16, సెప్టెంబర్ 2018, ఆదివారం

తాత మానవుడి చిన్న కధలు -31

Pranjali Prabha.com 
తాత మనవుడి చిన్న కధలు (౩౩)
తాత ఒక చిన్నకథ చెప్పవా అని అడిగాడు మనవుడు 

తల్లి తండ్రులను వృద్ధాశ్రమంలో చేర్చాడు..ఓ కొడుకు. 

ముసలి వారైన తల్లితండ్రులకి  సేవలు చేయడం తన భార్యవల్ల కాదని. 

వారానికోసారీ ఆశ్రమానికి వెళ్ళి తల్లి తండ్రుల  యోగక్షేమాలను తెలుసుకుంటూ కావలసిన వాటిని అమర్చి వచ్చేవాడు. క్రమం తప్పకుండా..... 

ఒకరోజు ఆ వృద్ధాశ్రమం నుండి అతని తల్లి ఆరోగ్యం బాలేదని ఆమె పరిస్థితి విషమంగా వుందని ఫోను రావడంతో ఆఫీసులో పర్మిషన్ తీసుకుని వాయువేగ మనోవేగాలతొ ఆశ్రమానికి వెళ్ళాడు. 

ఆమె పరిస్థితి విషమంగానే వుంది. మరో గంటలో ప్రాణం పోవచ్చని డాక్టర్ చెప్పాడు. 

ఆమెనా స్థితిలో చూసిన కొడుక్కి గుండె చేరువే అయింది. హృదయం బరువెక్కింది. కళ్ళు వర్షిస్తున్నాయి. వణుకుతున్న చేతులతొ ఆమె తలనిమురుతూ కూర్చున్నాడు శోకిస్తూ. 

ఆమె నెమ్మదిగా కళ్ళుతెరిచి శోకిస్తున్న కుమారున్ని చూసి ఏడవద్దొని సైగ చేస్తూ .....శక్తిని కూడగట్టుకుంటూ ఇలా చెప్పింది 

" కన్నా! ఆశ్రమంలో ఓక్క ఫ్యాను కూడాలేదు,  రేఫ్రిజిరేటరూ లేదు, ...చాలా ఇబ్బందిగా వుంది . వాటిని నువ్వు అమర్చరా! " అని కోరింది. 

ఆ మాటలకు ఆశ్చర్యపోతూ ఆకొడుకు 

"అయ్యో! మరి ఇంతకాలం ఎందుకు చెప్పలేదమ్మా! నువు చెప్పుంటే కనీసం మి ఇద్దరి గదిలో నైనా పెట్టించే వాన్నిగా " అన్నాడు బాధగా. 

" పోనీ బాబూ! నాకు ఈ కష్టాలు ఓ లెక్కకాదు. తట్టుకున్నాను. కాని రేపు భవిష్యత్తులో నిన్ను నీ కొడుకు ఇక్కడ చేర్చినపుడు ఫ్యాను ఫ్రిజ్ లేకపోతే నీవు తట్టుకోలేవనే నాబాధ " అని చెప్పిందా తల్లి.

ఆ మాటలకు కన్నీరు కారుస్తూ ఉండటం తప్ప ఏమి చేయలేని వాడిగా మిగిలాడు కొడుకు. 

అప్పుడే తండ్రి లోపలకు వస్తూ మేము ఇంకా నీకు గుర్తున్నామా అని అడిగాడు. 

చచ్చిన పామును చంపకండి నాన్న మునికోసం ఒక ఇల్లును తీసుకున్నా, అక్కడ మీరు హాయాగా ఉండవచ్చు, అమ్మకి మంచిము డాక్టర్ న్నీ చూపిస్తా ఒప్పుకోండి నాన్న 

మా శేష జీవితం ఇట్లా సాగని నీవన్న ఈ పరిస్థితి తెచ్చుకోకుండా కొడుకులపై అతి ప్రేమ పెంచుకోకు 
    
--((**))--

ప్రాంజలి ప్రభ.కం -
తాత మానవుడి చిన్న కధలు -32
తాత జయ విజయులు కహెద్ ఏమిటో ఎంతెలియపరుస్తావా ఆని మానవుడు అడుగగా 
ఈ విధముగా కథను తెలపటం మొదలు పెట్టాడు తాత   

జయ విజయులు శ్రీ మహా విష్ణువు నివాస స్థలమైన వైకుంఠానికి ద్వార పాలకులు. వీరి గురించి భాగవత పురాణం లో ఉంది. 

ఒక సారి బ్రహ్మ యొక్క మానస పుత్రులైన సనక, సనందన, సనాతన, సనత్కుమారులు విష్ణువు దర్శనార్ధమై వైకుంఠానికి వేంచేస్తారు. వాళ్ళు వయసులో పెద్దవారైనా చూసేందుకు పిల్లల్లాగా కనిపించడంతో ద్వారపాలకులుగా ఉన్న జయవిజయులు శ్రీహరి వేరే పనులందు నిమగ్నమై ఉన్నాడనే వంకతో వారిని అడ్డగిస్తారు. దాన్ని అగౌరవంగా భావించిన సనక సనందనాదులు ఆగ్రహించి భూలోకం లో మర్త్యులై సంచరించెదరని శాపం ఇస్తారు. 

దాంతో వారిరువురూ వెళ్ళి శ్రీ మహా విష్ణువు సంగతి నివేదిస్తారు. సర్వాంతర్యామినైన నాకు అందరితో గడపడానికి సమయం ఉంటుంది అంటూ వారి నిర్ణయాన్ని తప్పు పడతాడు. తరువాత తానే స్వయంగా వెళ్ళి తీసుకు వస్తాడు. ఆ మహర్షులు అందుకు అమితానందం పొందుతారు. వారికి పడ్డ శిక్ష గురించి ఏమి నిర్ణయించాలో ఆయనకే వదిలి వేస్తారు. తనకు ఆ శాపం వెనక్కు తీసుకునే శక్తి లేదనీ కాకపోతే రెండు ప్రత్యామ్నాయాలు మాత్రం సూచించగలనని చెబుతాడు. 

అప్పుడు మహా విష్ణువు వారిరువుర్నీ పలుమార్లు విష్ణుభక్తులుగా జనియించి తిరిగి వైకుంఠానికి వస్తారో లేక మూడు సార్లు మహావిష్ణువు ఆగర్భ శత్రువులుగా, ఆయనకు సమానంగా శక్తివంతులుగా జన్మించి ఆయన చేతిలోనే మరణం పొంది వైకుంఠానికి వస్తారో తేల్చుకోమంటాడు. అందుకు వారు ద్వితీయ మార్గాన్నే ఎంచుకుంటారు. 

దాని ప్రకారమే వారు కృతయుగంలో హిరణ్యాక్ష హిరణ్య కశిపులుగా, త్రేతాయుగం లో రావణ కుంభకర్ణులుగా, ద్వాపర యుగం లో శిశుపాల దంతవక్త్రులు గా జన్మించి తిరిగి విష్ణు సాన్నిధ్యం పొందుతారు. కలియుగంలో వారికి శాపవిమోచనం కలిగింది. కాబట్టి చాలా విష్ణు దేవాలయాల్లో జయ విజయులు ద్వారపాలకులు గా చెక్కి ఉండటాన్ని గమనించవచ్చు.
మానవుడా ఈ కధ బట్టి నీకేమి తెలిసింది అని అడిగాడు తాత
మోక్షం రావాలంటే ప్రత్యక్షంగానూ గాని పరోక్షంగా గాని దేవుణ్ణి సేవించటమే కదా తాతా 
అవునురా అవును ... అవును ....  
--((**))--

Pranjali Prabha.com
తాత మానవుడి చిన్న కధలు (32 ) 
రచయత : మల్లాప్రగడ రామకృష్ణ 

కల్లోలాల కళ్ళాపి జల్లి, మూర్ఖత్వపు ముగ్గులేసి, గుమ్మాలకు సమస్యల  తోరణాలు స్వాగతం పలుకుతుంటే 
పారిపోయిన సుఖ సంతోషాలకు పుట్టినరోజు  అంటూ అట్టహాసం చేస్తూ,  దీపాలను ఆర్పుతూ అర్ధం లేని ఖర్చు చేస్తూ, అప్పు;లు చేసి మరీ పండుగ వేడుకలు చేస్తున్న కలియుగ లీల.   

పచారి కొట్లో తాకట్టు పెట్టిన ఆత్మాభిమానం, అరువెట్టి అతికించుకున్న, వెలసిపొయిన దరహాస మిలమిలల మిథ్యా విలాసం, కనికట్టు మాయాజాలం తో, నిర్మించుకున్న గాలిమేడల, పేకల సోపానాల గాంభీర్యం, ఆకాశం కేసి చూపులు, 
పాతాళం కేసి అడుగులు ఉత్థానమెరుగని పతనాల, బతుకులు మధ్యతరగతి జీవితాలు బలుపెక్కిన ఖర్చులు ..... 

అంతరాంతరాల ఆశలు, అందని ద్రాక్షలై ఊరిస్తుంటే, అంతరిక్షంలోని నక్షత్రాలై, తళుకులీనుతూ మురిపిస్తుంటే 
అందుకోవాలనే ఆశ.,,యత్నం శూన్యం, యెగరాడానికీ నామోషి ..తాతలుతాగిన నేతుల వాసనతో బతికేసే బలహీన మనస్కులు, బావిలోకి చిక్కిన కప్పలుగా తనదే లోకం తనచుట్టువారు ఏమయినా నాకేమిటి అనే మనైజం కలిగిన మనుష్యులు ,   

భేషజాలనే వలచిన అక్కరకు రానీ, అరటితోక్కపై కాలిడీ పాతాళానికీ, పతనమయ్యే చారెడు బతుకులు, మధ్య తరగతి బతుకులు మర్మమెరగని బతుకులు త్రిశంకుస్వర్గమందు ఊగిసలాడే బతుకులు. చాలీ చాలని జీతాలు, పెరుగుతున్న అప్పులు, బిడ్డల చదువులు, ఇలా చెప్పుకుంటూ పొతే ఒకటేమిటి అన్ని సమస్యలే ఒకరి చెప్పుకోలేని మధ్యతరగతి సమస్యలు. అమ్మా పెట్టదు, అడుక్కోనివ్వదు అనే సామెత బతుకు మధ్యతరగతిది.       --((**))--



Pranjali prabha.com
తాత మానవుడి చిన్న కధలు -31
నేటి హాస్య చిన్న కధ
మా అమ్మ (చీర) కొంగు*

*ఇప్పటి పిల్లలకు చాలా మంది కి తెలియక పోవచ్చు.* *ఎందుకంటే నేటి మమ్మీలు చీరకట్టు తక్కువే.*
*చీరకొంగు చీర అందానికే సొగసునుపెంచేె మకుట మాణిక్యం !*
అంతేకాకుండా ..
*పొయ్యి మీద వేడి గిన్నెలను*
*దింపడానికి పనికొచ్చేి ముఖ్య సాధనం*
*పిల్లల కన్నీటిని తుడిచే ముఖ్యమైన పరికరం*
*చంటిపిల్లలు పడుకోడానికి అమ్మవడి పరుపు కాగా వెచ్చటి దుప్పటి‌ చీరకొంగే!*
*కొత్త వారు ఇంటికొచ్చినపుడు సిగ్గు పడే పిల్లలు ముఖం దాచుకునేది *అమ్మ కొంగు వెనకే.*
*అలాగే పిల్లలు ఈ మహా చెడ్డ ప్రపంచంలో కొత్తగా అడుగు లేస్తున్నప్పుడు అమ్మ కొంగేే పెద్ద దిక్సూచి, మార్గదర్శి!*
*అలాగే వాతావరణం:చలిగా ఉంటే అమ్మ కొంగుతోనే పిల్లలని వెచ్చగా చుట్టేది !*
*వంటచేసే తల్లి చెమట బిందువులు తుడుచు కొనేది కొంగు తోనే !*
*వంటకు పొయ్యిలోకి తెచ్చే కట్ట ముక్కలు సూదులు తెచ్చేది కొంగులోనే!*
*అలాగే పెరటి తోటలో కూరగాయలు, పువ్వులు, ఆకుకూరలు వంటింటికి తీసుకొచ్చేది కొంగులోనే.*
*అంతేకాదు ఇల్లు సర్దడం లో భాగంగా పిల్లల ఆట వస్తువులు పాత బట్టలు వంటివి చీర కొంగు లోనే కదా మూట కట్టేది!*
*ఇలాంటి ఎన్నో ఉపయోగాలు ఉన్న అమ్మ చీరకొంగు లాంటి వస్తువు మరొకటి కనిపెట్టాలంటే చాలా కష్టం!*
*ఇంతటి అద్భుతమైన అమ్మకొంగు లో కనిపించేది మాత్రం అమ్మ ప్రేమే !!*
అంకితం: చీర కట్టే అమ్మలందరికీ !
*అమ్మ ఒక మధుర జ్ఞాపకం.*
*తనకు నా ఆకలి ఎప్పుడు చెప్పాల్సిన అవసరం రాలేదు......*
*కొత్త బట్టలతో బైటకు వెళ్లివస్తే వెంటనే దిష్టి తీసేది...*
*పరీక్షలకు బయలుదేరితే తీపిపెరుగుతో ముందు నిలిచేది...*
*బాల్యంలో నా పిచ్చి భాషను క్షణంలో పసికట్టేది....*
*ఇలా ఎన్నో ఎన్నెన్నో....*
*అమ్మ. బిడ్డ ఒక స్థనంలో పాలు తాగుతూ, రెండో స్థనాన్ని పలుమార్లు తన్నుతూ ఉంటాడు/ఉంటుంది...*
*తనను తన్నే వారి కడుపు నింపే ఔదార్యం భగవంతుడు ఒక్కఅమ్మకు మాత్రమే ఇచ్చాడు....*
అమ్మ ఒక వేదం...
అమ్మ ఒక భక్తిభావం...
అమ్మ ఒక ప్రేమరూపం..
అమ్మ ఒక సంవేదన...
అమ్మ ఒక భావన...
అమ్మ ఒక పుస్తకం...
అమ్మ ఒక కలం...
అమ్మ ఒక కవిత...
అమ్మ ఒక జ్ఞానం...
అమ్మ ఒక గుడిలో దీపం...
అమ్మ ఒక హారతి పళ్లెం...
అమ్మ ఒక సుకుసుమం...
అమ్మ ఒక చల్లని చిరుగాలి...
అమ్మ ఒక అన్నపూర్ణ...
అమ్మ ఒక లాలిత్యం...
అమ్మ ఒక చీరకొంగు...
అమ్మ ఒక కరుణ...
అమ్మ ఒక దీవెన...
అమ్మ ఒక అక్షిత....
అమ్మ ఒక వర్షపు బిందువు...
అమ్మ ఒక మధురగేయం...
అమ్మ ఒక శ్వాస...
అమ్మ ఒక వూపిరి...
అమ్మ ఒక మురళి గానం...
అమ్మ ఒక జోలపాట...
అమ్మ ఒక పచ్చదనం...
అమ్మ ఒక కనురెప్ప...
అమ్మ ఒక దేవత...
అమ్మ ఒక పుడమి...
అమ్మ ఒక స్వచ్ఛత...
అమ్మ ఒక ప్రవచనం...
అమ్మ ఒక వెలుగు...
అమ్మ ఒక సుగుణం...
అమ్మ ఒక నమ్మకం...
అమ్మ ఒక ఆరోగ్యం...
అమ్మ ఒక భద్రత...
అమ్మ ఎన్నో ఎన్నెన్నో.......
ఇది చదివిన వారికి ఇంతమంది అమ్మలు జీవించివున్నారో, మరణించినారో తెలియదు. కాని ఒక్క మాట చెప్పగలను ఎవరు అమ్మ దగ్గర ఉంటారో వారు అతిసంపన్నులు. అమ్మ సేవ భాగ్యం కలిగివుంటారో ధన్యులు,అదృష్టవంతులు.
--((**))--



తాత మనవుడి చిన్న కధలు (30)
రచయిత: మల్లాప్రగడ రామకృష్ణ 
Pranjali Prabha.com

నేటి హాస్య కధ

ఒక చిన్న టౌన్ లో వున్న కోర్ట్ లో ,ఒక కేసు విచారణ సందర్భంగా ఒక బామ్మ గారిని సాక్షిగా పిలిచి బోనెక్కించారు. పబ్లిక్ ప్రాసిక్యూటర్ గారు ఆవిడ దగ్గరికి వెళ్ళి , " మామ్మ గారు నేనెవరో మీకు తెలుసా ?" అని అడిగాడు దర్పంగా నల్ల కోటు సర్దుకుంటూ...

ఆవిడ వెంటనే ," అయ్యో ,తెలియక పోవడమేంటీ..?బాగా తెలుసును..పెద్దపిచ్చయ్యగారి రెండో అబ్బాయి గోవిందానివి కదూ..నీ చిన్నప్పటి నుండీ నిన్నూ . మీ కుటుంబాన్నీ ఎరుగుదును నాయనా..! నిజంచెప్పాలంటే

,చిన్నప్పుడు నిన్ను ఎందుకూ పనికిరావు అనుకునేదాన్ని . అబధ్ధాలాడేవాడివి,
జనాన్ని మోసం చేసేవాడివి ,ఆఖరుకి నీ భార్యని కూడా మోసం చేసావ్ ..పైసాకు పనికిరాకపోయినా , గొప్పలు పోయేవాడివి .నాకు బాగా తెలుసు ను కదా !"
అంది.
P.P. గారు హడిలి పోయి ,బిక్క చచ్చి పోయారు. ఏం మాట్లాడాలో తెలియక , డిఫెన్సు లాయరు గారిని చూపించి , " వారు తెలుసా ..? "అని అడిగాడు.
బామ్మగారు ఠక్కున , "మాబాగా తెలుసును..జేబులు కత్తిరించే వీరదాసు కొడుకు
కుమారదాసు కదా .. చిన్నప్పుడు పనీ పాటాలేకుండా వీధులెంట బలాదూర్ తిరిగేవాడు.లేని దురలవాటులేదు..తాగుబోతు, తిరుగుబోతు కూడానూ !ఇతనిది
అందరి కంటే చెత్త ప్రాక్టీసు అని ఊరంతా చెప్పుకుంటారు. పైగా ముగ్గురు స్త్రీలతో అక్రమ సంబంధం ..అందులోఒకరు మీ ఆవిడే కదా ! నాకు తెలీకేం , బాగా
తెలుసు ..." అంది గుక్క తిప్పుకోకుండా .
డిఫెన్స్ గారికి చచ్చినంత పనైంది .
జడ్జి గారు ఇద్దరు లాయర్లని తన దగ్గరికి పిలిచి ,రహస్యంగా , "మీ ఇద్దర్లో ఎవరైనా
తెలివి తక్కువగా , జడ్జి గారు తెలుసా అని ఆవిడని అడిగారంటే ,కోర్టు ధిక్కారం కేసు
కింద జైల్లో తోయించేస్తా ,జాగ్రత్త !!"అని బెదిరించాడు.

లాయర్లు షాక్ !! బామ్మ రాక్స్ !!

--((**))--


తాత మానవుడి చిన్న కధలు (29 ) 
రచయత : మల్లాప్రగడ రామకృష్ణ 

రాము, సోము చిన్ననాటినుండి స్నేహితులు, 
ఇద్దరు ఎంత స్నేహితులంటే ఒకమంచంలో తిని ఒక కంచంలో పడుకునేంత ....ఛీ ఛీ .....ఒక కంచంలో తిని.... ఒక మంచంలో పడుకునేంత దగ్గరి స్నేహితులన్నమాట. 

ఇద్దరి ఆదర్శాలు ఒక్కటే .........నాస్తికత్వం.......... దేవుడు లేడు దయ్యము లేదంటూ .....ఇద్దరు గంటల గంటలు ఆ దేవున్ని తిడుతూ మాట్లాడుకునేవారు. 

అలాంటి స్నేహితులు చాలా రోజులుగా దూరమయ్యారు. సోము కు గుంటూరు లో ఉద్యోగం వచ్చింది మరి వెళ్ళక తప్పదుగా...... వెళ్ళాడు. 

చాలారోజుల తర్వాత..... ఆరోజే...... సోము రాము ను చూడ్డానికొచ్చాడు. 

బాగన్నకు చిన్న నాటి ప్రాణమిత్రున్ని చూడగానే సంతొషమేసింది. 

లోకాభిరామం మాటాడుతూ కూర్చున్నారు ఇద్దరు. ఉన్నట్టుండి సోము రామును 

"ఏరా బాగులూ! నువ్వు దేవున్ని నమ్ముతున్నావా?" అని అడిగాడు, 

అలా అడుగుతున్న మిత్రున్ని ఆశ్చర్యంగా చూసి నమ్మనన్నట్లు తలనడ్డంగా వూపుతూ 

"అదేం అలాఅడుగుతున్నావ్ , నేను మొదటినుంచి కూడా నమ్మను.కదరా! ఆ విషయం నీకూ తెలుసుకదరా!... " అన్నాడు 

వెంటనే సోము " హమ్మయ్య ఐతే .....నువ్వు మార్చుకొలేదన్న మాట నీ ఆదర్శాన్ని నీ దగ్గర గడపొచ్చన్నమాట " అంటుంటే మరింత 
ఆశ్చర్యంతొ రాము 

"నువ్వు కూడా నమ్మవుగా! మరిరోజు ఇలా అడగడమెందుకు?" అన్నాడు 

"నేను నా నమ్మకాన్ని మార్చుకున్నాలే!" అన్నాడు సోము 

" ఆహా! ఎప్పటినుండేమిటి?" బాగన్న వ్యంగ్యం 
"దయ్యాలున్నాయని నమ్మకం ప్రారంభమైనప్పటినుండి " చెప్పాడు సోము . 

" అలాగా! దయ్యాలనెప్పటి నుండి నమ్ముతున్నావేంటి?" అడిగాడు 

"నెల క్రితం తెలంగాణలో ఓ పేద్ద బస్సు ప్రమాదం జరిగింది, అందులో 52 మంది చనిపోయారు చూడు ఆరోజు నుండి" సోము చెప్పగానే 
"హహహహహ! ఇవే మూడనమ్మకాలు రైలు ప్రమాదానికి దయ్యాలకేంటీ సమ్మందం ఇలా చెడిపోయావేంటి? నువ్వు" అన్నాడు రాము మాటల్లో హేళన. 

" ఔను! ఆ బస్సు ప్రమాదంలో చనిపోయిన ప్రయాణీకులలో నేనూ ఒక్కడినికదా! అందుకే ఆరోజునుండి దయ్యాలున్నాయని నమ్ముతున్నా" నంటూ చెప్పి 
అంతలోనే మాయమైపోయాడు. 

అంతే సోము శరీరం చమటలతో తడిసి ముద్దయింది.

--((**))--



కామెంట్‌లు లేవు:

కామెంట్‌ను పోస్ట్ చేయండి