15, సెప్టెంబర్ 2018, శనివారం

తాత మానవుడి చిన్న కధలు (26 )




తాత మానవుడి చిన్న కధలు (29 ) 
రచయత : మల్లాప్రగడ రామకృష్ణ 

రాము, సోము చిన్ననాటినుండి స్నేహితులు, 
ఇద్దరు ఎంత స్నేహితులంటే ఒకమంచంలో తిని ఒక కంచంలో పడుకునేంత ....ఛీ ఛీ .....ఒక కంచంలో తిని.... ఒక మంచంలో పడుకునేంత దగ్గరి స్నేహితులన్నమాట. 

ఇద్దరి ఆదర్శాలు ఒక్కటే .........నాస్తికత్వం.......... దేవుడు లేడు దయ్యము లేదంటూ .....ఇద్దరు గంటల గంటలు  ఆ దేవున్ని తిడుతూ మాట్లాడుకునేవారు. 

అలాంటి స్నేహితులు చాలా రోజులుగా దూరమయ్యారు. సోము కు గుంటూరు  లో ఉద్యోగం వచ్చింది మరి వెళ్ళక తప్పదుగా...... వెళ్ళాడు. 

చాలారోజుల తర్వాత..... ఆరోజే...... సోము రాము ను చూడ్డానికొచ్చాడు. 

బాగన్నకు చిన్న నాటి ప్రాణమిత్రున్ని చూడగానే సంతొషమేసింది. 

లోకాభిరామం మాటాడుతూ కూర్చున్నారు ఇద్దరు. ఉన్నట్టుండి సోము రామును  

"ఏరా బాగులూ! నువ్వు దేవున్ని నమ్ముతున్నావా?" అని అడిగాడు, 

అలా అడుగుతున్న మిత్రున్ని ఆశ్చర్యంగా చూసి నమ్మనన్నట్లు తలనడ్డంగా వూపుతూ 

"అదేం అలాఅడుగుతున్నావ్ , నేను మొదటినుంచి కూడా నమ్మను.కదరా! ఆ విషయం నీకూ తెలుసుకదరా!... " అన్నాడు 

వెంటనే సోము  " హమ్మయ్య ఐతే .....నువ్వు మార్చుకొలేదన్న మాట నీ ఆదర్శాన్ని నీ దగ్గర గడపొచ్చన్నమాట " అంటుంటే మరింత 
ఆశ్చర్యంతొ రాము  

"నువ్వు కూడా నమ్మవుగా! మరిరోజు ఇలా అడగడమెందుకు?" అన్నాడు 

"నేను నా నమ్మకాన్ని మార్చుకున్నాలే!" అన్నాడు సోము  

" ఆహా! ఎప్పటినుండేమిటి?" బాగన్న వ్యంగ్యం 
"దయ్యాలున్నాయని నమ్మకం ప్రారంభమైనప్పటినుండి " చెప్పాడు సోము . 

" అలాగా! దయ్యాలనెప్పటి నుండి నమ్ముతున్నావేంటి?" అడిగాడు 

"నెల క్రితం తెలంగాణలో ఓ పేద్ద బస్సు ప్రమాదం జరిగింది, అందులో 52 మంది చనిపోయారు   చూడు ఆరోజు నుండి" సోము చెప్పగానే 
"హహహహహ! ఇవే మూడనమ్మకాలు రైలు ప్రమాదానికి దయ్యాలకేంటీ సమ్మందం ఇలా చెడిపోయావేంటి? నువ్వు" అన్నాడు రాము మాటల్లో హేళన. 

" ఔను! ఆ బస్సు  ప్రమాదంలో చనిపోయిన  ప్రయాణీకులలో నేనూ ఒక్కడినికదా! అందుకే ఆరోజునుండి దయ్యాలున్నాయని నమ్ముతున్నా" నంటూ చెప్పి 
అంతలోనే మాయమైపోయాడు. 

అంతే సోము శరీరం చమటలతో తడిసి ముద్దయింది.
--((**))--


#అహంకారం, పొగరు, కోపం ఇలాంటి లక్షణాలున్న వ్యక్తులు అనాలోచితంగా చేసే క్రియల వలన తమ స్వంత వారికి సైతం జీవితంలో తిరిగి కోలుకోలేని తీవ్ర నష్టం కలిగించడం తరువాత వేదన చెందడం ఈ కథలో ప్రధాన ఇతివృత్తం. )
ఇక కథలోని వెళ్తే...
రామం ఒక చిరు ప్రభుత్య ఉద్యోగి. అందమైన భార్య. పొందికైన చిన్న ఇల్లు, ముద్దులొలికే బాబు – చక్కటి సంసారం. ఇదంతా బయటికి కనిపించే వ్యవహారం. రామానిది విచిత్రమైన మనస్తత్వం. ఎప్పుడూ చిరాగ్గా కనిపిస్తాడు. కోపం ఎక్కువ. ఇరుగు పొరుగు ఎవరూ మిత్రులు కూడా లేరు. ఆఫీస్ కు వెళ్ళడం, రావడం మిగిలిన సమయం ఇంట్లోనే గడపడం అతనికి అలవాటు. ఇంట్లో కూడా ప్రతి చిన్న విషయాన్ని పట్టించుకుని భార్యని నిలదీస్తూ ఉంటాడు. ఒక్కోసారి ఆఫీస్ నుంచి వస్తూనే ధుమ ధుమ లాడుతూ వస్తాడు. ఆఫీస్ లో ఏదో గొడవ జరిగి ఉండి ఉంటుందిలే అని భార్య సరిపెట్టుకుంటుంది.
పిల్లవాడు రెండవ తరగతికి వచ్చాడు. ఆఫీస్ నుంచి వచ్చిన తరువాత కొడుకును కూర్చోపెట్టి చదువు చెబుతాడు రామం. తను అడిగినది సరిగా చెప్పలేక పొతే విపరీతమైన కోపం తెచ్చుకుంటాడు. అప్పుడు భార్య సర్ది చెప్పి కొడుకుని అవతలికి తీసుకు వెళ్తుంది.
ఒకరోజు ఆఫీస్ నుంచి విపరీతమైన కోపంతో వస్తాడు. తన ఇంటి వీధి లోకి మలుపు తిరగగానే అక్కడ ఇతర పిల్లలతో కలసి ఈ లోకాన్నే మరచిపోయి ఆడుకుంటున్న తన కొడుకును చూస్తాడు. అతని కోపం రెట్టింపు అవుతుంది. తన కొడుకును గట్టిగా పిలుస్తాడు. నవ్వుతూ కేరింతలు కొడుతూ ఆడుకుంటున్న కొడుకు ఉరుము లాంటి తండ్రి స్వరం వినగానే మ్రాన్పడి పోతాడు. ‘ రా ఇటు...’ అంటూ హుంకరిస్తాడు. కొడుకు భయం భయం గా తండ్రి వెంట నడుస్తాడు. ఇంట్లోకి వస్తూనే కూర్చో పెట్టి పదమూడో ఎక్కం రాయమంటాడు. కొడుకు గుండెల్లో రైళ్ళు పరుగెడతాయి. తనకు ఆ ఎక్కం రాదు. తనకు రాదనీ తండ్రికి కూడా తెలుసు. అయినా రాయమంటున్నాడు, పైగా కోపంగా ఉన్నాడు అనుకుంటూ పలక తీసుకుని తండ్రి కూర్చున్న కుర్చీకి ఎదురుగా కింద కూర్చున్నాడు కొడుకు. ఐదు నిమిషాల తరువాత ‘ఊ ... రాసావా’ గర్జించినట్లు అడిగాడు. కొడుకు బేలగా తలెత్తి లేదన్నట్టు తలాడించాడు. పలక తీసుకు రా! ఉరిమినట్లు పిలిచాడు.
కాళ్ళలో సత్తువ లేనట్లు పిల్లవాడు మెల్లగా లేచి పలక తీసుకుని తండ్రి ముందుకు వెళ్లి చేతికిచ్చాడు. అందులో ఏమీ రాసి లేదు. తండ్రి కోపం నషాళానికి అంటింది. ‘నీకు ఆటలు కావాలి కానీ చదువు అక్కర లేదు, ఎంతసేపూ ఆటలు ఆటలు.....’ కోపంతో ఊగిపోతూ అన్నాడు.
భార్య కలగజేసుకుని ‘ఆఫీస్ నుంచి రాగానే ఏమిటండి ఇది. బట్టలు మార్చుకుని కాఫీ తాగండి. తరువాత చదువు సంగతి చూద్దాం’ అని నచ్చచెప్పపోయింది.
‘నువ్వు నోరు మూసుకో...’ గట్టిగా అరిచాడు. ఆమె విసురుగా వంటింట్లోకి వెళ్ళిపోయింది.
‘పదమూడో ఎక్కం రాయలేదు సరే... నోటితో చెప్పు’ గట్టిగా అరిచాడు. కొడుకు తలవంచుకుని నిలబడ్డాడు. రామం కోపం కట్టలు తెంచుకుంది. కొడుకు చేతిలో ఉన్న గట్టిగా చెక్క ప్రేముతో ఉన్న పలక విసురుగా లాక్కొని బలంగా కొడుకు తలపై బలం కొద్దీ కొట్టాడు. బలమైన గాయమై బొట బొట రక్తం కుర్రవాడి లేత చెంపల మీదుగా కారింది. కొడుకు చేసిన ఆర్తనాదానికి వంటిట్లోంచి వచ్చిన తల్లి, భర్త వైపు తీక్షణంగా చూసి, కొడుకుని దగ్గరికి తీసుకుని, ధారగా కారుతున్న రక్తాన్ని ఆపడానికి సపర్యలు చేసింది.
ఆరోజు రాత్రి పిల్లవాడికి తీవ్ర మైన జ్వరం వచ్చింది. రెండురోజులు మూసిన కన్ను తెరవకుండా పడుకుని ఉన్నాడు. తండ్రి ఒక డాక్టర్ని తీసుకు వచ్చాడు. అతడు గాయానికి కట్టు కట్టి, జ్వరం తగ్గడానికి మందులు ఇచ్చి వెళ్ళిపోయాడు. ఆ మరుసటి రోజు జ్వరం తగ్గింది. తలపై గాయం వళ్ళ కుర్రవాడు అచేతనంగా పడుకుని ఉన్నాడు. అప్పుడు తల్లి గమనించింది తన కొడుకు శరీరంలో నడుం నుంచి కింద భాగంలో కదలిక లేదని. సాయంత్రం ఆఫీస్ నుంచి వచ్చిన భర్తకి విషయం చెప్పింది. పైకి గంభీరంగా ఉన్నా ఈ రెండు రోజుల నుంచి రామం లోపల చాలా మధన పడుతున్నాడు. భార్య చెప్పిన మాటతో హతాశుడయ్యాడు.
తన శక్తి కొద్దీ ఎందరో పెద్ద డాక్టర్లను తీసుకు వచ్చి కొడునుకు చూపించాడు. అందరూ పెదవి విరిచారు. కొడుకుకు శాశ్వత వైకల్యం కలిగిందని, పిల్లవాడు లేచి నిలబడలేడని, నడవ లేడని చెప్పేశారు.
రోజూ సాయంత్రం రామం ఆఫీస్ నుంచి రాగానే ఇంటిముందు వరండాలో కుర్చీలో కొడుకును వొళ్ళో కూర్చో పెట్టుకుని కూర్చుంటాడు. కొడుకు తల నిమురుతూ హృదయానికి హత్తుకుంటాడు. తండ్రి చూపిస్తున్న ఆప్యాయతకు కొడుకు మురిసిపోతూ ఉంటాడు. తన శాశ్వత వైకల్యం గురించి ఇంకా అవగాహన లేనివాడు.
‘నాన్నా! నేను కూడా వెళ్లి అందరితో కలసి ఆడుకోనా?’ అని ఆశగా అడుగుతాడు. ఆ ప్రశ్న తండ్రి గుండెల్లో గునపంలా గుచ్చుకుంటుంది. కన్నతల్లి ఉబికి వచ్చే కన్నీళ్లను బలవంతంగా ఆపుకుని కొడుకుకు కనపడకుండా మొహం తిప్పుకుంటుంది.
పదమూడో ఎక్కం నేర్చుకుని నీకు చెప్పిన తరువాతే ఆడుకోవడానికి వెళతాను నాన్నా! అన్న కొడుకు మాటలకు ఆ దంపతుల హృదయాలు కన్నీటి సంద్రాలు అవుతాయి.
ఆ కన్నీరు ఈ జీవితంలో ఇంకుతుందా????

తాత మానవుడి చిన్న కధలు (28 )
రచయత : మల్లాప్రగడ రామకృష్ణ  

            సూర్యుడు మండిపోతూ గాలిని తోడేసుకుని వికట్టాట్టహాసాలు చేస్తున్నాడు, మరిగిపోవటం అంటే మననం చేస్తున్నట్లు మనసు చచ్చిన దేహంతో చిరిగిన పీలికలతో, వయసుని దాచలేక, అగ్ని స్నానం చేస్తోంది వికృత చూపుల తెరల్ని కప్పుకుంటూ మాడిపోతున్న పేగుల్ని కూడదీసుకుంటూ అడుగులేస్తోంది, సూరీడుతో పాటు అందంగా లేదని అడిగే వాళ్ళు లేరని పిచ్చిదని పేరు పెట్టి వదిలించుకున్న అత్తింటి అనుబంధాన్ని లెక్కలేసుకుంటున్న పాతికేళ్ళ పడుచు. తన కొడుకు జ్వరంతో మంచాన పడి ఉన్నాడు మొగుడు మృగంలా మారి వేదిస్తున్నాడు.     

గమ్యమంటూ ఉంటేగా గమనానికి పొడారిన చూపుల్ని, తడారిన గొంతుని తడుపుకుంటూ, తంటాలు పడుతూ దిక్కూ, మొక్కూలేని జనారణ్యంలో ఆకలి నోరు అల్లాడిపోతోంది, సుళ్ళు సుళ్ళుగా దుఃఖం దూకుళ్ళు కడుపులో వికారం బతుకు పోరాటం తెలీక అలిసిపోయి ఏ చెట్టు నీడకో చేరుకుంటోంది దయతలిచి ముద్ద పెడితే ఆరోజు తనదనుకుంటూ చీకటి పడితే చెట్టుకిందే పక్క పరుచుకుంటుంది వేటాడే కుక్కలు, పీక్కుతినే నక్కలు ఉంటాయని తెలీక ఆకాశం కూడా ఆక్రోశిస్తోంది అనాదిగా ఆడదాన్ని అవమానిస్తుంది. చెట్టు కింద ఏదో కదలిక ఒక్క మెరుపు మెరిసింది భర్త మదిలో కామంలా తాగిన మత్తు తొందర చేస్తుంటే కటిక చీకటి దారి చూపిస్తుంటే జోరువాన గొడుగు పట్టగా అడుగులు చెట్టుకిందకు చేర్చాయి ఆ కాళరాత్రి కేళీవినోదానికి ఎండిన డొక్కల, ఆకలి ఆరుపులు నిండిన కడుపు “ఆ”కలి కులుకులు హోరు వానలో పెళ పెళ మంటూ ఎదిరించే సత్తువలేక ఒకరు బరితెగించి మత్తుని వదలలేక మరొకరు ఆ “రెండు క్షణాలు”, వర్షం సైతం చేష్టలుడిగి ప్రాణాలు గాలిలో తేలినట్లు మారినాయి, మంచంలో ఉన్న కొడుకు ప్రాణాలు స్వర్గలోకం చేరాయి. మూగ జీవిగా మారిన తల్లి కామ పైశాచీకుడ్ని ఆ గాలి వానలో ఆ మత్తులో చేతి  కందిన అస్త్రంతో భర్తని తలవక గొంతు పిసికి, కన్నకొడుకు శవాన్ని భుజాన వేసుకొని పిచ్చి దానిలా పరుగెడుతున్న మనిషిని ప్రజలు చూసి హశ్చ చేసి పారిపోతున్న దని భావించి చేతి కందిన రాళ్లతో కొట్టి చంపారు. 
ఇదండీ ఈ లోకం స్త్రీని స్త్రీగా బ్రతక నీయదు, కేవలం విలాస వస్తువుగా చూస్తున్నారు, దానికి కోరికలు ఉంటాయని అవి భర్త ద్వారా పొందాలని ఆశిస్తారు భర్తే మృగం గా మారితే స్త్రీ మృగంగా మారుట తప్పు కాదు. ప్రజలు ఒక గొర్రె అటు పొతే అన్నీ గొర్రెలు అటే పోయినట్లు, ఎవరో చెప్పారని ఆలోచిన్చకుండా ఒక నిండు ప్రాణాన్ని తీసే జనానికి శిక్ష ఎవరు వస్తారు? ఈ లోకం మారేదెప్పుడు. స్త్రీని గౌరవంగా ఆరాధించేదెప్పుడు అది మేరె చెప్పండి.                
--((**))--


తాత మానవుడి చిన్న కధలు (27 )
రచయత: మల్లాప్రగడ రామకృష్ణ 

చెపుతా విను ఒక అభాగ్యుని కధ 
ఆరేళ్ళ క్రితమే, వున్న అరెకరాన్నమ్మినా, అప్పులు తీరలేదనీ......ఓ రైతు అర్థరాత్రి ఉరిపోసుకుని 
ఉసురు తీసుకున్న అభాగ్యుని భార్య ఆరునెలల గర్భంతో బతుకుని భారంగా మోస్తుంది.....,,, 

తినడానికి లేక కాదు మగడు చచ్చిన ఆరేళ్ళకి మూడోబిడ్డకు తల్లవుతున్నందుకు సమాజం వేలెత్తి చూపుతూ అసహ్యించు కుంటున్నందుకు ఇంట్లో అభమూ శుభమూ యెరగని పిల్లలు కాటికీ కాలుచాపి కాలున్ని రా! రమ్మని ఆహ్వానించే ....

వృద్దులు ఆకలాకలంటూ  అలమటించిన నాడు అయ్యో అంటూ ఆపన్న హస్తాన్నందీవ్వని 
సమాజం ఇప్పుడు మాత్రం వేలెత్తి చూపుతూ రాబందుల్లా పొడుస్తూనే వున్నారు........ 

అప్పులు తీర్చాలని..... కడుపున పుట్టిన అభాగ్యుల ఆకలితీర్చాలనీ వార్థక్యంతో రెక్కలుడిగిన 
అత్తామామల ననాథల చేయకుండా ఆశ్రయమవ్వాలనీ ఆమెలోని ఓ అమ్మదనం, ఆమెలోని ఓ సంస్కారం, ఆమెలోని ఓ మానవత్వం, ఆమెనా పనికి పురికొల్పింది, ఆమేం తప్పూ చేయలేదు 

బ్రతుకు తెరువు కోసం ఏపని చేసినా తప్పు కాదు, తప్పు అనుకుంటే అందరూ చేసేవి తప్పులే 
చెప్పేవాడికె నీతులు, ఆచరించ టానికి అన్ని ఆటంకాలే. 

విజ్ఞాన్ శాస్త్రం పెరిగింది, ధైర్యంతో దేశ సేవచేస్తూ, భక్తి తో పరమాత్ముని కొలవడమే అందరి కీ శ్రేయోదాయకం.             
తాత చాలా మంచి కధ చెప్పావు, ధైర్యంతో బ్రతకాలనేదే ఈ కధ నీతి. 

--((**))--

తాత మానవుడి చిన్న కధలు (26 )
రచయత: మల్లాప్రగడ రామకృష్ణ 

తాత నీవు ఏదన్న కధ చెప్పవా 
 చందమామ కధ...అంతా మన మంచికే! చెపుతా విను  

అనగనగ ఒక రాజు గారు. ఆయన దగ్గర ఒక తెలివైన మంత్రి ఉన్నాడు. ఓసారి ఓ రాజుగారు పళ్లు తింటుండగా కత్తివేటుకు పొరపాటున వేలు తెగింది. పక్కనే ఉన్న మంత్రి ‘అంతా మన మంచికే’ అన్నాడు. రాజుకు కోపం వచ్చింది. మంత్రికి బుద్ధి చెప్పాలనుకున్నాడు. ఆ తర్వాత రోజు వేటకి వెళ్ళినప్పుడు, మంత్రిని ఒక బావిలోకి తోసి ‘‘ఏది జరిగినా అంతా మన మంచికే’’ అని వెటకారంగా నవ్వి వెళ్లిపోయాడు. అంతలో రాజును ఒక ఆటవిక జాతివారు బంధించి కాళికాదేవికి బలి ఇవ్వబోయారు. 
కాని రాజు వేలి గాయాన్ని చూసి బలివ్వడానికి పనికిరాడని వదిలేశారు. వేలు తెగినప్పుడు మంత్రి అన్నమాట గుర్తుకు వచ్చింది రాజుకి. వెంటనే మంత్రిని బావి నుండి వెలుపలికి తీశాడు. ‘‘నా వేలి గాయం నాకు మంచిదే అయింది, కానీ నిన్ను నూతిలోకి నెట్టడం నీకు మంచి ఎలా అయింది?’’ అనడిగాడు. అప్పుడు మంత్రి ‘‘నన్ను నూతిలోకి పడెయ్యకపోతే, మీతో పాటు నన్నూ పట్టుకునేవాళ్ళు మిమ్మల్ని వదిలేసి నన్ను బలిచ్చేవారు. అందుకే ఏం జరిగినా " 
అంతా మన మంచికే అనుకోవాలి’’ అన్నాడు..!

కామెంట్‌లు లేవు:

కామెంట్‌ను పోస్ట్ చేయండి