మనం హోలీ పండుగ వారికి కూడా వెన్నెల పండుగగా ఒక ప్రత్యేకతముగా జరుపుకుంటారు. అదే రోజు కొత్త జంటలకు వివాహము చేస్తారు. ప్రేమించినవారికి పొటీలు పెడతారు. ఇదే రోజు వంటి నిండా నూనె వ్రాసుకొని కుస్తీ పోటీలు, ఆడవారికి పూసలతొ అలంకరణ పోటీలు, రంగులు చల్లుకుంటూ సరద సరదాగా ఉంటారు.
హోలీ రోజున " అడవి పెద్ద" కూతురు మల్లి ని మబ్బుకు ఇచ్చి పెద్దల సమక్షమున తప్పెట్ల వాయిద్యముల మద్య వివాహము చేసినారు.
అడవిని వదలి గ్రామములో బ్రతకమని అడవి దినుసులు, ముంత నీరు ఇచ్చి అమ్దరూ సాగనంపారు అడవినుండి త్వరలో తిరిగి రమ్మని ఆశీర్వదిమ్చారు. ఇట్లు చేయుట ముఖ్య కారణము ఇక్కడనుండి పోయి న వారు ఎంతో కొంత విద్యనేర్చుకొని వస్తారని వారి నమ్మకము.
అందరికి దండములు పెట్టి " మబ్బు మల్లిక " నగరమునకు బయలుదేరారు. నడుస్తున్నకొద్ది వారికి గ్రామములనేవి కనబడుటలేదు. వారు దారిలో సొమ్మ సిల్లి పడి పోయిన వ్యక్తిని చూసారు. వారికీ తమవద్ద ఉన్న నీటిని త్రాగించి. తమవద్ద ఉన్న దుంపలు పెట్టారు.
అవి తిని ఓపికతో మీరు అడవిలో ఉండే వారు కదా, నేను మీకు తెలియక పోవచ్చు. మీ నాన్నగారు నాకు బాగా తెలుసు నేను పెద్ద వాడ్ని అయ్యాను నాకు ఓపిక తగ్గింది. మనం ఉండే అడవికి పోతున్నాను. నాకు మీరు చేసిన సహాయము మిమ్ము రక్షిమ్చుతుమ్ది అని దీవిమ్చాడు.
నా దగ్గర ఉన్న పూసలు, రుద్రాక్షలు, శంఖాలు, జంతువుల కొమ్ములు, చర్మాలు, అన్ని మీకిస్తున్నాను. వీటి ని అమ్ముకొని జీవితము గడపండి. నా అంతిమ శేష జీవితము అడవిలో గడుపుదామను కుంటున్నాను .
ఇక్కడకు కొంత దూరములొ ఒక పెద్ద రోడ్డు వస్తుంది. అక్కడ కు ఒక పెద్ద బస్సు వస్తుంది. మీరు ఈ ఎర్ర గుడ్డ చూపి వారిని బ్రతిమాలి ఎక్కండి తర్వాత మీ భవిషత్ మీరె నిర్ణ ఇంచు కోండి. ఇదిగో ఈ డబ్బులు మీ దగ్గర ఉమ్చు కోండి అని చేతికి ఇచ్చి వెనుతిరిగాడు పెద్ద మనిషి. అంతలో బస్సు రావటం దానిలో ఎక్కడం జరిగి పోయింది.
అంతలో బస్సులో ఏదో పోయిందని వెదుకుతున్నారు. అది ఒక ఉంగరం అది మల్లిక కాలి వద్దకు పడింది. అది ఎవరిదా అని అడిగుతున్నది అప్పుడే, అప్పుడే ఒక పెద్దావిడ వచ్చి ఇది నాది నాకిచ్చేయమని అడిగింది. మీకివ్వ టానికే మిమ్ము పిలిచింది. అన్నది మల్లిక. ఆ బస్సులోనే ఒక మూల ఇద్దరు క్రింద కూర్చొని ఉన్నారు. బస్సు లో టికెట్టు ఎక్కడకు అన్నప్పుడు పెద్దావిడ చెప్పినవూరు చెప్పింది మల్లికా. తనవద్ద ఉన్న బంగారు కాసులు ఇచ్చింది. కండక్టర్ తీసుకొని వెళ్లి పోయాడు.
మల్లి క బస్సు బయలు దేరుతున్నాప్పుడు నిద్రపట్టక అట్లాగే కూర్చొని ఉన్నది. అంతలో తనకి ఏదో వాసన వచ్చిన నట్లు గమనించింది. వెంటనే బస్సు పోతున్నప్పుడు పెద్దావిడ సీటు ప్రక్క పెద్ద "తేలు " ప్రాకటం చూసిమ్ది. వెంటనే క్రింద ఉన్న చెప్పుతో దాన్ని చంపటం జరిగింది. పెద్దావిడ మేలుకుంది. నన్ను రక్షిమ్చావు. నీవు దానిని చంపకపోతే నాకే ఎంతో భాద పడాల్సి వచ్చేది.
ఇమ్తకీ మీరెక్కడనుమ్చి వచ్చారు ఎక్కడకు పోతున్నారు, మీరిద్దరు ప్రేమించి పెళ్లి చేసుకున్నారా, అది చాలా పెద్ద కధ అమ్మగారు. మరి నాకు చెప్పవే నేను వింటాను ఇటురా ఇక్కడ కూర్చొని చెప్పు అన్నది పెద్దావిడ.
అమ్మగారు మేము పెరగిన అడవితల్లిని వదిలి, మమ్ము ముద్దుగా పెంచిన తల్లి తండ్రులను వదిలి, మాకు ధైర్యము నేర్పిన గురువుగారిని వదిలి, స్నేహితులను, మిత్రులను వదిలి మా ఆచారము ప్రకారము పెళ్లి ఐన తర్వాత బయట ప్రపంచమును చూడాలి అనేది మా ఆడవి పెద్దల నిర్ణయం దాని ప్రకారము మేము వచ్చాము అమ్మగారు.
అది సరే మీ ఇద్దరిలో ప్రేమ ఎట్లా మెదలైనది, అది వివరముగా చెప్పు అని అడిగింది పెద్దమ్మ మల్లిని.
ముసి ముసి నవ్వులతో మీరడుగు తుంటే నాకు సిగ్గే స్తుంది అమ్మగారు. నీ సిగ్గు ఇప్పుడు ఎవరు బయటకు చెప్పరులే జరిగింది చెప్పు.
మా పాక ఎదురు మరోపాక ఉండేది. ఆ పాకలో మబ్బు అనే వాడు ఉండేవాడు. అతడు ఎవరు ఏది చెప్పిన పని చేసి పెట్టేవాడు. నన్ను ఎప్పుడూ అదేపనిగా చూస్తు ఉండేవాడు.
అతని చూపులో నాకు ఏదో ఆకర్షణ కనిపించింది. అంతే ఒక్క సారి "మబ్బును" చూసా ఒక వెలుగు కిరణం నా వళ్ళు చేరింది. నాలో ఏదో తెలియని తాపము పెరిగింది. మనసులో ఏదో కావాలని యద రోదచేయటం మొదల పెట్టింది. అపుడే మా అమ్మ స్నానము చేయి అసలే మనది తడికల ఇల్లు ఎవరి కళ్ళు పడ్డ కష్టం. త్వరపడు అన్నమాటలకు మల్లి సరే అన్నది.
మబ్బు మాత్రము తడికలపై ఉన్న బట్టలు చూసి ఎప్పు డోస్తుందా అని ఎదురు చేసేవాడు. అంటే నేను కూడా ఉడికించటానికి కట్టి కట్ట నట్లుగా, బట్ట కట్టి ఉడికించే దానిని. అంతే ఉండ బట్టలేక మబ్బు దగ్గరకొచ్చి నేను నిన్ను ప్రేమిస్తున్నాను అన్నాడు.
అప్పటి దాక నాకు ప్రేమ అనేది ఏమిటో తెలియదు. మబ్బు చెప్పిన తర్వాత నా వళ్ళు జలద రిమ్చిమ్ది . అంతే లోపలి పరుగెత్తాను నేను " అది నా మొదటి అనుభవము".
ఒక నాడు మబ్బును కమ్మేసింది మేఘం. ఎంత ప్రయత్నిమ్చిన వెలుగును చూడలేక పోయినాను. మేఘము ఎప్పుడు పోతుందా నా యి కళ్ళు కాయలు కాసేదాక కూర్చొని అదే పనిగా మబ్బును చూస్తూ కూర్చున్నాను. అంతలో నాకు కళ్ళంబడి నీలు తిరిగాయి, అప్పుడే తలమీద చినుకు పడింది. కిరణము రాలేదు కాని చినుకులతో వొళ్ళంతా తడిసి పోయింది. నాలోని అందాలు పురివిప్పిన నెమలి లాగా, విచ్చు కున్న పుష్పం లాగా మారింది.
ఇంట్లో ఉండు బయట తడవకు మల్లి, మబ్బు వస్తాడు. కిరణం తో వస్తాడు. మేఘం కురిసి వెళ్లి పోతుంది ఇది ఎప్పుడు జరిగే విషయం . ముందు లోపలకు వచ్చి వళ్ళు వెచ్చ చేసుకో అని గట్టిగా అరిచింది. అంతే లోపలకేల్లి వంటి మీద బట్టలు విప్పి మంట దగ్గర కాచు కుంటున్నాను. ఏమిటే చీన్న పిల్లలాగ బట్టలు లేకుండా కూర్చున్నావు ముందు బట్టలు కట్టుకో అని అన్నమాటలకు ఉలిక్కి పడింది మల్లి. ఒక్క సారిగా నాలో చిన్నప్పుడు పక్షులవద్ద జిమ్కల వద్ద అడుకున్నది గుర్తుకొచ్చింది నాకు.
ఒక నాడు మా ఇంట్లో పెద్దలు ఎవ్వరు లేరు, అది అదును చూసుకొని లోపలకు వచ్చాడు మబ్బు. నన్ను బయటకు రమ్మన్నాడు. పువ్వులు తెచ్చాను నీకు ఇస్తానన్నాడు. పడ్లు తెచ్చాను నీకు ఇస్తానన్నాడు. భయముతో మా ఇంటి దగ్గర చెట్టు కాడకైతే వస్తానని చెప్పి అతనితో ముందుకు నడిచాను.
చెట్టు చాటుకుకు పోగానే అమాంతముగా తన బాహు భందాలలో ఇరికించి నా పెదాలు ఒక్కసారి ముద్దాడి నా వళ్ళంతా నిమిరాడు. అంతే నాలో తెలియని భయము ఏర్పడి ఒక్కసారి మబ్బును తోసి ముందుకు జరిగా అంతే నా పయట జారి నా అందాలు అతని కంట పడ్డాయి, మబ్బు చేతికి చిక్కకుండా లోపలకు పరు గెత్తాను "నా రెండవ అనుభవము". నన్ను పట్టుకోలేక క్రింద పడ్డాడు నా మబ్బు. ఎవ్వరో వస్తున్నట్లు గమనించి చల్లగా తప్పుకున్నాడు నా మబ్బు.
ఆ రోజునుంచి నాకు నిద్ర రావాటములేదు, మరోసారి మబ్బును కలవాలని ఒకటే కోరిక నన్ను వేమ్బ డించింది మబ్బు ఆన్న మాటలు గుర్తుకు తెచ్చుకున్నాను " నా మనసు నీది, నీ మనసు నాది, నన్ను నీ ప్రేమలో ముమ్చెయి, నీ మాటలను ఎప్పుడు జవదాటను నాకు నీవు, నీకు నేనుగా జీవిద్దాము అన్న మాటలు గుర్తుకొ చ్చి నవ్వుకుంది మల్లి
ఒక్క సారి బస్సు శబ్దం చేస్తూ ఆగింది అమ్దరూ గబా గబా దిగారు. మబ్బు , మల్లి, పెద్దమ్మ, కూడా దిగారు. ఎందుకు ఆపారు అని అడిగితె ఇక్కడ దగ్గరలో పెద్ద చెరువు ఉంది. అక్కడకు అడవి నుండి ఏనుగుల మంద వస్తున్నాయి. అవి మన బస్సును చూసాయను కుంటే మొత్తం బస్సుపై కి వస్తాయి అందుకే ముందు జాగార్తకు ఇక్కడ ఆపాము అన్నారు బస్సు నడిపేవారు.
ప్రక్కనే చిన్న చిన్న టెంటులు వేసి అక్కడ పడక కుర్చీలు వేసి విశ్రాంతికి ఏర్పాటు చేసారు. అమ్దరూ విశ్రాంతి తీసు కుంటున్నారు. అంతలో పెద్దమ్మ మీ ప్రేమ విషయం ఇంట్లో వాల్లకు తెలిసిందా లేదా అని అడిగింది
అందుకే ఒకనాడు మానాన్న లేని సమయాన మా అమ్మ వద్దకు నేను మబ్బు కలసి పోయి మేమిద్దరం పెళ్లి చెసు కుందా మను కుంటున్నాము అన్నాము మా అమ్మతో.
మీరు తొందర పడకండి మీనాన్నతొ మాట్లాడి మీకు పెళ్లి మేమే చేస్తాము అన్నది మా అమ్మ .
అంతలో తండ్రి ఇంట్లోకి వస్తూనె మన అమ్మాయికి మంచి సంభంధం చూసాను , అబ్బాయి చాలా మంచివాడు. అబ్బాయి పేరు మేఘం బాగుంది కదూ పేరు అని భార్యతో చెప్పాడు.
భార్య మల్లి ప్రేమ విషయం చెప్పింది మొగుడుతో అప్పుడు అగ్గిమీద గుగ్గిలం అయ్యాడు "ప్రేమ లేదు దోమలేదు నేను చూసిన వాడ్ని పెళ్లి చేసుకోవాలి అన్నాడు.
మా అల్లి తండ్రులు కాసేపు ఘర్షణ పడి చివరకు మా కుల ఆచారము ప్రకారము "ఓ అమ్మాయిని ఇద్దరు పెళ్లి చేసుకుంటామని వస్తే వాళ్లకు పరీక్షలు పెడతారు " అట్లాగే మీరు కూడా మీ అమ్మాయి కోసం పెట్టండని భార్య సలహా ఇచ్చింది.
అమ్మ మాటలకు నాన్న శాంత పడి అట్లాగే " మేఘం, మబ్బు " తల్లి తండ్రులకు ఈ విషయం చెప్పి వస్తాను వారికి ఇష్ట మైతే నాకు ఎందుకు అబ్యంతరము అన్నాడు.
కులపెద్దలను పిలిపించి అన్ని విషయాలు చెప్పి ఇద్దరి ఇష్టాలను దృష్టిలో పెట్టు కొని మూడు పరిక్షలు పెట్ట దలిచారు.
మొదటి ప్రశ్న: దూరముగా ఉన్న భగవాన్ కొండ పైన రకరకాల చీరలు వ్రేలాడి ఉంటాయి. వాటిలో మల్లి కకు ఇష్టమైనది, కట్టుకున్నది, ఉంటుంది. అది తెచ్చినవారు విజయము పొందినట్లు. ఆక్కడ రెండు పలుగులున్నాఇ వాటినిచేరోకటి తీసుకొని కొండపైకి పోయి అక్కడ పాతి చీర ముందుగా తేవాలి అన్నారు
మేఘం మబ్బు ఈ పరీక్షకు సిద్ధం అయ్యారు. అక్కడ ఉన్న పిల్లలు పెద్దలు అమ్దరూ అక్కడకు చేరారు. వెంటనే తొందరగా తిరిగిరావాలని పలుగు పట్టు కున్నాడు మీఘం అది చేతిని కాల్చింది. ఎందు కంటే అది కొలిమిలో కాల్చిన కడ్డి. కాని ఆప్పుడే మబ్బు చేతిలో ఇసుక మన్ను పెట్టుకొని మరీ పట్టుకొని పరుగెత్తడం మొదలుపెట్టాడు. మేఘం మబ్బు ఇరువురు వేగాలు పెంచి ముందుకు పోవటం జరుగుతున్నది. పైదాకా ఇద్దరు ముందే వెళ్లారు ఎచీర తీసుకురావాలని మేఘం ఆలోచిస్తూ ఉన్నాడు.
అప్పుడే మబ్బు ఒక చీరను తీసుకొని వెనుతిరిగాడు.
మల్లి మనసులో అనుకుంటుంది. మబ్బు నా చీర గుర్తు పడతాడా లేదా అని ఆలోచిస్తుంది. అప్పుడే గుర్తుకొచ్చింది సరస్సులో జరిగిన సంఘటన.
ఒకనాడు మల్లి, చేమంతి. గులాబి, కొందరు ఆడవాల్లు సరస్సుకు కుండలతో నీరు తేవటానికి వెళ్ళారు. ఏదో మాటల్లో ఉండగా గులాబి కుండ నీటిలో గాలికి దోర్లు కుంటు పడి పోయింది. అంటే అమ్దరూ కలసి అది పట్టు కోటానికి నీటిలోకి దిగారు. పట్టుకోటాని ఈదుతున్నారు. కాని కుండ చిక్కలేదు. అక్కడకోస్తున్న మబ్బు చూసాడు ఆడవారు మీరు కష్ట పడవద్దు . మీరమ్దరు ఇక్కడే ఉండండి నేను వెళ్లి కుండ తెస్తాను అన్నాడు.
నీటిలోకి దూకి ఈదు కుంటు చివరకు కుండ తెచ్చి గులాబికి ఇచ్చాడు. మబ్బు అప్పుడే చాలా సమయము అగుటవల్ల మల్లి తప్ప అమ్దరూ వేగంగా వెళ్లి పోయారు. మల్లి మాత్రము మబ్బు కండల శరీరము ను చూస్తు దగ్గరకు తడిచిన చీరతొ ముందుకు వచ్చి అమాంతము మబ్బును చేతులతో భందించి ఒక్క తోపు నీల్లలొకి తోసి నేను వెళ్ళొస్తా అంటు ఒకటే పరుగో పరుగు. పగటి కల చెదిరింది
ఇద్దరు ఒక్కసారే రావటం, ఇరువురు చెరో రంగు చీర తావడం జరిగింది అమ్దరూ ఎవరు గెలిచారో చెప్పండి అని అరవడం క్షణంలో జరిగింది.
అప్పుడు పెద్దలు మూడు పరిక్షలు ఐనతర్వత మీకు తెలియపరుస్తాము అన్నారు.
రెండవ పరిక్ష : అక్కడ రెండు సుత్తులు ఉన్నాయి వాటిలో చెరోకటి తీసుకొని అక్కడ కనిపిమ్చు చున్న పెద్ద బండలు వద్దకు పొయి మీరు వానిని పగలగొట్టాలి. ప్రక్కన ఉన్న ఇసుక బొమ్మలు ఏమి చెదర కూడదు. కేవలము పది ఘడియలలో ఈ పని చేయాలి అని వారికి చెప్పారు పెద్ద మనషులు.
వెంటనే మబ్బు, మేఘం ఇద్దరు బండల వద్దకు పోయారు. మేఘం వెంటనే బండను కొట్టి వేణు తిరిగాడు. మబ్బు మాత్రము బండను కొట్ట కుండా మెల్లగా బండ మీద కోడుతు ఒక్క సారి ఒకే ఒక దెబ్బ కొట్టాడు అంతే ముక్కలు ఐనాయి. కాని ఆలస్యముగా వచ్చాడు పెద్దలవద్దకు. అందరు మేఘం గెలిచాడు అని బిగ్గరుగా అరిచారు.
తోమ్దరోద్దు మూడవ పరిక్ష పెడుతున్నాము అది కూడా గెలవాలి కదా అన్నారు.
మల్లి మనస్సు భయము ఏర్పడినది తల్లిని పట్టుకొని ఒకటే ఏడుస్తున్నాది. అమ్మ నేను మేఘాన్ని చేసుకొనే అని భయ మెందుకమ్మ, మేము పెద్దలున్నాము కదా అంతా నీకు మంచే జరుగుతుంది.
మూడవ పరిక్ష : మీరు అడవిలోకి పోయి తేన తుట్టె పటుకురావాలి అదే పందెం అన్నారు పెద్దలు .
ఇంతే కదా అంటు " మేఘం " ముందు పరుగెత్తాడు. చేటు వద్దకు పోయి సేగపెట్టి తెనె టీగలు తరిమి
తెనతుట్టేను తీసు కొచ్చాడు. ముందుగా వచ్చాడు.
మబ్బు మాత్రము తేన తుట్టె ఉన్న కొమ్మ మొత్తము కొట్టుకొని తేన టీగలు కుడుతున్నా నెమ్మదిగా పందెం ప్రాంతానికి మోసుకొచ్చాడు.
అమ్దరూ" మేఘం " గెలిచాడు హోలీ సంబరం చేసుకుందాం అగ్గి వెలిగించండి అని కొందరంటున్నారు.
పెద్ద మనుషులందరూ కూడ బలుక్కొని మూడు పరిక్షల పెట్టిన తర్వాత గెలిచిన వారు, మల్లికను వివాహము చేకోనేవారు వివరముగా తెలియపరుస్తున్నాము. ఓడినవారు గెలిచినవారిని అభినందించి ఉండాలి అందుకు అందరికి ఇష్టమేనా ముఖ్యముగా పోటిలో పాల్గొన్నవారు ఇష్ట పడినట్లు మన కులదేవత అడవి తల్లి వద్ద గోమాత వద్ద ప్రమాణం చేయండి అప్పుడు మాతీర్పు చెబుతాము అన్నారు.
అంటే ఇరు కుటుంబాలవారు, మల్లి తరుఫు వారు మరియు గూడేం వారు అమ్దరూ అడవితల్లికి, గోమాతకు నమస్కరించారు.
మెదటి పరీక్షలో ఇద్దరు సమానముగా వచ్చిన తెచ్చిన చీర బట్టి మేము గేలుపు నిర్ధారణ చేయటము జరిగింది. మేము ముందుగా నిర్ణ ఇమ్చుకొని పెట్టిన చీరను తెచ్చిన వ్యక్తి " మబ్బు " కనుక ఈ పందెములో మబ్బు గెలిచినట్లు చెప్పటం జరిగింది.
రెండవ పరీక్షలో : మేఘం తొందరగా సుత్తితో కొట్టడం వళ్ళ బండ ముక్కలు ముక్కలుగా మారటమే కాకుండా ప్రక్కన ఉన్న ఇసుక బొమ్మలకు తగలి బోమ్మలు చెరిగి పోవటం జరిగింది. మబ్బు ఒకే ఒక దెబ్బతో కొట్టడం వళ్ళ బండ ముక్కలుగా చీలాయి. కనుక ఈ పందెములో మబ్బు గెలిచినట్లు చెప్పటం జరిగింది.
మూడవ పరీక్షలో మేఘం ముందుగా వచ్చి తేన తుట్టె తెచ్చి ఇవ్వటం జరిగింది. కాని దానిలో తేనే కారి పొయి దానిలో తుట్టె మాత్రమె ఉన్నాది. మబ్బు తెచ్చిన దానిలో తెనతో తెన టీగలు కుడా ఉన్నాయి.
ముఖ్యముగా మేము చెప్పేదేమిటంటే ఏపని చేసిన ఇష్టన్ని బట్టి చేయాలి , ఏపని చేసిన నాడిని బట్టి ప్రవరిమ్చాలి, ఏపని ఎట్లా చేసిన ఫలితము కలగాలి కనుక ఈ పందెములో విజేత మబ్బు అని మేమే తీర్మానం చేస్తూ తీర్పు చెపుతున్నాము అని తెలియపరిచారు.
అందరు ఒక్కసారి ఒకవేపు మబ్బును, మరోవేపు మల్లిని ఊరెగిమ్చారు. రంగులుచల్లుకున్నారు. మేలతాలలు మ్రోగాయి ఆరోజే అందరి ముందు చేతి బొటనవేలు రక్తంతో మబ్బు మల్లి నుదుటిపై పెట్టించారు తరువాత మల్లి చేతి బొటనవేలు రక్తంతో మబ్బు నుదుటిపై పెట్టించారు. దండలు మార్పించారు. మన ఆచారము ప్రకారము మీరిద్దరు ఈరొజు నుండి దంపతులుగా జీవించాలి అని దీవిమ్చారు.
ఆరోజే మా ఇద్దరినీ మా గూడెం వారు మమ్ము సాగనంపారు, దేశంలో బ్రతకమని అని పెద్దమ్మకు చెప్పింది తన ప్రేమ పెళ్లి కధ .
అమ్మో ఇంత జరిగిందా మరి మీరే క్కడ కెల్తున్నారు.
తెలీదమ్మగారు. మాకు చదువు రాదు మొద్దుగా బ్రతకటమే.
ముందు మబ్బును పిలువు అన్నది పెద్దమ్మ . మబ్బు వచ్చాడు ప్రక్కన నిల బడ్డాడు.
మీరిద్దరిని మాఊరుకు తీసు కెలతాను, మీకు విద్య నేర్పుతాను, మీరు నేర్చుకొని కొన్ని రోజులు మావద్ద ఉండి చిన్న చిన్న పనులు చేసుకొంటూ ఉండండి. విద్యనేర్చుకొన్న తర్వాత మీ అడవికి వెళ్ళవచ్చు మిమ్మల్ని మరలా ఇదే బస్సు ఎక్కి పంపిస్తాను మీరు దిగి మీ అడవిలోకి పోవచ్చు అన్నది పెద్దమ్మ.
మల్లిక ఏది చెపితే, నేను అదే చెపుతాను, అది అదంటే అది. ఇదంటే ఇది
ramakrishna garu, namasthe!
రిప్లయితొలగించండి"adavi malle ku pelli" ooh vinuthna prayogam. janapada nepadhyam kaligina ee katha baavundi. pathrala perlu , swabhaavalu kooda vinuthnam ga vunnayi. ee srungara katha rasavantham ga saagindi. cheyi thirigina jaanapada kadhakulu ga
raaninchadaniki ee prayogam oka prerana avuthundi. kaavaalani naa aakanksha.all
the best.---------------------raghupathi rao
ramakrishna garu, namasthe!
రిప్లయితొలగించండి"adavi malle ku pelli" ooh vinuthna prayogam. janapada nepadhyam kaligina ee katha baavundi. pathrala perlu , swabhaavalu kooda vinuthnam ga vunnayi. ee srungara katha rasavantham ga saagindi. cheyi thirigina jaanapada kadhakulu ga
raaninchadaniki ee prayogam oka prerana avuthundi. kaavaalani naa aakanksha.all
the best.---------------------raghupathi rao