8, సెప్టెంబర్ 2018, శనివారం

ఆరాధ్య ప్రేమ లీల






ఆరాధ్య ప్రేమ లీల                                                                                                                                      
రచయత: మల్లాప్రగడ రామకృష్ణ                                                                                                                         
గాలి కాలుష్యం చందకుండా, జాగర్త పడటమే మనపని
- పుడమి తల్లి కష్టాలు పడకుండా, ఉంచటమే మనపని   

కాల పరమార్ధాన్ని సద్వినియోగం చేయడమే మనపని   
- సమస్త ప్రాణులను ప్రేమించి, ప్రేమ పొందటమే మనపని

అజ్ఞానులను, విజ్ఞానులుగా మార్పు, చేయడమే మనపని
- సమయోన్నత శక్తిని చూపి, ఆదు కోవడమే మనపని   

సత్యం, ధర్మం, న్యాయం, సమయంలో బ్రతికించడమే మనపని 
తల్లి, తండ్రి, గురువు, వాక్కునే గౌరవించటమే మనపని 

విశ్వశాంటి కల్పించటమే మన లక్ష్యం 
దుర్మార్గాన్ని అణచడమే మన ధైర్యం 
దైవాన్ని ప్రార్ధించడమే మన మార్గం 
ఇది వేణు గోపాల ప్రేమ సుమా 
--((**))--


ఆరాధ్య ప్రేమ లీల
రచయత: మల్లాప్రగడ రామకృష్ణ  

మట్టివినాయకుణ్ణి తెచ్చి పూజలే ఇపుడు వినాయకా 
- నా మనసే నీకు పూజ పుష్పమాయ ఇపుడు వినాయకా 

నీ కీర్తనలు నాకు రాగ తలపులు ఇపుడు వినాయకా 
- నా సేవలు నీకు గోరువెచ్చగాను ఇపుడు వినాయకా  

నీ నవ్వుల వెలుగుతోనే వేదముగా ఇపుడు వినాయకా 
- నా ప్రార్దణలు బంధముగా మారెను ఇపుడు వినాయకా  

గరిక, పుష్పాలతో పూజ చేసాను ఇపుడు వినాయకా  
- స్నేహంతో ఉండ్రాళ్ళు, నైవేద్యం చేసాను ఇపుడు వినాయకా  

విఘ్న నాయకా పూజలందుకో 
సమస్త ప్రజలను ఆదుకో 
సమస్త విజ్ఞానము పంచి ఏలుకో 
ఇది వేణు గోపాల ప్రేమ సుమా 
--((**))--


ఆరాధ్య ప్రేమ లీల
రచయత: మల్లాప్రగడ రామకృష్ణ  

ఆకలితో అలమటించే వారికి రుచే చోటివ్వదు 
- చీకటితో సరసమాడే మనువు సిగ్గే చోటివ్వదు

వెలుతురు ఆవేశాలకు మనసు ఆశే చోటివ్వదు     
- ఆరాట పడుతున్నప్పుడు కాలం ఆశకు చోటివ్వదు 

వెన్నెలలో సరస మాడు నప్పుడు ఆశే చోటివ్వదు 
- జిజ్ఞాసకు అంతుండదు, ఏ మనుగడకీ చోటివ్వదు   

మల్లెకేమి మకిలుండదు. ఏ దిగులుకీ  చోటివ్వదు 
- ప్రేమికులమధ్య అపార్ధం, ఆశ,ఆవేశం, చోటివ్వదు  

చోటివ్వని చోట ఆశ పడకు 
మాయ ఉన్న చోట ఎగిరి పడకు       
మంచిని మరచి చెడుకు చోటివ్వకు 
ఇది వేణు గోపాల ప్రేమ సుమా   
--((**))--




ఆరాధ్య ప్రేమ లీల
రచయత: మల్లాప్రగడ రామకృష్ణ 

 నాటక సూత్రధారి పరమాత్మ అని తెలియాలోయ్ 
- నీ శ్వాస పెరుగక ఉంటె బ్రతుకని తెలియాలోయ్ 

క్షణ క్షణం మార్పును జయించాలని తెలియాలోయ్
- ఆశా మోహములే ప్రాణానికి ముప్పని తెలియాలోయ్

అనుభవ ధర్మ  ధైర్యమే గెలుపని తెలియాలోయ్     
- విజ్ఞాన  సాధనతో ఎదగా లని తెలియాలోయ్ 

పనియందు ప్రేమ దృష్టి నిలపాలని తెలియాలోయ్ 
- ప్రేమించి చెలియ ప్రేమను  పొందాలని తెలియాలోయ్ 

సద్గురువుల బోధల్ 
సత్య, ధర్మ, న్యాయ, శాస్త్రముల్
సమయం వ్యర్థం చేయక 
ఆచరించటం తెలియాలోయ్ 
ఇది వేణు గోపాల ప్రేమ సుమా
--((**))-- 



ఆరాధ్య ప్రేమ లీల-Pranjali Prabha .com 
రచయత : మల్లాప్రగడ రామకృష్ణ  

మనసే మంత్రమై హృదయ తంత్రులు వెదుకులాట 
- మమతే భంధమే  మధుర తంత్రులు వెదుకులాట 

మౌనమే మార్గమై సంసార తంత్రులు వెదుకులాట 
- కధలే  స్మ్రుతులై నయన తంత్రులు వెదుకులాట

ప్రేమలే చెలిమై తనువు తంత్రులు వెదుకులాట 
- బ్రతుకే ధనమై భయము తంత్రులు వెదుకులాట  

వెలుగే జీవమై మెదడు తంత్రులు వెదుకులాట 
- విశ్వమే వేదమై ఆయుధ తంత్రులు వెదుకులాట 

జ్ఞానులు, యోగులు యొక్క  
విద్యా తంత్రులు, దైవము యొక్క 
ప్రేమ తంత్రులు జగతి అంతా విస్తరించాలి 
ఇది వేణుగోపాల ప్రేమ సుమా 

--((**))--



ఆరాధ్య ప్రేమ లీల 
రచయత: మల్లాప్రగడ రామకృష్ణ 

నా మానస్సు నీ మాటను వినుట ఇంక కుదరదుగా
- నీవు అలా నా చూపును చూచుట ఇంక కుదరదుగా

నా కాలమంతా కలలో చూచుట ఇంక కుదరదుగా     
- నీ ప్రేమ అంతా కావ్యంగా చేయుట ఇంక కుదరదుగా

నా కనులు తిప్పి వింత చూచుట ఇంక కుదరదుగా
- నీ స్వచమైన రాగాన్ని వినుట ఇంక కుదరదుగా 

నా విరహం తావిచ్చే అవకాశం ఇంక కుదరదుగా
-నీ ప్రేమను తెల్పే గాలి వీచుట ఇంక కుదరదుగా  

ఇన్నాళ్ళు చేశాను ఆరాధనా 
దీని ఫలితమా ఈ ఆవేదనా  
కాలాన్ని బట్టి ఉండటమేనా 
ఇంక కుదరదుగా ఓ మైనా 
ఇది వేణుగోపాల పేమ సుమా 
--((**))--

కామెంట్‌లు లేవు:

కామెంట్‌ను పోస్ట్ చేయండి