20, సెప్టెంబర్ 2018, గురువారం

ఆరాధ్య ప్రేమ లీల


ఆరాధ్య ప్రేమ లీల
మల్లాప్రగడ రామకృష్ణ   

పలకరించే పెదాల ఆధరం నేస్తమైతే ఇంకేం కావాలి   
పరిమళించే చెలియ మనసే మౌన మైతే ఇంకేం కావాలి    

మగువ అందంకన్నా గుణము స్వఛ్ఛమైతే ఇంకేం కావాలి 
మగణి ధనము కన్నా ప్రేమ సొంతమైతే ఇంకేం కావాలి 

పద్యానికి భావం కన్నా స్వరం గొప్పదైతే ఇంకేం కావాలి
మనిషికి  ఆశ, అనుమానం లేకపొతే ఇంకేం కావాలి   

తల్లి  తండ్రుల ప్రేమ నిత్యం పొందితే  ఇంకేం కావాలి 
భార్యా బిడ్డల్నే  శాంత పరచ  గలిగితే   ఇంకేం కావాలి 

మాటలే ఆభరణంగా 
మనసే ప్రేమగా 
అనురాగమే ఆప్యాయంగా 
ఉన్న అల్పసంతోషికి ఇంకేం కావాలి 
ఇది వేణు గోపాల ప్-రెమ సుమా 

--((**))--


ఆరాధ్య ప్రేమ లీల
రచయిత : మల్లాప్రగడ రామకృష్ణ   

ప్రతి చినుకొక పారవస్య  వేద మంత్రం  
- ప్రతి తనువు అనుభవస్య జ్ఞాన మంత్రం 

ప్రతి జన్మ సార్ధక హృదయ మంత్రం 
- ప్రతి వెల్గు చీకటి తరిమే మంత్రం   

ప్రతి మాట మంచిని తెలిపే మంత్రం 
- ప్రతి నీడ జతను కలిపే మంత్రం 

ప్రతి రాత్రి మనసు శాంతించే మంత్రం 
- ప్రతి ప్రాణి తనువు తపించే  మంత్రం

కుతంత్రం కాదు తంత్రం 
తంత్రం కాదు మంత్రం 
మంత్రం కాదు తన్మాత్రం 
ఇది వేణు  గోపాల ప్రేమసుమా 
--((**))--


ఆరాధ్య ప్రేమ లీల
రచయత: మల్లాప్రగడ రామకృష్ణ 

కష్టమంటే ఏమిటో తెలుపని అనురాగ తల్లి
- విశ్రాతంటే ఏమిటో ఎరుగని మమతల తల్లి 

స్నేహమంటే ఏమిటో వదలని పలుకుల తల్లి
- ప్రాణమంటే ఏమిటో అడగని ఆశయాల తల్లి  
   
ప్రేమ పంచి పెంచి అమృతాన్ని ధారపోసిన తల్లి    
- హృదయానంద భరితంగా మనసు మార్చిన తల్లి 

వెలుగు లొసగి  చీకటిని తరిమి వేసే  తల్లి 
- జగతిలో అందరిలో మిన్న కరుణామూర్తి తల్లి  

తల్లి ప్రత్యక్ష దైవం 
తల్లి సృష్టికి మూలం 
తల్లి శాంతికి వరం 
తల్లి రుణాన్ని తీర్చలం 
ఇది వేణు గోపాల ప్రేమ సుమా

--((**))--

ఆరాధ్యప్రేమ లీల 
రచయత: మల్లాప్రగడ రామకృష్ణ 

కలువ విప్పారి నిగ నిగాలాడే సొగసు తోడ 
- జడివాన కలువ పై వాలి శ్వేత ముత్యాల తోడ      

సరస్సు నందు సరసమాడేను స్నేహితుల తోడ  
- మనసు కుదుట పడుటకు చేరే కులుకు జాడ 

పిలవ నేల చెలియా పిల్ల గాలి తెమ్మెర తోడ   
- తలపు మెరిసి కళలు పండించు కొనే జాడ   

పిల్ల చేష్టలను చేయుచు నిజము పిలుపు కూడ   
- వలపు విరుల ఝరుల పరవ శింపుట తోడ  

వేడి తగిలి, మంచు కరిగి, 
ఆవిరిగా నింగి చేరి, మేఘంగా మారి 
మెరుపుకు మఘం కరిగి, సృష్టికి నాంది పలికే 
ఇది వేణు గోపాల ప్రేమ సుమా
--((**))--  



ఆరాధ్య ప్రేమ లీల  
రచయత: మల్లాప్రగడ రామకృష్ణ

ఆత్మశుద్ధి అనంత సుఖాన్ని కోరు
- గురుబుద్ధి విద్యార్ధి  హితాన్ని కోరు 

సమబుద్ధి సమస్త సత్యాన్ని కోరు 
- నీచబుద్ధి మానవ ద్వేషాన్ని కోరు 

బందంనుండి విముక్తియే హితం కోరు 
- జీవ దు:ఖ నివృత్తియే హితం కోరు

ప్రకృతి నిత్య  ప్రాప్తియే హితం కోరు 
- జ్ఞాన విజ్ఞాన ప్రాప్తయే  హితం కోరు 

శ్రేష్టల యోక్క మాట మనసు చేరు 
- మాతృ హృదయానందం బిడ్డకు చేరు 

దుష్ట బుద్ధి హీనం చేత భయం చేరు 
- నమ్మకమే మనస్సుకు శాంతి చేరు

ఆశా మొహా వేశ0 మనిషని చేరు    
- మనిషి ప్రతి క్షణం సంతృప్తి కోరు

భార్యాభర్త విషయ సంభందం పోరు
గురు శిష్య విద్యా బోదనల పోరు 
  
నారు పోసిన, పోరు ఉన్నా 
కోరుకన్నది వచ్చేవరకు చేరు 
మనుష్యుల తీరు బట్టి మారు
ఇది వేణు గోపాల ప్రేమ సుమా    
--((*))-- 



ఆరాధ్య ప్రేమ లీల 
రచయత: మల్లాప్రగడ రామకృష్ణ 

చెలియ మనసును దోచేందుకు ఉంటుంది    
- కలిమి కోసం మనస్సు కలిసి ఉంటుంది   

బలిమి ఉంటె మనస్సే వెలిగి ఉంటుంది  
- చెలిమి ఉంటె మనస్సుకు శాంతి ఉంటుంది 

చలి హృదయాన్ని తపింప చేస్తూ ఉంటుంది
-చెలి తనువునే దహింప చేస్తూ ఉంటుంది 

జాలి మనస్సుని కంపింప చేస్తూ ఉంటుంది   
- గాలి ఊపిరిని ఆడింప చేస్తూ ఉంటుంది 

చలి చీమ చూడు  క్రమశిక్షణగా ఉంటుంది
- చెలి మాట చూడు ప్రేమాతి ప్రేమ ఉంటుంది

కలి చేరి వళ్ళంతా మార్పు తెస్తూ ఉంటుంది   
- బలి చే వయసంతా ఖర్చై పోతూ ఉంటుంది    

మల్లి కృప తోనే మనస్సు స్థిరం ఉంటుంది 
- లిల్లి పూవు తోనే పరువం స్థిరం ఉంటుంది  

ఉల్లి దయ తోనే ఆరోగ్యం స్థిరం ఉంటుంది   
- తల్లి ప్రేమతోనే ప్రాణం స్థిరంగా ఉంటుంది  

తల్లి, ఉల్లి, మల్లి, చేయు మేలు
అల్లం, బెల్లం. కళ్లెం. చేయు మేలు 
ఉల్లం జల్ జల్ అంటేనే మేలు 
 ఇది వేణుగోపాల ప్రేమ సుమా 
--((**))--


ఆరాధ్య ప్రేమ లీల 
రచయత: మల్లాప్రగడ రామకృష్ణ 

ఉల్లాసంగా, ఉస్చాహంగా, సంతోషంగా ఉండు  
- ఔనత్యం, ఔదార్యం, వినయంతో కల్సి ఉండు 

ఊహలను నిజం చేసి సుఖముగా ఉండు 
- ఋణానుబంధం తీర్చి వెల్గును పంచి ఉండు     

ఎంత ఎదిగిన అంతే ఒదిగియు ఉండు 
- ఏపని ఐన ఇష్టంతో కల్సి చేస్తూ ఉండు

ఓటమి గెలుపుకు పునాది అని ఉండు
- పుట్టినిల్లు మెట్టినిల్లు కాపాడుతూ ఉండు

తామరాకుపై నీటిబొట్టై కదుల్తు ఉండు
- ఐకమత్యమే జీవిత బలమని ఉండు

మనసుతొ అహంకారం చూపకుండా ఉండు
- మాట, నేర్పు, ఓర్పు, తీర్పు ఒక్కటిగ ఉండు

అంతరాలు, అభ్యంతరాలు లేకుండా ఉండు
- కలం, ఖడ్గం ఉపయోగం గమనించి ఉండు   

ఘన కీర్తికోసం ధర్మాన్ని తప్పక ఉండు   
- చక్కని సంతానం సుఖ సంసారివై ఉండు 

విజ్ఞాన సహిత జ్ఞానము బోధిస్తూ ఉండు 
- గురువు తల్లి తండ్రులను సేవిస్తూ ఉండు
  
ఎంత మాత్రము ఎవ్వరు తలచిన 
అంత మాత్రమే నీవు ఉండు 
దైవభక్తి నీకు రక్షణగా ఉండు 
ఇది వేణు గోపాల ప్రేమ సుమా 
--((**))--

కామెంట్‌లు లేవు:

కామెంట్‌ను పోస్ట్ చేయండి