ఓం సశ్రీ రాం - శ్రీ మత్రేనమ: - శ్రీ కృ ష్ణాయనమ:
ఆనందం - ఆరోగ్యం - ఆధ్యాత్మికం
ఆరాధ్య ప్రేమ లీల
రచయిత: మల్లాప్రగడ రామకృష్ణ
జీవిత చక్రం
ఎదలో మాటలను ఎరుక పర్చాలని తపించా
గుండెలో విషయాన్ని వినిపించాలని తపించా
మాటల భావాన్ని తెలియపరచాలని తపించా
అర్ధంలో పరమార్దం తెలపాలని తపించా
నవ్వుల మోముతో పలకరించాలని తపించా
పువ్వల నావలో సుఖమివ్వాలని తపించా
మాయను చేదించి మనసు పంచాలని తపించా
సంసార పడవను కడకు చేర్చాలని తపించా
వెలుగుతో విధిగా నిర్వహించాలని తపించా
గంగాజలం తో మనసు చేర్చాలని తపించా
తప్పిన బతుకును దారిలొ పెట్టేందుకు తపించా
మాటను తెలిపి స్థితిని కల్పించాలని తపించా
మనసు గా ఊపిరవ్వాలనే ఎంతో తపించా
ప్రాణంతో బ్రతికి బ్రతి కించాలని తపించా
ప్రేమ నదించి పొంది సుఖ పెట్టాలని తపించా
ప్రకృతి తో జీవనం సాగించాలని తపించా
తపనకు తను ఉంది
మనసుకు గతి ఉంది
మమతకు చెలి ఉంది
వయసుకు ప్రేమ ఉంది
ఇది వేణు గోపాల ప్రేమ సుమా
--((**))--
ఆరాధ్య ప్రేమ లీల
రచయిత: మల్లాప్రగడ రామకృష్ణ
ఉరుకులు పరుగులు ఎగసి పడే ఆగని కెరటాలు
- ఊహలు, పొరలు,తెరలు,తెరలుగా కదిలే అతీతాలు
మనసున చుట్టు ముట్టి వెంబడిస్తున్న మధుర జ్ఞాపకాలు
- ఆశాపాశానికి చిక్కి కల్లోల పరిచే కలలో నిధులు
అనుకున్నది పొందక మొదటి దశలో మగ్గిన మొగ్గలు
- శారీరక శ్రమతో విద్యాసాధనతో పొందిన విజయాలు
వయసు ఉడికి అనారోగ్యంతో శిశిరంలో రాలే ఆకులు
- కాలాన్ని బట్టి, గుణాన్ని బట్టి మారే మానవ జీవశ్చవాలు
కాలంతో పాటు వయసు తరుగు
విజ్ఞానంతో పాటు ప్రేమ పెరుగు
దైవభక్తితో పాటు శాంతి కలుగు
ఇది వేణు గోపాల ప్రేమ సుమా
--((**))--
ఆరాధ్య ప్రేమ లీల
రచయత: మల్లాప్రగడ రామకృష్ణ
అడుగులో అడుగునై జీవన యానంలో తోడవుతా
- పాలలో జలముగా ఏకమై నేనెప్పుడూ తోడవుతా
అనుకున్నా లేకున్నా నేను మాత్రం నీడగా తోడవుతా
- నీ శ్రమలో నేను నూతన తేజాన్ని ఇస్తూ తోడవుతా
నీ గెలుపు ఓటములకు భాగస్వామిగా తోడవుతా
- సమస్యలను పరిష్కరించుటకు నీకు తోడవుతా
చీకటిలో వెలుగునై కనుపాపలకు తోడవుతా
- నిదిరిస్తున్నప్పుడు మంచి కలను చూపి తోడవుతా
దుప్పటిలా హత్తుకొని స్వప్న లోకాలకు తోడవుతా
- మంచి చెడులు నిరంతరము హెశ్చరిస్తూ తోడవుతా
కాలాన్ని ఎప్పటి కప్పుడు తెల్పియు నీకు తోడవుతా
- మనస్సు శాంతి పరిచే మాటలు అందిస్తూ తోడవుతా
జిహ్వ చాపల్యం ఎప్పటికప్పుడు తీరుస్తూ తోడవుతా
- ఇంద్రియాలకు అంతరాయం కలగకుండా తోడవుతా
నిద్ర అంటూ ఉండదు మంచి ఆలోచలకు తోడవుతా
- బంధం పదిలం చేయుటకు ప్రేమను అందిస్తూ తోడవుతా
అంతరాత్మను నేను
దేవుడిగా తోడున్నాను
మంచి మార్గానికి తోడవుతాను
ఇది వేణుగోపాల ప్రేమ సుమా
--((**))--
ఆరాధ్య ప్రేమ లీల
రచయత: మలాప్రగడ రామకృష్ణ
నిండు పున్నమి జాబిల్లిని చూసి పరవసించా
- పండు వెన్నెల కదలిక చూసి పరవసించా
అండ పొందిన అమరిక చూసి పరవసించా
- ఉండు జన్మంత పసిడిని చూసి పరవసించా
ఏడు కొండల రాయుడిని చూసి పరవసించా
- పద్మావతి అమ్మవారిని చూసి పరవసించా
తల్లి తండ్రుల మొక్కులను తీర్చి పరవసించా
- భార్య బిడ్డల ఆశలను తీర్చి పరవసించా
పరవసించుట మనిషి హక్కు
మానవత్వాన్ని నిలిపే మరో హక్కు
అందరిలో ఉన్న దైవాన్ని గుర్తించే హక్కు
ఇది వేణు గోపాల ప్రేమ సుమా
--((**))--
ఆరాధ్య ప్రేమ లీల
రచయత: మాలాప్రగడ రామకృష్ణ
సుఖముగా పుట్టి సుఖ మెరుగక తిరుగుతున్నా
- మాయలోన బుట్టి మాయ ఎరుగక తిరుగుతున్నా
భయం లోన పెర్గి భయం తెలియక తిరుగుతున్నా
- ప్రేమ లోన నల్గి ప్రేమ నిజం కాక తిరుగుతున్నా
ధైర్యం ఇంట బుట్టి స్త్రీకి లొంగి ఇక తిరుగుతున్నా
- బంధం వెంట చిక్కి మౌనం వెంట ఇక తిరుగుతున్నా
తల్లి తండ్రి మాట వేదం అని చెప్పి తిరుగుతున్నా
- గురువు, దైవాన్ని ప్రేమించాలి తెల్సి తిరుగుతున్నా
కాలం మారుతుంది
గుణాలు మారుతాయి
ప్రేమలు ఒక్కటౌతాయి
ఓర్పు నీకు నేర్పని తెలుసుకో
ఇది వేణుగోపాల ప్రేమ సుమా
--((**))--
కామెంట్‌లు లేవు:
కామెంట్‌ను పోస్ట్ చేయండి