20, సెప్టెంబర్ 2018, గురువారం

తాత మనవుడి చిన్న కధలు (34 )


pranjali prabha.com
పదవి విరమణ
చిన్న కధ
rachayata: mallapragada raamakrishna

వేదికపై కూర్చున్న ప్రతిఒక్కరికి, వేదిక ము0దు ఆశీనులైన ప్రతిఒక్కరికి హృదయపూర్వక నమస్కారములు. పదవి విరమణ చేస్తున్న శ్రీ/ శ్రీమతి ............................ ప్రత్యేక శుభాకాంక్షలు.
పదవి విరమణ అనేది ఒక విధమైన బాధ్యతలను సక్రమముగా నిర్వహించి ప్రభుత్వము వారు నిర్దేశించిన ప్రకారముగా సక్రమముగా పదవి విరమణ చెందటం ఈ నాడు ఎంతో సంతోష కరమైన విషయం. ఇప్పుడు అంతా పేపర్ లెస్ జాబులుగా మారుతున్నాయి క్రమేపి ఒక మేధావిని ఉపయోగించుకొనే పద్దతి పోయి "కంప్యూటర్ " నమ్ముకొని చేస్తున్న ఉద్యోగాలు పెరిగి పోతున్నాయి. ఎకౌంట్స్ పరంగా పదవి విరమణ తర్వాత వచ్చే అమౌంట్స్ కూడా వేగంగా ఇస్తున్నందుకు సంతోషించ వలసిన విషయం.
శ్రీ/ శ్రీమతి ............................ ఎంత ఎదిగిన ఒదిగి ఉండే మన:స్వభావము గల మనిషి, సూర్యుని ఉషోదయం ఆలస్యము అయిన అవ్వ వచ్చు గాని మన .................................... క్రమశిక్షణ పరంగా సమయాన్ని దుర్వినియోగం చేయకుండా ఉదయసమయము కన్నా ముందు వచ్చి చీకటి పడ్డ తర్వాత పోవటం ఒక అలవాటుగా మార్చుకున్న వ్యక్తి.
ఉద్యోగులలో ఉన్నతులు, ఉత్తములు అనే రెండు రకాలు ఉన్నారు. అందులో ఈరోజు పదవి విరమణ చేయుచున్న వారు ఉత్తములు., వీరి ఆలోచనలు, నడకలు, యమనియమములు అత్యంత ప్రధానములైనవి.

యమములనగా 1) అహింస. (ఏప్రాణికి హింసచేయకుండుట) 2) సత్యము (నిజము పలుకుట), 3) అస్తేయము (దొంగతనము చేయకుండుట) 4) బ్రహ్మచర్యము (ఇంద్రియనిగ్రహము). 5) అసంగ్రహము (ఇతరులనుండి స్వీకరింప కుండుట).

"నియమములనగా" 1) సంతోషము (సుఖదుఃఖాది ద్వంద ములయందు సమత్వము). 2) శౌచము (శారీర మానసిక శుద్ధి). 3) తపస్సు (శారీరక, వాచిక, మానసిక, నియమము). 4) స్వాధ్యాయము (పుణ్యగ్రంథపఠనం) 5) ఈశ్వర ప్రణిధానము (భగవంతుని శరణాగతి).
ఈ దశవిధ గుణముల అనుష్ఠానము కలిగిన ఉత్తములు .

కనుక నేను చెప్పేదే మిటంటే ఇప్పటిదాకా మీరు ఒక (ఉద్యోగి అనే) రైలు ప్రయాణం చేశారు. నల్లేరు నడకలు, పల్లేరు నడకలు జీవితమనే సంసారములో నలిగి బిడ్డలంకు ఒక దారి చూపి ప్రశాంతి వాతావరణంలో జీవనం గడపటానికి ఒక అవకాశం ఏర్పడుతుంది. ఈ అవకాశము భక్తి మార్గములో ఉంటూ బంధాలకు చిక్కకుండా ఆరోగ్యాన్ని జాగర్తగా ఉంచుకొనుటకు తగిన ధనము దాచుకొని సుఖ జీవనం జరపాలని ఆ పారమాత్ముని కృపా కటాక్షాలు మీ మీద ఉండాలని కోరుతూ నాకీ అవకాశం ఇచ్చిన అందరికి మరోసారి వందనాలు అర్పిస్తూ ముగిస్తున్నాను.


తాత మనవుడి చిన్న కధలు (34 )
రచయత:మల్లాప్రగడ రామకృష్ణ   

తాత దంపతులు అంటే వివరిస్తావా 
          
          మానవుడా ఇది పెద్దలకు మాత్రమే అర్ధం అవుతుంది, ఇద్దరు ఏకమై ఒకే మాట, ఒకే బాట, ఒకే ఆట, ఒకే ప్రాణంగా ఉండటమే దాంపత్యం అటువంటి వారే నిజమైన దంపతులు. 

           తాత అమ్మొమ్మ మీరు ఎటువంటి దంపతులు 
నీకు చెప్పినా తప్పు, చెప్పక పోయినా తప్పే ఆ...... ఆ ..... చెపుతా విను  
  
          మూడు కాళ్ళ ముదుసల్లనీ, మూడు నేత్రాలుగల ముక్కంటిగారనీ, అమ్మగారు మీరు అర్ధనారీస్వరులనీ, మూడుకాలాల భవిషత్ తెలిసిన మహా జ్ఞానులనీ, మూడు రంగుల గల జండాను పట్టుకొని “ధర్మో రక్షితి రక్షిత:” అని నినాదంతో తిరుగుతున్న మహానుభావులు అనీ   ఎవరు పిలిపించుకుంటారో వారే దంపతులు.   

          ఎంతైనా వయసు ఉడికి, వాలి పోయే పొద్దు లాంటి జీవులు వారు, జారుడ బండ మీద నుండి జారే గుమ్మడికాయ బ్రతుకు మాదిరిగా మారిన వారు, ఇప్పుడు కష్టపడుట ఎందుకు అంటారు . ఇప్పుడు కుక్క పిల్లలాగా విశ్వాసం చూపి, తోకాడిస్తూ తిరిగే వారు, ఇప్పుడు మీ  వెనుక కానరారు.  ఒంటరితనాన్ని నుండి బయట  పడటానికి నేర్చిన విద్యనూ చెప్పు కుందామన్న గుర్తించే వారు కరువవుతారు. అయిన పట్టు విడవకుండా భోధ చేస్తు కాలం వేళ్ళ బుచ్చుతారు ఆ దంపతులు .

       ఓపిక అనే ఊత కర్రను చేత పట్టుకొని, బ్రతుకు కొసను ఆసాంతం వెల్ల దీసుకొవటానికి, కన్న కొడుకులు , కన్నకూ తుర్ల దగ్గర చేరక, బావిలో కప్పల్లాగా ఉండ కుండా, కొణ ఊపిరి దాక దేశ సేవ చేయాలని సంకల్పించారు, పిల్లల మాటలను వినలేదని సంతోషించాలా, పిల్ల పిల్లలకు  సేవ చేయలేదని భాదపడాలా అనీ ఆలోచించే దంపతులు. 

         మాట పడకుండా ధర్మాన్ని భోధిస్తూ, మౌనం పూలదండను మెల్లో ధరిస్తూ , కాలాన్ని ధనుస్సు నుండి వచ్చిన బాణంలా దూసుకుంటూ ప్రజల్లోకి పోతూ, కోర్కల మెలికలను తుంచేసి, రోగాల నుండి విముక్తి చెంది, పసితనం లేపనం పూసుకొని నవ యవ్వన దంపతుల్లాగా దేశ సేవచేస్తునారు.
     
      అనుభంధం మల్లె తీగలను మనసుకు చుట్టు కొనీయ కుండా, దైవాన్ని ప్రార్ధిస్తూ, పుణ్యక్షేత్రాలను దర్సనం చేస్తూ, నిగ్రహ శక్తి ఉన్నవారికి సాదించలేనిది అంటూ లేదని, కొన ఊపిరిలో కూడా కోటి సూక్తులు ప్రజలకు భోధించి మెల్కొన్న  మహానీయులుగా ఉండేవారే దంపతులు.
          
           ఏమన్నా అర్ధ మాయిందా మనవుడా
నాకు వయసొచ్చాక ముసలివాడుగా మారాక అపుడు ఆలోచిస్తా వస్తా తాత.
--((**))--     

కామెంట్‌లు లేవు:

కామెంట్‌ను పోస్ట్ చేయండి