ఆరాధ్య ప్రేమ లీల, Pranjali Prabha.com
రచయిత: మల్లాప్రగడ రామకృష్ణ
మేఘంలా కరిగే మనసు నీకు దొరికిందా
మధువులా అందించేటి మనసు దొరికిందా
దుప్పటిలా వెచ్చగుండే మనసు దొరికిందా
ఉత్సాహంలా పనిచేసే మనసు దొరికిందా
నవ్వులా వెలుగునిచ్చే మనసు దొరికిందా
వెన్నెలా చల్లగ నుంచే మనసు దొరుకిందా
తక్కెడిలా చెలి తూచే మనసు దొరికిందా
చీకటిలా చలి పంచె మనసు దొరికిందా
మనసున్న వాడికి
దొరకంది లేదు
ఆకలున్న వాడికి
దొరకంది లేదు
వేణు గోపాల ప్రేమ సుమా
--((**))--
Pranjali prabha com
ఆరాధ్య ప్రేమ లీల
రచయత: మల్లాప్రగడ రామకృష్ణ
వసంతం చేరి వళ్లంతా వయ్యారంగా మారితే రావేమిటి
- చీకటి వెన్నల గాలిలో శ్రావ్యంగా మారితే రావేమిటి
చెలి మనస్సు ప్రేమగా పిలవంగా కోరితే రావేమిటి
- విరహాగ్నితో కలువ విచ్చగా పిలివగా రావేమిటి
తాను పడే ఆవేదనను చూసి చాలార్చగా రావేమిటి
- గులాబీల రెక్కల్లా వలువలు తొల్గించగా రావేమిటి
శిశిరాలను మోయలేని హృదయం ఉండగా రావేమిటి
- ఉషోదయంలా నిత్యం సహకరిస్తూ ఉండగా టేను రావేమిటి
పెదవిచాటున నవ్వులను చూపిస్తుండగా రావేమిటి
- రామనామంలా జపిస్తూ ఉంటె కరుణించగా రావేమిటి
కురులన్ని నీపేరే పిలుస్తూ ప్రేమిస్తుండగా రావేమిటి
- ఏకాంత విందును సమర్పిస్తాననగా నీవు రావేమిటి
కన్నుల సోయగాల్ని చూచుటకు తొందరగా రావేమిటి
- శ్వాసలలో నీ ఊసే కలవరించు చుండగా రావేమిటి
ప్రేముండగా పెద్దలను ఎదిరించి ధైర్యంగా రావేమిటి
- పెళ్లి చేసుకొని హాయిగా మారుదాం సంసారిగా రావేమిటి
రెండు చేతులు కలిస్తే శబ్దం
రెండు పెదాలు కలిస్తే మౌనం
రెండు కళ్ళు కలిస్తే ప్రణయం
రావేమిటి అడిగినా అడ్డు కాలం
ఇది వేణు గోపాల ప్రేమ సుమా
--((**))--
Pranjali Prabha.com
ఆరాధ్య భక్తి లీల
రచయిత : మల్లాప్రగడ రామకృష్ణ
పాల కడలి యందు ఉద్భవించిన కన్యవు
- పరమ దయాల హృదయ తరుణి మల్లేవు
వెంకటేశ్వర పట్టపు మహారాణి వైనావు
- అలమేలు మంగగా ఆనంద పరిచినావు
ముని జన స్తోత్ర, మహలక్ష్మిదేవి వైనావు
- సమస్త మారాధ్య కల్పవల్లీ దేవి వైనావు
హృదయానంద భరిత అమృతాన్ని పంచావు
- తిరుమల శ్రీనివాసుకే నాయక వైనావు
వరలక్ష్మి, గజ లక్ష్మి, రాజ్యలక్ష్మి వైనావు
- భాగ్య లక్ష్మి, శ్రీ లక్ష్మి, సౌభాగ్యలక్ష్మి వైనావు
సంతాన లక్ష్మి,, వెంకటా లక్ష్మి,దేవి వైనావు
శరణన్న వారికి కొంగు బంగారం చేసావు
మమ్ము కన్నబిడ్డల్లా కాపాడే తల్లివైనావు
- మాతగా తిరుమలేశ్వరుని దేవి వైనావు
మగువల కోరికలు తీర్చే గౌరి వైనావు
- అయ్యను క్రిందకు రప్పించి తృపి పరిచావు
అమ్మా మాకు నీవే దిక్కు
మీకే ఉంది కరుణించే హక్కు
మాకు అందిచవమ్మా అమృత వాక్కు
ఇది వేణు గోపాల భక్తి లీల సుమా
--((**))--
ఈ నెలలో పదవి విరమణ చేస్తున్న ఉద్యోగ మిత్రులకు చిరుకానుక "స్నేహ లీల"
ఆరాధ్య స్నేహ లీల
రచయత: మల్లాప్రగడ రామకృష్ణ
నిత్యం ఆపని చెయ్ ఈ పనిని చెయ్ అనేటి నీస్నేహం
- నాలో నవ్వు మారేదాకా మరువలేను ఓ మిత్రమా
కనురెప్పలా పూర్తి సహకారామ్ అందించిన స్నేహం
- మనస్సు లోన ఉన్నంత వరకు మారదు మిత్రమా
కనుచూపులతో చూపే మమకారం అనేటి స్నేహం
- కను మగురుగయ్యే దాకా నాలో ఉంటుంది మిత్రమా
తీపి మాటలతో మనస్సును మెప్పించిన నీ స్నేహం
- అధరం కంటే మధురాతి మధురం నాకు మిత్రమా
ఎన్నో ఎన్నెన్నో మంచి సలహాలు చెప్పిన నీ స్నేహం
- హృదయం లోని మాటను చెప్పాలని ఉంది మిత్రమా
కాల మార్పుతో ప్రళయం వచ్చినా మారదు నీ స్నేహం
- ఏ స్థితిలో నైనా పిలిస్తే సాహకరిస్తా మిత్రమా
అణువణువు ఆత్మీయతతో ఆదుకున్న నీ స్నేహం
- మానవత్వాన్ని మరచి ఉండనే ఉండను మిత్రమా
పదవి విరమణ చేసినా మారదు మన స్నేహం
- ఉద్యోగులందరి తరుఫున సన్మానమే మిత్రమా
నేనెవరో మీకు తెలియదు
మీ స్నేహం నేను మరువలేను
కాల గమనం ఏకం చేసింది
అదే స్నేహం సాస్విత మైనది
ఇది వేణు గోపాల స్నేహ లీల
--((**))--
కామెంట్‌లు లేవు:
కామెంట్‌ను పోస్ట్ చేయండి