11, సెప్టెంబర్ 2018, మంగళవారం

తాత మనవుడి చిన్న కధలు (4)

ఓం  రామ్ -  ఓం శ్రీ మాత్రేనమ: శ్రీ కృష్ణాయనమ:

 ఆనందం - ఆరోగ్యం - ఆధ్యాత్మికం 

తాత మనవుడి చిన్న కధలు (23)
రచయత: మల్లాప్రగడ రామకృష్ణ 

తాత బిచ్చగాళ్ళు తెలివి మీరారు అన్నాడు మనవుడు
ఎట్లా కనుక్కున్నావురా 

ఇందాక ఒక బిచ్చగాడు వచ్చాడు, 
కొంచం బిరియాని ఉంటె పెట్టండమ్మా అని అడిగాడు. 
చేయి ఖాళీలేదని చెప్పాను, ఆలా పైకి పోయిరా అన్నాను.
అంతె వెంటనే లిఫ్ట్ బాయ్ ను పిలవండి, వెళ్లి అడుక్కోవాలి అన్నాడు వాడు. 

వెంటనే నాకు కోపం వచ్చింది తమాయిన్చుకొని లిఫ్ట్ బాయ్ తో  చెప్పాను తాత గారు.

మంచి పని చేసావ్, తొందరపడి నోరు జారవనుకో వీరి మాటలకూ సమాధానములు ఉండవు నీదగ్గర 
ఎందుకంటే ఎందరో ఇళ్లల్లో అనుభవాలు సంపాయించి ఉంటారు వారు. 

భిక్షాటన నిషేదించారు, రాజకీయ నాయకులు అది నీకు తెలుసా అన్నాడు తాత గారు.  
అదేంటి తాతగారు, వారు ఓటు భిక్ష అడుకుంటారు కదా అన్నాడు మనవుడు.  
శాసనాలు చేయటమే వాళ్లకు తెలుసు, ఆచరణ కొచ్చేటప్పటికల్లా అనేక మార్పులు వస్తాయి, ధనవంతులకు ఓ రకం, ధనం లేనివారికి మరోరకం గా ఉన్నాయి, వాటి గురించి మన చర్చించ కూడదు, బిచ్చ౦ వెయ్యాలను కుంటే వెయ్యాలి ఆవును తాతగారు.

మొన్న అమ్మొమ్మ ఒక బిచ్చగాడ్ని దున్నబోతులాగున్నావు కష్టపడి పనిచేసుకోలేవా అన్నది. 
వెంటనే బిచ్చగాడు నెమ్మదిగా అంతేలేమ్మా " పశువులకు మనుషులు కూడా పశువుల్లా కనబడుతారు" అన్నాడు. 
అప్పుడు చూసా అమ్మొమ్మ మోఖం ఎర్రగా మారింది.

తాతయ్య మనుష్యులను పశువులుగా పోల్చాడు కదా తాత.
అవును అందుకే జాగర్తగా ఎవరితో నయినా మాట్లాడాలని అంటూ ఉంటాను నేను. 

మొన్న నేను ఇంట్లో ఉన్నప్పుడు బిచ్చగాడు వచ్చాడు. 
సరే అని చేతిలో ఉన్న 10 రూపాయలు ఇచ్చాను, వీటితో ఇప్పుడు టీ కుడా రావటంలేదు సార్, 
ఒక్క సారి మీ సెల్ ఇవ్వండి ఫోన్ చేసుకోవాలి అన్నాడు.  

అంతే ఫోన్ ఇచ్చాను మాట్లాడుతున్నాడు, ఎప్పుడిస్తాడా అని ఎదురు చూస్తున్నాను అనాలో ఎవరో పిలిచినట్లు లోపలలకు వచ్చా, సెల్ లేదు, మనిషి లేడు ఇదేరా లోకం తీరు. 
పెడితే ఒక తంటా పెట్టక పొతే మరోతంటా. 

శక్తి కొద్దీ దానం చెయ్యాలి అని చెప్పారు పెద్దలు ఆ ప్రకారంగా ప్రతి ఒక్కరు చేస్తే మంచిదే 
అందుకనే అన్నారు చెప్పే వారికే నీతులు ఆచరించే వారికి ఉండవు.                                               
--((**))--       

తాత మనవుడి చిన్న కధలు (22)
రచయత: మల్లాప్రగడ రామకృష్ణ 

తాత పంచ పునీతాల గురించి తెలపవా ? 
వాక్ శుద్ధి, దేహశుద్ధి, భాండ శుద్ధి, కర్మ శుద్ధి, మన: శుద్ధి,    

వాక్ శుద్ధి : సకల ప్రాణులలో ఒక్క మనుష్యులకు మాత్రమే మాట్లాడే వరం భగవంతుడు కల్పించాడు.  కనుక వాక్కును దుర్విని యోగం చేయక, సత్య వాక్కుగా మనస్సుని శాంత పరిచే విధముగా ఉండాలి. పగ,  కసి,   ద్వేషముతో  సాటివారిని  ప్రత్యక్షముగా గాని పరోక్షంగా గాని నిందించ కూడదు. అమంగళాలు మాట్లాడేవారు ఎదురైతె వారితో మాట్లాడ కుండా ఒక నమస్కారం  పెట్టి మౌనంగా ఉండటం శ్రేయస్కరం.              

దేహశుద్ధి: శరీరం అనేది దేవుని ఆలయం వంటిది, మనశరీరం నిత్యం శుభ్రంగా ఉంచు కోవాలి,  రెండు పూటలా స్నానం చేయాలి, పరిశుబ్రమైన వస్త్రాలు ధరించాలి. శరీరాన్ని చమట బాక్టీరియా చేరకుండా కాపాడుతుంది.

భాండ శుద్ధి: శరీరానికి శక్తి నిచ్చేది ఆహారం. పరిశుబ్రమైన వస్త్రాలు ధరించి, ఆహారం పరిశుబ్రమైన పాత్రలో వండవలెను. అటువంటి ఆహారం అమృత తుల్యంగా ఉంటుంది. అపరిశుభ్రం శరీరానికి హాని కలిగిస్తుంది.           

కర్మ శుద్ధి: అనుకున్న పనిని ఆపేవాడు అధముడు, అసలు పనినే చేయనివాడు అధమాధముడు,    అనుకున్న పనిని కర్మ శుద్దితో చేసినవాడు ఉత్తముడు. 

మన: శుద్ధి:  మనస్సు చంచలమైనది, ఉప్పొంగే కెరటంలా పరిగెడుతుంది, మనస్సు చక్రంలా  పరిబ్రమిస్తుంది అది వక్రమార్గంకుండా పోకుండా జాగర్తపడాలి.   ఎవ్వరికీ హాని కలుగ కుండా మనస్తత్వం కలిగి ఉండటమే మన: శుద్ధి. 

మనిషిగా ఎదగాలంటే పంచ పునీతాల ప్రతిఒక్కరికి అవసరం 
తాత నా మనస్సు స్థిరంగా ఉండాలంటే ఏంచేయాలి 
మంచిని ఆదరించి వంచనమాటలు తిరస్కరించి, దేహశుద్ధితో, కర్మలను చేస్తేమనస్సు ప్రశాంతము గా ఉంటుంది. 
--((**))--       



తాత మనవుడి చిన్న కధలు (21)
రచయత:: మల్లాప్రగడ రామకృష్ణ 

తాత సత్యమంటే  ఏమిటి ?
సత్యమనగా మూడు కాలములందును నుండునది. నాశనరహితమైనది. మార్పులేనిది అదియే "పరబ్రహ్మము". 

ఈనామమునకు మరిరెండు భావములుకూడా తెలుపబడు ౘున్నవి. (సత్+తి+యమ్) = సత్త్యమ్. 

"సత్". అనగా ప్రాణములు_ "తి" అనగా అన్నము, "యమ్" అనగా సూర్యుడు ప్రాణ, అన్న, సూర్యరూపములతో 
గూడినవాడగుటచే భగవానుడు "సత్యమ్" అని చెప్పబడెను. సాధు సజ్జనులయందలి సత్ప్రవర్తనమే సత్యమని జ్ఞానులు వచింతురు. కావున శ్రీహరి "సత్యమ్" అని పిలువబడుౘున్నాడు. సత్యశీలమే పరమాత్మ ప్రాప్తికి సాధనమని భావము.

విద్యుచ్ఛక్తి కాన రాదు అది వేగముగా పరుగెడుతుంది, తాకితే మాత్రం ప్రాణం లేని ప్రాణులుగా మారుస్తుంది. ఉపయోగం మాత్రం  అనంతం, అలాగే సత్యం మాట్లాడే వారికి విలువ ఉండదు, అను కరించేవారికి  గుర్తింపు నుండదు, అబద్దమంటే వేగముగా మనుష్యులను నమ్మిం చు . కానీ స్థిర విద్యుత్తు  ఎలా పనిచేస్తుందో అలాగే సత్య వాక్కులు మనుష్యుల మేధస్సును పెంచి ఆశయ సాధనకు, కర్తవ్య దీక్ష పరులుగా మారుస్తుంది. 
        
బల్బుల యొక్క రంగులను బట్టియును తరతమ భేదములను బట్టియును కాంతి భేదింౘు ౘున్నట్లు గాన వచ్చిననూ విద్యుచ్ఛక్తి మాత్రమూ అన్నిటియందును సమానముగా నుండును గదా. అదేరీతిని ఉపాధులు భిన్న భిన్నములుగా నున్ననూ అందున్న ఆత్మ సమానమే యగును. అట్లాగే సత్య బోధ మొదట కష్టముగా ఉన్నాను అదే మనస్సు శాంతి కల్గించును.  

తాత సత్య బోధ చేసిన వారు ఎవరైనా ఉన్నారా   
ఎందుకు  లేరురా బాబు ఎందరో మహాను భావులున్నారు వారిలో ఆధ్యాత్మిక మార్గదర్శకులు తెలుపుతా వారి  మార్గంలో నడుస్తే ప్రతి ఒక్కరికి మోక్షం కలుగు తుంది. 
వారెవరు తాత ?   
     బుద్ధదేవ్, శంకరాచార్య,.గురునానక్, ధనుంజయ్ దాస్ జి, ప్రణబ్ నందాజి,  భాస్కరా నంద, శ్రీ చైతన్య, నిగమానంద, స్వామి వివేకానంద, భిలరామ్ బాబా, గంభీరా నందజీ, బాలానందజీ, మహావీర, పద్మపాదాచార్య, భక్తి హరిదాస్, ప్రభు నిత్యానందా, మెహర్ బాబా, సత్య సాయి బాబా, కబీర్, తులసీదాస్, శ్రీ రామానుజం, గోరక్షాణాద్, తోతాపురి, ధియోర్షాబాబా, సంత దాస్ జి, మధుసూదన్ సరస్వతికి, బిశుద్యానంద పరమ హంస, బిజోయ్ కృష్ణ స్వామీ, శ్రీ అరవింద యోగి, రమణ మహర్షి, సాధక్ రామ్ ప్రసాద్, సాదఃక్ నామ్ దేవ్, శ్యామ్ చరణ్ లహారి, రామ్ ఠాకూర్, ప్రభుజగ ద్భన్దు, భోలాగిరి, బాలాజీ మహారాజ్, రామ్ దాస్ జి, కతియాబాబా, మహాత్మా త్రిలింగస్వామి, శ్రీ భోలానాద్, లోకనాద్, బ్రహ్మ  చారి, శ్రీ రామకృష్ణ పరమ హంస, వేంకటాచల జోష్యులు ..... ఎందరో .. మరెందరో,.. 
తాత తక్షణమే మీరు చెప్పిన వారు రచించిన గ్రంధాల విషయాలు తెలపండి చాలు 
మానవుడా నాకు తెలిసిన మహానుభావుల విషయాలు తెలియపరుస్తా ....  
--((**))--

కామెంట్‌లు లేవు:

కామెంట్‌ను పోస్ట్ చేయండి