20, సెప్టెంబర్ 2018, గురువారం

శ్రీ శ్రీనివాసా




Pranjali Prabha.com
శ్రీ శ్రీనివాసా
రచయత : మల్లాప్రగడ రామకృష్ణ 

ఎందఱో మహానుభావులు శ్రీ శ్రీనివాసుని ప్రార్ధించి ఆయురారోగ్య ఐశ్వర్యములు పొంది, దేవుని కృపకు పాత్రులు అయినట్లు మనకు తెలుస్తున్నది, నాలో మెదిలిన భావాలను అక్షర రూపములొ స్వామివారిని కీర్తిస్తు ఇందు పొందు పరుస్తున్నాను, దీనిని చదివినవారు ప్రతి ఒక్కరు ఆ స్వామివారి కృపకు పాత్రులగుదురు,  ఆస్వామివారు నా మనసున ప్రవేసించి తెలుపగా నేను వ్రాయుట జరిగింది. మీరు చదివి ఇతరులను చదవమని ప్రోస్చహించిన మనస్సాంతి,  ఆరోగ్యము బాగుండగలదని, ఐశ్వర్యము పొందగలరని, ఆ స్వామివారి పై  నమ్మకముతో నేను చెప్పు చున్నాను.  మొక్కులను తీసుకొని మనకు ఆనందం పంచే శ్రీ శ్రీనివాసుడు ( శ్రీ వేంకటేశ్వరస్వామి, ఏడుకొండలవాడ వెంకటరమణ గోవిందా గోవిందా గోవిందా )
   
నా ప్రార్ధనలు ఆలకించు శ్రీ శ్రీనివాస

1. జయ విజయులను తప్పించుకొని, నిన్ను చేరాలను కున్నాను
    నిన్నూ, అమ్మని,  ప్రార్ధించి, మీ పాదాల చెంత ఉండాలను కున్నాను
    కళ్ళు మూసిన, కళ్ళు తెరిచినా, నీ రూపాన్ని తలుస్తూ ఉన్నాను 
    అందరి తండ్రివి నీవు, నా కేమో రక్షకుడవు శ్రీ శ్రీనివాసా     
                                                                                   
2. నాకు సమయస్పూర్తి  లేక నేను కొందరికి బందీ  నయనాను
    కాలచక్రం తెలియక  కొందరి చేతుల లో నలిగి పోయాను        
    నా మనసు సూర్య- చంద్రులుగా సహాయంచేసి నలిగి పోయాను
    అయినా నీ  మీద భక్తిని వదల లేకున్నాను  శ్రీ శ్రీనివాసా  

3. నా కను పాపలో పాపగా ఉన్నావు, నిన్ను నే చూడ లేకున్నాను
    కొండలపైన ఉన్నవనములో ఉన్నావు నే నెక్క లేకున్నాను
    నా రాత నిన్ను సేవించే విధముగా మార్చమని కోరుతున్నాను 
    మేఘంలా వచ్చి నిన్ను సుబ్రపరచాలనుకున్నా శ్రీ శ్రీనివాసా   

4. నా  అంతరంగం, నవనీతానికి ప్రతి రూపంగా, నీపై  ఉంటుంది
    నా మనసు, పుణ్య భావాల మందిరమై, అలరారుతూ ఉంటుంది
    ఆపదను తొలగించి, ఆదుకొనేది, నీవేనని, తెలిసింది 
    కర్మబందాలను తీర్చి మమ్ములను కాపాడవా  శ్రీ శ్రీనివాసా  

5. బృగు  మహర్షి  గర్వాన్ని తొలగించి దేవికి కోపం తెప్పించావు 
     శ్రీమతి కోసం లక్ష్మీ లక్ష్మీ అని కలియుగంలో విలపించావు                                                          అలసియు వల్మీకంలో ఉండి ఆవుపాలను త్రాగిన వాడవు 
    నేను నిత్య పూజా నైవేద్యములతో కొలుస్తాను శ్రీ శ్రీనివాసా 
                                    
--((**))--

6. భూమి ఆకాశం మధ్యలో నేను నలిగి పోయే మనిషిని నేను
    సముద్రపు వడ్డున పడి  గిల గిల లాడిన చాపను నేను
    చీకటి వెలుగులో నీ రూపాన్ని పూజించాలని అనుకున్నాను
    నీకు మ్రోక్కుచున్నాను  నా మనసు అర్ధం చేసుకో శ్రీ శ్రీనివాసా  

7. కళ్ళు మూసి తెరిచే లోపు లోకంలో ఉన్నమాయను తొలగించు 
    మానవులకు నాలుకపై లలాజల ముండే వరకు రక్షించు
    మనిషిగా పాదాలతో భూమిని తట్టుచున్నాను నన్నుక్షమించు
    మా శిరస్సులతో నీ పాదాలకు మ్రోక్కుచున్నాను శ్రీ శ్రీనివాసా 

8. ప్రతి రేయి  కలలు  కంటా,   ఏడు కొండలు ఎక్కి రావాలని
    ప్రతిక్షణం నీ గురించే ఆలోచనా  నిలబడి దీవిస్తావని 
    ప్రతి నిమిషం నిన్నే తలుస్తున్నా,  కష్టాలు  కడ  తెరుస్తావని   
    నీ పాదాలను ప్రార్ధిస్తూ ప్రతి రాత్రి  తపిస్తున్నా శ్రీ శ్రీనివాసా,   

9. జ్ఞానమే నలుసంత కాటుక పెట్టి అజ్ణానాన్ని తొలగించావు 
    ప్రతి హృదయంలో అజ్ఞానాన్ని తొలగించే జ్ఞానసంపన్నుడవు  
    ప్రతి హృదయ క్షేత్రములో ఆద్యాత్మిక బీజాలను నాటించావు   
    జీవిత రధాన్ని దైవ మార్గంలో నడిపించావు  శ్రీ శ్రీనివాసా 
                                                                   
10. అర్ధిస్తూ, అలమిటిస్తూ,  జ్ఞాణ బిక్షకు ప్రార్ధనలు చేయుచున్నా 
     విలపిస్తూ, అన్వేషిస్తూ, ధర్మ   భిక్షనుసేవలను చేయుచున్నా
     భవ బంధాలన్నియు వదలి ప్రేమ కోసం నిన్నే వేడుకుంటున్నా
     సతీ సమేతముగా నిర్ధిష్టంగా కీర్తిస్తున్నాము శ్రీ శ్రీనివాసా 

--((**))--

11. లోక మొక రంగస్థలి,  మేము నిన్ను తలచి చలించే దాసులం
     మనసు ఒక చక్రస్థలి, మేము  భగవంతుని కృప పాత్రులం
     మమతలుగల లోగిలి, మేము పాదాలను పూజిమ్చె పుష్పాలం
     నిన్ను మోసేది బాహుబలి,  నీ దర్శనమే మోక్షం శ్రీశ్రీనివాసా

12. భగవత్ సంకల్పమునకు మనం అనుకూలముగా జీవించడం 

     భగవంతునికి  ప్రతికూల  మైన  దాన్నీ మనం విసర్జిమ్చడం
     సంసారంలో సుఖశాంతులు దేవుని కల్పనఅని భావించడం  
    మేము మంచి-చెడుల మద్య నలిగి పోతున్నాము  శ్రీ  శ్రీనివాస

13. ప్రతి చినుకు తేనే, ప్రతిరోజూ పండుగ  నిన్ను ప్రార్దిమ్చుతుంటే

      ప్రతి మాట సత్యం, ప్రతి పనిలో నిన్నే సహాయమ కోరు తుంటే
      ప్రతి హృదయం నిన్నువేడుకుంటూ నిన్ను అమ్మను కొలుస్తూ ఉంటే 
      నిన్నుప్రార్ధించే శక్తి కల్పించమని  వేడుకుంటా శ్రీ శ్రీనివాసా 

14.  శితోష్ణస్థితి జయాపజయం మానవులు  అనుభవిస్తున్నాను

      సుఖ దు:ఖాలు, పాపపుణ్యాలు కోపం సహజమని భావిస్తున్నాను    
      కర్మాను  సారంగా వచ్చే ప్రతి ఫలితాన్ని అనుభవిస్తున్నాను
      ఇంద్రియ నిగ్రహము కొరకు  నిన్ను కోలుస్తున్నా శ్రీ శ్రీనివాసా

15. త్యాగము ద్వారా మాయను తుంచే  ప్రేమా అమృత తత్త్వం లభించును 

      అహంకారం, భయం, అనుమానం లేకపోతేనే ప్రేమ లభించును
      భగవంతుని  తత్వాన్ని అర్ధం చేసుకోలేక బ్రతుకు తున్నాను
      జన్మ జన్మల బంధంగా మేము ప్రార్దిమ్చుతున్నాను శ్రీ శ్రీనివాస
--((**))--


Pranjali Prabha.com
శ్రీ శ్రీనివాసా-4 


రచయత : మల్లాప్రగడ రామకృష్ణ

16. స్వామీ భాహ్య విషయాలకు మేము చింతించుట లేదు
      అంతర్యములోని  విషయం పట్టిమ్చు కోనుటలేదు
      సమస్త చింత తొలగించే దైవ ప్రార్ధన మారదు
      చిన్మాత్ర స్వరూపు డుగా ప్రార్థిస్తున్నా శ్రీ శ్రీనివాసా 

17. చిత్తము తోను చింతించు వాడు ముక్తిని పొందు తాడు
      మనసుతో  ప్రార్దిమ్చువాడు మోక్షమును పొందుతాడు
      దాన ధర్మాలు చేయువాడు స్వర్గమును చేరుతాడు
      మరణ సయ్యపై ఉన్నా నీపై భక్తి శ్రీ శ్రీనివాసా 

18. జ్ఞాణమనే అగ్ని,  అజ్ఞాన మాలిన్యం దగ్ధం చేయు
      జ్ఞాణ జ్యోతి  అజ్నానాంధకారాన్ని తొలగింప చేయు 
      జ్ఞానాన్ని  పెంచే నీ నామ స్మరణ ఉపకారం చేయు 
      ఆత్మజ్ఞానం కోసం నిన్నె ప్రార్దిమ్చుతా శ్రీ శ్రీనివాసా
  
19. భగవన్నామాలతో దివ్యాను భూతిని  పొందవచ్చు
      భక్తి అనే ఆయుధమే పరమాత్మను చేరవచ్చు
      నావ లేకుండా సంసార సముద్రాన్ని దాటవచ్చు
      భక్తి అనే బీజం వృక్షంగా సుఘంధం శ్రీ శ్రీనివాసా  
                                        
20.  తల్లి ప్రేమ ముందు కన్న బిడ్డలు నడవ కుండునా
       భార్య ప్రేమ ముందు భర్త ప్రేమ ఉండ కుండునా
       భక్తుడి ముందు పరమాత్ముడి ప్రేమ ఉండ కుండునా
        నిన్నే ప్రార్దిమ్చుతున్నా ను  భక్తుడుగా శ్రీ శ్రీనివాస 

--((**))--

21. గాంచితి కనులారా నీ దివ్యాతి దివ్య స్వరూపాన్ని   
     స్వప్నాను భూతినీ తెలుపుతూ వ్రాసితి కవిత్వాన్ని 
      కల వాని, కన్న కళ  వానిని  గాంచి ఔదార్యాన్ని 
      విశ్వాస ముగా దర్శనమిచ్చితివి శ్రీ శ్రీనివాసా  

22. పాములా పరుల ఇంటిలోన నిద్రించ లేకున్నాను
      చాపలా  ఆకలి  లేకున్నా  ఆశలకు  పోకున్నాను 
      తేనటీగల  ద్రవ్యాన్ని  సేకరించి పంచు తున్నాను
      మమ్ము కాపాడమని వేడుకుంటున్నా శ్రీ  శ్రీనివాసా 

23. నీ కొండలు నడిచి నీ రూపం చూడాలని ఉన్నది
      నీ కధలు వింటుంటే మనసు శాంతమవుతుంది 
      నీ దృశ్యం నా మనసుని నిర్దేహమయం చేస్తుంది
      నీ రూపం  నా మాయను  తొలగిస్తుంది శ్రీ శ్రీనివాస

24. హృదయ భవనము నందు పరమాత్మ భావనయే 
      సంసార సుఖ శాంతులు మనిషి గృహ కల్పనయే
      దంపతులకు సంతానం  కర్మల పరి పక్వతయే
      తప్పులు చేయక రక్షించు వాడవే శ్రీ శ్రీనివాసా

25. గోవిందా, గోవిందా ప్రార్ధన నా నిత్య నామస్మరణ
      వరదా, దయాపరా, మా మీద నిత్యం చూపు కరుణ
      ప్రాణులను రక్షించే అవతార లక్ష్యం నారాయణ 
      పాదాలను పూజించుటయే శరణ్యం శ్రీ శ్రీనివాసా

--((**))--



Pranjali Prabha.com
శ్రీ శ్రీనివాసా-5 

రచయత : మల్లాప్రగడ రామకృష్ణ


26. ఏలిక నీవయ్య, ఆలోచన  కూడిక నీ  తొనయ్యా
      మాతో పలుక వేమయ్య, ప్రార్ధన ఆలకిన్చవయ్యా
     మమ్మేలు కోవయ్య, మా తప్పులన్నీ మన్నించవేమయ్యా
     మా మీద కరుణ చూపేటి భాస్కర శ్రీ శ్రీనివాసా 

27. అఖిల దేహాలలో అంతర్యామిగా నేవే ఉన్నావు
      బాహ్యాభ్యంతరము వెలుగును విస్తరించేవాడవు 
      భూదేవి మొరవిని భారమును ధ్వంసము చేసావు
      మనసు లగ్నానికి సహకరించే  శ్రీ శ్రీనివాసా  

 28. చిరునవ్వుతో వికసిత  పద్మసౌందర్యం మోము గలవాడవు
      సమస్త దేవతా మూర్తులచే ,  మహర్షులచే వందనీయుడవు
      వరదాన పరాత్పరుడవు,  లక్ష్మి- పద్మావతీ వల్లభుడవు
       ప్రార్దిమ్చితే కరుణ చూపె కరుణా మయుడవు శ్రీ శ్రీనివసా 

29. మేము సంసార  సాగరమున  మగ్న  మైన వారము
      ద్వందముల వాయువుచే చెదర గొట్టిన వారము
      భార్యా, బిడ్డలనే బంధము తెంచుకోలేని వారము
       నిన్నే నిత్యం వేడు కుంటున్న వారము శ్రీ  శ్రీనివాసా

30. అనన్య భక్తితో నీయందే మనస్సును కలిగి ఉన్నవారము
      అనన్య భావముతో యోగము నందు నిమగ్నమై ఉన్న వారము
      సర్వ ప్రాణులకు ఆత్మ స్వరూపమని నిన్నే ప్రార్ధించు వారము
      విజ్ఞాన సహితముగా తత్వజ్ఞానమ్ అర్ధిస్తున్నా శ్రీ శ్రీనివాసా
--((**))--


Pranjali Prabha.com
శ్రీ శ్రీనివాసా-5 

31. జగత్తు నందు ప్రాణులు పుట్టించి సహకారించే వాడవు నీవె 
      జగత్తు నందు ప్రాణుల యొక్క నాశనము చేయు వాడవు నీవె
      సమస్థ ప్రాణుల జీవశక్తి, భక్తి కలిగించు వాడవు నీవె
      ప్రతి వస్తువు నీలొ ఉన్నది, నే ప్రార్దిమ్చుతున్నా శ్రీ శ్రీనివసా 

32. తేజో వంతులలో తేజస్సు బలం అందిమ్చి కాపాడిన వాడవు
      ప్రజ్ఞా వంతులలో ప్రజ్ఞను నిర్మలత్వం పంచిన నాయకుడవు   
      సమస్త   భూతములు, సృష్టి అధీనములో ఉంచుకొన్న వాడవు    
      ప్రకృతి అనుకరించి ప్రకాశింప చేసేవాడవు  శ్రీ శ్రీనివసా 

33. త్రిగుణాత్ముడవు మనస్సు సర్వమును ఒకచోట చేర్చువాడు
      సర్వేంద్రియాలు పనిచేసి జనన మరణాలు లేనివాడవు 
      భక్తికి లొంగి సహయము చేసి మనస్సు కంటెను శ్రేష్ఠుడైనావు  
       బుద్ధిలేని వారికి బుద్ధి, శక్తి  మార్చేవాడవు శ్రీ శ్రీనివాసా 

34. ఆకాశమున మేఘాన్ని, శబ్దాన్ని కల్పిమ్చే వాడవు
      స్త్రీలకు, పురుషులకు,   పౌరుషము  పెంచే వాడవు
      సమస్త గ్రహములను అదుపులో  ఉంచే వాడవు
       తాపసుల్లో తపస్సును ప్రోశ్చహిమ్చే శ్రీ శ్రీనివాసా  

35. శుభ కర్మలను ఆచరిస్తూ సుఖ సంపదను కోరుతున్నాను 
      శారీరక  మానసిక సంతాపానికి చలితుడవు తున్నాను
      సుఖాలపై ఆశక్తి వీడి  జ్ఞానము పొందు ఇచ్చగలవాడను
      అజ్నానులమై ఉన్నా మేము  జ్ఞానాన్ని కోరుతున్నా శ్రీ శ్రీనివాసా  
--((**))--


36. ఆశకు, మోహమనే  కెరటాలకు  చిక్కి ఉన్నాము  
      సుఖము అనేడి సుడిలో పడి లేవలేకున్నాము
      కన్న బిడ్డల ప్రేమానురాగం వదలక  ఉన్నాము
      మాయ భ్రమ నుండి మమ్ము  తప్పించుము శ్రీ శ్రీనివాసా             
                                                            
37. గాలి తీవ్రముగా ఉన్నప్పుడు కళ్ళు తెరచి చూడ లేకున్నాను
     కోరికల గాలులు మనసుకు తగిలి నిలుపలేకున్నాను  
     మూడు ముడులు వేసిన నేరానికి బంధాలకు చిక్కిఉన్నాను
     భక్తి అనే నావను ప్రేమగా నడిపి ప్రార్ధిస్థా శ్రీ శ్రీనివాసా

38. నీ  యందు  భక్తి  లేని వారిని  నేను  రక్షించ లేను
     మనస్సుతో  త్రునీకరించిన   వారిని తలవను
     నీ కధలు  లేని  గ్రంధాలను  నేను  చదువలేను
     అందరు కలసి సేవా పాత్రులమే  శ్రీ శ్రీనివాసా 

39. నాలుకతో శ్రీ శ్రీనివాస నామమును కీర్తిస్తాను
      చిత్తముతో ఏడుకొండలను ఎక్కి వేడు కుంటాను
      హస్తములతో నిత్యము నీకు  అర్చనలు చేస్తాను
      నీలాలు అర్పించియూ, మొక్కు తీరుస్తా శ్రీ శ్రీనివాసా

40. శ్రవణాలతో నిత్యం భక్తి గీతాలు ఆలకిస్తాను
     నేత్రాలతో దివ్యమంగళ  రూపాన్ని తిలకిస్తాను
     మోకాళ్ళతో ఆలయంచేరి పాదాలను పూజిస్తాను

     తలరాత మార్చి నీపై ద్యాస ఉంచు శ్రీ శ్రీనివాసా        

--((**))--

శ్రీ  శ్రీనివాసా Pranjali Prabh.com   
రచయత : మల్లాప్రగడ రామకృష్ణ

41. నీ సకల వైభవాళ్ళో ముందు  భూమి ఒక రేణువో
     నీ వెలుగు ముందు అగ్ని అంతయు మిణుగురు పురుగో
     నీ శ్వాస ముందు వాయువు సన్నని నిట్టుర్పు వంటిదో
     మేము దాసాను దాసులం అవుతున్నా శ్రీ శ్రీనివాసా

42.నేత్రములయందు ఆనంద బాష్పాలురాలు తున్నవి
     శిరము వంచి, అంజలి ఘటిస్తూ, స్వరంతో మనవి 
     ధ్యానమనే సుధా రసము పానము  కల్పించితివి
     పాదాలు కొలుచుకు అనుగ్ర హింపు శ్రీ శ్రీనివాసా

43. ఏడు కొండల వేంకట రమణ, కరుణ సముద్రా,
     శ్రీ పతీ, కంసారీ,  గజేంద్రుని బ్రోచే దేవా, మాధవా,
     జగత్రయ గురో, హే పుండరీకాక్షా, హే గొపీ నాధా,
     రక్షించే నిన్ను తప్ప అన్య మెరుగ శ్రీ శ్రీనివాసా

44. మనస్సు హృదయం నందే స్తిరముగా నిలిపితిని
      సర్వేద్రియాలను నిగ్రహించు కొని ప్రార్దిమ్చితిని
     ఏకాగ్రతతో నిన్నే కీర్తిస్తూ  చెంతకు  చేరితిని
       ద్యానమార్గంలో ఆరాధించు చుంటిని శ్రీ శ్రీనివాసా

45. సర్వజ్ఞుడవు, సనాతనుడవు, అందర్నీ శాసించేటి వాడవు
      అణువుకంటే సూక్షమైన వాడవు, అందర్నీ పోషించు వాడవు
      అచింత్య రూపుడవు, సూర్యునివలె నిత్యం ప్రకాశించు వాడవు
      అజ్నానంధకారాన్ని పారద్రోలమని ప్రార్ధించా  శ్రీ శ్రీనివాసా
      --((**))--
                                                       
46 మాలోఉన్న అసురప్రకృతిని తగ్గించి,   దైవశక్తి పంచావు
   ఆశ్చర్య కరముగా ఆకర్షించేటి కేశములు కలవాడవు
    ఉంగరాల వలె  కేశాలను పెంచుకొనేటట్లు చేసే వాడవు
    స్త్రీలు, పురుషులు కురులు తీసుకొని, కాపాడే శ్రీశ్రీనివాసా

47.   పురుషులకన్న ఉత్తముడవు, శబ్ధ, జ్ఞాన, సంపన్నుడవు
       అశుభాలు తొలగించి అందరికి శుభాలు కల్పించే వాడవు
       ఆపేక్ష కలగి మంగళాన్ని కలిగించే కలియుగ దేవుడవు
       ప్రతి ప్రాణిని  సక్రమ మార్గమున నడిపించే శ్రీ శ్రీనివాసా

48.  అవసరానికి   ఉపాయము  నందించే  నేతగా ఉండే వాడవు
       ప్రకృతి  విపత్తు  నుండి   జీవులను  రక్షించేటి పురుషుడవు
       భక్తుడైన ప్రహ్లాదుడి భయాన్ని తొలగించిన నరశింహుడవు
       అస్థిరమైన మనస్సుగల ప్రాణాల్ని కాపాడే శ్రీ శ్రీనివాసా

49.  విద్య, వాసన, కర్మ, రుచి, అనేవి తెలియని వానికి నీవే రక్షః               
      మాయ మాటలకు చిక్కి, మనసు చలించినట్టి వానికి నీవే రక్షః
      ముక్తులను ఆనంద పరిచి, వారిని కటాక్షిమ్చుటకు నీవే రక్షః
      మా గుణములన్నియు క్రమంలో ఉంచుటకు నీవే రక్ష శ్రీ శ్రీనివాసా     

50. కలియుగ ధర్మమునకు హాని కలిగుతున్న వారికి నీవే రక్షః
     దుష్టులను,దుర్మార్గులను, మోసకార్లను, రూపుమాపుటకు నీ రక్షః
    సత్పురుషులు, పతివ్రతలు, భక్తులు పరిరక్షించుటకు నీ రక్షః
    తిరుమలపై అవతరించి మాతప్పులను మన్నించే శ్రీ శ్రీనివాసా

--((**))--

51.    ఆది అంతములు లేని నిత్య యవ్వన వంతుడవు
        గర్భాన్ని ఆవిర్భావింప తల్లి బిడ్డను కాపాడే వాడవు
       బ్రహ్మచే సృజిమ్పపడిన ప్రజాపతులకన్న ఉత్క్రుష్టుడవు
       బ్రహ్మా రుద్రాదులతో సేవించ బడు శ్రీ శ్రీనివాసుడవు

52.    తనకు తానుగా అవతారము ఎత్తిన వాడవు
        సౌశీల్యాది గుణములను ప్రకటిమ్చినవాడవు
        సర్వమండలం మద్య నివసించే పరాత్పరుడవు
        మమ్ము కాపాడే హస్తములుగల శ్రీ శ్రీనివాసుడవు

 53. ఎదిగే ఎదమీద ఆచ్చాదనలేక దిక్కులేని వారిని కాపాడావు
       ఎంగిలి మేతుకులులకు కుక్కల్లాగా పోట్లాడేవారిని కాపాడావు 
    పసికందులతో, చలిలోఇల్లులేక చెట్టు క్రింద చేరినవారిని కాపాడావు   
    అందరి హృదయాలకు అర్ధం చేసుకొని శ్రీ శ్రీనివాసా కాపాడే వాడవు

54.  భూలోకంలో  పాపపుణ్యాల భారాన్ని మోసే వాడవు
      కాలాన్ని కదిలే ప్రవాహంలా సృష్టించిన వాడవు
     సుఖ దు:ఖాలతో జీవులు బ్రతకాల న్న వాడవు
     ఆశ- నిరాశ మద్య జీవితాన్నిచ్చే  శ్రీ శ్రీనివాసా 
                                                                             
55. కోకిల గొంతుల్లో మధుర స్వరాలు వినిపుస్తున్నా
     తులసీ దళాలు పరిమళాలు విరజిమ్ము  తున్నా
     మకరందాలు గ్రోలు బ్రమరాలు నాదాలు చెస్తున్నా    
     బాధల్లో ఉన్నా దయచూపి రక్షించే శ్రీ శ్రీనివాసా

56. అలంకార శోభితుడవై శ్రీ శ్రీనివాసుని ఊరెగించు వేళ
     శ్రీదేవి, భూదేవి సమేతంగా ప్రజలకు దర్శన మిచ్చు వేళ
     నీనామంతో పారవశ్యంతో జడి వానలో నాట్య మాడిన వేళ 
   దూర ప్రాంతం నుండి వచ్చాము మామీద దయచూపు శ్రీ శ్రీనివాసా 

57.శుభంగా తెల్గునాడు అందరికి  ప్రశాంత చిత్తము కల్పిమ్చుము
    సర్వదా సుఖ శాంతి లిచ్చి, మా మనస్సు ప్రశాంతముగా ఉంచుము  
    మంగళ రూపుడవై, సర్వ లోకాలను నీ ఆజ్ఞచే  పాలించుము
    కళయే ప్రాణంగా బ్రతికే  వారిని కాపాడము శ్రీ శ్రీనివాసా

58. నీవు అనుగ్రహం పంచె విషయంలో దృడముగా ఉండే వాడవు 
     సమస్త ప్రాణులకు రక్షణను కల్పింప చేయచున్న వాడవు
     దేవాలయాలను కట్టించిన తగ్గని ధనము కలవాడవు
     కోరిన వారిని ఉద్దరించడానికి ఉన్నావు శ్రీ శ్రీనివాసా  

59. అనిష్ట నుండి  సాధువు లందరిని ఉజ్జీవింప  చేసే వాడవు
    కర్మల సంబంధాన్ని శ్వీకరించి ప్రజలను కాపాడే వాడవు 
    జన్మలో ప్రతి ఒక్కరికి భోగ, మోక్ష,  ఫలము నిచ్చు వాడవు
    మా కష్టం కడ తేర్చే సమర్దుడవు, ఆదుకొనే శ్రీ  శ్రీనివాసా  

60. మెదడుంటే  సరిపోదు శరీరానికి హృదయం ఉండాలన్నావు
    వర్ణాలుంటే సరిపోదు పూలకు పరిమళాలు ఉండా లన్నావు
    పరిమాణం ఉంటె సరిపోదు పండ్లకు మాధుర్యం ఉండా లన్నావు
    నీకొండకు వచ్చిన ప్రేమ భక్తి ఉండాలన్నావు శ్రీ శ్రీనివాసా
--((**))--



స్వయంచాలక ప్రత్యామ్నాయ వచనం ఏదీ అందుబాటులో లేదు.


కామెంట్‌లు లేవు:

కామెంట్‌ను పోస్ట్ చేయండి