ఆరాధ్య ప్రేమ లీల
రచయత: మల్లాప్రగడ రామకృష్ణ
పెదాలకు తాళాలు పెట్టి నట్లు ఉంటాయి
- ఆకలనే చెవి తిప్పీతె తెరవకుండా ఉంటుందా
ఆకాశము పుడమి అందనట్లు ఉంటాయి
- వర్ష మనే చెవి తిప్పితే కలవకుండా ఉంటుందా
శృంగారము అలక తాకనట్లు ఉంటాయి
- జిహ్వ చాపం చెవి తిప్పితే కరగకుండా ఉంటుందా
మోహమనే చూపులు తాకనట్లు ఉంటాయి
- అగంగం ఆదమరిస్తే ఆశ తీరకుండా ఉటుందా
పెదాల కదలికలు తాకనట్లు ఉంటాయి
- అధరామృతం తోడైతే ఆశ మారకుండా ఉంటుందా
లతలు పరిమలించ లేనట్లు ఉంటాయి
- నీ మనసు తోడైతే తపన తీరకుండా ఉంటుందా
అణువణువు ఆవేశం ఉన్నట్లు ఉంటాయి
- నింగి తార చీకటిలో మెరవకుండా ఉంటుందా
మనసు మమతా చుట్టూ ఉన్నటు ఉంటాయి
- నీ ధర్మ కీర్తి, న్యాయస్ఫూర్తి మెరవకుండా ఉంటుందా
అగ్నికి ఆజ్యం వెలుగు - నదికి సంద్రం వెలుగు
రాత్రికి పగలు వెలుగు - గాలికి ప్రకృతి వెలుగు
భార్యకి భర్తయు వెలుగు - నేర్పుకి ఓర్పుయు వెలుగు
ఇది వేణు గోపాల ప్రేమ సుమా
--((**))--
శ్రీకృష్ణాష్టమి సందర్భముగా
ఆరాధ్య ప్రేమ లీల
రచయత: మల్లాప్రగడ రామకృష్ణ
కరి రాజు కోరంగా పరుగు పరుగున రక్షించే
కపి రాజు కోరంగా స్నేహమును కలిపి రక్షించే
సిరి రాజు కోరంగా విఘ్నముల నుండి రక్షించే
దరి రాజు కోరగా యుద్ధమున సహకరించే
రేపల్లె వాసులందరిని పెనుతుఫాన్ నుండి రక్షించే
రోలునే వృక్షముల మధ్యగా లాగి శాపం తొలగించే
తల్లికి నోరు తెరచీ ప్రపంచ మొత్తాన్ని చూపించే
అటుకు లందించిన వారికి స్వర్గసుఖాలందించే
ముదుసలిచ్చిన పండ్లునుఁ ముదుమారా ఆరగించే
గురు యజ్ఞం కోసం ఆడదని చూడక సంహరించే
ఉడుత చేసిన సహాయంకు చేతితో నిమిరి ఆదరించే
హనుమచేసిన సహాయంకు ఆలింగనంతో ఆదరించే
రాముడన్నా, కృష్ణుడన్నా
మన మనస్సు శాంతి పడురన్నా
ఆరాధిస్తే చాలు మోక్షమే నన్నా
ఇది వేణుగోపాల ప్రేమ సుమా
--((**))--
ఆరాధ్య ప్రేమ లిల
రచయత: మల్లాప్రగడ రామకృష్ణ రామ జపం తరంగాలుగా విస్తరించి - దుర్మార్గుల మనస్సున చేరి రామ జపం కిరణాలుగా విస్తరించి - పుడమితల్లి హృదయం చేరి రామ జపం కెరటాలుగా విస్తరించి - సముద్ర ఘర్బాన ఖనిజాల్లా చేరి రామ జపం మనుష్యులను ఆవరించి - హృదయప్రక్షాలంగా మార్పుకు చేరి రామ జపం మనో బుద్ధులను కల్పించి - మానవాభ్యుదయానికి నిత్యం చేరి రామ జపం ప్రతి ఒక్కరునూ ఉచ్ఛరించి - మన:శాంతికి మనుగడగా చేరి రామ జపం కు హనుమ ఇంట నివసించి - ప్రేతాత్మల నుండి రక్షణగా చేరి రామ జపం కు దేహబలం శక్తి ఆవహించి - ఇల్లాలి కోర్కలు తిర్చుటకు చేరి అందుకే నిత్యం జపించు శ్రీరామ రామ రామేతి రమే రామే మనోరమే ! సహస్రనామ తత్తుల్యం రామనామ వరాననే !! శ్రీరామనామ వరానన ఓమ్ నమ ఇతి. --((**))-- |
ఆరాధ్య ప్రేమ లీల
రచయత: మల్లాప్రగడ రామకృష్ణ
అల్లరి చెలుల అలకలు తీర్చిన వాడే వీడు
- వేణు గానందతో మనసును మార్చిన వాడే వీడు
తల్లితండ్రులకు మోక్షాన్నికల్పించిన వాడేవిడు
- నోటిలో సకల లోకాలు చూపించిన వాడే వీడు
ఆడబడుచుల శీలాన్ని రక్షించిన వాడే వీడు
- మూర్ఖుల గర్వాన్ని మాయతో అణచిన వాడే వీడు
ఎత్తుకు పైఎత్తు వేసి చిత్తు చేసిన వాడే వీడు
- జీవితంలో శాంతి సౌభాగ్యం కల్పించిన వాడే వీడు
స్వామిరారా అనుకో
మనసును తేలికపరుచుకో
జీవితాన్ని రక్షించుకో
ఇది వేణుగోపాల ప్రేమ సుమా
--((**))--
ఆరాధ్య ప్రేమ లీల
రచయత : మల్లాప్రగడ రామకృష్ణ
కోపము మనిషిని ఊయలుగా ఊపేస్తుంది
- గొడవ మనిషిని బొంగరంగా తిప్పేస్తుంది
పేచీలు మనిషిని మౌనముగా మార్చేస్తుంది
- నవ్వులు మనిషిని ఆలోచింప చేయిస్తుంది
ఏడ్పులు మనిషిని అయ్యోమయ్యం గాచేస్తుంది
- ముచ్చట్లు మనిషిని మార్చేట్లు ప్రయత్నిస్తుంది
చెలిమి మనిషిని ప్రేమించేటట్లు చేస్తుంది
- ఆనందం మనిషిని ప్రేమమయాన్ని చేస్తుంది
కోపము ఉత్తముని యందు క్షణం
మధ్యముని యందు రెండు ఘడియలు
అధముని యందు రోజంతా
మూర్ఖునియందు చచ్చేంతవరకు
ఇది వేణు గోపాల ప్రేమ సుమా
--((**))--
రచయత: మల్లాప్రగడ రామకృష్ణ
పెదాలకు తాళాలు పెట్టి నట్లు ఉంటాయి
- ఆకలనే చెవి తిప్పీతె తెరవకుండా ఉంటుందా
ఆకాశము పుడమి అందనట్లు ఉంటాయి
- వర్ష మనే చెవి తిప్పితే కలవకుండా ఉంటుందా
శృంగారము అలక తాకనట్లు ఉంటాయి
- జిహ్వ చాపం చెవి తిప్పితే కరగకుండా ఉంటుందా
మోహమనే చూపులు తాకనట్లు ఉంటాయి
- అగంగం ఆదమరిస్తే ఆశ తీరకుండా ఉటుందా
పెదాల కదలికలు తాకనట్లు ఉంటాయి
- అధరామృతం తోడైతే ఆశ మారకుండా ఉంటుందా
లతలు పరిమలించ లేనట్లు ఉంటాయి
- నీ మనసు తోడైతే తపన తీరకుండా ఉంటుందా
అణువణువు ఆవేశం ఉన్నట్లు ఉంటాయి
- నింగి తార చీకటిలో మెరవకుండా ఉంటుందా
మనసు మమతా చుట్టూ ఉన్నటు ఉంటాయి
- నీ ధర్మ కీర్తి, న్యాయస్ఫూర్తి మెరవకుండా ఉంటుందా
అగ్నికి ఆజ్యం వెలుగు - నదికి సంద్రం వెలుగు
రాత్రికి పగలు వెలుగు - గాలికి ప్రకృతి వెలుగు
భార్యకి భర్తయు వెలుగు - నేర్పుకి ఓర్పుయు వెలుగు
ఇది వేణు గోపాల ప్రేమ సుమా
--((**))--
శ్రీ కృష్ణాష్టమి సందర్భముగా
ఆరాధ్య ప్రేమలీల -
గోపికలు యశోదకు తెల్పిన మాటలు
రచయత: మల్లాప్రగడ రామకృష్ణ
నల్లని వాడైన చక్కని వాడమ్మా
బలే అందమెన్నా చూపుల వాడమ్మా
అల్లరి చేసేటి కృష్ణుడు వాడమ్మా
అందరోడిలే మాకందని వాడమ్మా
వెన్న దొంగని పేరు గన్న వాడమ్మా
మనసు ఆరాధ్య దేవుడు వాడమ్మా
తిన్న నోటిలో బ్రహ్మా౦డం చూపాడమ్మా
మహిమలు చూపి మాయ చేశాడమ్మా
పాలుత్రాగుతూ పూతన చంపాడమ్మా
రోలు లాగుతూ శాపము తీర్చాడమ్మా
రక్కసులను కృష్ణుడు చంపాడమ్మా
గోపికలకు మోక్షం కల్పించాడమ్మా
బాలకృష్ణుని లీలలు చూడరమ్మా
భగవంతుడె ఈ బాలుడుగదమ్మా
ఎక్కడ చూచిన కనపడు నమ్మా
ఎదనే మధురం చేయును గదమ్మా
--((**))--
కామెంట్‌లు లేవు:
కామెంట్‌ను పోస్ట్ చేయండి