ఓం శ్రీరామ్ - శ్రీ మాత్రేనమ: - శ్రీ కృష్ణాయనమ:
ఆనందం - ఆరోగ్యం - ఆధ్యాత్మికం
తాత మానవుడి చిన్న కధలు (18)
సేకరణ రచయత: మల్లాప్రగడ రామకృష్ణ
తాత ఐకమత్యం గురించి పాత కధ ఎమన్నా ఉంటె చెప్పు
ఎందుకు లేవురా చాలా కధలు ఉన్నాయి ఒక కోతులు కదా చెప్తుతా విను
ఐకమత్యం..........(పైడిమర్రి రామకృష్ణ.)
ఆనందం - ఆరోగ్యం - ఆధ్యాత్మికం
తాత మానవుడి చిన్న కధలు (18)
సేకరణ రచయత: మల్లాప్రగడ రామకృష్ణ
తాత ఐకమత్యం గురించి పాత కధ ఎమన్నా ఉంటె చెప్పు
ఎందుకు లేవురా చాలా కధలు ఉన్నాయి ఒక కోతులు కదా చెప్తుతా విను
అనగనగా ఒక అడవిలో కోతుల గుట్ట ఉండేది. అక్కడ చాలా కోతులు, కొండముచ్చులు నివసించేవి. ఆ గుట్టకు దగ్గరలోనే ఒక చెరువు ఉండేది. ఆ చెరువు ఒడ్డున ఒక మర్రి చెట్టు పచ్చగా పెద్దపెద్ద ఊడలతో అందంగా ఉండేది. ఆ మర్రిచెట్టు కింద కొంతకాలంగా ఒక ముని శివుని కోసం తపస్సు చేసుకొంటూ ఉండేవారు.
కోతులు, కొండముచ్చులు ఎప్పుడు పోట్లాడుకునేవి. చెట్లకు కాసిన పళ్లు, కాయలు కోసుకుని తిని, చెరువులో నీటిని తాగి మర్రిచెట్టు మీద ఎగిరేవి. కొండముచ్చులు రాగానే కోతులు మర్రిచెట్టును వదిలి గుట్టల్లోకి పారిపోయేవి.
ఇదంతా చాలా కాలంగా తపస్సు చేసుకుంటున్న ముని గమనించేవాడు. అవి అప్పుడప్పుడు ముని తపస్సును భంగపరిచేవి. ముని పట్టించుకోక వాటి సహజ గుణాన్ని చూసి నవ్వుకునేవాడు.
ఇలా ఉండగా ఎండాకాలం ఎండలు ఎప్పుడు లేనంతగా వచ్చాయి. దాంతో చెరువు ఎండిపోయింది. చెరువుని చూసి కోతులు, కొండముచ్చులు బాధపడ్డాయి. దాహం తీర్చుకోటానికి ఏం చేయాలో వాటకి తోచలేదు. అప్పుడే బుజ్జి కోతులు నీటి కోసం 'కిచకిచ'మని అరిచేవి. ముసలి కోతులకు కూడా కష్టమైంది. అవి నీటికోసం చాలా దూరం ప్రయాణించి మరో చెరువులో ఉన్న కొద్దినీటిని తాగి వచ్చేవి.
మునికి కూడా స్నానాకి, ఇతర కార్యాలకు నీటి కొరత ఏర్పడింది. అతడు కూడా దూరంలో ఉన్న మరో చెరువులో స్నానం చేసి, తన కమండలంలో కొంత నీటిని తీసుకుని మర్రిచెట్టు కింద తపస్సు చేసుకుంటుండేవాడు.
ఒకరోజు అతను తపస్సు చేసుకుంటుండగా ఒక కోతికి బాగా దాహంవేసి, దూరంగా ఉన్న మరో చెరువు దగ్గరకు పోలేక ముని కమండలంలోని నీటిలో మూతి పెట్టింది. ముని కండ్లు తెరచి చూశాడు. కోతికి భయం వేసింది. మునిని చూసి 'గుర్ర్' మని
భయపెట్టింది. ముని మాట్లాడలేదు. తిరిగి కండ్లు మూసుకొని తపస్సు చేసుకోసాగాడు. కోతి, నీళ్లు తాగి కమండలం కిందపడవేసి వెళ్లిపోయింది.
ఆ క్షణం అతడికి ఆ ప్రదేశం వదిలి మరోచోటికి వెళ్లి తపస్సు చేసుకోవాలనిపించింది. కానీ అడవిలో ఏ చోటైనా జంతువులు, పక్షులుంటాయని గ్రహించాడు. ఎండలకి అన్ని చెరువుల్లో దాదాపు ఎండిపోయిందని కనిపెట్టాడు. ఏం చేయటమా ....అని దీర్ఘంగా ఆలోచించాడు. అతడికి ఒక ఆలోచన తట్టింది.
వెంటనే మర్రిచెట్టుకు కాస్త దూరంలో ఉన్న ఒక ప్రదేశాన్ని ఎన్నుకుని అక్కడ పూజ చేశాడు. కొబ్బరికాయ కొట్టి కండ్లు మూసుకుని నమస్కరించాడు. కొబ్బరి చిప్పలకై కోతులు, కొండముచ్చులు అక్కడ చేరుకున్నాయి. అతని ముందే కోతులు, కొండముచ్చులు పోట్లాడుకోసాగాయి.
ముని మొదటసారిగా గొంతువిప్పాడు. ''ఆపండి! మీ పోట్లాట! అంటూ అరిచాడు. ముని మాట్లాడటంచూసిన కోతులు అవి ఆశ్చర్యపోయాయి. అతని కళ్లలో ప్రకాశిస్తున్న దివ్యజ్యోతిని చూసి భయంతో తలవంచుకొని నిలబడ్డాయి. ముని- కోతుల నాయముడు, కొండముచ్చుల నాయకుడిని దగ్గరకు పిలిచాడు.
''వానరుల్లారా! మీ శక్తి అమోఘమైది. ఇలా కోతిచేష్టలతో మీ శక్తిని వృధా పరుచుకోకండి. మీ ఇద్దరూ ఎకమై నిలబడితే ఎంతటి కార్యమైన అవలీలగా సాధించగలరు అన్నాడు ముని.
ఐక్యంగా ఉంటే ఏ పనైనా తేలికగా సాధించడం సాధ్యమేనా? అని కోతుల నాయముడు ప్రశ్నించాడు.
నిస్సందేహంగా- ''ఐకమత్యమే మహాబలం అని మరువకండి''. పట్టుదలతో ఉన్నవారికి ఏది అసాధ్యము కాదు.
మునీంథ్రా! మేము అనుక్షణం నీటి కోరత వల్ల మాలో కొన్ని కోతులు మరణించడం వల్ల. మా రెండూ జాతుల మధ్య వైరం ఏర్పడినది. మా దాహార్తిని తీర్చే మార్గం చూపించి పుణ్యం కట్టుకొండి.
మీ సమస్యను తప్పకుండా పరిష్కారిస్తాను.
మీ కోతుల దండు అంతా ఏకమైతే మీ దాహాం తీరిపోతుంది.
''వానరులారా! నేను పూజచేసిన ఈ ప్రదేశంలో ఒక మంచి నీటిని బావిని తవ్వండి!
అందులో జలసీరి ఎగసిపడుతుంది. మీ కష్టాలు సమసిపోతామని అభయమిచ్చాడు మునీంధ్రుడు.
అంతే.....జాతివైరం మరచి, కోతులు, కొండముచ్చులు ఏకమయ్యాయి. బావి తవ్వకాని కావలసిన పలుగుపార, తట్టబుట్ట తీసుకోని బావి తవ్వడం ప్రారంభించాయి. రెండూ రోజులు కష్టపడి ఒక పెద్దబావిని త్వాయి. అందులో నుండి పాతాళ గంగ ఎగసిపడి కోతుల శ్రమను, అలసటను మరచిపోయేలా చేసింది. కోతులు, కొండముచ్చులు ఒకదానికోకటి తమ అభినందనలు తెలుపుకొని సంబరపడ్డాయి.
ఆ వానరనాయకులు తమ అనుచరులతో మునీంధ్రునికి ప్రణమిల్లి. మీ పట్ల అపచారంగా ప్రవర్తించినందుకు క్షేమించమని ప్రార్థించాయి.
అసలే కోతులు మీ బుద్ధి నిలకడగా ఉండదు కానీ, మీ సంకల్పం మాత్రం బహు గోప్పది.
మీవల్ల నలుగురికి మంచి జరగాలి. అప్పుడే మీకు మంచి జరుగుతుందని ఆశీర్వదించాడు.
వనదేవత! మునీంధ్రుని ముందు ప్రత్యక్షమై....! వత్సా! నీ ప్రయత్నము అద్భుతము. నాడు శ్రీరాముడు లంకకు వారధికట్టి రావణ సంహారం కావించి, సీతకు రావణనుని చెరనుండి విముక్తి కలిగించాడు. నేడు ఈ వానరసేనతో పాతళగంగను భూమిపై గలగలపారించి అపరభగీరధుడవై నిలిచావు. నీకు సకల శుభములు కలుగుతాయి అని ఆశీర్వదించి, వనదేవత అదృశ్యమైంది.
మునీంధ్రుడు రెండూ కనులు మూసుకొని తన ధ్యానంలో నిమగ్నమయ్యాడు.
ఐకమత్యం..........(పైడిమర్రి రామకృష్ణ.)
తాత మానవుడి చిన్న కధలు (17)
రచయత: మల్లాప్రగడ రామకృష్ణ
తాత గొప్ప వారు ఎవరు తాత అని మనవుడు అడిగాడు ?
ప్రతి ఒక్కరు గొప్పవారే సమయానాన్ని వ్యర్ధ చేయకుండా, ఎవ్వరికి భారం కాకుండా, ఎవ్వరిని మోసం చేయకుండా, నమ్మిన కళలో విజయ సాధించాలని తీవ్రకృషి చేసిన వారు గొప్పవారు, ధనం ఉన్న వారు గొప్పవారు అనుకోవటం తప్పు,
అందుకే ఒక చిన్న కధ చెపుతా విను మనవుడా
కాలం కదులుతుంది అది మనకు తెలియదు, పగలు రాత్రి కలయికతో ఒక రోజు కదుల్తుంది. ఆ మధ్య సమయంలో అనేక మార్పులు నిత్యమూ గోచరమౌతాయి.
అందరి కన్నా గొప్ప నేను అనుకుంటారు ఎవరికి వారు అనగా ఓ అందమైన భవనాన్ని నిర్మించు టకు ఇటికలు గొప్పవని చెప్పుకున్నాయి. ఆ ప్రక్కనే ఉన్న సిమెంటు అన్నది మీరు విడిగా ఉన్నప్పుడు ఎవరు గమనించరు, ఇటుకలను ఎక సూత్రముగా కలుపుటకు నేనుండగా మీ గొప్ప పెరిగింది అన్నది. అక్కడే ఉన్న దర్వాజాలు, కిటికీలు అందముగా మేము ఉండుటవల్లే ఇంటికి అందం పెరిగింది అది మీరు గమనించండి అన్నాయి.
అప్పుడే అటుగా మేస్త్రి పోతూ వీళ్ళ సంభాషణలు విని నేను కూలీలను చేర్చి చక్కగా నిర్మించుట వల్లా, గొప్పగా కనిపించింది ఈ భవనము. అప్పుడే అటుగా పోతున్న ఇంటి యజమాని వచ్చి మీ రందరు కాదు ఇది నా సంపాదన వళ్ళ ఏర్పడినది మీరందరు నేను పిలవగా వచ్చిన వారు అన్నాడు.. అప్పుడే అటుగా ఒక స్త్రీ భాదపడుతూ వచ్చింది.
అమ్మా ఎవరు మీరు బాధ పడుతున్నారు అని అడిగాయి. నేను పుడమి తల్లిని మీ బరువు నంతా మోసున్నాను నన్ను మరిచి పోయారు మీరు, మిరే గొప్ప అని అను కుంటున్నారు అది ఎంత వరకు నిజం మీలో "సంయమనం, సహనం, పరస్పర సహకారం " లోపించింది. అందువల్లే నేను భాధ పడుతున్నాను . మమ్మల్ని క్షమించండి మా తప్పులు మన్నించండి. మేమందరం మీ బిడ్డలం .
మీకందఱకు నేను ఒకటే చెప్పేది ఐకమత్యం లోపించి, వ్యక్తిత్వమే ప్రాధాన్యత వహించిన చోట సదా పతనం, పరాభవం లభిస్తుంది. మీ గొప్పలు ఆవతలు పెట్టి ఐకమత్యంగా ఉండి " సంయమనం సహనం పరస్పర సహకారం ఉన్నత కాలం నేను మీ వెంటే ఉంటాను. మీరు ఎదురు తిరిగితే నేను పెట్టె కష్టాలను భరించ వలసి ఉంటుంది అని తెలుసు కొండి. ఒకరికొకరు సహకరాం అందించుకుటూ ఉంటేనే పగలు రాత్రి ప్రశాంతముగా ఉంటాయి.
తాతా అన్నిటి కన్నా గొప్పది భూమాత కదా తాత, అవునురా అందరికన్నా గొప్ప
ఇంకా ప్రత్యక్ష దైవాలు " సూర్యచంద్రులు, పంచభూతాలు, తల్లి తండ్రులు, గురువు గొప్పవారు.
మనవుడు నెమ్మదిగా వచ్చి తాత పాదాలకు నమస్కరించాడు.
ఏమిటిరా ఏ రోజు స్పెషల్ గొప్ప విషయాలు చెప్పారు, నా మనసుకు తృప్తి కలిగింది తాత
ఏమీ తెలిసిందిరా నీకు
ఎవ్వరూ గొప్పవారు కాదు, సత్యమ్, ధర్మం,న్యాయం నిలబెట్టే పరమేశ్వరుడే గొప్పవారు తాత
అవును ......... అవునా ....... అవును ... అవును
--((**))--
తాత మనవుడి చిన్న కధలు (16 )
రచయత: మల్లాప్రగడ రామకృష్ణ
తాతా ఆర్ధతరంగా అధికారాన్ని రద్దు చేసు కొనుట ఎందుకు, వీధి, వీధి తిరిగి ఓటేయమని మరలా అడుగుట ఎందుకు?
ఇది పెద్దవాల్ల విషయం
పెద్ద వాళ్లంటే ఎవరు తాతా
నేను నీకు ఏమౌతా వయసులో పెద్దవాడివి తాతా అంతేనా
అంతే కదా తాతా నీవే చెప్పావు " అందరికీ అన్నీ తెలియవు" తెలిసిన దానిలో నిష్ణాతులుగామారి కుటుంబపోషణకు, దేశసేవకు సహకరిస్తారని చెప్పావు"
అవునురా అవును, కానీ రాజకీయములో నిష్ణాతులకు విలువలేదు, మేధావులకు తావులేదు, విద్యార్థులకు గుర్తింపు లేదు కేవలము ధన సంపాదన, కీర్తి ప్రతిష్టల ప్రభుత్వ సొమ్మునే తనవారు తనచుట్టూ ఉన్నవారికి సహాయము చేసి జై జైలు కొట్టించు కుంటారు. అందరూ అంతేనా
లేదు అందరూ అలా ఉండరు మహాత్మాగాంధీ దేశం కోసం, మరి ఎందరో ప్రాణాలు అర్పించారు.
తాతా అసలు విషయం చెప్పలేదు
"చెపితే చాలా ఉన్నది చూస్తే ఏమీ కనబడదు" అన్నారు పెద్దలు. అర్ధం కాలేదు తాత
తలపండిన వారికే రాజకీయం గురించి అర్ధం కాదు, నాకు తెలిసినది చెపుతా విను.
మనిషికి అధికారానికి ఆశే జీవితం, అత్యాశపరుడుగా మారితే అంతా సర్వనాశనం. అధికారాన్ని రద్దు పరుచుటకు ఎదో ఒక ఆశ ఉండి ఉండవచ్చు, తాను అధికారంలో చేసిన పనులమీద నమ్మకం, నెరవేర్చిన వాగ్దానాలమీద నమ్మకం, అందుబాటులో ఉన్న ధనం మీద నమ్మకం తో ప్రజలను మల్లి ఓటు అడగటానికి ముందుకు రావచ్చు.
అందరికీ గెలుపు ఖాయమా తాత
అది ఎవ్వరూ చెప్పలేరు
మనిషి, అధికారులు ఊహించను గూడా లేని సంఘటనలను విధి జరిపిస్తుంది. జరగటానికి వీలుకాని వాటిని జరిపిస్తుంది. జరిగి పోతున్న వాటిని స్తంభింప జేస్తుంది. ఘటనా ఘటనలు విధి చేతులో వుంటాయి. అందుకే మన పెద్దవాళ్ళు 'విధి బలీయం' అని అంటూంటారు.
ఇతరుల దోషముల నెంచక చూపు సహజ చాకచక్యమును, తెలివినీ చూపి, తమ దోషములను తిలి పిన వారిని గుర్తించి, వారు చెప్పిన విధముగా మారి, ప్రతి ఒక్కరి సమస్యలను పరిష్కరిస్తూ ఓర్పుతో మాట్లాడుతూ, ఓదార్పుతో అనుకరిస్తూ, ప్రజాసేవకు అంకిత మైన వారినే ప్రజలు గెలిపిస్తారు, ఇదే లోక సహజం.
మరి గెలిచిన వారందరు మంచివారా తాత
మొదట మంచివారైనా అధికారం వచ్చిన తర్వాత కొంత అహంకారం ప్రవేశించి తను పట్టిన కుందేలుకు 3 డే కాళ్ళని వాదించే వారు లేక పోలేదు.
పాలు ఉపయేగపడేవేె, కాని ఒక్క రోజుకు మించితే పాడైపోతాయి. అలాగే నాయకుడు ఉపయోగ పడేవాడే అవసరానికి ఒక్కరోజు లో సహాయము చేయని వాడు పాలతో సమానమే.
పాలలొ మజ్జిగ చుక్క వేస్తె పెరుగు అవుతుంది. అలాగే నాయకుడు మరొక నాయకునితో స్నేహము కలిపితే పార్టీ బలం, పెరుగుతుంది.
పెరుగు మరొకరోజువరకు ఉపయోగపడతుంది. అలాగే పార్టీల మధ్య మనస్పర్థలు పెరిగితే మొదటికే మోసం రావచ్చు ఒక్క రోజులో పెరుగులా మారొచ్చు.
కాని పెరగు వేరొకరోజుకి పాడైపోతుంది.
పెరుగును మదిస్తే వెన్న అవుతుంది. మనస్పర్థలు రాకుండా మంత్రిపదవులు ఇచ్చి, అందు కున్నంత దోచుకో అని అవకాశము ఇచ్చి, నీటిలో వెన్న ముద్ద అంటనట్లు ఉంటె కొంత వరకు అధికారం నిలబడుతుంది. అంతే ఒక్క రోజులో ముదిరిన పాకంలా మారితే బెడిసి కొడుతుంది
వెన్న మరొకరోజు వరకే ఉంటుంది. తరువాయి అదికూడా పాడైపోతుంది.
ఆ వెన్నను మరిగిస్తే నెయ్యి అవుతుంది. వెన్నలాంటి మనసు ఉండి, న్యాయం, ధర్మం,సత్యమ్, నిరంతరం బ్రతికుంచుటకు శ్రమను ధారపోసి ప్రజా సేవకు అంకితమై, తన కష్టార్జితమును కూడా ఖర్చుచేసి ప్రజల హృదయాలలో ఉండేవాడే నిజమైన
నాయకుడు, ఇదే నేతితో సమానము
ఈ నెయ్యి ఎన్నటికి పాడవ్వదు.
తాత కొందరు నేతిని వాడరు కదా
అవునురా మంచి చేసే వారు జీవితము సాగించలేరు, ప్రజల హృదయాలలో నేతిలా కరిగి పోతారు.
తాత మరి నీవు ఓటు వేస్తావా " ప్రతి ఒక్కరూ ఓటు వెయ్యాలి నిజాయతీని బ్రతికించాలి.
తాత నాకు ఓటు లేదుగా తొందరెందుకు ముందొస్తుంది ముసళ్ల పండగ అంటారు పెద్దలు.
అంటే ఏమిటి తాత ..... బాబోయ్ ఇప్పుడు ఏమీ చెప్పలేను పార్టీ మీటింగుకు పోవాలి వస్తా ...
--((**))--
*నేటి - నీతి కథ*
ఒక గ్రామంలో ఐదుగురు మిత్రులు ఉండేవారు. వారు భిక్షువులుగా జీవించాలని నిర్ణయించుకొని, భిక్షా దీక్ష తీసుకున్నారు. ఇంద్రియాల్ని జయించిన వాడే గొప్ప భిక్షువు కాబట్టి ఐదుగురూ ఇంద్రియాల్ని జయించాలని గట్టిగా నిర్ణయించుకున్నారు.
ఒకరోజున ఐదుగురూ ఒకచోట సమావేశమై జితేంద్రియులు కావడానికి చేయాల్సిన కృషి గురించి మాట్లాడుకుంటున్నారు. వారిలో మొదటివాడు -
మిత్రులారా! పంచేంద్రియాల్లో మనం ఎక్కువ జ్ఞానం పొందేది కన్ను ద్వారానే. రంగూ, ఆకారాలను చూసి అది మనల్ని కోర్కెల వెంట పరుగులు తీయిస్తుంది. కాబట్టి ముందుగా మనం దృష్టి జ్ఞానాన్ని అదుపు చేసుకునే పనితో మన శిక్షణ ప్రారంభిద్దాం అన్నాడు.
లేదు మిత్రమా! కంటి కంటే చెవి ప్రమాదకరం. తీయని మాటలు విని మనల్ని మోసపుచ్చుతుంది. కాబట్టి శ్రవణేంద్రియ నియంత్రణతో ప్రారంభిద్దాం అన్నాడు రెండోవాడు.
కన్నూ, చెవి కంటే ముక్కు వల్ల కలిగే వాసనలు ప్రమాదకరం. సువాసనలు మత్తెక్కించి మన మనస్సుకి మైమరపు కలిగిస్తాయి. మనల్ని ఇంద్రియ లోలత్వాన్ని కలిగిస్తాయి. కాబట్టి వాసనల్ని దూరం చేసుకొనే విధంగా మన ఇంద్రియ నియంత్రణ శిక్షణ మొదలెడదాం అన్నాడు మూడోవాడు.
దానికి నాలుగోవాడు నవ్వి -
మిత్రులారా! రసతృష్ణకు మించిన తృష్ణ లేదు. నాలుక అదుపులో ఉంటే అన్నీ అదుపులో ఉంటాయి. రుచుల వెంట పడిపోయి, భ్రష్టులై, భంగపడినవారు ఎందరో...కాబట్టి రసతృష్ణను అదుపు చేసుకోవడంతో మన పని ప్రారంభిద్దాం! తేలిగ్గా జితేంద్రియులం అవుదాం అన్నాడు.
మీరు నలుగురూ చెప్పింది బాగానే ఉంది. కానీ శరీరం మొత్తం ఆవరించిన ఇంద్రియం స్పర్శ జ్ఞానాన్ని కలిగించే చర్మం. స్పర్శసుఖం అలవికాని ఆనందాన్ని రేకెత్తించి, మనల్ని త్వరగా పెడమార్గంలో పడేస్తుంది. కాబట్టి ముందు స్పర్శానుభూతులకు లోనుకాకుండా మన చిత్తాన్ని దృఢతరం చేసుకోవడం మేలు అన్నాడు ఐదోవాడు.
వారికి చిత్త ఏకాగ్రత కోసం, ఇంద్రియాల్ని అదుపు చేయడం కోసం సాధన ఎక్కడి నుండి మొదలుపెట్టాలో తేలలేదు. ఎవరి వాదాలు వారికి. ఎవరి ప్రాధాన్యాలు వారివి. కొన్నిరోజులు గడిచిపోయాయి. కానీ సాధన ఆగలేదు. ఈ సమస్య తేల్చుకోవాలని బుద్ధుని దగ్గరకు వచ్చారు. నమస్కరించి, తమ సాధన విషయం చెప్పారు. ఏ ఇంద్రియాన్ని మొదటగా అదుపుచేయాలో సెలవియ్యండి అని విన్నవించుకున్నారు.
భిక్షువులారా! ఏ ఇంద్రి నిగ్రహమైనా మంచిదే. మీకు ఏది ప్రాధాన్యం అనిపిస్తే ఆ ఇంద్రియ నిగ్రహంతోనే మొదలుపెట్టండి. ఒక ఇంద్రియాన్ని నిగ్రహించాక మిగిలిన ఇంద్రియ నిగ్రహాలు నెమ్మదిగా సాధించగలుగుతారు. ఎక్కడ మొదలుపెట్టాలంటూ తర్జన భర్జనల కంటే ఒక సాధనని ఎక్కడో ఒకచోట మొదలుపెట్టడం మేలు. ఒక ఇంద్రియ నిగ్రహం మంచిదే. అన్ని ఇంద్రియ నిగ్రహాలు మరీ మంచిది.
చక్కునా సంవరో సాధు, సాధు సోతేన సంవరో
ఘాణీన సంవరో సాధు, సాధు జివ్హాయ సంవరో..
కాయేన సంవరో, సాధు వాచాయ సంవరో
మనసా సంవరో సాధు, సాధు సబ్బత్థ సంవరో
చూపులు, శబ్దాలు, వాసనలు, రుచులు, వాక్కులు, స్పర్శలపై, మనస్సుపై - వీటిలో దేనిపై అదుపు ఉన్నా మంచిదే. అంతేకాదు, అన్నింటిపై అదుపు ఉండడం మరీ మేలు అని చెప్పాడు.
వారు వారికి నచ్చిన విధంగా సాధన మొదలుపెట్టారు. చివరికి జితేంద్రియులయ్యారు.
కనులు కనులు కలబడి
రారా ప్రియ. సుందర
రవి తేజ, వెన్నెలకు రాజ
వేచి నది రోజ-- కౌగిలి కి
రారా, ప్రియ. సుందర!
కనులు కనులు కలబడి చూచెను
పెదవి తొ పెదవి ముచ్చట లాడెను
మనసే మెచ్చి ,నచ్చిన సఖుడవు
మచ్చలేని నా మనో హరుడవు!
రారా ప్రియ సుందర......
రవి కిరణముల విరిసెను కమలము
చంద్ర కాంతి తో నవ్వెను కలువలు
సుందరాంగ నీ చూపులు సొకగ
పొందితి మిన్నగు సుందర రూపము
రారా ప్రియ సుందర.....
వున్నవి వెన్నెల చల్లని గాలుల
పొన్నల నీడన పానుపు పరచి
పరిమళించు ఈ పూవులు జల్లగ
పురుషోత్తమ నిను పొంద గోరితిర!
రారా ప్రియ సుందర.....
కామెంట్‌లు లేవు:
కామెంట్‌ను పోస్ట్ చేయండి