు చేసి తరిమ్చటమె  మాకు విధి ధర్మం
ఇప్పుడె పిల్లలు సంక్రాంతి గురించి అడిగితె తెలిసినవి చెప్పాము

చూడమ్మాయి జరిగిపొఇన దాని గురిమ్చి అలూచిమ్చకు 
ప్రతిపని మనమంచికి జరిగిందని భావించి జరుగు ముందుకు
కాలమే సత్యం,  ధనం,   ప్రాణం,   అని ఎప్పటికి మరువకు
మావగారు నేను తప్పుగా మాట్లాడితే 
క్షెమించండి.    


పెద్దవాడిగా చెపుతున్నా మీకు పిల్లలకు బట్టలు తెచ్చాము
మా అమ్మాయిని అల్లుడ్ని  కూడా ఇక్కడకు రమ్మన్నాము 
మీరెమి కొనవద్దు  వారికి బట్టలు మేమే తీసుకొచ్చాము 
సరదాగా పండగ మూడు రోజులు గడుపుదామను కుంటున్నాము.

నాన్న నేను పెట్టాల్సింది పోయి మీరు కొనుక్కు రావడమేమిటి
పెద్దవాళ్ళగా మేము చెపుతున్నాము ఈ సంక్రాంతికి వప్పుకోండి    
మీ ఆరోగ్యాన్ని కూడా లెక్కపెట్టకుండా ఇంత ఖర్చు ఎందుకు అని
అందరూ సుఖముగా ఉంటే లోకమంతా సుఖముగా ఉంటుంది

జీవితమనేది  ఈశ్వర ప్రసాదముగా స్వీకరించాలి
హనుమంతుని ఆరాధిస్తూ ధైర్యముగా బ్రతకాలి
జీవితము ఆటవంటిది గెలుపు ఒటమి భరించాలి
జీవిత లక్ష్యాన్ని అందుకోవటానికి ప్రయత్నించాలి

జీవితమ్ అందమైనది పువ్వులా వికసిస్తూ ఉండాలి
జీవితమ్ ఒక స్నేహ సాగారం, స్నేహం సాగించాలి
జీవితమ్ ఒక ప్రతిజ్ఞ ఎప్పుడు నిలబెట్టుకుంటుఉండాలి
జీవితమ్ ఒక యుద్ధం గెలవటానికి ప్రయత్నించాలి


మావయ్యగారు అత్తయ్యగారు కాస్త విశ్రాంతి తీసుకొండి
అన్నయ్యగారు కూడా వస్తారుగదా అమ్దరూ సరదాగా ఉందాం
పిల్లలు వారిని వేదిమ్చక మీ స్కూళ్ళు పని ఉంటే చక చక చేసుకోండి
పండుగకు అందరూ వచ్చారు సంతోషంతో ఇల్లంతా సందడి

ఈ మూడు రోజుల ఖర్చు మేమే భరించాలని అనుకున్నాం   
మీ ఇద్దరి అమ్మాయిల పెరుమీద, నాకూతురు బిడ్డ పెరు మీద
ఫిక్సుడు బాండ్ తెచ్చాము వారికి సంక్రాంతినాడు ఇస్తున్నాము 
ప్రతిపమ్డుగకు అందరు కలసి మెలసి ఉండాలనేది మా ఆకాంక్ష

పిమ్దివంటలు చేస్తూ, ఇల్లు అలమ్కరిస్తూ కొత్త బట్టలు వేసుకొని
అమ్దరూ చేస్తున్నారు సందడే సందడే
ప్రతిఒక్కరికి నూతన సంవత్చర, సంక్రాంతి సుభా కాంక్షలు
ఇందు మూలముగా తెలియ పరుస్తున్నాను

సంతోషమే సగముబలం అన్నారు   

జీవమ్ ఒక్కటే జీవితమ్  వేరు
రూపమ్ ఒక్కటే గుణం వేరు
కాలం ఒక్కటే గమ్యం   వేరు
పండుగ ఒక్కటే పద్ధతులే వేరు 

                                                    


 

........................................................................................................................................................................
.........................................................................................................................................................................

2 కామెంట్‌లు: