28, సెప్టెంబర్ 2018, శుక్రవారం

ఆరాధ్య ప్రేమ లీల (ఛందస్సు) *




ఆరాధ్య లీల (ఛందస్సు) 
ద్రాచాయట: మల్లాప్రగడ రామకృష్ణ 

నాకే మివ్వద్దు తల్లీ నీ మాట జవదాటనమ్మా     
నీకే చిత్తమ్ము తల్లీ  మా మోర విని తెల్పవమ్మా 
నీదే ధైర్యమ్ము తల్లీ మా కోర్క విని తీర్చవమ్మా     
నిత్యా దైవమ్ము తల్లీ మా తీర్పు విని మార్చవమ్మా 

సాధిం చావమ్మ తల్లీ మా మాట విని నమ్మవమ్మా     
ప్రాణం పంచమ్మ తల్లీ మా హృద్య విని నిల్పవమ్మా 
నామం నీదమ్మ తల్లీ మా తీరు విని మన్నించమ్మా 
నీపై ప్రేమమ్ము తల్లీ మా ఓర్పు కని మార్చవమ్మా      

--((**))--




Pranjali Prabha.com 
ఆరాధ్య ప్రేమ లీల (ఛందస్సు )
రచయత: మల్లాప్రగడ రామకృష్ణ 

గులాబీల తోట గుభాళింపు కన్నా అందమైన ప్రేదేశమేది 
మనో నిబ్బరంతొ ముభావంగ ఉన్నా దివ్యమైన ప్రేదేశమేది 

సెవా భావ వాకిట శాంతంగ ఉన్నా సత్య మైన ప్రేదేశమేది   
సదా కల్పు తీసియు పంటంత ఉన్నా నిత్య మైన ప్రేదేశమేది  

నిజం మాట చెప్పియు మౌనంగ ఉన్నా చిత్రమైన ప్రేదేశమేది 
మనం అంటు కల్సియు సవ్యంగ ఉన్నా రమ్యమైన ప్రేదేశమేది    

తరించేటి అందము బంధంగ ఉన్నా భవ్య మైన ప్రేదేశమేది   
తనూ నేను నిత్యము సౌఖ్యంగ ఉన్నా తృప్తి యైన ప్రేదేశమేది 

--((**))--      


ఆరాధ్య ప్రేమ లీల (ఛందస్సు )
రచయత: మల్లాప్రగడ రామకృష్ణ 

కలువల రాజు నిశిరాతిరి చెప్పెను స్వాగతం  
మనసున రాణి నడి రాతిరి పల్కెను స్వాగతం 

సొగసున వెన్నెలలు కాంతితొ తెల్పెను స్వాగతం  
నది జరిగే కలియు సంద్రము చూపెను స్వాగతం 

మనసున కన్నె అల లాగను పిల్చెను స్వాగతం  
మదితలపే మనసు వేగము పెంచెను స్వాగతం 

తెనియలు పంచి చిరు మొముతొ పిల్చెను స్వాగతం     
మగువల కోర్క వల తామస సంతస స్వాగతం 

పొగరు సెగలు కమ్మినా 
వగరు కళలు చిమ్మినా 
మగువ మనసు పంచినా 
తప్పదు  స్వాగతం   
వేణుగోపాల ప్రేమ సుమా 

--((**))--
ప్రాంజలి ప్రభ.com 
ఆరాధ్య ప్రేమ లీల (ఛందస్సు) 
రచయత: మల్లాప్రగడ రామకృష్ణ 

ఆశ వీడి బాధ లన్ని చెప్పు కొంటి వేద నాయకా    
కాన వచ్చె లోక శక్తి తెల్పి కాంచ వేమి నాయకా 

లేని పోని నింద లొద్దు ఉన్న కన్న ప్రేమ చాలురా  
విన్న పాలు చిత్త గించి కోర్క తీర్చి తృప్తి పర్చరా 

కన్నె లన్న చుల్క నేల ప్రేమ పంచి ఆదు కొమ్మురా 
మార్పు నేర్పు తీర్పు ఓర్పు నిన్ను చూసి నేర్చు కొందురా 

కాల మాయ కమ్ము వేళ ఆదు కొమ్ము గోప బాలకా   
వేన వేళ గుండె గోల కాపు కాయు వేంక టేశ్వరా      

కష్ట జీవి శోభ నిచ్చు
వేద వాక్కు నిత్యా సత్యం 
పూజ శక్తి ప్రేమ పెంచు     
వేణుగోపాల ప్రేమ సుమా 
--((**))--


మనిషిలో ఆరాటం ఎలా ఉంటుందో ఒక్కసారి చదవండి    
ఆరాధ్య ప్రేమ లీల (ఛందస్సు) 
రచయత: మల్లాప్రగడ రామకృష్ణ 
        
చిందులు వేయగా లెమ్ము - ఆటల - మండప మందు హాయిగా  
విందులు చేయగా రమ్ము - వేగమే - నందన మందు హాయిగా 
పొందుకు సేవగా రమ్ము - ఆశయే - తీరును ముందు హాయిగా 
శాంతము ఉండుటే నమ్ము - కాలమే - మార్చును ముందు హాయిగా 
కుందన  శిల్పమై రమ్ము - కోమలి - స్యందన మందుఁ హాయిగా 
భావము తెల్పగా రమ్ము - ఆటలు - పాటలు మందు హాయిగా 
స్పన్దన పంచగా రమ్ము  - నిత్యము - సత్యము ముందు హాయిగా  
మందము ముందమై రమ్ము - మానస - సుందరి చిందు హాయిగా 

ఆకలి ఉన్ననూ ఆశ 
- చావదు - పాపము చేసె పాశమే  
కావలి ఉన్ననూ నీడ 
- మారదు - కాలము వేగా మాయయే
ఇది వేణు గోపాల ప్రేమ సుమా 
--((**))--



ఆరాధ్య ఉపాధ్యాయ లీల
రచయత. మల్లాప్రగడ రామకృష్ణ

అనంతకోటి విద్యా రక్షణకు  - మది విసిరేశావు కదా
ఆత్మరక్షణ కూడ చేసుకోక - సహాయాన్ని చేసావు కదా

వియోగాగ్ని భరించి శాంతిని- గుండెల్లోన నింపేశావు కదా
వాంఛ్ఛా బలహీనాన్ని, మత్తు - బానిసను తొలగించావు కదా

పెను ధుఃఖపు తెరలపొర - లను భలే చీల్చేశావు కదా
కళ్ళకు కను రెప్పల్లా - భయస్తులకు కాపుకాశావు కదా

సంపాదనంతా కష్టజీవులకు - దానంగా ఇచ్చేశావు కదా
వయసు ప్రేమనంతా ప్రజల - కొరకు పరిచేశావు కదా

లక్ష్యం, ధ్యెయం, ఉన్నచోట - ధనం, ఆశ, చొరబడదు.
విద్యా సేవ అనుకున్న చోట - శ్రమ, శక్తి కానరాదు
ఇది వేణు గోపాల ప్రేమ సుమా
--((**))--

Pranjali Prabha.com
ఆరాధ్య ప్రేమ లీల
రచయత: మల్లాప్రగడ రామకృష్ణ

ఈ ధరా రజముపై నింపాదిగా ధర్మాన్నంతా తెల్పి

ఈ జలరాశిని సమస్త ప్రజానికానికి నిల్పి

ఈ గాలులతొ నిండుహృదయా నందముననే సల్పి

ఈ భరతంబున నె మానసంబున సంతస సల్పి

ఈ భూమిగంధంబు నెపుడు నాఘ్రాణించి మానం తె ల్పి

ఈ ప్రజాసేవలో ఇనుమడించి తీవ్రతరం నిల్పి

ఈ నేలపై నేను మౌన జీవితంతో ప్రకృతి సల్పి

ఈ తల్లి నర్చించి మనస్సును సేవాతరుణం నిల్పి

ఈ జన్మ సార్ధకం చేసుకో

మరుజన్మ లేకుండా చూసుకో

జన్మజన్మల బంధమని ఏలుకో

ఇది వేణు గోపాల ప్రేమ సుమా

--((**))--

ఆరాధ్య ప్రేమ లీల
రచయత: మల్లాప్రగడ రామకృష్ణ 
శృంగార సాహిత్యం 

రాతలచి వయసునే - మమతాను నగరిలో 
ఆలోచన సమయమే - నిత్యానందము తనువే

రాధికను మరుతువా - కలిసేను మధురిలో 
లీలామయ తరుణమే - మనోవాంచ సఫలమే 

వేదనయె మనసులో - కలలాయె పరిధిలో 
సేవాకల బ్రమరమే -  ఆశాదీప చరితమే   

ప్రేమసఖి తనువులో- కెరటాలు పరుగులే 
ఆకాశము లహరిగా - బరువంత సెగలతో  

చంద్రాలయ కులుకుయే - గజమాల కుదుపుయే 
వక్షోజము మరుపుగా -  మృగరాజ కటి వలే  

సంతోషయ సమరమే - సమభోజ మనసులే 
జాప్యవల సుఖములే - సమపాశ వరదలే   
 --((**))--

ఉడురాజముఖీ మృగరాజకటి 
ర్గజరాజగతిః కుచభారనతా 
యది సా రమణీ హృదయే రమతే 
క్వ జపః క్వ తపః క్వ సమాధిరతిః 

(చంద్రునిలాటి అందమైన ముఖము గలది, సింహములాటి సన్నని నడుము గలది, ఏనుగులాటి మందమైన గమనము గలది, స్తనభారముచేత వంగినది, అట్టి ఆ సుందరి హృదయములో ఆసనము వేసికొని ఉన్నప్పుడు జపమెందుకు, తపమెందుకు, సమాధి ఎందుకు?) 

చపలా - అర్ధసమ వృత్తములు -

బేసి పాదములు - 
నదీ (అరి) - భ/న/లగ UIII IIIU 127 
విమలజలా - స/న/లగ IIUI IIIU 124
ఈడా - త/న/లగ UUII IIIU 125
శిఖిలిఖితా - మ/న/లగ UUUI IIIU 121

సరి పాదములు - 
క్షమా – మ/ర/లగ UUUU IUIU 81 
నాగరక – భ/ర/లగ UIIU IUIU 87 
నారాచ – త/ర/లగ UUIU IUIU 85
ప్రమాణికా – జ/ర/లగ IUIU IUIU 86
హేమరూప – ర/ర/లగ UIUU IUIU 83

UIII IIIU // UIIU IUIU 
రాధికను మఱతువా 
మాధవ నీకు భావ్యమా 
వేదనయె మనసులో 
మోదము నిమ్ము మోహనా

UUUI IIIU // UUIU IUIU 
ఆకాశమ్మున శశితో 
నాకెందుకో వివాదమే 
ఆకాంతిచ్ఛట సెలలో 
నీకైరవమ్ము పూయదే

IIUI IIIU // IUIU IUIU 
కమలాప్తుఁడు వెలుఁగన్ 
సుమమ్ము లెన్నొ పూయఁగా 
రమణీయపు రవముల్ 
ద్రుమమ్ములందు నిండెఁగా

UUII IIIU // UIUU IUIU
రావోయి నను గనఁగా 
జీవనాకాశ చంద్రుఁడై 
నీవేగద మనసులో 
నావసంతర్తు యామినుల్

UUUI IIIU // UUUU IUIU
ఆవర్ణమ్ముల చెలువుల్ 
భావాతీతమ్ము సంధ్యలో 
రావేలా నను గనఁగా 
దేవీ సంధ్యా స్వరూపమై


విధేయుడు - జెజ్జాల కృష్ణ మోహన రావు

కారు చీకటి కమ్ము కున్నా
కాంతి పుంజం నీవె చెలీ !

కారు మబ్బులు నిండు కున్నా
నాదు మెరువువు నీవె సఖీ !

లేదు సుఖమీ జగమునందున
లేనె లేదూ ... ఎంత వెదకిన !

నీదు మోమును గాంచలేనీ
నిముసమదివో .. నరకప్రాయము !

కవుగిలింతలు కోరబోను ....
కనికరించి ఒడిని చేర్చు !

వెతలనన్నీ మరచిపోయి ,
కతలు వింటూ నిదురబోతా !

కతలు వింటూ నిదుర బోయీ
కవితలేవో అల్లుకుంటా ..... !

కవితలేవో అల్లుకుంటూ ,
కలల తీరం చేరుకుంటా !!

జోల పాడవ జాబిలమ్మా ...
నీదు పాపను నేను కానా !

జోల పాడవె జాబిలమ్మా ...
నీదు పాపను ఒడిని జేర్చీ ! ....




కామెంట్‌లు లేవు:

కామెంట్‌ను పోస్ట్ చేయండి