9, సెప్టెంబర్ 2018, ఆదివారం

Tata Manavudi kadhalu -4

om sri raam - sri maatrenama: - sri krishnaayanama:


తాతా మనవుడి చిన్న కధలు(20 )   
రచయత: మల్లాప్రగడ రామకృష్ణ 

తాత సంసారి సన్యాసిగా - సన్యాసి సంసారిగా ఎలా మారుతాడు వివరించుతావా?
అందరూ చెప్పే పాత కధ మరలా నీకు విని పిస్తా విను.
  
        ఒక సాధువు సంసారం మీద విరక్తి తో ఊరి బయట ఒక పాక వేసుకొని గురువుగారు చెప్పినట్లు ధ్యానం చేసుకుంటూ వూరి ప్రజలు తనకు సమర్పించే పళ్ళు,తిని పాలు మాత్రం తాగి జీవిస్తూ వుండే వాడు.
అతనికి రెండు కౌపీనాలు(గోచీలు) మాత్రమే ఉండేవి స్నానం చేసి ఒకటి ఆరేసుకునే వాడు,ఒకటి కట్టుకునే వాడు. కొన్నాళ్ళకు ఒక ఎలుక ఆ కౌపీనాన్ని రోజూ కోరికి వెయ సాగింది.
ఎన్ని కౌపీనాలు మార్చినా అలాగే కోరికేస్తూండేది.
గ్రామస్తుడొకడు ఆ సాధువు కు ఒక పిల్లిని యిచ్చి దీనివలన మీకు ఎలుక బాధ వుండదు స్వామీ అని చెప్పాడు.
మరి ఆ పిల్లికి పాలు పొయ్యాలి కదా! గ్రామస్తులంతా కలిసి అతనికి ఒక ఆవును కొనిచ్చారు.
ఆ ఆవు పాలు పితికేందుకు, దాని అడవి కి తీసుకొని పోయి మేపు కొని వచ్చేందుకు మనిషి కావాలి కదా!
ఎవరినైనా పెట్టుకుంటే వాడికి జీతమివ్వాలి. అందుకని గ్రామస్తులు అతన్ని పెళ్లి చేసుకోమని సలహా యిచ్చారు. అమ్మాయిని కూడా చూపించారు.
అతను పెళ్లి చేసుకున్నాడు. భార్య గోచీ బాగా లేదు పంచె కట్టుకోండి అని అన్నది.
సరే పంచెలు కొన్నాడు. బిడ్డలు పుట్టారు
వాళ్ళను పోషించేందుకు డబ్బు కావలిసి వచ్చింది. గ్రామస్తులతో మాట్లాడి ఒకరి పొలాన్ని కౌలు కు తీసుకొని సేద్యం చేయ సాగాడు.
తర్వాత పెద్ద ఇల్లు కట్టుకున్నాడు. సొంతంగా పొలం కొనుక్కున్నాడు. ఎద్దులు కొన్నాడు. సంసారం పెరిగి పోయింది.. ధ్యానం,తపస్సు వెనక బడి పోయాయి.
డబ్బు యావ పెరిగి పోయింది. ధ్యానం బదులు ధాన్యమే ముఖ్య మైంది. శాంతి కరువైంది. యిది యిలా వుండగా ఒకసారి అతని గురువు అతన్ని చూడ టానికి వచ్చాడు.
ఆయన యిదంతా చూసి ఆశ్చర్య పోయి యిదేమిటి రా నేను చెప్పిందేమిటి? నీవు చేసిందేమిటి? అని అడిగాడు.
.గురుదేవా! నా గోచిని కాపాడు కోవడానికి ఇన్ని  మార్పులు చేయాల్సి వచ్చింది   అని చెప్పి నాకు బుద్ధి వచ్చింది అని లెంపలు వేసుకొని .ఆ సంపదనంతా భార్యను చూసుకోమని చెప్పి అడవికి వెళ్లి పోయి హాయిగా కంద మూలాదులు తింటూ తపస్సు చేసుకుంటూ శాంతి గా గడి పాడుట .
కాలమే మనుష్యులను మారుస్తుంది, సంసారములోనికి దింపుతోంది, ఆకాలమే వైరాగ్యుయునిగా మారుస్తుంది, ఈతప్పు కాలందా మనుష్యులుదా, అది మీరే ఆలోచించండి.
మనవుడా ఈకధపై నీ అభిప్రాయం ఏమిటి
ప్రాయం వ్యర్థం చేయ కూడదు, అనుభవిస్తేనే కదా సుఖదు:ఖాల విషయాలుతెలుస్థాయి కదా తాత.           
                              
--((*))--



తాత మానవుడి చిన్న కధలు (19 ) Pranjali Prabha.com 
రచయత: మల్లాప్రగడ రామకృష్ణ 

తాతా సామెతలా గురించి ఎమన్నా చెపుతావా ? అవి రాజ కీయములో ఎలా ఉపయోగ పడతాయి.  
సామెత అంటేనే అను భవాల నుండి, ఆచారాల నుండి, కులాల నుండి, మతాల నుండి రాజకీయాల నుండి,  ప్రజల హృదయాలలో ఒక ఊత పదంగా వాడారు ఆనాడు, ఈనాడు కూడా వాడు తున్నారు. 
         
        “ఏరు దాటేదాకా ఏరు మల్లన్న, ఆ తరవాత బోడి మల్లన్న” - చాలామందికి తెలిసినదే! ఒక పార్టీలో ఎదిగి, తరవాత సమయాను కూలంగా పార్టీలు మారే వారికి, ఏ విధమైన స్వార్థమూ లేకుండా తమకు ఎన్నో రకాలుగా సాయం చేసిన వాళ్ళనే వెటకారం చేస్తూ - “ఆయనేమిటి? నాకు సాయం చేయడ మేమిటి? నేను స్వశక్తితో పైకొచ్చినవాణ్ణి అని మిడిసిపడే వాళ్ళకీ బాగా పనికొచ్చేది! 

తాత ఒక పార్టీ తరుఫున గెలిచి వేరొక పార్టీ లో చేరటం కదా తాత. అలాంటిదే ఆయినప్పటికీ  ప్రజలపై అటువంటి వాళ్లకు నమ్మకం ఎక్కువ ప్రజలే నాకు దేవుళ్ళు, అధికారం ఉంటే ప్రేజలకు సేవ చేయవచ్చు అని భావిస్తారు. ధన ప్రభావం కావచ్చు, పార్టీ ప్రభావం కావచ్చు, "అవకాశం ఉన్నంత వరకు సంపాదించుకో"  అన్న సామెతగా బ్రతుకు తారు కదరా మనవుడా.              

       ”ఏకులాగ వచ్చి మేకైపోవడం!” - ఇదీ చాలామందికి తెలిసిందే! అమాయకుడిలాగ వచ్చి, ఆ తరవాత తిష్ఠవేసుకుని, అసలు వాడికే పంగనామాలు పెట్టడం {తాము చెప్పినదల్లా విని, “తమ తమ పనులను” నిరాటంకంగా చేసుకొని వారి మాటలు పెడచెవి పెట్టటం}

       అంటే తాత ఒకరి ద్వారా గెలిచి మంత్రి పదవి పొంది, ముఖ్యమంత్రిని కావాలని  వారిని ప్రక్కకు తొలగించి తానే అధికారం తీసుకోవటం కదా తాత. 
అవునురా ఇది రాజకీయములో సర్వ సాధారణమ్. ఒక పార్టీ మద్దతుతో గెలిచి ఇది నా సొంతమని ప్రకటించటం, సహాయ పడ్డ వారిని తృణీకరించటం, తన కుటుంబ పాలనను పారంభించటం సర్వ సాధారణమ్. 

తాత నేను ఎప్పుడు నీ పార్టీనే నేను నిన్ను వదలను అంటూ గట్టిగ కౌగలించుకున్నాడు. 
ఆపురా ఆపు ఈప్రేమ అంతా నీకు పెళ్ళాం వచ్చేదాకే దత్తర్వాత నెవరో నేనెవరో 
అంతేరా అంతే " ఓడలు బండ్లు ఆవుతాయి - బండ్లు ఓడలవుతాయి. 
అందుతేనా తాత ఆంతే .....           ఆ ......... ఆలేదు  ...........  ఊలేదు....  నడూ ..        
        --((**))--



తాత మనవుడి చిన్న కధలు - 18
రచయత: మలాప్రగడ రామకృష్ణ
  
తాత సెల్ వాళ్ళ ఉపయోగం ఉందా లేదా కొంచం చెపుతావా 
ఏటో ఉపయోగం ఉంది, చెపుతా విను చిన్న కధ . 
తండ్రి కూతురు  సెల్ నవ్వుల హరివిల్లు "సెల్ "
కూతురు :  నాన్న నన్ను సర్కస్ కు తీసుకెల్తావా అని సెల్ లో తండ్రితో మాట్లాడింది 
తండ్రి : రడీగా ఉండు తీసికెల్తాను, అన్నట్టు మరిచాను నీవు పుట్టిన రోజు వేసుకొన్న ఆ గౌన్ చాలా బాగుంటుంది వేసుకో.
కూతురు :  అది చాల చిన్నది, అందులో బుట్టలతో పైకి పోతుంటుంది, అమ్మ బయటకు వేసు కేల్లనివ్వదు కదా నాన్న.
తండ్రి : అమ్మ చుట్టాలింటికి వెల్లిందికదా, ఎం పర్వాలేదు ఇప్పుడు అది ఫాషన్, అమ్మ వచ్చే లోపు వచ్చేద్దాం.
కూతురు : సరే అట్లాగే నాన్న 
(సర్కస్కు వెళ్లారు తండ్రి కూతురు, ఇంకా షో  బిగిన్ కాలేదు, అక్కడ ఉన్న టి  స్టాల్ వద్ద కూర్చుందామని  వెళ్లారు ఇద్దరు, కూతురుతో చెప్పాడు, సెల్ మాత్రం నీ దగ్గర పెట్టుకో, నేను అటూ ఇటూ తిరిగినా ఈ జనంలో మారి పడ్డ అదే మనకు రక్షా జాగర్త అని చెప్పి సిగేరేట్ త్రాగే పాడు అలవాటు ఉండటం వళ్ళ ప్రక్కకు వెళ్ళడు తండ్రి)
కూతురు: నాన్న పులి, నాన్న పులి అంటూ పరిగెట్టింది  
పులి : పులి ఘాన్డ్రిస్తూ  పరుగెడుతుంది కూతురి వెంట
కూతురు : వెంటనే తండ్రికి సెల్ నొక్కేంది నాన్న పులి అని చెప్పింది 
తండ్రి: భయపడకు నీ సెల్ లో పులి సౌండ్ వచ్చే పాట ఉన్నది అది అన్ చేయ్, భయ పడకు
కూతురు : అలాగే అది అన్ చేసి ధైర్యముగా పులి ముందుకు విసిరింది 
పులి : అంతే ఒక్కసారి ఆగి ఆ శబ్ద వంక చూస్తూ ఆగి పోయింది, వెనక్కి పోయినది, దానికి భయము వచ్చి 
కూతురు : ధైర్యముతో ముందుకు వచ్చి సెల్ తీసుకుంది, తండ్రి కి ఫోన్ చేసింది నాన్న అ పులి వెళ్లి పోయింది, నీవు చెప్పిన సలహా బాగుందినాన్న, అంటూనే, నాన్న పులి ఎంబడి పడుతుంది, నాన్న పరుగెత్తు ఆలోచించకు, అది అసలే మృగం అన్నాడు తండ్రి.  
పరుగెత్తి తెరిచిఉన్న సిహం బోనులోకి చేరింది కూతురు
కూతురు: నాన్న నేను సిహం బోనులోకి ఇరుక్కున్నాను, అని సెల్లులో చెప్పింది , దాన్ని చూస్తుంటే భయముగా ఉన్నది నాన్న. 
తండ్రి : భయపడకు ధైర్యముగా ఉండు, నెను నీ వెనుకనే ఉన్నాను 
కూతురు : బోన్ తలుపు పడి పోయింది నాన్నా, లోపల సింహం ఉంది నాన్న మీదకు దూకుతుందేమొనాన్న.
తండ్రి: నేను నేర్పిన శవాశనమ్ వేసి పడుకో అన్నాడు తండ్రి 
కూతురు : అట్లాగే నాన్న అంటూ పడుకున్నది. బొనులోనె, సింహము పెద్ద జూలుతో పాప ముందుకు వచ్చింది, అటు ఇటు చూసింది, వెనక్కి పోయింది 
(కూతురు సెల్ చేవిదగ్గరే పెట్టు కొని పడుకున్నది)
తండ్రి:  బోను తలుపు తీసా నెమ్మదిగా లేచి వచ్చేయి అని చెప్పాడు తండ్రి సెల్లులో 
కూతురు : నెమ్మదిగా లేచింది తలుపు దగ్గర్కు వచ్చింది,. సెల్ మోగింది, సింహం అరిచింది, ఒక్క గంతుతో కూతురు బయటకు వచ్చింది బోన్ తలపు పడింది.
టాంక్సు  నాన్న నన్ను కాపాడినందుకు    
నేను కాదు నీ దగ్గర ఉన్న సెల్ 
తండ్రి : సర్కస్ కు పోదామా 
కూతురు: నాన్న నిజమైన సర్కస్ ను చూసా, ఇంటికి పోదాం అమ్మ ఛీ సర్కస్ చూడాలిగా 
అంటూ నవ్వుకుంటూ నడిచారు తండ్రీకూతుర్లు .   అని ముగించాడు తాత 
తాత పులి అని అరిచాడు మనవుడు
మనవుడు ఏదిరా శబ్దం వినబడింది ఇదిగో అంటూ సెల్ చూపాడు మానవుడు
బడుద్దాయి అన్ని వేషాలే .....  తాత నీవు అమ్మొమ్మ దగ్గర వేసే వేషాలు కన్నా నావేమి పెద్దవి కావు 
ఏమన్నవ్ ....ఏమీ లేదు ... ఏమీలేదా ....   ఆ..  ఆ..
--((**))--

కామెంట్‌లు లేవు:

కామెంట్‌ను పోస్ట్ చేయండి