3, సెప్టెంబర్ 2018, సోమవారం

తాత మనవుడి కధలు-2





తాత మనవుడి చిన్న కధలు (15 )
రచయత: మల్లాప్రగడ రామకృష్ణ

తాత మిమ్మల్ని  ఒకటి అడుగు దామనుకున్న  
అడుగురా మనవుడా హనుమంతుని బిళ్ళను పిల్లల మెడలో ఎందుకు వేస్తారు తాత    
చెపుతా విను 
నరదృష్టి, భూత, ప్రేత, పిశాచాల, దృష్టి తగలకుండా కాపాడేవాడు, ధైర్యయాన్ని ఇచ్చి సంతోషమైన శక్తి సామర్ధ్యాలను అందించగలడని ప్రతిఒక్కరి నమ్మకం, నామాంకమే కాదు నా అనుభవంతో తెలియ పరుస్తున్నాను, ఆడ మోగా ఖచ్చితంగా ధరించాలి తప్పు ఉండదు అని మానాన్నగారు నాకు చెప్పారు, నేను నీకు చెపుతున్నాను. ఇంకా చెపుతాను విను.           

" బుద్ధిర్బలం యశోధైర్యం - నిర్భయత్వం అరోగతా 
అజాడ్జం వాక్పటుత్వంచ - హనుమత్ స్మరణాద్భవేత్ "

విజయసాధనలొ పట్టుదల, సడలని ప్రయత్నం, ఏకాగ్రత, బుద్ధి బలం, సమర్ధత  ఎవరి దగ్గర ఉంటాయో వారికి తప్పక విజయం సిద్ధించును. అది హనుమంతునిలో ఉంది, అందుకే రామ భక్త హనుమంతుని ఆరాధన చేయండి. మన:శాంతితో దైర్యంగా బ్రతకండి.         
          
ఒక్కసారి రామాయణంలో హనుమంతుని ప్రవర్తనను గమనించు కుందాము 

హనుమంతుడు వానరులతొ సముద్రము మీద ఎంత దూరము పోవలెనో తెలుసు కోకుండా సీత జాడ తెలిపెదనని, ఆత్మ విశ్వాసము వానరులకు కల్పించెను.  (మనమీద పెట్టుకున్న  నమ్మకాన్ని వమ్ము చేయకుండా సాధించ గలమని ఒక నమ్మకము కల్గిన్చటమే ఇందులో భావము )  

హనుమంతుడు సముద్రమీద పోవునప్పుడు మైనాకుడు కృతజ్ఞతా భావంతో విశ్రాంతి తీసుకోమన్న రామకార్యము మీద పోవునప్పుడు మద్యలో ఆగనని ప్రతిజ్ఞ చేసి యున్నాను, మీ సహకారమే నా కార్యమునకు ఆశీర్వచనులుగా భావిస్తున్నాను. ( మనము ఒక పని మీద పోవునప్పుడు మద్యలో ఆగి ప్రేమ పాశాలకు లొంగ కుండా ముందుకు పోవాలనేది ఇందు భావం  )

హనుమంతుని ప్రయాణములో " సురస"  హనుమంతునితో నా నోటిలోనికి ప్రవేసించే ముందుకు పోవాలి ఇదే  బ్రహ్మ నాకు ఇచ్చి వరమని చెప్పగా , వెంటనే చిన్న రూపము దాల్చి నోటిలోకి ప్రవేశించి బయటకు వచ్చెను.
 (మనము అవసరాన్ని బట్టి బలప్రయోగము చేయాలి, వీలున్న0త వరకు యుక్తితో జయించాలని ఇందు భావము)

హనుమంతుని నీడనె ఆకర్షించిన సింహిక నోటిలోకి దూకి మర్మావయవాలను ఛేదించి బయటకు వచ్చెను.  (అవసర మైనప్పుడు, దుష్టులైన  స్త్రీని కూడా చంప వచ్చునని, ఆకర్షణకు లొంగకుండా తుద  ముట్టించాలని ఇందుభావము)

హనుమంతుడు లంఖినికి బుద్ధిచెప్పి , లంకానమగరంలో ఉన్న సీత జాడ రామునకు తెలిపే కష్టాలు ఎదురైనా భయపడకుండా ఉన్న శక్తితో పోరాడటమే  నిజమైన ధర్మం      
(స్నేహధర్మం  నిలపాలనేదే అందరి లక్ష్యం అని తెలుసుకోవాలి)
తాతా నీవు చెప్పింది అక్షరాలా నిజం, నేను రాత్రి పడుకొనే ముందు హనుమంతుని తలచుకొని పడుకుంటా అంతే తెల్లారేదాకా మెళుకువ రాదు, కల అంటే తెలియదు అన్నాడు మనవుడు. 
సరే పదా ఆ రామాలయానికి పోయి ప్రార్ధించి వద్దాం 
సరే తాత ...               సరే పదా ..........
--((**))--




తాత మానవుడి చిన్న కధలు - 14  
రచయత: మల్లాప్రగడ రామకృష్ణ 

తాత ఉపకారి అంటే ఎవరు ? 
మనవడా చాలా పెద్ద ప్రశ్న అడిగావు
ఉపకార అంటే ప్రతిఒక్కరు ఉపకారులే అంటే ఒకరికి ఒకరు ఉపకారులుగా ఉంటేనే మనసు ప్రశాంతత, ఆరోగ్య భద్రత, దేశ సంపద పెరుగుటకు ప్రతి ఒక్కరు మూలకారులే.

          మొదటగా మేల్కొల్పే అంధకారమును తరిమి వెలుగును పంచే సూర్యుడు అందరికీ ఉపకారి, చల్లని గాలి పంచి సకల ప్రాణులనుండి బొగ్గుపులుసు వాయువును స్వీకరించి ప్రాణులను బ్రతికించే ప్రాణవాయువుని అందించే తరువులు అందరికీ ఉపకారి, ఎంతటి భారమైన భరిస్తూ ఖనిజ సంపదను, ఆహార వనరులను అందిస్తూ ఉండే పుడమి అందరికీ ఉపకారి, సకాలములో మేఘములద్వారా వర్షములు కురిపిస్తూ, పగలు సూర్యుణ్ణి, రాత్రుల్లో చంద్ర నక్షత్రసమూహాలను మోస్తూ ఉండే ఆబరము అందరికీ ఉపకారి, ఆదిమానవుల బ్రతుకులో నిప్పును అందించి ఆనిప్పే పుష్టిక ఆహారము తీసుకొనుటకు, మాంసాన్ని కాల్చుకొని తినుటకు ఉపయోగపడే నిప్పే అందరికీ ఉపకారి, సకల ప్రాణుల దాహార్తిని  తగ్గించి సముద్రములో కలిసే నది అందరికీ ఉపకారి.                     
        ఆకలంటే తెలియక మునుపే పాలిచ్చి, మురిపాలు పంచి, జోలపాడి, ఒడిలో ఆదమరిచి నిగుర పోయే తృప్తిని పరిచయం చేసిన తొలి అమ్మ అందరికీ ఉపకారి, అడుగులు తడబడకుండా అండగా నిలిచి నడక, నడత నేర్పి, బతుకు బండి తడబడకుండా ఉండాలని అంకితమై వారసత్వం పంచిచ్చే శక్తి శాలి తండ్రి అందరికీ ఉపకారి, అక్షరాలు దిద్దించి, క్రమశిక్షణ నేర్పించి లక్ష్యాలను సాధించే శక్తినిచ్చి క్షణక్షణం అభ్యున్నతిని కాక్షించే సులక్షణ మార్గదర్శి అసలు గురువు అందరికీ ఉపకారి,  సృష్టికి మూలం "ఆదిపరాశక్తి" ఆమే అందరికి ఉపకారి.    

ఒరే మనవుడా ఇంతకీ నీవు ఉపకరివా, అపకారివా ముందు నాకు చెప్పు అని అడిగాడు తాతగారు. 
బాలవాక్కు బ్రహ్మవాక్కు కదా తాత నేను అందరికీ ఉపకారి ఉంటాను అన్నాడు మనవుడు 
అపకారికి ఉపకారము చేయువాడు నిజమైన అందరికి ఉపకారి 
తాత ఇవిగో కళ్ళజోడు, చేతికర్ర, భగవద్గిత, తీసుకోని ఈ చెప్పులు వేసుకోండి అని అని చెప్పాడు, ఏమిటిరా ఈ రోజు  కొత్త అలవాట్లు నేర్చుకున్నావు       
అవును తాత ఉపకార అంటే తెలిపావు నీతోనే ప్రారంభిస్తున్నాను 
ఆ....        ఆ.. . అంటూ నవ్వుకున్నాడు తాత 
  .--((**))--




తాత మనవుడి కధలు
రచయత: మల్లాప్రగడ రామకృష్ణ 
  
తాత బహుమతి గురించి ఎమన్నా చెపుతావా, 
మనవుడా భుహుమతి నిమిత్తం నవ్వులాటున కూడా అబద్ధమాడకూడదు జాగర్త అన్నాడు 
ఎంతాత అలా అంటావు 
ఎం చెప్పెదిరా పెళ్ళైన కొత్తలో మీ అమ్మొమ్మ తో అన్న మాటలు గుర్తుకొస్తున్నాయి అందుకే చెపుతున్న 
బహుమతి గురించి ఏమన్నవో చెప్పు తాతయ్యా నాకు వినాలని ఉంది 
సరే చెపుతా విను     

 ఏమండోయి శ్రీమతి గారు నీ పుట్టిన రోజు సందర్భముగా ఏదైనా కోరు కోండి తీసుకొస్తాను అని ముద్దుగా భర్త అడిగాడు, అసలే మీకు గుండె జబ్బు, నేను కోరానుకో పడిపోతావు అన్నది భార్య , అడుగు నేను తీసుకొస్తాను. సరే అడుగు తున్నాను బహుమతి  గుండె ధైర్యం చేసుకోండి.  నాకూ "సొంత జెట్ విమానం" కొని పెట్టండి  ఆ మాటలకే భర్త బ్రహ్మానందం క్రింద బడి గిల గిల కొట్టు కుంటూ ఉన్నాడు.

నీరు చల్లి లేపి గొప్పలుకు పోకు, ఎప్పటిలా గుడికి పోయి దేవున్ని  చల్లగా చూడమని ప్రార్ధించి  తిరిగి వద్దాం, మీరు సుఖంగా ఉండి నన్ను పిల్లలను చక్కగా చూసు కుంటే  రోజూ పుట్టిన రోజులే. 

సరే నీవు బహుమతి ఏమి తేద్దామనుకున్నావో చెప్పు, అప్పుడు నా నిర్ణయం చెపుతాను. నేను చెప్పాకా నీవు కోపం తెచ్చుకో కూడదు, నన్ను తిట్ట కూడదు, ఆ చెప్పు  నీలాంటి బలహీన గుండె కాదు నాది, నీతో ఎన్నికష్టాలు పడలేదు చెప్పు. బహుమతి, బహుమతి ఆబ్బా చెప్పండి,  వేదించక, ఉండవే చెపుతాను, ప్రక్కన ఉన్న కర్ర, చీపురు  తీయనీవే, అసలే నామతి పొతున్నది,  ఏ బహుమతో చెప్పరా మొగుడా, చంపకు  .

నాలో అర్ధబాగాం నీవు ఆక్రమించావు, మిగతా అర్ధబాగాన్ని ఇవ్వటానికి, నీకు తోడుగా సవితిని తెద్దామను కుంటున్నానే, నీవు కష్ట పడ కుండా సహాయముగా ఉంటుంది,  ఏమన్నావ్  అదే నీ పుట్టిన రోజు గిఫ్ట్ గా తెద్దా మనుకుంటున్నాను అంతే

ఎమీ అనకుండా ఇంట్లోకి పోయి తలుపెసుకున్నది, భర్త కు కంగారు పుట్టింది ఆత్మ హత్యచేసు కుంటుందని అనుకున్నాడు, చీరమార్చుకొని కట్టుకొని, పిల్లలను, తీసుకొని బయటకు నడిచింది.
నాకు మీ బహుమతి వద్దు, దానితోనే ఉండండి, నేనే నా సవితిని నీకు నా పుట్టిన రోజుగా బహుమతి ఇస్తున్నాను వేల్లోస్తానండి. "నవ్వులాటతో అన్నానే, నామోహానికి రెండో పెళ్ళాము కూడానా", నన్ను కరుణిమ్చవే, పిల్లలను వదలవే నీవు రావే, చెంపలేసు కుంటున్నాను,  లోపలకు రావే , నాకెవ్వరూ లేరే నీవు తప్ప “నిజమైన ప్రేమ ముందు చిన్న అబద్దపు మాట సముద్రపు ఊప్పెనలా తయారవుతుంది “ నవ్వులాటకూ కూడ నీతో అభద్దం చెప్పను, అంటూ కాళ్ళు పట్టు కున్నాడు, ఒక్క సారి కాల్లు విదిలించగా, " ప్రక్కన నిద్రపోతున్న నేను క్రింద పడ్డాను. నీ పుట్టిన రోజు బహుమతి నీ పాదంతో  పూజా, నన్నుక్షమించండి, మీకాల్లకు దండం పెట్టుకోవాలి అంటూ మంగలసూత్రాలను కాళ్ళ కూ అడ్డు కుంది.    అయ్యో ఇది కల  అని నవ్వుకున్నది, పొద్దున్నే నీ నవ్వు మొఖమ రోజూ చూడాలని పిస్తున్నది, నీకీ బహుమతి తెస్తా, వద్దండి మనం హాయిగా ఏదైనా , అలా సినమా చూసి, హోటల్లో భోంచాద్దాం అదే నా పుట్టినరోజు బహుమతి.    
--((**))--

కామెంట్‌లు లేవు:

కామెంట్‌ను పోస్ట్ చేయండి