3, సెప్టెంబర్ 2018, సోమవారం

ఆరాధ్య ప్రేమ లీల





ఆరాధ్య ప్రేమ లీల - ప్రాంజలి ప్రభ.కం   
రచయిత: మల్లాప్రగడ రామకృష్ణ 

మనప్రేమ కోసం, తనువంతా ఊపుతూ సరేలే అన్నావు    
- అనురాగం కోసం, అనుబంధం చూపుతూ సరేలే అన్నావు 

తలనిండా పూలు, సొగసంతా చూపుతూ సరేలే అన్నావు 
- నడుమును చూపి, మనసంతా తెల్పుతూ సరేలే అన్నావు 

ఎలుగెత్తి పాడి, ఎద చూపి త్వరగా సరేలే అన్నావు
- మైకముతో ఉండి, మతిపోయే మాటతో సరేలే అన్నావు         

సీరకొంగు జార్చి, సిలిపిగా నవ్వుతూ సరేలే అన్నావు 
- కనికరం చూపి, కన్ను గీటి పొందుకు సరేలే అన్నావు
    
సరే అంటే ఒప్పు  
సరే అనక పొతే తప్పు 
ఒప్పు, తప్పు, అంటేనే ముప్పు 
ఇది వేణు గోపాల ప్రేమ సుమా 

--((**))--



ఆరాధ్య ప్రేమ లీల
మల్లాప్రగడ రామకృష్ణ  

నా మనసును దోచిన సుమ గంధమా 
- నాకు పరిమళాలు అందించే పుష్పమా 

నన్ను వరించే ధన గుణ సంపెంగమా  
- నా మనసంతా శాంతి నింపే అమృతమా 

బంగారు తీగ లాగా నడుమున్నా భామా 
- నయన మనోహరములు గల సుమా 

నటన తెలియని ముద్ద మందారమా 
- నిత్యం అనుభూతుల తొ  రంజిల్లిదామా 

నిర్మల హృదయంతో మనమై  ఉందామా     
- నిర్విచనముగా అనుభ విమ్చుదామా 

వలపు తలపు అంటూ ఎకమౌదామా 
- నువ్వు నేను కళ ఒకటై జీవిద్దామా 

జీవన మాధుర్యం తెలిపే కుసుమమా  
- ఆత్మగౌరవం నిల్పే మాట మధురిమా

అనుపానాలన్నీ తెలుసుకో 
స్వర్గం ఏమిటో తెలుసుకో 
కానరానిలోకాలకు తెలిపో 
సుఖం క్షణం, జీవితం నిరీక్షణం 
ఇది వేణుగోపాల ప్రేమ సుమా  

--((**))--



ప్రాంజలి ప్రభ.కం 
ఆరాధ్య  ప్రేమ లీల 
రచయత: మల్లాప్రగడ రామకృష్ణ 

మల్లెపూల జల్లులోనే తడిస్తే ఎంతో హాయి 
- మనసుతో  సరసంగా తడిస్తే ఎంతో హాయి 

ప్రణయ రాగంతో పాడి తడిస్తే ఎంతో హాయి  
- ఆనంద విందులో ఆడి తడిస్తే ఎంతో హాయి 

ఆణువణువూ ఐక్యమై  తడిస్తే ఎంతో హాయి 
- అల్లుకొని ఆధరాలు తడిస్తే ఎంతో హాయి 

క్రియాశీల ముద్దులోనే  తడిస్తే ఎంతో హాయి
- హృదయానంద పరుస్తూ తడిస్తే ఎంతో హాయి  

తేలికభావం ఉంటె అంతా హాయి
ప్రతిదీ నాది, నావారిది అంటే లేదు హాయి 
అంతరాత్మ ఘోష లేకుంటే అంతా హాయి 
ఇది వేణు గోపాల ప్రేమ సుమా 
--((**))--
   



ఆరాధ్య ప్రేమ లీల 
రచయత : మల్లాప్రగడ రామకృష్ణ 

కళ్ళు గప్పి వెదుకు లాటలను చూసి 
- గిల్లి బెదురు బిత్తర చూపులు చూసి  
చీర చెంగున దోగాడి లాగుట చూసి 
- ఓప లేనురా  చిలిపి పనులు  కృష్ణా   

చెంప దెబ్బకు అతివ భాదను చూసి 
- మల్లెల జడ లాగుట ఆటను చూసి 
వెన్న ముద్దలు దొంగగా తినుట చూసి 
- ఓప లేనురా  చిలిపి పనులు  కృష్ణా 

తనువు మోపలేని  మహిళలని చూసి  
- సుధలు విప్పారి ఇంతుల ఆశ చూసి  
పొందు కోసం వనితల ప్రేమలు చూసి 
- ఓప లేనురా  చిలిపి పనులు  కృష్ణా 

తాపము తగ్గించుట ఎలా అని చూసి
- కోపము లేక ప్రేమ పొందాలని చూసి
వేడుకొని ప్రేమను అర్ధించుట చూసి
- ఓప లేనురా  చిలిపి పనులు  కృష్ణా 

ప్రేమ జ్వరం ఉంటె 
నిద్రా సుఖం ఉండదు
శాంతి కోరే ప్రేమే 
జీవితాంతం సుఖం 
ఇది వేణుగోపాల ప్రేమ సుమా       
--((**))--


ఆరాధ్య ప్రేమ లీల 
రచయత: మల్లాప్రగడ రామకృష్ణ 

అందేల సవ్వడుల చిద్విలాసం నాకు మైమరుపు  
- మృదు మధుర అధర దర హాసం నాకు మైమరుపు 

పసిడి సొగసు ముఖ ప్రభాసం నాకు మైమరుపు 
- అంతర్ వాణిగా నిత్యసహవాసం నాకు మైమరుపు  

జల్లు లేక హరివిల్లు విలాసం నాకు మైమరుపు 
- మౌనపు పులకింత నిజగ్రాసం నాకు మైమరుపు

సమయం వ్యర్ధంచేసే పరిహాసం నాకు మైమరుపు
- తెలియంది లేదనే ఇతి హాసం నాకు మైమరుపు

మతిమరపు - మైమరుపు ఎంతో తేడా 
న్యాయ మరుపు - అన్యాయ మెరుపు తేడా
తోలి వలపు - తుది మలుపు కూడా తేడా
ఇది వేణుగోపాల ప్రేమ సుమా 
--((**))--


ఆరాధ్య ప్రేమ లీల 
రచయత: మల్లాప్రగడ రామకృష్ణ 

మరులు గొల్పి మది ఉల్లాస పరుచు నీమాట 
- సిరులు నిల్పి దాన గుణాన్ని పెంచును నీమాట 

కలలు కల్గి సుఖ సంతోషాన్ని పంచు నీమాట  
- చేప్పిన తక్షణం తరుణం ఫలించును నీమాట 

తగువులకు ఎప్పుడు కాదు ఆధారం నీమాట 
- మనస్సును ఉల్లాసం ఉత్సాహపరుచు నీమాట 

సమయ సంధర్భాలను బట్టి మారును నీమాట 
- దేవుడు గురువు తల్లి తండ్రుల  మాటే నీమాట 

సమస్యను పరిషరించి 
అనుమానాలను తుంచి 
నమ్మకములను కలిగించి 
జీవితాన్ని నడిపించేదే నీమాట
వేణుగోపాల ప్రేమ సుమా 

--((**))--



ఉపాధ్యాయులను స్మరించుకునే ఈరోజు
గురువుని గురించి వ్రాసినది
ఆరాధ్య ప్రేమ లీల 
రచయత : మల్లాప్రగడ రామకృష్ణ 

అజ్ఞాణం తొలగించి విద్యావిజ్ఞానం నింపే వెలుగుల్
- అంధకారం తొలగించి దివ్య తేజం నింపే వెలుగుల్

బద్దకం తొలగించి దృఢ శక్తిని నింపే వెలుగుల్  
- కలలన్ని నిజం చేసే సుఖనిద్ర నింపే వెలుగుల్

స్థిరబుద్ధిని కల్పించు ధర్మగుణం నింపే వెలుగుల్
- మాయను తొలగించే ధైర్య సద్గుణం నింపే వెలుగుల్ 

ధర్మ సూక్ష్మాల మర్మాన్ని మనసున  నింపే వెలుగుల్      
- దైవ, కాల గమనాన్ని మనుష్యుల్లో నింపే వెలుగుల్  

నిత్య వెలుగులు నింపేది సూర్యుడు 
విద్యా వెలుగులు నింపేది గురువు
ప్రేమ వెలుగులు నింపేది వనిత 
 ఇది వేణుగోపాల ప్రేమ సుమా 

--((**))--



ఆరాధ్య ప్రేమ లీల 
రచయత : మల్లాప్రగడ రామకృష్ణ 

అనురాగము ఆప్యాయత తో అభ్యుదయం చూపే 
- ఆదర్శం ఆత్మీయతతో విద్యానుబందాన్ని  చూపే 

జ్ఞానం, వినయ విజ్ఞానాన్ని అభ్యాసము తో చూపే  
- కర్తవ్య కారున్యం  కలియుగ ప్రేమలతో చూపే 

ధరణి యందు ధనముతో సంభందం లేక చూపే   
- గమన గమ్యం,  తారతమ్యం తేడాలకుండా చూపే  

అక్షర జ్ఞానం  విద్యార్థులకు ఆశయంతో చూపే  
- గురువు పాద పద్మములు వందనములు చూపే    

తల్లి, తండ్రి, గురువు 
దైవం, నిత్య బంధం 
గౌరవించుటే విద్యార్థుల ధర్మం
ఇది వేణు గోపాల ప్రేమ సుమా
--((**))--



ఆరాధ్య ప్రేమ లీల
రచయత: మల్లాప్రగడ రామకృష్ణ  

మనిషిని మనిషిగా చుస్తే అదే నీ గొప్పతనం 
- మాటను బట్టి గౌరవిస్తే  అదే నీ గొప్పతనం

శాంతిని కల్పించి గుర్తిస్తే అదే నీ గొప్పతనం
- మాయ, భయాన్ని తొలగిస్తే అదే నీ గొప్పతనం 

మానవత్వాన్ని బ్రతికిస్తే అదే నీ గొప్పతనం
- మాతృభాష  అనుకరిస్తే అదే నీ గొప్పతనం

మగువ మౌనాన్ని తీరుస్తే అదే నీ గొప్పతనం
- అనుమానాన్ని తొలగిస్తే అదే నీ గొప్పతనం

గొప్పతనం - మంచి గుణం 
స్నేహతత్వం - ప్రేమతత్వం 
తల్లి తండ్రుల గుణాన్ని బట్టి మారు 
ఇది వేణు గోపాల ప్రేమ సుమా 
--((**))--



ఆరాధ్య ప్రేమ  లీల 
రచయత: మల్లాప్రగడ రామకృష్ణ  

పున్నమి వెన్నెలకు పుడమి పురి విప్పింది  
- పున్నాగ పొదలకు  చెలిమి చేరి నవ్వింది 

నయన చూపులకు గులిమి చేరి పిల్చింది 
- వల్లోన తలబెట్టి ఉరిమి చూసి ఏడ్చింది 

జోకొట్టి జోలపాడి దఱిమి చేరి జుర్రన్ది    
- ఊకొట్టి ఊయలూగి బలిమి చూపి భల్లంది

ముద్దెట్టి మలిచూపి మేలిమి సిరి మేలంది  
- కధల మాటలకు కలిమి చేరి కస్సంది 

కస్సు బస్సు అన్న 
కన్నె సోకు తగ్గదన్న 
అవునన్నా కాదన్నా 
వనితకు లొంగకున్న 
జీవితము సున్నా 
వేణుగోపాల ప్రేమ సుమా  
--((**))--


ఆరాధ్య ప్రేమ  లీల 
రచయత: మల్లాప్రగడ రామకృష్ణ  

మల్లెపూల కురులే మనసైన వాడికి మత్తు జల్లులే     
- పల్లెబాట పుష్పాలే మనసైన వాడికి మత్తు గాలులే   

కళ్ళ చూపు ఆశలే మనసైన వాడికి మత్తు జూపులే 
- కళ్ళ మాయ సెగలే మనసైన వాడికి మత్తు గొల్పులే 

విల్లు వంపు బాణాలే మనసైన వాడికి మత్తు గోళీలే   
- వెల్గు వత్తి చీకటే   మనసైన వాడికి మత్తు పగలే 

వన్నెలాడి నడుమే మనసైన వాడికి మత్తు సెగలే 
- జంట చేరు చెలియే మనసైన వాడికి మత్తు ప్రేమలే 
    
కాకి పిల్ల కాకికి ముద్దు 
పిల్ల ప్రేమ ప్రియునికి ముద్దు 
ప్రియుని మగసిరి పిల్లకు ముద్దు 
ఇది వేణు గోపాల ప్రేమ సుమా 
--((**))--

కామెంట్‌లు లేవు:

కామెంట్‌ను పోస్ట్ చేయండి