2, మార్చి 2014, ఆదివారం

116. Philos'ophy story -/20 (నిజమైన ధర్మాత్ముడు)


దృశ్య ప్రపంచమునకు వెనుక ఏమి దాగియున్నదో కనుగోనవలయునని మానవుని బుద్ధి సదా పెనుగులాడుతూనే యుండును.

ఉదయాస్తమానాలు, తుపానులు, ప్రకృతియొక్క మహోత్తర గమ్బీర శక్తులు, అందలి రమనీయత వివిధ మానవుల భుద్ధి ఆకర్షిమ్చును.  అంతటితో త్రుప్తి చెందక  వాని రహస్యమును గ్రహించవలయునని కాంక్ష పెరుగును.  మానవుని ఉపయోగపడే వస్తువులను తయారుచేయుటకు  మేదస్సు పనికి వచ్చును. ఇతర దేశాల వారికి మనమేధస్సు ఉపయోగపడుతున్నాది.

ఒక్క విషయము మాత్రము నేను చెప్పగలను.  మానవులు తమ ఇంద్రియ పరిమితులను దాటి పోవుచున్నారు. ఇమ్ద్రియములతో తృప్తి పడుటలేదు. ప్రక్రుతి సృష్టిని ధిక్కరిమ్చుతున్నారు. కొందరు ధర్మాన్ని అర్ధం చేసుకొని ఆవేశము చెందకుండా, తన్మయత్యులుగా  మారకుండా జీవిమ్చ కలుగుతున్నారు.

నక్షత్రాలు, గ్రహాలు చలించు ధర్మాలు బ్రాహ్మణులు గ్రహించుట మనహిమ్దువులు చేసుకున్న పుణ్యము. ధర్మాలబాట్టి మన పండగలు వస్తున్నాయని గ్రహించగలరు.      


ధర్మ భోధవలననే వ్యక్తి లో దయ నిండు కుంటుందిదయగల హృదయమే ఎదుటి వ్యక్తి హృదయాన్ని తృప్తి పరుచగలదు. గాయాలనుయ్ మాన్చాగలదు. మనసును ప్రశాంతముగా ఉమ్చగలదు  ప్రతి వ్యక్తిలో సీలాన్ని  పెమ్పోమ్దిమ్చాలి. 

భీష్మ పితామహుడు శాంతి పర్వంలో వ్యక్తి ధర్మాల్ని  కూడా భోదించాడు.  ప్రతివ్యక్తి శీల వంతుడై  జీవిమ్చాలన్నాడు. మనసా, వాచా, కర్మణా ఇతరులకు హాని చేయకపోవడమే శీలమ్, సిగ్గుతో తలదించుకోవాల్సిన పనులు చేయకపోవడమే శీలం  సాటివారికి సాయపడటమే శీలమ్ - ఎట్టి  పరిస్తితులల్లో  కూడా సీలమ్ వదలుకొకూడదని హెచ్చరించాడు.

ప్రస్తుత పరిస్తితులలో శీలాన్ని కోల్పోయిన వ్యాపార వెక్తలు  జైలు పాలైన సమ్ధర్బాలున్నాయి.  శీలాన్ని వదులుకున్న రాజకీయనాయకుల్ని ప్రజలు ఘోరంగా తిరస్కరించిన ఉదంతాలు లున్నాయి.   శీలాన్ని వదులుకున్న న్యాయ మూర్తులు, ఐ.ఎ. ఎస్, ఐ.పి.ఎస్ వారు దోషులుగా నిలబడిన సంఘటనలు ఉన్నాయి.
ధనం కోసం, రాజకీయమ్ కోసం శీలాన్ని తాకాటు పెట్టిన వారున్నారు.     

ముఖస్తుతికి పొంగి పోవద్దు. నిష్టురసత్యాలకు కోపం తెచ్చుకోవద్దు. మంచి చెడులను బెరీజు వెసు కుంటు  దుర్మార్గుల్నీ సన్మారుర్గుల్నీ వెరుచెసు కుంటు  ముందుకెళ్ళి పోవడమే జీవితమ్ అనేది ఆచార్యుని సలహా.

ఆదిత్యు డుదఇమ్చగానే  విశ్వమంతా వేలుగు తోరణాలతో శోభిస్తుంది.వ్యక్తిలో  ధర్మం ఉదఇమ్చగానే జీవితము   కళ్యామయమై భావిస్తుంది. మనసును అదుపులో ఉమ్చటము ద్వారా సత్ప్రవర్తన ద్వారా, ఆత్మావలోకనం ద్వారా ప్రశాంతతను పొందవచ్చునని మన పూర్వీకులు మనకుకు భోదిమ్చారు.

ధర్మమే స్తితి కారణమైనది.  ధర్మమును దక్షిమ్చినవారిని ధర్మమే రక్ష్మిచును. ధర్మమును అతిక్రమిమ్చినవారిని ఆ ధర్మమే అమ్తరిమ్ప చేయును.         
వేదాల సారాన్ని, ఉపనిషత్తుల మర్మాన్ని, ధర్మ సూక్ష్మాల లొతుల్నీ కధల రూపంలో పిల్లలకు నేర్పుట ప్రతి తల్లి తండ్రులకు శీల సంపదగా భావించి, ఆరోగ్యమునకు ఆనందమునకు ప్రతిరోజూ పార్కుకు తీసుకొని వెళ్లి పిల్లలతో ఆడుట అనేది తల్లి తండ్రులకు కూడా ఒక యోగ లాంటిదని భావించవచ్చును.       

                                                   
శ్రీ కృష్ణ పరమాత్ముడు బాల్యంలో అమాయకుడుగా అందరిని మెప్పించడం, ఆనందపరచడం, చిన్న చిన్న దొంగతనాలు చేయడం, పెద్దవాళ్ళను, చీన్నవాళ్ళను, ఆడవాళ్ళను ఆట పట్టించడం  బాల్య చేష్టలుగా భావించ గలిగింది ఆనాడు యశోద. ఈనాడు కూడా ప్రతిఒక్కరు తమపిల్లలను గారాబముగా పెంచుతున్నారు.

జీవిత మనేది  ఒక ఆట అని, ఆ ఆటలో ఒకనాడు గెలువ వచ్చు, ఒకనాడు ఓడ వచ్చు అంత మాత్రమున భాదపడుట, మనసుకు గాయముగా భావించుట, చిన్న పెద్ద లేకుండా అరుచుకోనుట, ఎవ్వరికి తగదని మనధర్మాలు చెపుతున్నాయి.        

ఇంద్రియ వ్యాపార ఫలము మొదట అనుకూలముగా ఉండును.  తరువాత ఎదురుతిరుగు చుండును. కాలముయోక్క నడక అలల నడకగా పోల్చవచ్చును. ప్రతి అల మొదట దిగుడు మరుక్షణము మరల ఎగుడు, మరల దిగుడు ఎగుడు మాదిరగా ఆవృత రూపముగ సాగుచుండును. మానవుని మనస్సు కూడా సంకోచ వ్యాకొచములు జరుగును.  యంత్రమునకు శక్తి తోడ్పడితే ఎట్లు కదులునో, అట్లే ప్రతిఒక్కరిలొకూడా ఏదో శక్తి  ఆవహించి జీవితము నేట్టుకుంటు వచ్చు బండి లాగ జరుగు చుండును.

ఇమ్ద్రియగోచారుడగు మానవుడు బుద్ధికి అతీతుడు, ప్రతిబిమ్బమువంటివాడే, దేశకాల భాద్యుడు అగుటచే నిత్యముక్తుడు. అతడెన్నడూ భద్దుడు కాలేడు కాజాలుడు.

మనశరీరములొని రక్తకణాలు మారు చుండును.   శరీరమమ్తా  నిరంతరం పరిబ్రమిమ్చు చుండును. వయస్సు పెరిగినకొద్దీ అనేక వ్యాధులు రావటానికి మూలకారణము మనము అనుకరించిన పదద్దతులు, మానసిక వత్తిడివల్ల, ఆలోచనవల్ల, మనిషిలో ఉన్న శక్తి కొంత తగ్గును. మన మనస్సు ఒక క్షణం సౌఖ్యం, మరుక్షణం అసౌఖ్యం, ఒక క్షణం బలం అనుక్షణం దౌర్బల్యం, నిరంతరము నీటిలో  సుడిగుండము వలే  తిరుగు చుండును.

ప్రతి కాలితో నడుచునది నీవె, ప్రతి పెదవితో మాట్లాడునది నీవె, ప్రతికల్లతో చూచునది నీవె, ప్రతి చేతులతో చేయునది నీవె, ప్రతి హృదయముతో కష్టసుఖాదులను భావిమ్చునది నీవె.

సత్యమును ధర్మమును తెలిసికొన్నచో మనుష్యులు భీతిచేమ్దరు. తమవ్యక్తిత్వమును నిలబెట్టు కొందురు.

                                                                      

అనగనగా ఒక రాజ్యమున్నది. ఆరాజ్యమునకు ఒక రాజు ఆ రాజుకు నలుగురు కొడుకులు ఉన్నారు. నలుగురిని పిలిపించి నేను వృద్దుడైనాను సర్వాదికారములు మీలొ ఎవరుకి ఇవ్వాలో నాకు తెలియుటలేదు ఎమ్డుకంటే మీరు అన్ని విద్యలలో సమానులు. మీలొ ఎవరైతే సర్వాదికుడైన ధర్మాత్మున్ని వెతికి తీసుకు వస్తాడో అతనికి రాజ్యాధికారము ఇస్తాను. ధర్మాత్మునికి నేను పరీక్షలు పెట్టి, భహుమతి ఇచ్చి పపంపెదను అట్లు ఇష్టపడ్డవారినే తీసుకురండి.

నలుగురు కుమారులు నాలుగు దిక్కులు బయలు దేరారు. పెద్దవాడు ఒకనగరములొ ఒక గుప్తా  గారిని కలిసి  మీకు మారాజ్యం లో సన్మానము చేస్తారు మీరు వస్తారా, మారాజ్యములో మీరు మీ ధర్మ ప్రచారము చేసుకొనవచ్చును అని చెప్పాడు. అట్లే అని ఒప్పుకున్నతర్వాత అతనిని రాజదర్బారులో కూర్చొ బెట్టి. వారిని గురించి ఈ విధముగా వివరించాడు పెద్దకొడుకు.       

ఇతను వేలాది రూపాయలు దానము చేసాడు, ఆలయాలు కట్టించాడు, చెరువులు త్రవ్వించాడు, చలివేంద్రాలు ఏర్పాటు చేసాడు. నిత్యమూ వీరు పురాణ శ్రవణము చేస్తుంటారు. గొపూజలు చేస్తుంటారు. వీరిని మించిన ధర్మాత్ముడు ఉండదు అన్నాడు.

వెంటనే రాజు గారు గుప్తాగారిని కొన్ని ప్రశ్నలు వేసారు.

ప్రతిఒక్కరికి ఉండవలసిన "దానం " మెది ?
కాసేపు ఆలోచించి  "నిదానం " అని సమాధానము చెప్పాడు.

ఇది దానం కాదు విశాలమైన దానం ఏది. ?
కాసేపు ఆలోచించి  "మైదానం " అని సమాధానము చెప్పాడు.

దంపతులు ఎదానం చేస్తే పుణ్య మోస్తుమ్ది ?
దంపతులు ముక్యముగా కన్యాదానం చేస్తే పుణ్య మోస్తుంది.
సభలో ఉన్న వారమ్దరూ సమాధానాలకు కరతలధ్వనులతో రాజుగారు గుప్తాగారిని సన్మానించారు.  
 

రెండవ కుమారుడు ఒక బ్రాహ్మనోత్తముడిని  తీసుకొని వచ్చి సభికులందరి ముందు నిలబెట్టి ఇతడే నిజమైన ధర్మాత్ముడు అని అతని వివరాలు తెలియపరిచాడు.
నియమభద్ధముగా మంత్రజపాదులు పూర్తిచెసుకున్నతరువాత నే  జలపానం చేస్తారు. త్రికాలాలలో సంద్యావందనం చేస్తారు. ఆసత్యానికి వీరు భయపడతారు. ఈయనకు కోపమనేది ఎప్పుడూ రాలేదు అట్లువచ్చినట్లు ఎవరూ చూడలేదు. ఎప్పుడు భక్తి కీర్తనలతొ దేవుణ్ణి కొలుస్తూ ఉంటాడు. భగవద్గీతను అద్బుతముగా ప్రజలకు అర్ధమయ్యె విధముగా విడమరిచి చెప్పగలరు. అని వివరించాడు.

ఈయన నిశ్చయమగా  ధర్మాతుడు ఐన నేను మూడు  ప్రశ్నలను వేస్తాను సమాధానము చెప్పగలరు అని రాజు గారు బ్రాహ్మణుడిని అడిగారు.
1.ఎఘడియల్లో దేవుణ్ణి ప్రార్ధించాలి ?
    అమ్రుతఘడియల్లో
2. దేవున్ని పూజ చేసే టప్పుడు అందరికి ఉండ వలసినది ఏమిటి.?
    ఓర్పు, శక్తి
3. మూర్ఖుడు నైన  చక్కపరిచేది ఏది ?
    సత్సాంగత్యం
సమాధానాలకు అమ్దరూ మెచ్చు కున్నారు, సన్మానమును చేసి పంపారు. 


మూడవ కుమారుడు   ఒక బాబాను తీసుకొని వచ్చి  రాజభవనంలో అందరి సమక్షమున అతని గుణగనాలు వివరించాడు.

యితడు మహాతపస్వి, వారానికి ఒక్క సారి మాత్రమే క్షీరపానమ్ చేస్తారు.  సీతాకాలాలల్లో జలాలల్లో నిలబడతారు. గ్రీష్మ ఋతువులో పంచాగ్ని మధ్యలో ఉంటారు. నిత్యమూ గాలి నీరుద్వారానే జీవితము గడుపుతారు. ఆశ్రమం ద్వారా భక్తులకు వేదం నేర్పుతారు. యజ్నయాగాలు నిర్వహిస్తారు.
వెంటనే రాజు వీరు మహా ధర్మాత్ములు ఇందు సందేహములేదు. ఐన నేను మూదు ప్రశ్నలు వేస్తాను అని అన్నాడు.

1.నోటినుండి శివ లింగము తెప్పిమ్చుట ఎంగిలి కాదా ?
   ఉదర పోషనార్ధం చేసే విద్యకు సిగ్గు, ఎంగిలి ఉంటే జీవిమ్చ లేము.

2. స్వామి  మీకు ఇంద్రియ సుఖం అవసరమా? 
    పరమేశ్వరునికే తప్పలేదు నాలాంటి వానికి ఎలా సాద్యం.

3.మీ పాదాలకు పూజ చేసి నీరు చల్లు కోవటం మంచిదా?
   దేవుడని నమ్మినవానినికి మంచిది. కాని నేను చెప్పేది ప్రత్యక్ష దైవాలైన తల్లి తమ్డులకు పాదాలు కడిగి
   ఆనీరు చల్లుకోవటం మంచిది.   

సమాధానాలకు అమ్దరూ సంతృప్తి పడ్డారు. అంతలో రాజు సన్మానము చేయబోతుంటే నేను సన్యాసిని నాకు మీరు సన్మానము చేయవలదు. మీరు చెయ్యాలంటే
ర్మాన్ని నాలుగుపాదాలతో నడిపే వేదాలను రక్షించి ఆ వేదాల అర్ధాన్ని ప్రజలకు తెలిపే అవకాసము నాకివ్వండి అన్నారు. అమ్దరూ లేచి బాబాకు నమస్కరించారు. 
అదే మీరు నాకు చేసే స్న్మానముగా భావిస్తాను. అన్నమాతలకు రాజు చాలా సంతో సహించి భూదానంతో గోదానంతో సత్కరించి పంపారు.  నాల్గవ చిన్న కుమారుడు ఒక రైతును నిలబెట్టి అతని విషయాలు వివరముగా సభికులందరికీ తెలియపరిచాడు. వానరుల నుండి  మానవులుగా మారారని అందరకి తెలుసు. మానవులు జ్ఞానవంతులు తనజ్ఞానాన్ని నలుగురికి పంచి దానివల్ల వచ్చే రోక్ఖమును సంసారపోషణకు వాడుకొనుట అనేది సహజము. అదేవిధముగా రైతు పంట పండించి తన కుటుంబమునకు  సరిపడు బియ్యపు గింజలు వుంచుకొని మిగతావి దానం చేస్తాడు.మూగ ప్రాణు లణు సేకరించి వాటిని పోషించి వాటి మీద  వచ్చే  ఆదాయమును నలుగురికి పంచేవాడు.  ఉచితముగా అందరికి ఆవుపాలు, గేదపాలు పోసేవాడు. పెంపుడు జంతువులకు చిన్న గాయమైన వెంటనే దానికి మందు వాడేవాడు. వాటి రక్షణ కోసం ఆహార్నిసాల కష్టపడేవాడు.

రొజూ దేవాలయము వద్దకు పోయి అంతా సుబ్రపరచి దీపమ్ వెలిగించేవాడు. యితడు చదువుకోలేదు. కాని ఎవరైనా జబ్బు పడితే వార్కి దగ్గరుండి సేవచేస్తాడు. ఎవరైనా యాచిస్తే గుప్ప్డు మెతుకులు పెడతాడు ఇతడే నిజమైన ధర్మాత్ముడు. అని చెప్పాడు చిన్న కుమారుడు.

వెంటనే రాజు గారు మిమ్మల్ని మూడు ప్రశ్నలు వేద్దామని అనుకుంటున్నాను. మీ చేతిలో ఏదో తెచ్చారు అన్నాడు.          

ఇది సాక్షాత్తు హనుమంతుని రూపమ్ ఆకుపై కనబడుతుంది. అది మీకు చూపిద్దామని తెచ్చాను అని "ఆకు చూపిమ్చాడు". అమ్దరూ చూసి ఆశ్చర్య పోయారు.   

అమ్దరూ ఆకుకు ఒక్కసారి సమస్కరిమ్చారు.

1. మనుష్యులంటే ఎవ్వరు ?
    పరుల సుఖం కోసం స్వార్ధాన్ని, స్వసుఖాన్ని కూడా త్యాగం చేయగలవారు.

2. ఎప్పుడు ఏది కోరుకుంటావు ?
    నా పొలం కన్నా నాపొలం చుట్టు ఉన్న పొలాలు బాగా పండాలని కోరుకుంటాను.

3. పంటను ఎలా పండించాలి ?
   మనుష్యులకు అరి షడ్ వర్గాలు ఎలా వెంబడిస్తాయో, అట్లే పొలంలో కలుపు మొక్కలు ఉంటాయి అవి
   తొలగించాలి. అవగాహనా అనే జాలం పోసి, వివేకమనే ఎరువువేసి, అభిమానమనే పక్షులు, అహంకారమనే   మృగాలు పాడుచేయకుండా చూసుకొవాలి. బీజమ్ నాటిన నాటి నుంచి అది పుష్పించి ఫలింమ్చే వరకు   తోటమాలి ఏవిధముగా శ్రద్ధ కలిగి ఉంటాడో (కదుపుతొఉన్న స్త్రీ 9నెలలు కడుపులో పెరుగుతున్న ప్రాణం   కోసం ఎట్లా శ్రద్ధ వహిస్తారో ) అట్లే  పంట పండింమ్చే  వాడు జాగరూకతొ ఉండాలి. ప్రక్రుతి విపత్తులు వచ్చిన   కష్టాన్ని భరించి ఓర్పుతో, ఓపికతో, ఓదార్పుతో, పొలమును నమ్ముకొని జీవిమ్చె వాడే నిజమైన రైతు ఆ   మాటలకు అమ్దరూ ముక్త  కమ్థముగా ఇతడే నిజమైన ధర్మాత్ముడు అన్నారు.

   వెంటనే రాజు కష్టాలలో ఆ
దుకున్నావాడే నిజమైన స్నేహితుడు            
   అనారోగ్యముతో భాద పడినవాడిని ఆదుకున్నవాడే నిజమైన వైద్యుడు.
   చీకటిలొ ఉన్నవానికి వెలుగు చూపెవాడే నిజమైన సూర్యుడు.
   భూమి ఆకాశమును నమ్ముకొని తిండిగింజలు పండించి అందరి ఆకలి తీర్చువాడే                           రైతు భాంధవుడు,    ధర్మాత్ముడు.         
                                                                             

రాజు తనకుమారులకు తనరాజ్యమును నాలుగు భాగాలుగా చేసి నలుగురికి పంచి ధర్మాన్ని విడువకుండా జీవిమ్చండి.

చివరగా సభలో ఉన్న వారందరికీ నేచేప్పేద్ర్మం ఏమిటంటే రైతు రకరకాల పంటలు పండించాలి వారికి అమ్దరూ సహాయము చేయాలి. రైతు ఆరోగ్యముగా ఉంటే దేశం ఆరోగ్యముగా ఉంటుంది.

సృష్టిలో జంతువులు ఇతరజంతువుల్ని ఆహారం కోసం ఆకలేసినప్పుడు చంపుతాయి. ఒక్క జమ్తువుమాత్రమే వినోదంకోసం, జిహ్వాచాపల్యంకోసం "జంతు మాసాన్ని" తినే జంతువే మానవుడు.

కరుణ,  ప్రేమ, వాత్స్యల్యం, ఔదార్యం, స్నేహం, తృప్తి కోరవ పడి నప్పుడు మనిషిలో హింసగుణం పెరిగి జంతువుగా మారుతాడు. అట్లా మారకుండా అందరు సుఖ శాంతులతో జీవిమ్చాలని నీ కోరుతున్నాను.

వయస్సుకు తగ్గ తృప్తి పొమ్దుతూ సంతృప్తిగా జీవిమ్చాలని నా ఆకాంక్ష.

ఈ కధ మీ అభి ప్రాయాలు తెలుపగలరు.
                                                             మీ మల్లాప్రగడ రామకృష్ణ 

                                                            Asst. Treasury Officer.
                                                             O/o The Disstrict Treasury
                                                             Nizamabad, Telangana 
                                                             Andhrapradesh, India.