8, మార్చి 2014, శనివారం

117. Philos'ophy story -/21 (ఆర్ధిక విజేత )

                                                                               


ఆర్ధిక విజేత
మధ్య తరగతి మానవులు పౌష్టిక ఆహారము తీసుకొనుటకు ప్రయత్నించాలి, వాటివల్ల కండరబలము పెరుగుతుంది. శరీరము ఎదుగుదలకు తోడ్పడుతుంది. మనసుకు ప్రసాంతత ఏర్పడుతుంది.  యవ్వనంలో శరీరరానికి కాస్తంత కొవ్వు అవసరం అది పరిధిలు దాటితే మాత్రము ప్రమాదం అని గమనించాలి. నిత్యమూ పాలు త్రాగుట అనేది అలవాటు చేసుకోవటం మంచిది.

" టీ " లు, కాఫీలు అలవాటు చేసుకోవటం అంత మంచిది కాదు. కాని కాఫీ మాత్రము తెల్లవారుజామున లేచిన తర్వాత త్రాగితే మనము తిన్న ఆహారము జీర్నము అవటానికి దోహద పడుతుంది." టీ " లు త్రాగితే ఉల్లాసముగా  ఉత్చాహముగా ఉంటుంది. అదేపనిగా మాత్రము త్రాగావలదు .     

అలవాటుగా పొరపాటు చేయక, నేను తెలియక పొరబాటు చేసినాను అని సరిదిద్దు కోన్నప్పుడే మనము ఆర్ధికంగా విజేతలు అవుతాము.

జన్మత: కొందరు లక్షాదికారులు, కొటీశ్వరులు కావచ్చు. వారి గుణాలు మాత్రము ఎలా ఉంటాయో ఎవ్వరూ చెప్పలేరు. తండ్రి సంపాదనను దుర్వినియోగము చేయవచ్చు లేదా సద్వినియోగాముచేసి నలుగురిలో మంచి పేరు తెచ్చు  కోవచ్చు.  కాలక్రమాన నిర్దిష్టమైన అలవాట్లు బట్టి మానవులు వృద్ధికి రావటమా లేదా పతనము కావటమా అనేది మనము అలవరుచుకున్న అలవాట్లు, పద్ధతులుపై జీవితములొ మార్పులు సమ్భవిస్తాయి దానికి భాద్యులు మనమే, ఇందుకు వేరొకరిని అన్న ఫలితము ఉండదు.  

ఎంత ఆస్తిఉన్న అప్పు తీసుకొవటము కొందరి అలవాటు, దానిని తీర్చుకొవటములొ ఉన్నది మజా అని భావిస్తారు. అప్పువారు మనచుట్టూ తిరిగితే అదొక గొప్ప అని భావిస్తారు.   వారి తిట్లు శాపనార్ధాలు తలుగుతాయని తెలిసి కూడా  తీసు కుంటారు. అవసరము మించి ఆప్పు తీసుకొకూడదని తీసుకున్నా వెంటనే తీర్చుటకు ప్రణాళిక ఏర్పాటుచేసి ఆర్ధిక ఇబ్బందులు రాకుండా జాగర్త పడాలని నేను చెపుతున్నాను.

లేనిదాని కోసం వేమ్పర్లాడవద్దు, ఉన్న దానిని వదులుకోవద్దు, ఎట్టి  పరిస్తితులలో మనసుకు భాధకలిగిమ్చి పనిని ఎవ్వరుచేయవద్దు. కూర్చొని తింటే కొండలైనా కరుగును.  ప్రతిఒక్కరు కష్టపడుతూ ఉంటే దాని ఫలితము పెరిగి కొండలా మన ఆదాయము పెరుగుతుంది. ఈనాడు  క్రమం తప్పకుండా ఇంటి ఖర్చులతో పాటు  అప్పు తీర్చుకుంటూ  పొతే మనసు ప్రసామ్తము, ఇంటి యందు ఆనందము ఉమ్టుందని నా అనుభవ పూర్వకుమ్గా ఇందు తెలియ పరుస్తున్నాను. 

జీవితములో మొదట 25 సంవత్స్చరములు ఉల్లాసముగా ఉత్చాహముగా, ఆనందముగా ఏమ్తోకోర్కలతో సరదా సరదాగా గడపాలి. యువరక్త ప్రవాహంలో ఎదిమంచో ఏది చెడో తెలిసికొనే వయసు కాదు, శక్తి ఉండదు.  కొన్ని మానసిక కోరికలు వెమ్బడిస్తాఇ. జిహ్వాచాపల్యము పెరుగుతుంది. ఏదో సాధించాలని తపన పెరుగుతుంది. అందమైన పూలను చూసిన అమ్మాయిలను చూసిన మనసులో ఏదో కోరిక కలుగుతుంది, మనసంతా వికారముగా మారుతుంది. ఎవరికీ చెపితే ఫలితము తగులుతుంది అని ఆలోచిస్తారు.

ముందుగా స్నేహితులకు తమ అభిప్రాయాలు చెప్పుకుంటారు. అక్కడే కొన్ని అలవాట్లు మొదలవుతాయి కొందరికి (సిగరెట్టూ, మందు, చతుర్ముఖపారాయనము, గుర్రపు పందెములు, నేమ్బ రింగు ఆట, లాతరీలు కట్టడం ) వాటిని వదిలించుకోవటం చాలా కష్టం. అలవాటు పడకుండా ఉండటమే నిజమైన ఆర్ధి విజేతగా మారే వ్యక్తి అని నేను మనసు పూర్వకముగా చెపుతున్నాను.
                                                


పెద్దలు ఏమి చెప్పిన ఆ వయసుకు ఎక్కదు, ఎ విషయము చెప్పిన అంతా మాకు తెలుసు మేమేమి చిన్న పిల్లమా అందులో చదువుకున్న వాళ్లము, నీవు మాకేం చెప్పొద్దూ.నీ మాటలన్నీ పాత చింత కాయ పచ్చడి లాంటివి, ఇప్పుడు మనము ఆధునిక యుగంలో ఉన్నాము అని వాదిస్తారు.
అదే ఆడపిల్లలైతే అందమైన వస్త్రాలు ధరించి కుర్రకారును రెచ్చకొట్టి ఏమి తెలియని అమాయకులుగా ఉంటారు. వారికి నిక్ నేఁములు పెడితే ఏడుస్తారు.
                                          


International women's day on 9-03-2014
కాని ఈనా డు  స్త్రీలలో కుడా ఆత్మధైర్యం పెరిగింది. పురుషులతో పా
టు సమానముగా ముందుకు వస్తున్నారు.  
స్త్రీలు, పురుషులు కరమ తప్పకుండా తెల్లవారుజామున లేవటం తప్పక అలవాటు చేసుకోవాలి యవ్వనదసలో ఏదో ఒక విద్యలో అభ్యసిమ్చినప్పుడు దాని వళ్ళ నలుగురులో మంచి పేరు తేచ్చుకోవటానికి ఓక్ ఆవకాసము వస్తుంది.   యోగాబ్యాసము పుస్తకపటనము మనసుకు ప్రశాంత కలిగించును. 

ఒక కళాకారుని కొడుకుని కాని, కూతురుని కాని వారి కళయందు ఉన్న మంచి చెడులు వంశ  పారంపర్యముగా వచ్చిన విద్యనూ వృద్ధిపరిచిన నాడే దేశం బాగుపడుతుంది. ప్రతిఒక్కరు ఆర్ధికంగా ముందుకు పోయే అవకాసము ఉంటుంది.

లోకకల్యానమునకు విద్య ఎంత వరకు ఉపయోగపడుతుందో అంతవరకు నేర్చుకొనుట మంచిది.  అత్యాశకు పొఐ ఇంకా చదువుకోవాలి, ఇంకా నేర్చుకోవాలి అని పట్టుదలతో చదువులు చదివితే జీవితములొ ఉన్న సుఖాలు పోగొట్టుకుంటారు. వయసులో ఉన్నప్పుడే వివాహము చేసుకుంటే దానిలో ఉన్న తృప్తి తెలుస్తుంది. విజ్ఞాన వారసత్వము పిల్లలకు తల్లి తండ్రులు పంచాలి.
                                                    


ఆధునిక విద్యకోసం విదేశాలకు పంపి భాదపడుట అవసరామా, డబ్బే సాస్వితముకాదు. మనిషి ఆరోగ్యము కుడా చాలా విలువైనది. శరీరమ్ ఆరోగ్యంగా ఉంటేనే మనసు ఆరోగ్యంగా ఉంటుంది.  మనస్సు ఆరోగ్యంగా ఉంటేనే బుర్ర చురుగ్గా పనిచేస్తుంది. అందుకే ఆర్ధిక విజేతలు డబ్బు కెంత విలువ యిస్తారో ఆరోగ్యానికి అంతే  ప్రాధాన్యత ఇస్తారు. ఆరోగ్యానిచ్చే  ఆహారం తీసు కుంటారు . ఆరోగ్యమైన జీవన శైలిని ఎన్నుకుంటారు. వ్యాయామానికి సమయం కేటాయిస్తారు. ఏటా ఆరోగ్య పరిక్షలు చెఇమ్చుకుమ్తారు. కుటుంబ సభ్యులకు వైద్యపరీక్షలు చెఇస్తారు. వైద్యపరిక్షల క్రింద  ఆదాయపుపన్ను మినహాయింపు కూడా  పొందుతారు.   


చిన్నప్పుడు వేలుపట్టుకొని నడకనేర్పుతారు, చెఐపత్తుకొని అక్షరాలు నేర్పుతారు, హండిల్ పట్టుకొని సైకిల్ నేర్పుతారు, సాటి వారిని ప్రేమించటం నేర్పుతారు. అదే కొందరి తల్లి తండ్రులకు నాన్న నేను ప్రేమలో పడ్డాను నేను అతనిని తప్ప వెరుకరిని పెళ్లి చేసుకోనన్నప్పుడు తల్లి తండ్రుల భాద ఏవిధముగా ఉంటుందో అందరికి తెలుసు.

ముఖ్యముగా తల్లి తండ్రులు విద్యాబ్యాసము చెఇమ్చారు,  మంచిగా చదివించారు, చదివిమ్చిన చదువుకు దేశానికి సేవ చేసి నలుగురికి సహాయపడే విధముగా ఉండాలి, నలుగురికి సహాయపడని చదువు చదువు కాదు, ప్రేమలేని పెళ్లి పెళ్లి కాదు.

ముఖ్యముగా డబ్బు లేకపోతే, తల్లి, కొడుకులు,కూతుర్లు,  భార్య, మిత్రులు కూడా  శత్రువులుగా మారిపోతారు ఇది నిజం ఈది నిజం ఇది నిజం.

తను చదివిన చదువుకు తగిన ఉద్యోగము చూసుకొని దానిమీద వచ్చే ధన సంపాదనతో మాత్రము మనిషి సుఖసంతోషాలు సంప్రాప్తమోతాయి. అదే నా నమ్మకము.

విఘ్నేశ్వరుని ఆఅరాధిమ్చటం మరువద్దు 
అవినీతి సొమ్ము జీర్ణము కాదు
ఆశకుపోతే వచ్చిన ధనం నిలబడదు
ఇల్లాలి సుఖమే నిజమైన ధనం

సింహం లక్ష్యం దిశగా దూసుకు వెళ్తున్నప్పుడు ఒక్క సారి వెనుకకు తిరిగి చూసు కుంటుంది. 
మనము ఆర్ధిక వేజేత  కావాలని ఎంత కష్ట  పడ్డ,  మన వెనుక ఉన్న తల్లి తండ్రులను, గురువులను, మిత్రులను, మరచిపోనివాడే నిజమైన ఆర్ధిక విజేత.