హాస్య ప్రభ
చిన్న హాస్య కధ (oka sinu) -1
Pranajalai Prabha .com
రచయత : మల్లాప్రగడ రామకృష్ణ
"ఒరేయి బహ్మానందం" నీకో విషయం చెప్పాలిరా
అన్నాడు సుబ్బారావు.
"ఏమోరా" నీవు చెప్పే విషయాలన్నీ ఒక సెన్సేషన్ చేస్తాయ్
" సరే చెప్పు " అసలే నాకు గుండె వేగంగా కొట్టు కుంటున్నది
" అట్లయితే వద్దులేరా" ( అని మాట్లాడలేదు)
" ఒరేయి ఒరేయి చంపకురా" నా కసలే ఆదుర్దాగా ఉంది.
సరే అలా నడుస్తూ నడుస్తూ మాట్లాడుకుందాం.
" అన్నయ్య గారు బాగున్నారా " విని
బాగున్నానమ్మా మీ వారిని పలకరిద్దామని వచ్చాను,
ఇక్కడుందామని కాదు.
ఇక్కడేట్లాగు ఉండలేరు
ఏమంటున్నారో అర్ధం కాలా అంటూ
అమ్మ మీకు నమస్కారం
మీ ఆయన ఎదో చెపుతానని, ఇందా కన్నించి అన్నడే తప్పా, ఒక్క మాట చెపితే ఒట్టు.
కాసేపు బయటకు పోదామంటాడు, కనీసం కూర్చోమనడు, నుంచో పెట్టి వాయిస్తున్నాడు
ఆ మాటలకు నవ్వు కుంటూ
మీకు ఇది మొదటి అనుభవం కదండీ సర్దుకు పోగలరు .
నేను కాఫీ తెస్తాను, మాట్లాడుతూ ఉండండి.
చూడు బ్రహ్మా నందం అంటూ ప్రారంభించాడు సుబ్బారావు , మనం
" సంసారం కోసం సంపాదన లో పడ్డాము ...
సంపాదన మొదలయ్యింది ...రక్త సంబందీకులు దూర మయ్యారు ..
నిజమేనా
నిజమే కదా
పిల్లలతో తీరిగ్గా గడుపుదామంటె, తీరిక దొరక లేదు....
ఇన్నాళ్లకు తీరిక దొరికిందను కుంటె ,
పిల్లలు సంపాదన లో పడిపోయారు!!
నన్ను నా శ్రీమతిని గౌరవించి ఆదరించేవారు లేరురా "
ఇదా విషయం
ఆ ఇదే
ఈ విషయం ఎవరికైనా చెప్పాలా అని ఆలోచిస్తున్నాను
ఇప్పడికి నీవు దొరికావు ఒక (బకరాగా )అన్నాడు
బ్రహ్మా నందం ఎక్కడా అంటూ చూసాడు
నేలపై గిలగిలా కొట్టు కుంటూ కనిపించాడు
ఏ మండి బ్రహ్మానందం గారికి, ఏమైందో ఒకసారి చూడండి .
అన్నయ్యగారు కాఫీ తెచ్చాను త్రాగండి
నాకేం కాలేదు,
నాకేం కాలేదు,
అంటూ గిలగిలా కొట్టు కుంటూ కూలబడ్డాడు బ్రహ్మానందం
అన్నయ్యగారు కాఫీ అండి
మీకో దండం, మీ కాఫి కోదండం అంటూ లేచి
వస్తానమ్మ
వద్దు వద్దు రానమ్మ, రా నంటే రాను, మీ ఆయనను మాట్లడిన్చుటకు రానేరాను .
అన్నయ్యగారు కాఫీ
" ఆ కాఫీ నాకీ నె తాగేస్తానులే "
ఆ ..... ఆ...
---(**))--
--((**))--
ఏమండోయ్!!
మిమ్మల్నే......
మీరు
సత్యవంతుడు ,
బుద్ధివన్తుడు,
సహన శీలుడు ,....
లాంటి వారి కోసం వెతకొద్దు!!
ఎందుకంటే...
బయట చాలా చాలా ఎండలు కాస్తున్నాయి!!
నేనేమో బయటికి రావడం లేదు!!
--((**))--
చిన్న హాస్య కధ (oka sinu) -2 Pranajalai Prabha .com రచయత : మల్లాప్రగడ రామకృష్ణ
ఎప్పుడూ ' టివి' సీరియల్సేనా
ఈ పతి దేవుడ్ని పట్టుకొనేదేమన్నా ఉన్నదా మీరు హడావిడిగా వస్తుంటే ఏమైందో అడుగు దామను కున్నా,
మరచి పోయానండి, ఉండండి ఇప్పుడే మంచి నీళ్లు తెస్తా
సరే అవే కాస్త నాకీ
చీ పాడు అవేం మాటలండీ, నాకి ఇమ్మంటారు
నాకి అంటే ఆ నాకుడు కాదు, నేను నీరు త్రాగుతాను ఇమ్మని
అట్లయితే ఇస్తాను ఉండండి
ఇంతకీ మీ సేన్హితునికి బాగోలేదు, ఆసుపత్రికి వెళుతున్నాను అనిచెప్పారువెళ్ళరా
ఆ వెళ్ళాను, వాడు ఎంత హడావిడి చేసాడో
ఏంచేసాడండి
అలా కూర్చో చెపుతా
అనుకున్నంతా జరిగింది!!
ఈ ఎండలకి ఎక్కడొ అక్కడ , ఇలాంటి ఘోరం జరగుతుందని వూహిస్తూనె వున్నాను!!
మా ఫ్రెండు...అదే.."బ్రహానందం " గాడు ..
"దైవేచ్చ " నర్సింగ్ హొమ్ ముందు కూర్చుని వున్నాడు !!
చెప్పక పోవడమేం, నా గుండె కొంచెం వేగం పెంచింది...
నిన్ననే.....వాళ్లింటికి వెళితే ...
"దా బాబూ....సగ్గు బియ్యం పాయసం చేసాను...
కొంచెం తాగు....ఈ ఎండలకి అది దివ్య ఔషధమ్...
బాగా చలవ చేస్తుంది..."
అని గ్లాసెడు పాయసం తెచ్చి ఇచ్చింది , మన "బ్రహ్మానందం " గాడి బామ్మ గారు!!
....కొంచెం ధైర్యం తెచ్చుకుని ,వణుకుతున్న బ్రహ్మానందం తో అడిగాను...
"ఎ...ఎ ...ఏమైందిరా...ఇక్క డున్నావు???" అని
వాడు చెప్పిన సమాధానం విని "అవాక్కై" పోయాను!!!
ఎం చెప్పాడండి డాక్టర్
ఎం చెప్పాడా చెపుతా విను,
...........
................
............
........................
..ఎం చెయ్యను మరి??...వై ఫి సిగ్నల్ ఇక్కడె వస్తోంది!!" అన్నాడు
అందుకే ఇక్కడున్నాను ....
ఆ.... ఆ...
--((**))--
చిన్న హాస్య కధ (oka sinu) - 3
Pranajalai Prabha .com
రచయత : మల్లాప్రగడ రామకృష్ణ
క్లాస్ రూములో టీచరు పిల్లల సంభాషణలు ఒక్కసారి చదవండి
"గీత...అంటె ... రేఖ ని (లైన్) ఎవరైనా వివరించగలరా !!? " అడిగింది టీచరమ్మ!!
" రాము " లేచాడు!!
"....అంటె టీచర్ ....గీత....అదే ....రేఖ ....అసలు అది ఒక చుక్క అన్నమాటా!!
...ఆ చుక్క వాకింగు కి వెళ్ళితే ....దాన్నే రేఖ లేదా గీత ....అని అంటారు!!" అన్నాడు " రాము "
"*---------------------------"
సీత నీవు చెప్పు
రేఖ సినిమా యాక్టర్, బ్రహ్మాన్దముగా నటిస్తుంది టీచరమ్మ
లక్ష్మణ్ నీవు చెప్పు:
చేతిని నుదుట మీద చూపుతున్నావు
రేఖలు కనిపించుట లేదా టీచరమ్మ
అవునులే బ్రహ్మ వ్రాసిన రేఖలు మీకు తెలుస్తే మాకు టీచర్ గా వచ్చేవారు కాదు, ఇలాంటి ప్రశ్నలు అడిగేవారు కాదు
ఆ.... ఆ... కూర్చో
టీచర్ ఈ రేఖ దగ్గరా కూర్చోమంటారా టీచరమ్మ
టీచర్ : ఒక రేఖను బోర్డు మీద గీసి చెరప కుండా చిన్నది చేయగలరా
రాము లేచాడు : నేను చేస్తాను టీచర్
ఒక గడ్డి పరక తెచ్చి ఇది రేఖ అనుకోవచ్చా టీచర్
అవుననుకో ఎలా చెపుతావ్
టీచర్ మీరు ఇటు పట్టుకోండి అంటూ రెండవ వైపు బోర్డు వద్ద పట్టు కొని చూపాడు, చూడు టీచర్ మీరు గీసినది దీనికాన్న చిన్నది కదా అదే రేఖా ఇది రేఖా అవునా టిచరామ్మా
బెళ్లైనట్టు ఉంది, రేపు కలుద్దాం
--((**))__
చిన్న హాస్య కధ (4 ) ఒక సీను
రచయత: మల్లాప్రగడ రామకృష్ణ
కొత్తగా పెళ్లైన జంట ఈవిధంగా మాటాడు కుంటున్నారు
కీటకాల భాషలో
మగ దోమ ఆడ దోమతో - డార్లింగ్, నేను నీ కోసం సింహాన్ని వేటాడి తీస్కొస్తా....
ఆడ దోమ - అంత అవసరం లేదు ..
మగ దోమ - ఏనుగుని కుట్టి దాని రక్తాన్ని నీ కోసం తీస్కొస్తా..
ఆడ దోమ - అంత అవసరం లేదు ..
మగ దోమ - నిన్ను బెంజి కారులో ప్యారిస్ తీస్క పోతా...
ఆడ దోమ - అంత వసరం లేదు ..
మగ దోమ - ఏటి నమ్మకం లేదా.. నీ కోసం 100 గ్రాముల బంగారు గొలుసు తీస్కొస్తా..
ఆడ దోమ - అంత అవసరం లేదు ? ముందు పని కానీరా నాకు నిద్ర వస్తుంది .
మగ దోమ - తల్లి తండ్రులను (అత్తా మామలను) మనమే పోషిద్దాం
ఆడ దోమ - అంత వసరం లేదు ..
మగ దోమ - ఏది అవసరమో చెప్పవే ..
ఆడ దోమ - అమృత ఘడియలు పోతున్నాయరా మగడా ..
మగ దోమ - దేవలోకం కెళ్ళి అమృతం తెమ్మంటావా ...
ఆడ దోమ - అంత వసరం లేదు .. ముందు నాకు ఆకలేస్తుంది ఆకలి తీర్చు
మగ దోమ - ఆకలి తీర్చటానికి మందు ఎమన్నా ఉందొ కనుకుంటా
ఆడ దోమ - అంత అవసరం లేదు ? ...
మగ దోమ - లేచావే ఎందుకు ...
ఆడ దోమ - ఆకలి తీర్చుకోవాటానికి ..
మగ దోమ - ఇదిగో బెల్లం ఉండి ఈ రోజుకు సర్దుకో ..
ఆడ దోమ - అది ముందే తీయకూడదురా మగడా .
అలా ముక్కులతో పొడుచుకొని తిన్నాయ్ దోమలు
ఎలా ఉందే నా బాషా
అఘోరించి నట్లుంది
లైటార్పిరా నిద్దరొస్తుంది
ఏమిటే దోమల కుట్టావ్
సింహంలా తినేస్తా ముందు లైటార్పు
ఆ ...... ఆ...
--((**))--
నేటి హాస్యం
రచయత: మల్లాప్రగడ రామకృష్ణ
"నాన్నా హైదరాబాద్ వెళతా ....
సిసమా డైరక్టర్ ని అవుతా!!" అన్నాడు "కొడుకు "
సిసమా డైరక్టర్ ని అవుతా!!" అన్నాడు "కొడుకు "
"అద్దం లో నీ ఫేస్ ఎప్పుడన్నా చూసుకున్నావా ??" అన్నాడు " తండ్రి "
ముందు యూ ట్యూబు సినిమాలో తీయటం నేర్చుకో అన్నాడు తండ్రి !!
"ఊ(!...సరే...సరే....విమానం లో పోతావా....రైల్లో పోతావా?" అడిగాడు " తండ్రి "
అయితే ముందు ఒక కెమెరా కోనండి, ఆ తరువాత ఎక్కడకు పోయి సినిమాలు తీసు చూపిస్తా అన్నాడు కొడుకు
అయితే కెమెరా కొనేదాకా ఇక్కడే ఉంది చక్కగా చదువుకో తరువాత ఆలోచిద్దాం ఏడు టీన్ద్రి
అంతేనా ...... అంతే .....
--((**))--
"జడ్జి గారు....నాకు ఆంటిసిపెటరీ బెయిలు కావాలి !!" అన్నాడు గజ గజ వణికి పొతూ "రామ్ ... జీ"
"అద్సరే నయ్యా!!!!..ఇంతకీ అంత ఘోరమైన పని నువ్వేం చెసావూ??!" అడిగారు జడ్జి గారు !!
"ఈ రోజే ,ఆఫీసులో కొత్త లేడీ సెగట్రీ ని పెట్టుకున్నానండి!!"అన్నాడు " రామ్ -వాజీ"
--((**))_-
"స్మార్ట్ ఫోన్" కి చెయ్యెత్తి నమస్కారం!!
ఈ కాలం ...
అబ్బాయలకి
అమ్మాయలకి ...
"తల వంచుకుని నడవటం...కూర్చొవడమ్ " నేర్పింది!!!
--((**))--
దేముడు గారు,ఒక సారి ....
ఒక మనిషి మెదడులోని ,
"జ్ఞాపక శక్తి" మొత్తం డిలీట్ చేసేసాడు !!
"ఊ(!! ఇప్పుడు నీకేమైనా జ్ఞాపకం ఉందా??హహహ!!!" అని అడిగాడు.
"ఓ!..... వుంది......మా యావిడ పేరు గుర్తు ఉంది!!" అన్నాడు మనిషి!
దేముడు ఖంగారు పడి మిగతా దేవుళ్ళని అడిగాడు.....ఇలా జరిగిందేమిటని!!!!
"హహహ....నువ్వు మనిషి మెదడు ఎంత ఫార్మాట్ చేసినా........
,"వైరస్" పోలేదు మరి !!" అన్నారు ముక్త కంఠం తో మిగతా దేవుళ్ళు!!
--((**))--
ఫుట్బాల్...ఆడా??...మగా??
ఖచ్చితంగా ఆడ!!
లేక పొతే...11+11=22 మంది ఎందుకు వెంటపడాతారు??!!
--((**))--
హహహ.....డబ్బులు తీసుకుని
,మనల్ని అడుకునెటట్లు చేసే వాడు ఒక్కడే!!
.....పానీ పురీ వాడు....
డబ్బలు తీసుకుని, చిన్న చిప్ప చేతిలో పెట్టి నించొమంటాడు!!
--((**))--
ఇంటర్నేషనల్ సర్వే ప్రకారము......
*****************************
"అరటి పండు తొక్క మీద కాలు వేసి,.... జారిన వాళ్ల
సంఖ్య కన్నా...
ఆడవారి మాటలకు జారి బోర్లా పడిన వారి సంఖ్య ఎక్కువ...ట!!
--((**))--
హహహ....సార్ వారూ!!
మీరు ఎప్పుడైనా మీ శ్రీమతి గారితో ఆర్గ్యుమెంట్ పెట్టుకున్నారా.....
అదే నండీ...వాదన పెట్టుకున్నారా???
...జాగర్తగా గమనించండి!!....
సాఫ్ట్వేర్ లైసెన్స్ అగ్రిమెంట్ చదివినట్టే వుంటుంది!!!
..అబ్బే!! మనకు ఒక ముక్క కూడా అర్ధం కాదు....కానీ
చివరలో ..."ఐ ఎగ్రీ"..
"నేను వొప్పుకుంటున్నను"
అన్న చొట ,
మనం "టిక్" కొట్టెస్తాము!!
--((**))--
"రా-మాయ-ణం"!!!!!!!!!!
కానిస్టే-బుల్ :..."సార్!! సార్!! నిన్న రాత్రి మన జైల్లో,ఖైదీలన్ద్రూ కలిసి రామాయణం నాటకం వేసారు సార్!!
జైలర్ బాబు: ఓహ్! ఇది చాలా మంచి విషయం.....వాళ్ళలో మార్పు వస్తోందన్న మాట .....గూడ్ ...గూడ్!!
దీంట్లో నువ్వు టెన్షన్ పడాల్సిన పని ఏముంది .
కానిస్టే-బుల్:..సార్!!.....అదే సార్!! నాకు టెన్షన్ ఎందుకంటే.......
హనుమంతుడి వేషం వేసిన ఖైదీ ,...
సంజీవనీ పర్వతం తెస్తానని వెళ్లి .
....................ఇన్తవరకూ రాలేదు!!, మరి!!!
--((**))--
"నాన్నోయ్!!...నాకు కూడా ఒక మోటార్ సైకిల్ కొని ఇవ్వు!!" అన్నాడు "పిడుగు"
"ఎడిశావ్ లేరా...పిల్ల సన్నాసీ !!...దేముడు నీకు రెండు కాళ్లు ఇచ్చాడు...ఎన్దుకనుకుంటున్నావ్??" అంది వాళ్ల బామ్మ!!
"ఆ మాత్రం మాకూ తెలుసు...
ఒక కాలు గేర్లు మార్చడానికి,
రెండొ కాలు బ్రేక్ వెయ్యడానికి!!" అన్నాడు "పిడుగు"
--((**))--
అంతర్జాతీయ ప్రేమ కథలు ఇలానే వుంటాయి!!
ఒక కుక్క గారు,ఒక దోమ గారు ఒకరినొకరు ప్రేమించుకున్నారు!!
"దోమ" కి ప్రేమ ఎక్కువయ్యి ....
"కుక్క" గారినిముడ్డు పెట్టుకుంది!!
"కుక్క" కూడా ,
దోమ ని మెల్లిగా కరిచి ,
తన ప్రేమ ని ప్రదర్శించింది!!
హు(! హన్తా..... దైవ నిర్ణయం!!
''దోమ''...రేబీస్ వచ్చి చచ్చిపోయింది!!!
''కుక్క''...డెంగ్యూ వచ్చి చచ్చిపోయింది !!!!!
--((**))--
"చదువు" లో ప్రగతి సాధించిన ప్రతి "మగవాడి" వెనుక...............
................
ఒక ..........
"డి ఆక్టివేట్" చేసిన ఫేస్ బుక్ అక్కౌంట్ వుంటుంది !!
--((**))--
మీ "ప్రభు"!! 040615-2
సరదాగా తీసుకొవాలండొయ్!, మరి!!!
"ఇదిగో!! మిమ్మల్నే!!...
ఒక వేళ , ఈ ప్రపంచం ఇంకో 30 ని.ల లో అంతం అయిపోతుంది అనుకుందాం ...
.అప్పుడు మీరేం చెయ్య దానికి ఇష్టపడతారు??!!" అని అడిగింది "జండుబామామెశ్వరి "
"అయ్ బాబోయ్ !! నిజవే(!!...అయితేనేను .....
అదే నా జీవితంలో ...ఒక్క సారైనా ...
నిన్ను ...నిన్ను...కొట్టాలని....
అదే..అంటె ... నాకు ఇది ఆఖరి అవకాసం కదా...అందుకని,..." అంటూ నసిగాడు "నంగి మాలోకం"
"జండుబామామెశ్వరి " భర్త ని ఒక సారి ఎగాదిగా ఒర్రకంటి తో చూసి.......
"ఊ(!!.....సరే!!...మీ సంబడం !!!
మరి మిగతా 29 ని.లు ఎం చేస్తారుట !!" అంది , దగ్గరికి వస్తూ!!
....వణికి పోయాడు మన "నంగి మాలోకం "....
--((**))--
అబ్బాయి;...."వావ్!!..నీ ఫొటొ చూసాను ఎఫ్బి లో...
నీ సౌన్దర్యమ్ ,నీ చర్మ కాంతి...మై గాడ్...అదుర్స్!!
ఎం వాడుతున్నావ్??
అమ్మాయి:....అడోబ్ ఫోటోషాప్...సీ ఎస్ 5!!
--((**))--
"హొండాళ్లమ్మ " తన హోండా సిటీ కారు లో వెళుతుంటే పెద్ద ఆక్సిడెంటు అయ్యింది!!
కాలు విరిగిన పేషంట్ ని డాక్టర్ , అడుగుతున్నాడు!!
"ఏమయ్యా !!...అసలే ఆడమనిషి బండి నడుపుతున్నారు..
.పైగా ఆవిడకు కొత్త...నువ్వేనా రొడ్డు మీద నడిచేటప్పుడు చూసుకుని నడవచ్చు గా !!" అని.
"రొడ్డా?? రొడ్డా???....రొడ్డెమిటండీ బాబూ....
.నేను నా పొలంలో పని చెసుకుంటూంటె కారు వచ్చి గుద్దేసింది!!" అన్నాడు బాధగా!!
--(**))--
"ఆహుల్ గాంధీ" ఒక చొట ఆగి, ఒక బీద వాడిని చూసి దగరకు పిలిచాడు!!
"ఎం బాబూ!!ప్రేమించడం కష్టమైనా పనా?? లేక విలాసవంత మైన పనా???"అని అడిగాడు!"ఆహుల్ గాంధి"
"అయ్ బాబో....చాలా విలాస వంత మైన పనండి!!" అన్నాడు బీద వాడు !!
"ఎలా చెప్పగలవు, అది విలాస వంత మైన పని అని!??" అని అడిగాడు "ఆహుల్ గాంధి"
"చిత్తం!!...చిత్తం...అది కష్టమైన పని అయ్యి ఉంటె .....,
తవరు ....ఆ పని కూడా , ఎంతో కొంత డబ్బు లిచ్చి ,...మాతొటె చేపించేవోరు కదండి!!
--((**))--
పెద్ద తేడా ఏమీ లేదు!!!
చైనా వాళ్ల దగ్గర "చైనా వాల్ " వుంటె ...
మనకి "కేజ్రి వాల్ " వున్నాడు !!
--((**))--
అబ్బో!!...మహా గడసరి !!!
రెలియన్స్ మాల్ కి వెళ్లి ,
తనకు నచ్చిన డ్రెస్ లన్నీ ట్రయల్ రూమ్ లో వేసుకుని...
సేల్ఫీ తీసుకునేవాడు...
--((**))--
కామెంట్‌లు లేవు:
కామెంట్‌ను పోస్ట్ చేయండి